Comment navigation


15795

« 1 ... 1331 1332 1333 1334 1335 ... 1580 »

  1. విన్నపము గురించి bheshajaam agnihOtrudu గారి అభిప్రాయం:

    11/03/2008 1:00 pm

    ఎ.బి.కె. ప్రసాద్ గారు మహాత్మా గాంధీ గారిని కోట్ చెయ్యడం, మహాత్ముడి మాటలు స్ఫూర్తి కలిగిచాయనడం ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆయన మార్క్స్ అనూయాయులని వినికిడి. మరయితే ఏ మార్క్సో!
    Here is a French witticism.
    Je suis Marxiste, tendance Groucho.
    (I am a Marxist of the Groucho variety)

    వసుదేవుడు చిన్నికృష్ణుణ్ణి కంసుడిబారినుంచి తప్పించడానికి అవసరార్థం ఏదో జంతువు కాళ్ళు పట్టుకున్నాడని కథ విన్నట్టు గుర్తు!
    అయ్యా! బాబ్జీలు గారూ! నూరు కోట్లు మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయనాయకులు హారతికర్పూరంలా ఊదేయగలరు!
    విధేయుడు,
    భేషజం అగ్నిహోత్రుడు

  2. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    11/03/2008 12:43 pm

    ఈ శీర్షిక ఉత్సాహంతో చదువుతున్నాను. గొప్ప ఆనందం కలుగుతున్నది.

    1. ఈ పద్యంలో శ్లేష ఆసాంతం ఉంది అనిపిస్తున్నది. వాన పడుతున్నప్పుడు గౌరిని, ప్రకృతిని రెంటినీ వర్ణించారనిపిస్తున్నది. ఈ పద్యంలో అడవిచెట్లు, ఆకులు, ?భూమి, కొండలు, మడుగులు – ఈ క్రమంలో లేవా? చెప్పగలరు.
    2. మానవ దేహ వర్ణన చేయటం ‘దౌర్భాగ్యం’ ఎందుకవుతుంది? మానవ దేహ సౌందర్యం తక్కువది కాదే. ఎందుకీ అసందర్భపు విరక్తి?

    లైలా.

  3. ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి నిషిగంధ గారి అభిప్రాయం:

    11/03/2008 11:22 am

    ఈమాట సంపాదకవర్గానికి అభినందనలు!

  4. జనరంజని: మహానటి సావిత్రి గురించి నిషిగంధ గారి అభిప్రాయం:

    11/03/2008 11:20 am

    మనసు ఎక్కడో చిక్కడిపోయి వెనక్కి రానంటోంది! ఇంతటి అరుదైన, అద్భుతమైన ఆడియో మాకందించినందుకు మీకెన్ని ధన్యవాదాలు చెప్తే సరిపోతుందో!!

  5. సువర్ణభూమిలో … గురించి ప్రజాపతి గారి అభిప్రాయం:

    11/03/2008 11:09 am

    ఇందులో ఒక్కముక్క అర్థమైతే చెప్పుచ్చుకు కొట్టండి

  6. ఈమాట – నామాట గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/03/2008 9:38 am

    సమీక్షా పద్దతి పై మాధవ్ గారి వివరణ బాగుంది. అవసరమని కూడా అనిపించింది.

    మొదట్లో వారు చెప్పిన “…ఇటువంటి వాటికి మా మేధా మా ప్రజ్ఞా అతీతం అనుకునే పండితుల కోసం ఈమాట రివ్యూ పద్ధతులు మార్చలేమనే చెప్పాలి” అన్న వాక్యం పానకంలో పుడకలాగ, సమీక్షా పద్దతి నొదిలేసి, అనవసరమైన రచయితల motive hunting ను ఈడ్చుకొచ్చింది. సంపాదకుల ఉద్దేశం అది కాదని తెలిసినా, ఈ మాట లెందుకో అని అనుకుంటుండగా, సత్వరమే వివరణ ఇవ్వడం హర్షణీయం.

    ఈమాట ప్రచురణకు స్వచ్చందంగా సాహిత్య సేవాసక్తితో పరిశ్రమించే వారెందరో అందరికీ కృతజ్ఞతాపూర్వక వందనములు.
    =======
    విధేయుడు
    -Srinivas

  7. జనరంజని: మహానటి సావిత్రి గురించి surya గారి అభిప్రాయం:

    11/03/2008 9:24 am

    పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఉంది మీ వ్యాసం శ్రీనివాస్ గారు. 44 నిమిషాల nostalgia! బండెడు ధన్యవాదాలు!!

