Comment navigation


15795

« 1 ... 1330 1331 1332 1333 1334 ... 1580 »

  1. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి నెటిజన్ గారి అభిప్రాయం:

    11/03/2008 10:49 pm

    “షోకుల, బాకాల,పొలికేకల కింద
    ఆకలి కేకలు అడుగంటుతున్నాయి”
    బావుంది.

    16కోట్ల రూపాయల జాకెట్ ప్రకటనలు గుప్పించిన వైనం గుర్తు వచ్చింది.

    తెలుగవ్వడం ఒక్కటే కాదు, మీకు కవిత్వం కూడా చేసింది.

  2. సార్ గారండీ… సార్ గారండీ… గురించి ఏకాంతపు దిలీప్ గారి అభిప్రాయం:

    11/03/2008 10:09 pm

    బాబా గారు,
    చాలా బాగుంది… నేనూ ఇంతకుముందు ఒకసారి అన్నాను, మీరు మార్పుని అర్ధం చేసుకుంటారని, ఆహ్వానిస్తారని… తరాల మధ్య అంతరాలని అర్ధంచేసుకోగలరని… మనం కలుస్తాము ఎప్పుడైనా…

  3. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి సుజాత (మనసులో మాట) గారి అభిప్రాయం:

    11/03/2008 7:56 pm

    “క్షుధాగ్ని కొలిమిని ఆర్పకుండా ఎందుకీ క్షుద్ర దేవతారాధాన?”

    చాలా చాలా బాగుంది రాజేంద్ర గారు, అభినందనలు!

  4. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి galls గారి అభిప్రాయం:

    11/03/2008 7:31 pm

    అయ్యా మీ కవిత చాలా బాగుంది. మీ కోరిక నెరవేరాలని కోరుతున్నాను. మీకు ఆ నైపుణ్యం ఉంది.

    All the best.

  5. ఈమాట – నామాట గురించి వామనమూర్తి గారి అభిప్రాయం:

    11/03/2008 7:13 pm

    ఈ మాట సంపాదక వర్గానికీ, కవితల్నీ, కథల్నీ చూసే ‘పీర్ల ‘ కీ భారత ప్రభుత్వం ‘మహా పద్మ విభూషణ సమ్రాట్ శేఖర ‘ బిరుదులు ఎనౌన్స్ చెయ్యాలని ఒక ఉద్యమం చేపట్టాలనుకుంటున్నాము. మీ ‘పీర్లు ‘ అనుమతిస్తే తెలీయచేయండి.

  6. సువర్ణభూమిలో … గురించి వామనమూర్తి గారి అభిప్రాయం:

    11/03/2008 7:07 pm

    ఈ కవిత యదుకుల భూషణ్ గారికి అంకితమిస్తూ..
    అంకాలమ్మ
    గుడిలో ఒక అడుగు
    ఆటోలో శవం ఊరేగుతోంది
    జెండాపై బల్లి
    ఒకటే గురకపెడుతోంది
    తామరాకు నిద్రలేచి
    ఆవులించింది
    పసి పాప
    ప్రత్యేక రాష్ట్రం కోసం
    గర్జిస్తోంది
    ఎంత సుకుమారం
    ఛాంగు భళ ఎంకి మామా

  7. జనరంజని: మహానటి సావిత్రి గురించి రానారె గారి అభిప్రాయం:

    11/03/2008 4:46 pm

    వింటూ వింటూ మనసెక్కడికో వెళ్లిపోయింది. ఇన్ని మంచి పాటలను ఆ పాటలతో సంబంధమున్న మనిషొకరు వ్యాఖ్యానిస్తూవుండగా ఒకసారిగా వినాలంటే రేడియో ఒకటే మార్గం. “మరోసారి తప్పకుండా కలుసుకుంటానని …” సెలవుతీసుకున్న సావిత్రిగారి మాటను మీరు దక్కించారు. వింటూ ఎంతో ఆనందించాను. అరుదైన ఈ శబ్దతరంగాలను సేకరించి ‘ఈమాట’ వేదికమీదుగా వినిపించినందుకు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే పరుచూరిగారూ!

  8. సార్ గారండీ… సార్ గారండీ… గురించి ప్రజాపతి గారి అభిప్రాయం:

    11/03/2008 3:49 pm

    అద్భుతంగా ఉంది.చక్కటి చిక్కటి కవిత్వం. పదచిత్రాలు, అన్వయం, మనసుని కదిలించే ముగింపు.చాలా రోజుల తర్వాత మళ్ళీమళ్ళీ చదివించిన కవిత.

    ఈ దేహం కలిసిపోయే లోపు
    ఎప్పుడో, ఎక్కడో వాడు కన్పించి,
    “బాగున్నారా మాష్టారూ” అంటాడు.
    అంతకుమించింకేం కావాలీ జీవితానికి.
    హేట్సాఫ్.

  9. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి ఉమాశంకర్ గారి అభిప్రాయం:

    11/03/2008 1:42 pm

    కవిత బావుంది.

    మీరు బేసిగ్గా విశాఖ వాస్తవ్యులనుకున్నా.గుంటూరు నుంచి వలస వెళ్ళారన్నమాట.

  10. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి mOhana గారి అభిప్రాయం:

    11/03/2008 1:13 pm

    నాకు నచ్చిన కవులలో నన్నెచోడుడు ఒకడు. ఇతనికి ఇవ్వని ప్రబంధపరమేశ్వరుడనే బిరుదును ఎఱ్ఱాప్రెగడకు ఎందుకిచ్చారో. తెలుగులో మొట్టమొదటి ప్రబంధము
    కుమారసంభవమే. లైలాగారు చెప్పినట్లు ఇందులో ప్రకృతివర్ణన కూడా ఉందనుకోవచ్చు. అందువల్ల అలంకార రీత్యా ఇది స్వభావోక్తి (శ్లేష కాదు). ఈ పద్యం నాకు ఆకాశంబునుండి (భర్తృహరి సుభాషితం) అనే పద్యాన్ని గుర్తుకు తెస్తుంది. మరెప్పుడైనా వీలున్నప్పుడు నన్నెచోడునిపైన వ్రాయాలి. విధేయుడు – మోహన

« 1 ... 1330 1331 1332 1333 1334 ... 1580 »