Comment navigation


15814

« 1 ... 1355 1356 1357 1358 1359 ... 1582 »

  1. చంద్రోదయం గురించి suvarna గారి అభిప్రాయం:

    09/05/2008 5:32 am

    “పక్షుల అట్టహాసం అసలే ఉండదు” వాక్యం అర్ధం కాలేదు.
    చంద్రోదయం అప్పుడూ పక్షులు గూళ్ళకు చేరుతూ కిలకిలరావాలు చేస్తాయి కదా!
    సువర్ణ.

  2. బాలమురళీకృష్ణ గురించి baabjeelu గారి అభిప్రాయం:

    09/04/2008 8:57 pm

    రోహిణీ ప్రసాద్ గారూ,
    పెద్దాడ సుందర రామకృష్ణ గారి “ప్రార్థన” అద్భుతం.
    సంగీతం లో అ, ఆ లు రాని వాళ్ళం బాలమురళీ కచేరలకి, హాజరవుతాం. అలాగే మరో నాలుగు పాసులెక్కువ తీసుకుని, గేటు బయట పాసుల్లేని వాళ్ళకి మిగిలిన పాసులిచ్చి సంతోషపడే వాళ్ళూ ఉంటారు. కచేరీ కొచ్చినవాళ్ళలో, నార్తిండియన్సూఎక్కువే ఉంటారు. వీళ్ళతో సమానంగా, “నా మొహం. ఏముక్కకాముక్క విడగొట్టి, ఏ కీలుకాకీలు విరిచేసి, అడ్డదిడ్డంగా పాడతాడు. అదేం శాస్త్రీయ సంగీతం?” అని అనేవాళ్ళూ ఉన్నారు. మిగిలిన విద్వాంసులకి ఇలాటి పరిస్థితి లేదు.
    బాలమురళీ సంగీతం గురించి ఇంతకన్నా ఇంకొంచెం వివరంగా, ఇంకో వ్యాసం రాయాలి మీరు.

  3. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/04/2008 8:19 pm

    సూర్యుడు గారూ,

    తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలేవీ నాకు అందుబాటులో లేవు కాని ప్రవచనం అంటే గొప్ప మాట, ప్రవక్తలు చెప్పేది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది Propositional Logic – ప్రతిపాదనల తర్కం.

    ప్రమేయం (function) అంటే మీ ఆలోచన సరయినదే. నేనో ఉదాహరణ ఇచ్చాను – Square(x). అలాగే Sum(x, y). Sum(4, 5) విలువ 9. ఇది గణితంలో మనకందరికీ తెలిసినదే.

    తర్కం మన వివేచనకి సంబంధించింది. అంటే గణితం కన్నా కూడా మౌలికమైనది. అన్ని రకాల భావనలకీ, అన్ని రంగాల్లోనూ వర్తిస్తుంది. ప్రమేయాన్ని Frege కొంచం మార్చి తర్కంలో భావనకి సంకేతంగా వాడుకున్నాడు.

    దానిని గణితంలో లాగా సంఖ్యలకి పరిమితం చెయ్యకుండా అన్ని రకాల వస్తువులకీ వాడాడు. RedColored(x) అన్న ప్రమేయం x మనిషైనా, జంతువైనా, వస్తువైనా వర్తిస్తుంది – ఎర్రగాఉందన్న భావనకి సంకేతంగా.

    తను రూపొందిస్తున్నది ప్రతిపాద తర్కం కనుక ప్రమేయం తిరుగు ఇచ్చే విలువని రెండు విలువలకే పరిమితం చేశాడు. అలాంటి ప్రమేయాలని Truth-value functions అన్నాడు. ఆ రెండు విలువలు – True, False.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. చంద్రోదయం గురించి వినీల్ గారి అభిప్రాయం:

    09/04/2008 6:23 pm

    చంద్రోదయమంత చక్కగా ఉంది. అభినందనలు.

  5. బాలమురళీకృష్ణ గురించి రంగ గారి అభిప్రాయం:

    09/04/2008 2:41 pm

    “పాడటానికి నేనూ, వాయించటానికి తమ్ముడు చిట్టిబాబూ చాలు” అని “అన్నగారు బాలమురళి” అనే వారని చిట్టిబాబుగారన్నారు. తమిళ (గాత్ర) విద్వాంసుల ప్రతిభ మీద గబుక్కున జోక్స్ వేసేయటం ఇద్దరికీ అలవాటనుకుంటాను. అది అనేక యుద్ధాల్లో ఆరితేరిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమో, నిశ్చతమైన అభిపాయమో, లేక కేవలం పెట్టీనెస్సో వెంటనే తెలిసేది కాదు.

    బాలమురళీగారు ఆత్మకథ వ్రాశారు కాదా? ఎక్కడో సీరియల్ గా చూసిన గుర్తు. (పినాకపాణి గారి ఆత్మకథతో కన్ఫ్యూస్ అవుతున్నానేమో?)

    చక్కటి వ్యాసాన్ని అందినంచినందుకు రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

  6. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి పాఠకుడు గారి అభిప్రాయం:

    09/04/2008 10:20 am

    పిడకల వేట ఎక్కువైన ఈ వ్యాసంలో కనీసం పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు. గందరగోళం ఎక్కువయ్యింది.

