Comment navigation


15815

« 1 ... 1357 1358 1359 1360 1361 ... 1582 »

  1. చంద్రోదయం గురించి Lakshmi Kallakuri – ‘Sailakshmi’ గారి అభిప్రాయం:

    09/04/2008 12:25 am

    అందుకే మావా! ( మామా!) చందమామా !

  2. ఏటి ఒడ్డున గురించి Lakshmi Kallakuri – ‘Sailakshmi’ గారి అభిప్రాయం:

    09/04/2008 12:14 am

    సాయిలక్ష్మి స్వాభిప్రాయము:
    అర్ధరాత్రి అందమైన నిశ్శబ్దములో నీ పిక్నిక్ బాస్కెట్టు కొట్టేశానోచ్ ….!

    గలగల పారే ఆలోచనల సవ్వడిలేక
    కాలాన్ని కట్టేసి జలతరంగిణిల
    అలౌకిక (నీకవితా) రసాస్వాదన చేస్తూ
    వెలలేని అపార సౌందర్య చిత్రమైన నా సగంతో
    కలసి తాదాత్మ్యమ్ చెందానే ! సఖీ!
    ఆలపించింతిని రహస్యగానాన్ని.
    కల గాదే నీ కవితా పరిమళమ్ !

    ఏలనైనా నే ‘దేహి’ యందునే నీ కవితలకై
    వలదనకే! ‘వై’ యనకే చెలీ! వైదేహి!

  3. గుప్పెడంత మనసు గురించి sathya గారి అభిప్రాయం:

    09/04/2008 12:11 am

    చాలా బావుంది, కాని మనసు అదుపులొ వున్నా ఎందుకంత అలజడి?

    మనసు సున్నితం కాబట్టి !

    కొత్తవి ఇంకా రాయండి.

  4. పుస్తక సమీక్షల గురించి… గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/03/2008 10:58 pm

    రారా, తాపీ, కీట్సు, కుటుంబరావు

    ఇది మొదలెట్టడంతోటే నాకు కుటుంబరావు వ్యాసం, “విమర్శలకు ప్రమాణాలు,” (సాహిత్య వ్యాసాలు, పేజీ 413), గుర్తొచ్చింది.

    సెవెన్ స్టార్స్ సిండికేట్ ప్రచురించిన ‘నవత’ పత్రికలో కవిత్వాన్ని రారా నిశితంగా విమర్శిస్తే, తాపీ రారాని మందలిస్తూ, “రారా గారి విమర్శన లాంటి విమర్శనలు ప్రతి సంఘటనకూ స్పందించే సున్నిత హృదయులైన రచయితల మీద ఎంతటి తీవ్రంగా పని చేయగలదో చెప్పాలంటే పూర్వం ఇలాంటి విమర్శ కారణంగానే కీట్సు కవి జీవితం అంతమయింది. విమర్శకుని కర్తవ్యం అభ్యుదయ రచనను పెంపొందించటం తప్ప ఖండించడం కాదు,” అని రాశారు.

    రారాని సమర్థిస్తూ కుటుంబరావు రాసిన వ్యాసం అది.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. వాడుక భాషలో పద్యాలు గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:

    09/03/2008 10:12 pm

    JKM garu

    As usual wonderful piece from you. Thankyou.

    Might be off the track conversation but for some strange reason, your post here brings back memories of the following….Thanks to Dr Dwa.na.Sastry gari sAhitya kaburlu book –

    “మున్ పటి రూల్సుకు కట్టుపడమ”ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి “అభినవ సరస్వతి” పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.

    భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి – అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.

    ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. “కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ”ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.

    ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. “కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే” మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. “జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు”నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస.

  6. నాకు నచ్చిన పద్యం: భాస్కర రామాయణంలో వర్షాగమన వర్ణన గురించి Dr Darla VenkateswaraRao గారి అభిప్రాయం:

    09/03/2008 10:00 pm

    పద్యాన్ని వివరించిన తీరు బాగుంది. మన ప్రాచీన కావ్యాల్లోని పద్యాల ప్రభావం తరువాత కావ్యాల్లో చాలా పద్యాల్లో కనిపిస్తుంటుంది. దాన్ని మీరు ” గౌరవం ప్రకటించినట్లు” వ్యాఖ్యానించడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. మీ వ్యాసంలో పద్య భావాన్ని కూడా రాసి ఉంటే సామాన్యులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందేమో.. ఈ సారి ఆ దిశగా ఆలోచించండి.
    మీ
    దార్ల

  7. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/03/2008 8:30 pm

    సూర్యుడు గారూ,

    మీరీ ప్రశ్న అడిగారు:

    “ప్రమేయం విలువ మాత్రం అవును (True), కాదు (False) అనే రెండిట్లో ఒక విలువని మాత్రమే ఇస్తుంది”

    పై ప్రవచనం కరక్టేనా?

    కరక్టే.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. బాలమురళీకృష్ణ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    09/03/2008 7:11 pm

    మరొక ముచ్చట గుర్తుకొచ్చింది. చిన్నతనంలో తనను పరీక్షించడానికొచ్చిన ఒక విద్వాంసుడు తలొక్క చేత్తో తలొక కాలంలో ఆదితాళం వేసి చూపుతూ, ఆ విద్యను కుర్రవాడికి నేర్పమని బాలమురళి గురువుకు సలహా ఇచ్చాడట. అంటే ఒక వేగంతో ఒక చేత్తోనూ, దానికి రెండింతల వేగంతో మరో చేత్తోనూ వేళ్ళు కదుపుతూ ఆదితాళాన్ని సూచించడం అన్నమాట. ఇది చూసిన బాలమురళి తానుకూడా వెంటనే అలా చేసి చూపడమే కాక చేతులు మార్చి మళ్ళీ తాళం వేసి చూపాడట. మీరలా చెయ్యగలరా అని ఆ వచ్చినాయనను బాలమురళి అడిగితే ఆయన చల్లగా జారుకున్నాడట. ఈ రకమైన అవయవ నియంత్రణ ఆదిభట్ల నారాయణాదాసుగారికి ఉండేదనీ, ఆయన ఏకకాలంలో పంచముఖి అనే అయిదురకాల తాళాలను ఒకేసారి (రెండు కాళ్ళూ, రెండు చేతులూ, నోటిపాట ద్వారా) వేసి చూపేవాడనీ అంటారు.

  9. సెన్సిటివిటీ ట్రెయినింగ్ గురించి రానారె గారి అభిప్రాయం:

    09/03/2008 1:36 pm

    భలే కథ. వేగంగా చదివించేలా చాలా బాగా అనువదించారు. “సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.

  10. గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940) గురించి రానారె గారి అభిప్రాయం:

    09/03/2008 11:43 am

    నాకు తెలీని చాలా విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నాను. కృతజ్ఞతలు. “1857 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది.” … ఈ వాక్యం రామమూర్తిగారి విద్యాభ్యాసాన్ని గురించి చెప్పిందేనా అని సందేహం. ఆయన జన్మించింది 1863లో అన్నారు కదా?

    [అక్కడ “1875 దాకా ” అని ఉండాల్సింది. అచ్చు తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం.]

« 1 ... 1357 1358 1359 1360 1361 ... 1582 »