  8. విన్నపము గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/03/2008 9:08 am

    రెహ్మతుల్లాగారూ నమస్తే,మీ దయవల్ల “పిడుగు” రామ్మూర్తిగారి వ్యాసం చదవగలిగేను.ఎబికే గారి కి దండాలెట్టుకోడం తప్పించింకేటీ సెయ్యలేం.ఇప్పుడు రాబోయే “వొంద” కోట్ల “గ్రాంట్లిండీషన్” తో తెలుగు భాషామతల్లి ఆరోగ్యం ఎలా బాగుపడిపోద్దో-సరిగ్గా వాడుకుంటే- తెల్టంలేదు.తెలుగు భాషామతల్లి కేటవలేదు. ఇన్నేళ్ళు బతికి బట్టకట్టింది. ఈ కొత్త హోదాతో ఆయమ్మకేటీ అవదు. ఈ హోదా రాకపోయినా ఆయమ్మ కేటీ “నస్టం” లేదు. (ఆ తమిళం బాబెవరో కాలడ్డెట్టేట్ట కదా? న్యాయమూర్తులు ఆ కాలు తీసీవరకూ “ట్రాఫిక్ జామేనటకదా?)ఈ “గ్రేంటు”, ప్రభుత్వుద్యోగుల జీతాలకీ, “టీయే,డీయే” బిల్లులకీ సెల్లు. మాయమ్మ సింకి సీరలాగేవుందేటని మీలాటోళ్ళు నిలదీస్తే, ఆ బాబులు “గ్రేంట్లు లేవోయ్ అయిరానీ సిల్లులుకి కుట్లేద్దారి” అంటారు.భాష నదీప్రవాహంలాటిదని “బా” రెహ్మతుల్లాగారూ, “రామన్నగారూ” “లక్ష్మన్నగారూ” మిగతా గార్లందరూ వొప్పుకుంటారు కదా? ఎన్ని “డేవుఁలు” కట్టినా “ఏట్లాబం?”
    త్యాగరాజుగారికి తమిళం వచ్చా? తమిళంలో కృతులు రాసేరా లాటివి ఈ మధ్యనే ఇందులోనే చదివేను. ఖచ్చితంగా తమిళం వచ్చేవుంటుంది. రాజాస్థానంలోనూ, పండిత గోష్టికీ తెలుగు చెల్లుతుందేమోగానీ, తోడుకోసం పక్కింటత్తయ్యగారిని “మామీ, తైరు వేణుం, తైరు పణ్రత్తికాహ” అనే అడిగుంటారు త్యాగబ్రహ్మ. ప్రస్తుతం అక్కడ ( తంజావూరులో) తెలుగు, తెలుగు కుటుంబాల వల్లే బతికుందేమో? “ప్రభుత్వ గ్రేంట్ల” వల్లకాదని నా నమ్మకం.
    కుతుబ్ షాహీ ల సమయంలోనూ, తరవాత “నిజాం” ల కాలంలోనూ తెలుగు బతికేవుందికదా?
    అమ్మనుద్ధరించీ మహానుభావులు పుట్టేరా? ఏమో?  

  9. ఈమాట – నామాట గురించి Madhav గారి అభిప్రాయం:

    11/03/2008 8:16 am

    మా నుంచి మరికొంచెం వివరణ (ఈమాట రివ్యూ పద్ధతి గురించి అపోహలేమన్నా ఉంటే తొలగిపోతాయనే నమ్మకంతో).

    1. ఈమాటను scientific journal లాగా మేము చూడటం లేదు. ఒక సాహితీ పత్రిక లాగానే నడుపుతున్నాం. అలాగే నడుపుతాం కూడా.

    2. పీర్ రివ్యూ అన్నపదం పదేపదే వాడడం వల్ల కొంచెం “భయం” ఏర్పడ్డదేమో, నిజమే అయుండచ్చు. అది పోగొట్టడానికి కృషి చేస్తాం.

    3. ఈమాటకు ప్రత్యేకంగా సమీక్షకులు లేరు. రచయితలూ, కవులూ వ్యాసకర్తలే మా సమీక్షకులు. (కొన్ని విశేష సాంకేతిక వ్యాసాల సమీక్షలకు తప్ప). అందువల్ల రచయితలూ సమీక్షకులూ ఒక తానులో ముక్కలే.

    4. ఈమాట విలువలు నిలుపుకుంటూ, “అన్ని రంగాల వారినీ” ఆకర్షించేదిగా మెలగాలనే మా కోరికా, తపనా కూడానూ. వచ్చిన ప్రతీ వ్యాసాన్నీ ప్రతీసారీ external review కి పంపము అని ఇంతకుముందే చెప్పా గదా. మోహనరావు గారు చక్కగా చెప్పారు. ఈమాట ఎలా ఉండాలి అనే విషయం మీద మాకు నిర్దిష్టమైన అభిప్రాయం లేదా దృక్పథం ఉంది. (అది మీకు నచ్చడం మా అదృష్టం). సంపాదకులుగా ఈమాటలో ప్రచురణలు ఎలా ఉండాలో వారికే తెలుస్తుంది, కాబట్టి మొదటి రివ్యూ సంపాదక బృందానిదే, ఆఖరి నిర్ణయం కూడా వారిదే. కానీ, బయాస్ కి తావు లేకుండా, (మాకు కొమ్ములు మొలవకుండా) an external perspective కోసం, వేరే వారితో రివ్యూ చేయించడం సబబు అనే మా నమ్మకం. అలాగే, సాంకేతిక, చారిత్రాత్మక, తదితర సంబంధమైన వ్యాసాలు కూడా. ఎందుకంటే అటువంటి వ్యాసాల్లో మేము వ్యాస లక్షణాలను సరిదిద్దుకోగలమే కానీ, ప్రతీసారీ వస్తుశీలతను నిర్ధారించలేం కదా! కొన్నిసార్లు కథలూ, కవితలకి కూడా ఈ అవసరం పడుతూ ఉంటుంది. అంతేకాదు, ఎవరికి రివ్యూకి పంపాలో వారి ప్రతిభ, పటిమ రెండూ ముందు తెలుసుకునే పంపుతున్నాం కూడా.

