Comment navigation


15810

« 1 ... 1349 1350 1351 1352 1353 ... 1581 »

  1. పడవ మునుగుతోంది గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:

    09/11/2008 7:02 pm

    పువ్వులూ, చెట్లూ, అకాశాలూ, సూర్యుళ్ళూ, చంద్రుళ్ళూ, మనసులో మాకుమేవే కల్పించుకునే అవాస్తవ సమస్యలు, నిన్న త్రాగిన నేతుల వాసన్లు, వీటినుంచి చిలికిన కథలో, కవితలో చదివి అలసిన మనసుకి, నేలని చూపించారు, బతుకుని కళ్ళ ముందర, ఏ మాత్రం భేషజాల్లేకుండా, నగ్నంగా కూర్చోబెట్టేరు.

  2. మరో గుప్పెడు మొర్మొరాలు గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:

    09/11/2008 6:31 pm

    భాస్కర్,

    పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు అనను గానీ, గుప్పెటినిండా దొరకలేదు. దవడలక్రింద గుప్పెడన్నా నలగకపోతే మొర్మరాల రుచి అంతగా తెలీదుకదా. నోట్లో పడిన ఆ కొద్ది మరమరాలు ఎక్కడో, ఎప్పుడో సరుకుల గదిలో మర్చిపోయిన డబ్బాలో చాలాకాలంగా నిలవుండిపొయ్యి, కొంచెం బూజెక్కి, కరుణెక్కిన మరమరాలని నాకనిపించింది. సాయంకాలం రావాలయందగ్గరకి హస్కేసుకోడానికిపోతే, తెలుగయ్యోరు వ్యాకరణం గురించి ఇచ్చిన ఉపన్యాసం ఇన్నట్టుంది ఈ వ్యాసం. చదివించగలిగిన శక్తుందా, బెమ్మాండంగావుంది గానీ చదివిందే భలే లేదనిపించింది. ఆ మాత్రం రాయగలిగుండి ఈపాటికో గుప్పెడు కథలో కాకరకాయలో రాసెయ్యకుండా, why the heck you are reintroducing us to something passé?

  3. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి పాణిని శంఖవరం గారి అభిప్రాయం:

    09/11/2008 4:07 pm

    “ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”
    అన్నారు శ్రీనివాస్ నాగులపల్లిగారు.
    అందుకే కాబోలు, ఈ వ్యాసపరంపరకు శీర్షిక “మీకు నచ్చవలసిన పద్యం: …” అని లేదు!
    అన్యధా భావించకండి, మీ అభిప్రాయం చదివాక వచ్చిన చిన్ని ఆలోచన, అంతే.

  4. పుస్తక సమీక్షల గురించి… గురించి vElUri VEMkaTESvara raavu గారి అభిప్రాయం:

    09/11/2008 1:46 pm

    —రామ (రమ) భరద్వాజ్ గారికి:
    మీరు ఉదహరించిన రెండు సమీక్షలు/విమర్శలూ నాకు తెలుసు. వాటి ప్రతులు నా దగ్గిర లేకపోవటంతో, నేను వాటి ప్రస్తావన తేలేదు. నా సంపాదకీయం/వ్యాసం (?)(సరేనా విప్లవ్ గారూ! మీకు అభినందనలు) లో నేను ఉదహరించిన వాటన్నిటికీ నాదగ్గిర ప్రతులున్నాయి! మీరు ఆ రెండుసమీక్షలూ గుర్తుకితెచ్చి నన్ను మందలించినందుకు కృతజ్ఞుడిని.
    —రోహిణీప్రసాద్ గారికి:
    ఈ మాట గురించి మీరు చెప్పిన రెండు మంచి మాటలు మాకెంతో ఆనందం; గర్వకారణం. మీకు నా నమస్సులు.
    —కొత్తపాళీ గారికి:
    నిష్పాక్షికము అన్న మాట నేను without bias కి అనువాదంగా వాడాను. నా ఉద్దేశంలో విమర్శలలోసాధ్యమైనంతవరకూ ఏవిధమైన bias (పక్షపాతం అన్న మాట ఒప్పుకుంటారా?) ఉండకూడదు. అంటే విమర్శకుడి biases సమీక్షలోను, విమర్శలోనూ కనపడకూడదు, అని! తన భావస్పందన స్పష్టం గా ఉండకూడదనే అర్థం నావ్యాసం(?)/సంపాదకీయంలో వచ్చిఉంటే, రచయితగా అది నా చేతకానితనం. క్షమార్హుణ్ణి.

    హనుమంతరావుగారికి:

    కొ.కు. చెప్పినా, రా .రా. వ్రాసినా, తా.ధ. మందలించినా; — అసలు నిజం ఇది: కీట్స్ మరణానికి కారణం అతని క్షయ వ్యాధి. తన క్షయ వ్యాధి, దరిమిలా తన రాబోవు మరణం గురించి కీట్స్ చాలా మథన పడ్డాడు. కీట్స్ apothecary గా ( అంటే, మన భాషలో కాంపౌండర్ అనవచ్చనుకుంటా!) శిక్షణ పొందాడు!

    1821 లో (కీట్స్ మరణానంతరం) ఈ కథ / రూమర్ మొదలయ్యింది. క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఒక “కర్కోటక” విమర్శకుడు(విమర్శకురాలు?) వ్రాసిన సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని! ఈ రూమర్ కి ఆజ్యం పోసిన వాడు షెల్లీ. మీరు చదివే ఉంటారు; షెల్లీ వ్రాసిన Adonais. అది కీట్స్ పై elegy అని మీకు నేను చెప్పనక్కరలేదు. పోతే, బైరన్ వ్రాసిన Don Juan పద్యంలో, ఈ రూమర్ని కాస్త తక్కువ పాళ్ళల్లో పాడాడు:
    ‘Tis strange the mind, that very fiery particle,
    Should let itself be snuffed out by an Article.”

