చాలా కృతజ్ఞతలు. ఉద్యోగపర్వము లో ఇంకా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు వివరిస్తే చదవాలని చాల ఆత్రుతగా ఉంది. దయ ఉంచి వాటిని తెలియచేయగలరు.
ఎన్నో సంస్కృత పదాలు మనం తెలుగు పదాలుగా వాడుతాం. కొన్ని పదాలైతే ఇవీ సంస్కృత పదాలూ, తెలుగువి కావన్న తేడా కూడా తెలీకుండా వాడుకలో ఉన్నాయి. గ్రాంధిక భాషలో వచ్చిన అనేక కావ్యాలలో సంస్కృత పదాలు తెలుగు పదాలుగానే వ్యవహరింపబడ్డాయి. ముఖ్యంగా దైవ స్తుతి వచ్చేసరికి చాలామందిపై సంస్కృత స్తోత్రాల ప్రభావం చాలా కనిపిస్తుంది. ఆ ధోరణిలోనే రచనలు కనిపిస్తాయి. మీరుదహరించిన త్యాగరాజు కృతుల్లో అన్నీ సంస్కృత పదాలే! కానీ అవన్నీ ఎంతో కొంత తెలుగు చదువుకున్న వారికి తెలీని పదాలు కావు. పూర్తి అర్థాలు తెలీక పోయినా చాలా పదాలు వాడుకలో కనిపించేవే!
త్యాగరాజు మొదట్లో చేసిన రచనల్లో సంస్కృత భాష ప్రభావం అమితంగా ఉంది. రాను రానూ పూర్తిగా తెలుగులోనే కృతులు కనిపిస్తాయి. వాగ్గేయకారుడిగా రచనల్లో పరిణామ క్రమం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొన్ని త్యాగరాజు కీర్తనలు ఆయన ముద్రతోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ప్రక్షిప్తాలా లేక త్యాగరాజు స్వీయరచనలా అన్నది స్పష్టంగా తెలీదు. చాలా భాగం త్యాగరాజు కీర్తనలు ఆయన శిష్యుల ద్వారా లభించినవే!
స్వలిఖితంగా ఉన్న ఒక్క త్యాగరాజ కృతీ దొరకలేదు.
కొన్ని కృతులు త్యాగరాజు రాయలేదన్న సంగీత శాస్త్రజ్ఞుల వాదన కూడా! సామజవరగమన ఆయన కృతే అని శైలిని బట్టి చెప్పచ్చు. ఇందులో వాడిన కొన్ని పదాలు వేరేచోట్ల మరికొన్ని కృతుల్లో కనిపిస్తాయి. కానీ “శ్రీ గణనాధం భజామ్యహం” కృతి మాత్రం ప్రక్షిప్తమనీ చెప్పడానికి కొన్నైనా ఆధారాలు చూపగలం.
ఇవన్నీ ముందు ముందు నాకు తెలుసున్నంత వరకూ చర్చిస్తాను.
నేను రాసిన ” త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతి ఇదొక్కటే! ” అన్న వాక్యం ఉపసంహరించుకుంటున్నాను. అది తొలగించమని ఈమాట వారిని అడుగుతాను. మీరు “సవరణ” చెప్పినందుకు కృతజ్ఞతలు.
రవి గారూ,
కృతజ్ఞతలు. మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే జ్యోతిషం మీద పుస్తకాలకి కొదవలేదు. Best of luck.
నా అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని ఈ వ్యాసాల్లో రాయడం జరిగింది. ప్రస్తుతానికి ఇదే టాపిక్ మీద ఇంకా రాసే ఆలోచన లేదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
సామజవరగమనా , నాదతనుమనిశం, శ్రీ నారసింహ మాం పాహి ……..యిలా ఇంకా చాలా సంస్కృత కీర్తనలు త్యాగరాజ కీర్తనలు గానే, ఆయన ముద్రతో ప్రాచుర్యం లో ఉన్నాయి.
“త్యాగరాజ స్వామి సంస్కృత కీర్తనలు ” అని ఒక 10 లేక 12 కీర్తనల సంకలనం శ్రీ బాలమురళీ కృష్ణ గారు పాడిన ” సంగీతా ” కంపెనీ వారి కేసెట్టు కూడా ఒకటి ఉంది.
