బాగుందండీ.
కాకుంటే ఓ చిన్న సూచన – ఇలా మీరు చాలా పద్యాల గురించి రాస్తున్నారు కదా… అన్నింటికీ ఒక టాగ్ అలా ఏదన్నా పెడితే వరుసగా చదువుకోడానికి వీలుగా ఉంటుంది.
విశ్వనాథ వారి “సాహిత్య సురభి” గుర్తు వస్తోంది..
మీ వ్యాసం బావుంది. పథేర్ పాంచాలి నిజంగా ఒక కళాఖండం. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో సన్నివేశం, ముగింపులో హరిహర్ భార్యని చనిపోయిన దుర్గ గురించి అడుగుతున్నప్పుడు ఆమె కూర్చున్నచోటునే దుఃఖంతో కూలబడిపోతుంది. ఇక్కడ పండిట్ రవిశంకర్ తన అసమాన ప్రతిభని చూపించాడు. దృశ్యం, శబ్దం ఏకమై ప్రేక్షకుడు వాళ్ళ దుఃఖంతో మమేకమౌతాడు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
అలాగే భిభూతిభూషణ్ మరొక మంచి నవల “వనవాసి”.
ఈమాట – నామాట గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/02/2008 8:11 pm
ఈమాట సంపాదక, రచయిత, పాఠక వర్గానికి పదో జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు కాలాల పాటు ఈ పత్రిక వెలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంచికకీ రాత్రింబవళ్ళూ శ్రమించే సంపాదకులకి, ముఖ్యంగా నాకెక్కువ సాయపడే సురేష్ కీ, పద్మ గారికీ, కృతజ్ఞతలు. ఎంత చిన్న విషయాన్నయినా తేలిగ్గా తీసుకోకుండా ఉన్నత స్థాయిలో ప్రచురించాలనే వారి దీక్ష మెచ్చుకోదగ్గది. వాళ్ళు మార్చినది బాలేదని నేను పేచీ పెడ్తే ఓపిగ్గా సమాధానం ఇచ్చి సామరస్యంగా పరిష్కరించడం సంతోషకరం. వారి ఉద్యోగ బాధ్యతలని నిర్వర్తిస్తూ, బహుశా కుటుంబ బాధ్యతలని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఈమాట కోసం పాటుపడుతున్న సంపాదకుల అంకిత భావం స్ఫూర్తిదాయకం.
Peer Review గురించి: సంపాదకులకి తలకి మించిన పనిభారం వలన గానీ, పరిమిత విషయ పరిజ్ఞానం వలన గానీ, కొన్నిటిని వేరే వాళ్ళని సమీక్షించమంటే సరే, కాని అది పత్రిక పద్ధతిగా పెట్టుకుంటే, నాదొక సందేహం. ఇది సాహితీ పత్రికలలో సాధారణంగా చేస్తారా? ఉన్నత ప్రమాణాలున్న, తెలుగులో లేకపోతే ఇంగ్లీషులోనే తీసుకోండి, ఇతర సాహితీ పత్రికలలో ఇదేనా ఆనవాయితీ? నాకు నిజంగానే తెలియకే అడుగుతున్నాను.
ఈమాట సంపాదక వర్గం అంతా, రచయితల్లో చాలా మందీ, బహుశా పాఠకుల్లో కూడా చాలా వరకూ, విజ్ఞానశాస్త్రాల్లో విద్యాధికులూ, నిష్ణాతులూనూ. కాని సాహితీ పత్రిక అన్ని రంగాల వాళ్ళనీ ఆకర్షించేదిగా ఉండాలి. ఈమాటని Physical Review ప్రమాణాలతో నడుపుతాం అంటే శాస్త్రరంగాలలో లేనివాళ్ళకి కాస్త “భయం” కలగొచ్చు. The New Yorker పద్ధతిన నడుపుతాం అంటే బహుశా అందరికీ ఆమోదయోగ్యం కావొచ్చు.