  7. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి sUryuDu గారి అభిప్రాయం:

    09/04/2008 10:01 am

    కొడవళ్ళ హనుమంతరావు గారు,

    ప్రమేయం అంటే ఒక ఫంక్షన్ కదా, ఫంక్షన్ అంటే కొన్ని విలువలని ఇన్పుట్ గా తీసుకుని ఒక అవుట్పుట్ ఇచ్చేది కదా, ఆ అవుట్పుట్ కి అవును కాదు అని ఎందుకు అవ్వాలి, అది బూలియన్ ఫంక్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది కాని. మీరు చెప్పిన సూత్రం ప్రవచనాలకి సరిపోతుంది, ఏదైనా ప్రవచనం అవును కాని లేదా కాదు కాని తప్పక అయితీరాలి.

    నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా?

    సూర్యుడు 🙂

  8. ధార గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:

    09/04/2008 9:44 am

    శ్రీనివాస్ గారన్నట్టు, నాక్కూడా అసలు స్టోరీ మీనింగ్ ఏమిటో తెలియలేదు. ఆ అందమైన అమ్మాయి ఏడ్చే సీనుకీ, వీళ్ళ పార్టీకీ ఏమిటీ సంబంధం? ఏదో వుంది రచయిత దృష్టిలో. అది నాకర్థం కాలేదంతే అని అనిపిస్తుంది. ఒక పురుషుడి పెత్తనం వల్ల ఆ అమ్మాయి ఏడ్చిందని మాత్రం అర్థం అయింది. అయినా ఎవరన్నా అలా రెస్టారెంట్లో అంత బావురుమని ఏడుస్తారా? ఆ పురుషుడి పెత్తనం గురించి అప్పుడే మొదటిసారిగా తెలిసిందా, ఏమన్నానా?

    ఆ కోటీశ్వరులకీ, ఆ పేద పంతులికీ మధ్య వున్న స్నేహం కూడా విచిత్రంగానే వుంది. ఆ తాగుళ్ళకీ, తిండికీ బిల్లు కట్టేది ఆ కోటీశ్వరులే కదా ఎప్పుడూ? ఇదేదో డబ్బున్న వారి వెంట లేని వారు తిరగడం లాగానే వుంది తప్ప, స్నేహం లాగా లేదు. ఇక, “దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు.” అన్న వాక్య నిర్మాణం వల్ల, విషయం మొదట్లో అర్థం కాలేదు.

    ఈ కధని మెచ్చుకున్న వాళ్ళెవరైనా, దీనర్థం కాస్త విపులీకరిస్తే, బాగుంటుందనుకుంటున్నాను.

    ఖరీదైన రెస్టారెంట్లో పడ్డ ఆ అమ్మాయి కష్టానికి వీళ్ళు చలించలేదనా?

    రచయితా, ఈ కధని ఇష్ట పడ్డవాళ్ళూ క్షమించాలి. విషయం అర్థం కానివారు వుంటారని మాత్రం గ్రహించాలి.

    – జె. యు. బి. వి. ప్రసాద్

  9. బాలమురళీకృష్ణ గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    09/04/2008 8:46 am

    శ్రీ బాలమురళి పై ఇంత సాధికారంగా రోహిణీప్రసాద్ గారు రాయగలరని నాకు తెలుసు. అయినా, “ఈమాట” కోసం రాసినందుకు ధన్యవాదాలు.

    ఈ వ్యాసంలో ముచ్చటించిన ఒకటి, రెండు విషయాలను మళ్ళీ మీ ముందుంచాలని:

    1. “గాయకుడిగా శ్రీబాలమురళీ దరిదాపులకు వచ్చేవాళ్ళు లేకున్నా, శ్రీ బాలమురళీకి మరిన్ని సుగుణాలు ఉంటే బాగుండేది” అన్న వ్యాసకర్త మాటలు, గమనించతగ్గవి. ఆలోచింపతగ్గవి. సంగీతంతో (పుస్తక జ్ఞానమేకాక) అన్ని రకాలుగా ఎంతో గాఢమైన పరిచయం, అనుభవం ఉంటే కాని ఇటువంటి వాక్యాలు రాయలేరు.

    2. శ్రీ బాలమురళి సంగీతం, జీవితం తరవాత తరాల కోసం డాక్యుమెంటేషన్ విషయమై, రోహిణీప్రసాద్ గారు చేసిన సూచనలు ఆలోచించి, ఆచరణలో పెట్టవలసినవి. నాకు ఉన్న పరిచయంలో, తెలుగు సంఘాలకి గాని, సంస్థలకి గాని అటువంటి దమ్ము, ఆసక్తి ఉన్నాయని నే అనుకోను.

    మోహనరావుగారికి:

    మీ అభిప్రాయంలో, మీరిచ్చిన లింకులకి ధన్యవాదాలు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. ధార గురించి Samata గారి అభిప్రాయం:

    09/04/2008 8:36 am

    కథ ఇంకా వుంది అనుకున్నాను. మధ్య లొనే ఆగిపొయినట్టు వుంది.

« 1 ... 1355 1356 1357 1358 1359 ... 1582 »