బ్రహ్మానందం గారూ , “నమోనమోరాఘవాయ” అనే కృతి ఒక్కటే త్యాగరాజ స్వామి వారి ఏకైక సంస్కృత రచన అంటారా ? రూఢి గా ? ( మీరు వ్యాసం లో ఒకచోట చెప్పినట్లు )
థాంక్స్. ఈ వ్యాసాలు అర్థం చేసుకోడానికి హైస్కూలు లెక్కలకి మించిన గణిత పరిజ్ఞానం అవసరం లేకపోయినా హైస్కూలు స్థాయిని దాటిన పరిణతి కావాలి. వీటిని బడిపిల్లలకి అందుబాటులోకి తేవాలంటే మార్పులు చేర్పులు చెయ్యాలి.
Intuitionism మీదా Brouwer గురించీ కొంత వచ్చే సంచికలో రాస్తాను.
నా వరకు అన్ని నిర్వచనాలకు బద్ధులైన చివరి క్లాసికల్ వాగ్గేయకారులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు వారి శిష్యులైన మైసూర్ వాసుదేవాచార్యులు. మిగిలినవారు ఆ ఔన్నత్యాన్ని అందలేదు అని నా భావన. అందులో వాసుదేవాచార్యులు సుమారు వంద సంవత్సరాలు జీవించారు. చివరి వరకు గాన విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. వీరి మాతృభాష కన్నడము అయినా కూడా తెలుగులోనే రాశారు. వీరికి సంస్కృతములో ఎనలేని పాండిత్యము. వీరి గురువుగారే వీరివద్ద సంస్కృతములో రాసినది చదివిచూడమనే వారట! బాలమురళిగారి పాటలను మిగిలిన గాయకులు తమ కచేరీలలో ఇప్పుడు కూడా పాడుతున్నారా, ఈ విషయం నాకు అంతగా తెలియదు. గాయకులందరు వీరి పాటలను “బ్రోచేవారెవరురా..” లేక “రఘువంశ సుధాంబుధి..” లా పాడుతుంటే వీరు కూడా వారిలాటి మహనీయ వాగ్గేయకారులే. అందరూ వాగ్గేయకారులే. కాని Some are more equal than others అని అంటారు గదా! విధేయుడు – మోహన
“జీవితము” యొక్క గొప్ప దనమే అది. ఎన్నెన్ని సార్లు
వర్ణించినా, ఎన్ని రకాలుగా విశ్లేషించినా, ఎన్నెన్నో రీతులైన
నిర్వచనాలను నిరంతరమూ అందుకుంటూనే ఉండే
అక్షయ పాత్ర కదండీ, అది.
జ్యోతిష్యం గురించి ఇంత లోతైన పరిశీలన ఇంతవరకు నేను చూడలేదు. సబ్జక్టు మీద మీరెంతో కృషిచేశారనీ, ఆలోచించారనీ తెలుస్తోంది. అయినా కూడా డిటాచ్డ్ గా రాయగలిగారు. జ్యోతిషాన్ని సీరియస్గా నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? నేను ఒకటి రెండు పుస్తకాలు చదవడానకి ట్రై చేశానుగానీ చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించింది.
మీరు జాతకాలు చెప్పారా? వాటిల్లో ఏమైనా నిజమయ్యాయా? జాతకాలు చెప్పడంలో మీ వ్యక్తిగతానుభవాలు ఇంకా రాస్తే బాగుంటుంది. నాలాంటివాళ్ళు నేర్చుకోడానికి జ్యోతిష్యం పాఠాలేమైనా రాయగలరా? అసలు జాతకాలు ఎలా వేస్తారు? పంచాంగం అంటే ఏమిటి మొదలైన విషయాలు వాటిల్లో చెప్తే బాగుంటుంది.
ఏది ఏమైనా మీరు ఇంకా ఇటువంటి రచనలు చెయ్యాలని కోరుతున్నాను.