    Stanley Plumly ఈ మధ్యనే Posthumous Keats ( Norton, 2008) ప్రచురించాడు. అందులో ఈ కథ/రూమర్ ప్రస్తావన దొరుకుతుంది.

    విధేయుడు, — వేలూరి వేంకటేశ్వర రావు.

  5. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి sasAmka గారి అభిప్రాయం:

    09/11/2008 12:27 pm

    కర్ణాటక సంగీతం కాదు బాబోయ్..కర్నాటక సంగీతం

  6. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    09/11/2008 11:47 am

    నమస్కారం.
    నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి. మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.

    ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం, అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ, అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది. అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని ఊరుకున్నట్లుగా.

    అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా, పదాల ప్రవాహ ధారతో, మనకు గుర్తుండే విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!

    పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా! తిట్లు, బెదిరింపులు, శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.
    ***
    విధేయుడు
    Srinivas

  7. ఏటి ఒడ్డున గురించి radhika గారి అభిప్రాయం:

    09/11/2008 10:31 am

    కవిత్వమంటే ఇదీ అని ఎవరికన్నా చెప్పాల్సివస్తే ఈ కవిత ఒక్కటి చూపిస్తే చాలు. ఎన్ని పదచిత్రాలో, ఎన్ని మెరుపులో….
    నా మనసు, నేనూ పూర్తిగా మునిగిపోయాము.

  8. పడవ మునుగుతోంది గురించి కె.మహేష్ కుమార్ గారి అభిప్రాయం:

    09/10/2008 11:04 pm

    ఒకసారి తమ దేశానికే కాకుండాపోయిన తరువాత, కాందిశీకులుగా ఈ ప్రపంచానికి ఎలాకాకుండాపోతామో చాలా చక్కగా చెప్పారు. పౌరసత్వంతో పాటూ, మానవులుగా జీవించే హక్కునికూడా కోల్పోవడం మానవత్వానికే కళంకం. మంచి కథ.

  9. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి sivaram గారి అభిప్రాయం:

    09/10/2008 7:51 am

    చాలా కృతజ్ఞతలు. ఉద్యోగపర్వము లో ఇంకా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు వివరిస్తే చదవాలని చాల ఆత్రుతగా ఉంది. దయ ఉంచి వాటిని తెలియచేయగలరు.

    ధన్యవాదములు,
    శివరామ ప్రతాప్ రవ్వ

  10. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    09/10/2008 5:05 am

    సూర్యనారాయణ గారూ,

    ఎన్నో సంస్కృత పదాలు మనం తెలుగు పదాలుగా వాడుతాం. కొన్ని పదాలైతే ఇవీ సంస్కృత పదాలూ, తెలుగువి కావన్న తేడా కూడా తెలీకుండా వాడుకలో ఉన్నాయి. గ్రాంధిక భాషలో వచ్చిన అనేక కావ్యాలలో సంస్కృత పదాలు తెలుగు పదాలుగానే వ్యవహరింపబడ్డాయి. ముఖ్యంగా దైవ స్తుతి వచ్చేసరికి చాలామందిపై సంస్కృత స్తోత్రాల ప్రభావం చాలా కనిపిస్తుంది. ఆ ధోరణిలోనే రచనలు కనిపిస్తాయి. మీరుదహరించిన త్యాగరాజు కృతుల్లో అన్నీ సంస్కృత పదాలే! కానీ అవన్నీ ఎంతో కొంత తెలుగు చదువుకున్న వారికి తెలీని పదాలు కావు. పూర్తి అర్థాలు తెలీక పోయినా చాలా పదాలు వాడుకలో కనిపించేవే!

    త్యాగరాజు మొదట్లో చేసిన రచనల్లో సంస్కృత భాష ప్రభావం అమితంగా ఉంది. రాను రానూ పూర్తిగా తెలుగులోనే కృతులు కనిపిస్తాయి. వాగ్గేయకారుడిగా రచనల్లో పరిణామ క్రమం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొన్ని త్యాగరాజు కీర్తనలు ఆయన ముద్రతోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ప్రక్షిప్తాలా లేక త్యాగరాజు స్వీయరచనలా అన్నది స్పష్టంగా తెలీదు. చాలా భాగం త్యాగరాజు కీర్తనలు ఆయన శిష్యుల ద్వారా లభించినవే!

    స్వలిఖితంగా ఉన్న ఒక్క త్యాగరాజ కృతీ దొరకలేదు.

    కొన్ని కృతులు త్యాగరాజు రాయలేదన్న సంగీత శాస్త్రజ్ఞుల వాదన కూడా! సామజవరగమన ఆయన కృతే అని శైలిని బట్టి చెప్పచ్చు. ఇందులో వాడిన కొన్ని పదాలు వేరేచోట్ల మరికొన్ని కృతుల్లో కనిపిస్తాయి. కానీ “శ్రీ గణనాధం భజామ్యహం” కృతి మాత్రం ప్రక్షిప్తమనీ చెప్పడానికి కొన్నైనా ఆధారాలు చూపగలం.

    ఇవన్నీ ముందు ముందు నాకు తెలుసున్నంత వరకూ చర్చిస్తాను.

    నేను రాసిన ” త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతి ఇదొక్కటే! ” అన్న వాక్యం ఉపసంహరించుకుంటున్నాను. అది తొలగించమని ఈమాట వారిని అడుగుతాను. మీరు “సవరణ” చెప్పినందుకు కృతజ్ఞతలు.

« 1 ... 1349 1350 1351 1352 1353 ... 1581 »