Comment navigation


15795

« 1 ... 1335 1336 1337 1338 1339 ... 1580 »

  1. ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:

    11/02/2008 6:12 am

    Congratulations and best wishes

    Vamsi

  2. మూడు జ్ఞాపకాలు గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/01/2008 11:34 pm

    మీ జ్ఞాపకాలు చాలా బావున్నాయి. మీరు పూర్తి స్థాయి కథలు రాస్తే చదవాలని ఉంది!

  3. పదేళ్ళ “ఈమాట” మాట గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/01/2008 11:31 pm

    వెబ్ పత్రికల్లో ఈమాట అగ్రగణ్య. సందేహం లేదు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి రచనలతో పాఠకుల దాహాన్ని తీరుస్తుందని ఆశిస్తూ…

  4. సువర్ణభూమిలో … గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/01/2008 11:19 pm

    ఆఖరి ఖండిక బావుంది.

  5. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/01/2008 11:16 pm

    మంచి వాతావరణ కల్పన ఉంది. పడికట్టు పదాలు లేకపోవడం మీ కవిత్వ బలం. keep writing!

  6. తరువాతేమిటి? గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/01/2008 11:12 pm

    కొన్ని వ్యక్తీకరణలు బలంగా ఉన్నాయి.

  7. సార్ గారండీ… సార్ గారండీ… గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    11/01/2008 11:09 pm

    చాలా బావుందండీ!

  8. వాడుక భాషలో పద్యాలు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/01/2008 5:33 am

    ఈ మధ్య ఇంటర్నెట్టు సౌలభ్యానికి కాస్తంత అభ్యంతరం ఏర్పడి ఈ చర్చని ఇంతవరకూ చూడలేదు. దీని గురించి తాపీగా మళ్ళీ ఆలోచించి రాయాలి. ప్రస్తుతానికి రెండు మూడు విషయాలు.
    మోహనగారు వాడుకభాషలో పద్యాలకి ఆదరణ లభించాలని కోరుకున్నారు. సమంజసమే. వాడుక భాషలో పదునైన, అందమైన పద్యకవిత్వం వస్తే (రా గలిగితే) దానికి ఆదరణ తప్పకుండా లభిస్తుందని నా నమ్మకం.
    తెలుగులో పాదాంత విరామం గురించి. అది సంస్కృతంలో నియమం. తెలుగులో లేదు. కాబట్టి, కావాల్సిన చోటల్లా ఆ విరామాన్ని పాటించడానికీ అవకాశం ఉంది, అక్కరలేదనుకున్నప్పుడు పాటించకపోడానికీ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలుగు ఛందస్సులో ఎక్కువ వెసులుబాటు ఉందన్నమాట!
    బాబ్జీలుగారు తమ వ్యాఖ్యల్లోకి రెండు మూడు సార్లు నన్ను లాక్కొచ్చారు 🙂 వారికోసం నేను వాడుకభాషలో రాసిన పద్యాలు: “నాన్నా తెలుసా“.

  9. వాడుక భాషలో పద్యాలు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/01/2008 5:24 am

    బాబ్జీలు గారు,
    మస్తు ఉపకారం చేసారు గా ప్రశ్న అడిగి. నా పాయింటుకు సూ…….టితనం తెచ్చారు.

    వాడుక భాషలో పద్యాల గురించే మన ముచ్చట. మస్తుగా సదివినోళ్ళు, సూసినోళ్ళు, వాడుక భాషలోని పదానికే అర్థం తెలియక తటపటాయిస్తే, ఇక అందులో పద్యాలు రాయడం, చదవడం, అవి సులభంగా, సవ్యంగా పాఠకునికి అర్థమవడం- అంతా అయ్యే పనేనా అని పెద్ద, చెడ్డ అనుమానం. కారణం? మన సక్కని భాషకు సక్కని dictionaries సామాన్యులకు అందుబాటులో లేకపోవడం.

    అదృష్టం బాగుండి Brown Telugu-English dictionary లో “మస్తు” అంటే “సమృద్ధి, plenty, abundance” అని ఒక అర్థం ఉంది. మనకున్న ఎన్నో dictionaries లో అది ఉంటుందని ఆశైతే లేదు. మనకాడ పుట్టిన bazaar పదానికి అర్థం వ్యుత్పత్తులు మన కాడ కన్నా English dictionaries లోనే మంచిగా దొరుకతయి. మనదైపోయిన పదానికి అర్థం, మరో భాషలోని పాటను చెప్పుకొని వివరించుకుంటేనేగాని అర్థం కాని దుస్థితిలో ఉన్నాం. వాడుక భాష వాడితేనే సదువుకున్నోళ్ళు పరేషానైపోతే, వేరేవాళ్ళ పరిస్థితి దేవుడెరుగు.
    ==============
    విధేయుడు
    -Srinivas

  10. వాడుక భాషలో పద్యాలు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    10/31/2008 9:52 am

    కృష్ణమోహన్ గారూ,మీకు చేత కాదని నేననుకోవడంలేదు. మీరు రాసిన పద్యాలు నేను చూళ్ళేదు. క్షమించండి. మీరు గానీ, కామేశ్వర రావు గారు గానీ, మరెవరైనా గానీయండి; ఛందోబధ్దమైన పద్యాలు నా “హ్రస్వదృష్టి”కి (దానికి తోడు చెత్వారం)కనబడలేదు. అది నా తప్పే. కానీ ఒక విషయం చెప్పండి, మీ వ్యాసంలో వుదాహరణలు ఇప్పటివాళ్ళవి ఎంత %? అది చా………లా తక్కువనిపించింది నాకు. అందుకని అడిగేను. వాడుక భాషలోనైనా, మరేభాషలోనైనా ఛందొబధ్ధమైన పద్యాల విషయం ఎలాటిదంటే: ఒకప్పటి మన గొప్ప ఆట “హాకీ” ఇప్పటికీ గొప్పదనడంలాటిది. ప్రస్తుతం “హాకీ” గొప్పగా ఆడీవాళ్ళు లేకపోయినా.

    ఇంతకీ శ్రీనివాస్ నాగులపల్లి గారుదహరించిన తేటగీతి చివరి పాదంలోని “మస్తు”
    “తూ చీజ్ బడీ హై “”మస్త్ మస్త్”” లోని మస్తేనా? ఇంకో మస్తా?
    ఇందులో ఇకటాలేటీలేవు. తెలకడగడం అంతే. దయుంచాల.

    లైలాగారు చెప్పిన “ఈమాట” యొక్క “ఎడ్వాంటెజి” వొప్పుడో వొప్పీసుకున్నాను. మౌనంగా అలోచించడవొక్కటే నేర్సుకోవాల. “సబ్మిట్” మీద “క్లిక్” కొట్టినకాణ్ణించీ అదీ మొదలెడతాను.    

« 1 ... 1335 1336 1337 1338 1339 ... 1580 »