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి sivaram గారి అభిప్రాయం:
09/10/2008 7:51 am
చాలా కృతజ్ఞతలు. ఉద్యోగపర్వము లో ఇంకా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు వివరిస్తే చదవాలని చాల ఆత్రుతగా ఉంది. దయ ఉంచి వాటిని తెలియచేయగలరు.
ధన్యవాదములు,
శివరామ ప్రతాప్ రవ్వ
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
09/10/2008 5:05 am
సూర్యనారాయణ గారూ,
ఎన్నో సంస్కృత పదాలు మనం తెలుగు పదాలుగా వాడుతాం. కొన్ని పదాలైతే ఇవీ సంస్కృత పదాలూ, తెలుగువి కావన్న తేడా కూడా తెలీకుండా వాడుకలో ఉన్నాయి. గ్రాంధిక భాషలో వచ్చిన అనేక కావ్యాలలో సంస్కృత పదాలు తెలుగు పదాలుగానే వ్యవహరింపబడ్డాయి. ముఖ్యంగా దైవ స్తుతి వచ్చేసరికి చాలామందిపై సంస్కృత స్తోత్రాల ప్రభావం చాలా కనిపిస్తుంది. ఆ ధోరణిలోనే రచనలు కనిపిస్తాయి. మీరుదహరించిన త్యాగరాజు కృతుల్లో అన్నీ సంస్కృత పదాలే! కానీ అవన్నీ ఎంతో కొంత తెలుగు చదువుకున్న వారికి తెలీని పదాలు కావు. పూర్తి అర్థాలు తెలీక పోయినా చాలా పదాలు వాడుకలో కనిపించేవే!
త్యాగరాజు మొదట్లో చేసిన రచనల్లో సంస్కృత భాష ప్రభావం అమితంగా ఉంది. రాను రానూ పూర్తిగా తెలుగులోనే కృతులు కనిపిస్తాయి. వాగ్గేయకారుడిగా రచనల్లో పరిణామ క్రమం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొన్ని త్యాగరాజు కీర్తనలు ఆయన ముద్రతోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ప్రక్షిప్తాలా లేక త్యాగరాజు స్వీయరచనలా అన్నది స్పష్టంగా తెలీదు. చాలా భాగం త్యాగరాజు కీర్తనలు ఆయన శిష్యుల ద్వారా లభించినవే!
స్వలిఖితంగా ఉన్న ఒక్క త్యాగరాజ కృతీ దొరకలేదు.
కొన్ని కృతులు త్యాగరాజు రాయలేదన్న సంగీత శాస్త్రజ్ఞుల వాదన కూడా! సామజవరగమన ఆయన కృతే అని శైలిని బట్టి చెప్పచ్చు. ఇందులో వాడిన కొన్ని పదాలు వేరేచోట్ల మరికొన్ని కృతుల్లో కనిపిస్తాయి. కానీ “శ్రీ గణనాధం భజామ్యహం” కృతి మాత్రం ప్రక్షిప్తమనీ చెప్పడానికి కొన్నైనా ఆధారాలు చూపగలం.
ఇవన్నీ ముందు ముందు నాకు తెలుసున్నంత వరకూ చర్చిస్తాను.
నేను రాసిన ” త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతి ఇదొక్కటే! ” అన్న వాక్యం ఉపసంహరించుకుంటున్నాను. అది తొలగించమని ఈమాట వారిని అడుగుతాను. మీరు “సవరణ” చెప్పినందుకు కృతజ్ఞతలు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి గారి అభిప్రాయం:
09/10/2008 1:07 am
రవి గారూ,
కృతజ్ఞతలు. మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే జ్యోతిషం మీద పుస్తకాలకి కొదవలేదు. Best of luck.
నా అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని ఈ వ్యాసాల్లో రాయడం జరిగింది. ప్రస్తుతానికి ఇదే టాపిక్ మీద ఇంకా రాసే ఆలోచన లేదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి suryanarayanna గారి అభిప్రాయం:
09/10/2008 12:53 am
సామజవరగమనా , నాదతనుమనిశం, శ్రీ నారసింహ మాం పాహి ……..యిలా ఇంకా చాలా సంస్కృత కీర్తనలు త్యాగరాజ కీర్తనలు గానే, ఆయన ముద్రతో ప్రాచుర్యం లో ఉన్నాయి.