A comprehensive and interesting review. The book indeed shows her dedication, hard work and in depth analysis. It sure is “heart warming” introduction by Sarayu Rao as you rightly put it.
ఈమాట – నామాట గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
మరో విశేషం. ఈ నామాట, ప్రచురణకి ముందు సమీక్షించబడింది. వాళ్ళ సలహాలననుసరించి మార్పులు, కూర్పులూ చెయ్యడం కూడా జరిగింది! అయితే, నేను సమీక్షకులసంగతి మరిచిపోయానన్న సంగతి మా సమీక్షకులుకూడా నాకు చెప్పలేదు. నన్ను హెచ్చరించలేదు. నన్ను మందలించినందుకు బ్రహ్మానందంగారికి కృతజ్ఞతలు.
మోహన గారి సలహా పాటించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నా.
మళ్ళీ మరోసారి, నా క్షమాపణలు.
విధేయుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
ఈమాట పదవ వార్షికోత్సవ సందర్భంగా సంపాదకులందరికీ మరొక్కసారి శుభాభినందనలు!!
సాహిత్య పరంగానూ, సాంకేతికపరంగానూ అతిరధులు,మహారధులైన సంపాదకుల సారధ్యం వలన ప్రస్తుతం ఉన్న సాహితీ పత్రికలన్నింటిలో ఈమాట మొదటి స్థానం లో ఉండటం ఎంతమాత్రమూ ఆశ్చర్యం కాకపోయినా ఈ పత్రిక ను ఈ స్థాయిలో నడపటం వెనుక ఉన్న సంపాదకవర్గం కృషి, నిబద్ధత ,అంకితభావం ,passion, పత్రిక పై వారు వెచ్చిస్తున్న సమయం నిస్సందేహంగా అభినందనీయాలు.
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Sowmya గారి అభిప్రాయం:
11/03/2008 12:25 am
బాగుందండీ.
కాకుంటే ఓ చిన్న సూచన – ఇలా మీరు చాలా పద్యాల గురించి రాస్తున్నారు కదా… అన్నింటికీ ఒక టాగ్ అలా ఏదన్నా పెడితే వరుసగా చదువుకోడానికి వీలుగా ఉంటుంది.
విశ్వనాథ వారి “సాహిత్య సురభి” గుర్తు వస్తోంది..
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి శివ బండారు గారి అభిప్రాయం:
11/03/2008 12:23 am
బావుంది
రెండు తీరాలు గురించి Sowmya గారి అభిప్రాయం:
11/03/2008 12:15 am
చాలా బాగుంది!
సువర్ణభూమిలో … గురించి Sowmya గారి అభిప్రాయం:
11/03/2008 12:11 am
I liked the last one the most 🙂
Others… నాకు సరిగా అర్థం అయ్యాయా లేదా అని సందేహం 🙂
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:
11/02/2008 11:00 pm
అబినందనలు
రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి B.Ajay Prasad గారి అభిప్రాయం:
11/02/2008 10:36 pm
మీ వ్యాసం బావుంది. పథేర్ పాంచాలి నిజంగా ఒక కళాఖండం. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో సన్నివేశం, ముగింపులో హరిహర్ భార్యని చనిపోయిన దుర్గ గురించి అడుగుతున్నప్పుడు ఆమె కూర్చున్నచోటునే దుఃఖంతో కూలబడిపోతుంది. ఇక్కడ పండిట్ రవిశంకర్ తన అసమాన ప్రతిభని చూపించాడు. దృశ్యం, శబ్దం ఏకమై ప్రేక్షకుడు వాళ్ళ దుఃఖంతో మమేకమౌతాడు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
అలాగే భిభూతిభూషణ్ మరొక మంచి నవల “వనవాసి”.