    (పనిభారం వల్ల మాత్రం కాదని ఒట్టేసి చెబుతున్నాను. 🙂 నాకు ఈ పని భారమనిపిస్తే నేనిక్కడ ఉండగూడదని అర్థం, అంతే. సహధర్మచారుల అభిప్రాయం వేరే అనుకోండి, అది వేరే విషయం)

    ఇక నిక్కచ్చిగానే కొన్ని విషయాలు చెపుతాను. అన్యధా భావించవద్దు.

    తెలుగు సాహితీరంగంలో సంపాదకుడు తన బాధ్యతను, కర్తవ్యాన్నీ మర్చిపోయి చాలా కాలమయిందనే “నా” అభిప్రాయం. మంచి సాహిత్యమనే నాణేనికి రచయిత ఒక వైపు ఉంటే పాఠకుడు రెండోవైపు. ఈ రెండు పార్శ్వాలనీ నిలబెడుతూ, రచయిత అందించే సాహిత్యాన్ని పరిష్కరించి పాఠకుడికి అందిస్తూ, అనుసంధానుకుడైన సంపాదకుడు ఆ నాణేనికి మూడోవైపు. పరిష్కర్త గా ఉండవలసిన వ్యక్తి కేవలం పేజీ కంపోజర్ గా మిగిలిపోడం దురదృష్టం. కారణాలేమిటన్నది అప్రస్తుతం. మంచి సాహిత్యానికి సమీక్ష, పరిష్కరణ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్న బలీయమైన నమ్మకమే ఈ రివ్యూ పద్ధతికి అంకురార్పణ.

    ఈ రివ్యూ పద్ధతి కొత్తగా తిరిగి నేర్చుకోవలసి రావడం వలన, రచయితలలో జంకు కలగడం సహజం. వారి కోకిలను సంపాదకుడు ఏ కాకిగా మారుస్తాడో అన్న భయం వల్ల. అందువల్ల, మేము మార్పులూ చేర్పులూ చేసిన ప్రతీసారీ, రచయితలకు ప్రివ్యూ చూపించి వారికి నచ్చి, ఒప్పుకున్న తర్వాతే వారి కథనూ, కవితనూ, వ్యాసాన్నీ ప్రచురిస్తున్నాం. ఒకవేళ వారికి నచ్చక పోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేమూ తిరస్కరించడమో జరుగుతుంది. నిజానికి ఈ ప్రివ్యూ పద్ధతి వేరే పత్రికలకు లేదు. సంపాదకులదే ఏకపక్ష నిర్ణయం. కానీ ఈమాట పద్ధతి అది కాదు. మనమందరమూ కలిసి ఒక మంచి సాహిత్యాన్ని ఆనందిద్దాము, అనేది మా అంతిమ లక్ష్యం.

    ఏదేమైనా ఈమాట రచయితల విశాల హృదయం, విమర్శను స్వీకరించే సహృదయతా మా రివ్యూ పద్ధతి కొనసాగడానికీ, ఈమాట ప్రమాణాలు నిలబడడానికీ కారణాలు. ఇలాగే మా కర్తవ్య నిర్వహణలో లోపాలున్నా, మా పద్ధతి నచ్చకున్నా చక్కగా విమర్శించడం మీ బాధ్యత. విని తప్పు దిద్దుకోడం మా కర్తవ్యం. (విలువలకి రాజీ పడి మాత్రం కాదని మీకూ తెలుసు, అలా రాజీపడితే మీరు ఏమాత్రం సహించరని మాకూ తెలుసు).

    ఇంతకంటే వివరణ అనావశ్యమనే మా భావన. శెలవు.

    మాధవ్ మాచవరం
    ఈమాట సంపాదకుల తరఫున.

  10. సార్ గారండీ… సార్ గారండీ… గురించి bollojubaba గారి అభిప్రాయం:

    11/03/2008 7:32 am

    రాధిక గారికి
    ధన్యవాదములండి. మీ కరక్షన్ కరక్టేనండి. ఆ టైపాటు నాదే
    బొల్లోజు బాబా

    [తప్పు సరిదిద్దాము. క్షమాపణలతో – సం.]

« 1 ... 1331 1332 1333 1334 1335 ... 1580 »