Comment navigation


15803

« 1 ... 1342 1343 1344 1345 1346 ... 1581 »

  1. ప్రయాణం గురించి krishna గారి అభిప్రాయం:

    10/03/2008 3:09 am

    చాలా చాల బావుంది. నా వళ్ళంతా పులకరించింది.

    నిజంగా చాలా అద్భుతంగా వుంది. మీరు ఇంకా మంచివి వ్రాయగలరు. ప్రయత్నించండి.

  2. జ్ఞాపకాల ఎదురుచూపు గురించి shivakumar గారి అభిప్రాయం:

    10/03/2008 1:09 am

    మీ కవిత చాలా బాగుంది.

  3. చంద్రోదయం గురించి janardhanchoudary గారి అభిప్రాయం:

    10/02/2008 10:49 pm

    hi,it’s simple and good…

  4. ఈమాట గురించి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    10/01/2008 10:32 pm

    బాబ్జీలు గారికి,

    పల్లెటూరి నుండి వచ్చిన వాణ్ణి కాబట్టి బీడీల గురించి సందేహాలేం లేవు; ఖానా గట్టు గురించి ఉన్నాయి. మీ రాతల్లో నిగూఢంగా ఉన్న పద సంపద చెప్పుకోదగ్గది; మూడు నిఘంటువుల్లో వెతికినా “సబూరి” కనపడలేదు!

    (2005 లో పదవీ స్వీకారం సందర్భంగా, ఆవుల మంజులత గారు అకుంఠిత దీక్షతో కృషి చేసి అయిదేళ్ళలో సమగ్ర నిఘంటువుని తయారుచేస్తామని హామీ ఇచ్చారు. పదవీ విరమణ సమయంలో దాని గురించి ఎవరైనా అడిగారా? ప్రభుత్వరంగంలో పలుకుబడి గల వాళ్ళెవరైనా కనుక్కుని వివరాలు తెలపమని మనవి.)

    చలం ఇంటర్వ్యూ వినలేదు కాని మ్యూజింగ్స్ (పేజీలు 68-74) చదివాను. అది చదివితే మామూలు వాళ్ళకి ఇక రాయాలంటే భయం! ఆయన మహానుభావుడని ఒప్పుకోవాల్సిందే – ఆఖర్న అష్టగ్రహ కూటాల్ని నమ్మి ఆముష్మిక చింతనలో మునిగినా.

    తనని తాను తిట్టుకోడానికి మాత్రమే అయితే చలం పుస్తకాలు రాసి ప్రపంచం మీద వదిలి నానా దుమారం లేపాల్సిన అవసరం లేదు కదా! బీడిలు కాల్చేవాడు కాదు గాని ఎప్పుడూ నోట్లో పైపుతో కనబడే ఒకాయన అరవై ఏళ్ళ క్రితం మాటల్లో :

    “Thus, the author writes in order to address himself to the freedom of readers, and he requires it in order to make his work exist. But he does not stop there; he also requires that they return this confidence which he has given them, that they recognize his creative freedom, and that they in turn solicit it by a symmetrical and inverse appeal.” [1]

    ఇంతకు మించి రాస్తే వ్యాసమవుతుంది. అది నా అర కొర జ్ఞానంతో కన్నా కాస్త లోతుగా తెలిసినవాళ్ళు రాస్తే బావుంటుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] From “Why Write?” in “What Is Literature?” and Other Essays, by Jean-Paul Sartre.

    [ఈమాట అభిప్రాయ రచయితలకు మనవి: ఈమాట రచనలపై మీరు రాసే అభిప్రాయాలను ఆయా రచనలలో వివరించిన అంశాలతో ఏదో ఒక సంబంధం ఉండేటట్లుగా రాయమని మా మనవి. రచనలతో ఏ మాత్రం సంబంధం లేని నిరన్వయ (unrelated), తిర్యగ్గత (tangential) అభిప్రాయాలను ఇకపైనుండి తిరస్కరించాలని సంపాదక వర్గం నిర్ణయం. ఇటువంటి చర్చలకు రచ్చబండ వంటి ఫోరములు సరైన వేదికలని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. — సంపాదకులు]

  5. తడి గురించి Kittu గారి అభిప్రాయం:

    10/01/2008 12:50 pm

    చిన్నమయ్య గారికి: మీ కథ చాల బాగుంది. ఇంతకి మీరు “పది మందికి ఉపయోగపడే నిధి” స్థాపించారా ? ఒక వేళ చేస్తే స్థాపించినట్టు మాకూ చెప్పండి.

    Tarakaram గారికి: US లో ఉన్న వాళ్ళంతా మీరు అనుకున్నట్టు అక్కడి వాళ్ళను మరిచిపోరు. అలా జనరలైజ్ చేసి మాట్లాడడం తప్పు. అలాగే, మీరు అన్నట్లు ఇక్కడ ఉన్నవాళ్ళంతా గొప్ప వాళ్ళు కారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. మేము కూడా మాకు తోచిన సహాయం చేస్తున్నాము. ఇక ముందు చేస్తాము కూడా.

    కిట్టు.

  6. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి peesaati soma surya sekharudu గారి అభిప్రాయం:

    10/01/2008 8:45 am

    చాలా కాలానికి చక్కని కవిత్వం చదివిన అనుభూతి కలిగింది. అతి మధురం గా ఉంది.

  7. అజంతా పద్యాలు గురించి bollojubaba గారి అభిప్రాయం:

    10/01/2008 7:38 am

    అజంతా వ్రాసిన మరికొన్ని పంక్తులను ఉదహరించి ఉండాల్సింది.
    బొల్లోజు బాబా

  8. కవిత్వీకరణ మరికొన్ని సంగతులు గురించి bollojubaba గారి అభిప్రాయం:

    10/01/2008 2:56 am

    కవులకు దిశానిర్దేశం చేసే విధంగా ఉంది.

    బొల్లోజు బాబా

  9. కవిత్వం లో “నేను” గురించి bollojubaba గారి అభిప్రాయం:

    10/01/2008 2:41 am

    “నేను” వాడకం అభివ్యక్తి కి అడ్డంకా, లేక ద్విగుణీకృతం చేస్తుందా?

    బొల్లోజు బాబా

  10. ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం గురించి bollojubaba గారి అభిప్రాయం:

    10/01/2008 2:28 am

    ఇస్మాయిల్ గారిని మరలా గుర్తుచేసారు. ఈ హేంగోవర్ కొంతకాలం తప్పదు తీయగా అనుభవించాల్సిందే.

    బొల్లోజు బాబా

« 1 ... 1342 1343 1344 1345 1346 ... 1581 »