ఈమాట – నామాట గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
11/02/2008 8:11 pm
ఈమాట సంపాదక, రచయిత, పాఠక వర్గానికి పదో జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు కాలాల పాటు ఈ పత్రిక వెలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంచికకీ రాత్రింబవళ్ళూ శ్రమించే సంపాదకులకి, ముఖ్యంగా నాకెక్కువ సాయపడే సురేష్ కీ, పద్మ గారికీ, కృతజ్ఞతలు. ఎంత చిన్న విషయాన్నయినా తేలిగ్గా తీసుకోకుండా ఉన్నత స్థాయిలో ప్రచురించాలనే వారి దీక్ష మెచ్చుకోదగ్గది. వాళ్ళు మార్చినది బాలేదని నేను పేచీ పెడ్తే ఓపిగ్గా సమాధానం ఇచ్చి సామరస్యంగా పరిష్కరించడం సంతోషకరం. వారి ఉద్యోగ బాధ్యతలని నిర్వర్తిస్తూ, బహుశా కుటుంబ బాధ్యతలని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఈమాట కోసం పాటుపడుతున్న సంపాదకుల అంకిత భావం స్ఫూర్తిదాయకం.
Peer Review గురించి: సంపాదకులకి తలకి మించిన పనిభారం వలన గానీ, పరిమిత విషయ పరిజ్ఞానం వలన గానీ, కొన్నిటిని వేరే వాళ్ళని సమీక్షించమంటే సరే, కాని అది పత్రిక పద్ధతిగా పెట్టుకుంటే, నాదొక సందేహం. ఇది సాహితీ పత్రికలలో సాధారణంగా చేస్తారా? ఉన్నత ప్రమాణాలున్న, తెలుగులో లేకపోతే ఇంగ్లీషులోనే తీసుకోండి, ఇతర సాహితీ పత్రికలలో ఇదేనా ఆనవాయితీ? నాకు నిజంగానే తెలియకే అడుగుతున్నాను.
ఈమాట సంపాదక వర్గం అంతా, రచయితల్లో చాలా మందీ, బహుశా పాఠకుల్లో కూడా చాలా వరకూ, విజ్ఞానశాస్త్రాల్లో విద్యాధికులూ, నిష్ణాతులూనూ. కాని సాహితీ పత్రిక అన్ని రంగాల వాళ్ళనీ ఆకర్షించేదిగా ఉండాలి. ఈమాటని Physical Review ప్రమాణాలతో నడుపుతాం అంటే శాస్త్రరంగాలలో లేనివాళ్ళకి కాస్త “భయం” కలగొచ్చు. The New Yorker పద్ధతిన నడుపుతాం అంటే బహుశా అందరికీ ఆమోదయోగ్యం కావొచ్చు.
కొడవళ్ళ హనుమంతరావు
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
11/02/2008 3:56 pm
A comprehensive and interesting review. The book indeed shows her dedication, hard work and in depth analysis. It sure is “heart warming” introduction by Sarayu Rao as you rightly put it.
ఈమాట – నామాట గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి అభిప్రాయం:
11/02/2008 2:03 pm
సమీక్షకులకి కృతజ్ఞతలు చెప్పకపోవడం నాతప్పు. క్షమార్హుణ్ణి. తలపండినా తప్పులు చెయ్యడం మాత్రం తగ్గ లేదు!
మరో విశేషం. ఈ నామాట, ప్రచురణకి ముందు సమీక్షించబడింది. వాళ్ళ సలహాలననుసరించి మార్పులు, కూర్పులూ చెయ్యడం కూడా జరిగింది! అయితే, నేను సమీక్షకులసంగతి మరిచిపోయానన్న సంగతి మా సమీక్షకులుకూడా నాకు చెప్పలేదు. నన్ను హెచ్చరించలేదు. నన్ను మందలించినందుకు బ్రహ్మానందంగారికి కృతజ్ఞతలు.
మోహన గారి సలహా పాటించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నా.
మళ్ళీ మరోసారి, నా క్షమాపణలు.
విధేయుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
11/02/2008 1:20 pm