“త్యాగరాజ స్వామి సంస్కృత కీర్తనలు ” అని ఒక 10 లేక 12 కీర్తనల సంకలనం శ్రీ బాలమురళీ కృష్ణ గారు పాడిన ” సంగీతా ” కంపెనీ వారి కేసెట్టు కూడా ఒకటి ఉంది.
బ్రహ్మానందం గారూ , “నమోనమోరాఘవాయ” అనే కృతి ఒక్కటే త్యాగరాజ స్వామి వారి ఏకైక సంస్కృత రచన అంటారా ? రూఢి గా ? ( మీరు వ్యాసం లో ఒకచోట చెప్పినట్లు )
తారామతి బిరాదరి గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:
09/09/2008 9:05 pm
గత మూడేళ్ళుగా తారామతి బిరాదరిని ప్రతి రోజూ సందర్శిస్తూనే ఉన్నాను.
వర్షం కురిసిన ఓ సాయంకాలం బిరాదరిలో నాకు కలిగిన అనుభూతే ఈ కవిత.
పాలపర్తి ఇంద్రాణి.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/09/2008 9:04 pm
రామారావ్,
థాంక్స్. ఈ వ్యాసాలు అర్థం చేసుకోడానికి హైస్కూలు లెక్కలకి మించిన గణిత పరిజ్ఞానం అవసరం లేకపోయినా హైస్కూలు స్థాయిని దాటిన పరిణతి కావాలి. వీటిని బడిపిల్లలకి అందుబాటులోకి తేవాలంటే మార్పులు చేర్పులు చెయ్యాలి.
Intuitionism మీదా Brouwer గురించీ కొంత వచ్చే సంచికలో రాస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
గుప్పెడంత మనసు గురించి lingesh గారి అభిప్రాయం:
09/09/2008 12:21 pm
చాలా బాగుంది. nice one.
బాలమురళీకృష్ణ గురించి mOhana గారి అభిప్రాయం:
09/09/2008 9:10 am
నా వరకు అన్ని నిర్వచనాలకు బద్ధులైన చివరి క్లాసికల్ వాగ్గేయకారులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ మరియు వారి శిష్యులైన మైసూర్ వాసుదేవాచార్యులు. మిగిలినవారు ఆ ఔన్నత్యాన్ని అందలేదు అని నా భావన. అందులో వాసుదేవాచార్యులు సుమారు వంద సంవత్సరాలు జీవించారు. చివరి వరకు గాన విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. వీరి మాతృభాష కన్నడము అయినా కూడా తెలుగులోనే రాశారు. వీరికి సంస్కృతములో ఎనలేని పాండిత్యము. వీరి గురువుగారే వీరివద్ద సంస్కృతములో రాసినది చదివిచూడమనే వారట! బాలమురళిగారి పాటలను మిగిలిన గాయకులు తమ కచేరీలలో ఇప్పుడు కూడా పాడుతున్నారా, ఈ విషయం నాకు అంతగా తెలియదు. గాయకులందరు వీరి పాటలను “బ్రోచేవారెవరురా..” లేక “రఘువంశ సుధాంబుధి..” లా పాడుతుంటే వీరు కూడా వారిలాటి మహనీయ వాగ్గేయకారులే. అందరూ వాగ్గేయకారులే. కాని Some are more equal than others అని అంటారు గదా! విధేయుడు – మోహన
గుప్పెడంత మనసు గురించి kusumakumari గారి అభిప్రాయం:
09/09/2008 4:55 am
“జీవితము” యొక్క గొప్ప దనమే అది. ఎన్నెన్ని సార్లు
వర్ణించినా, ఎన్ని రకాలుగా విశ్లేషించినా, ఎన్నెన్నో రీతులైన
నిర్వచనాలను నిరంతరమూ అందుకుంటూనే ఉండే
అక్షయ పాత్ర కదండీ, అది.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి Ravi గారి అభిప్రాయం:
09/09/2008 2:37 am