Comment navigation


15795

« 1 ... 1328 1329 1330 1331 1332 ... 1580 »

  1. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    11/04/2008 11:50 am

    నన్నెచోడుని, అతని చక్కని పద్యాన్ని పరిచయం చేసారు. మోహనగారన్నట్టు ప్రబంధపరమేశ్వరుడు బిరుదుకి నన్నెచోడుడు తగినవాడే!
    మీ వివరణకి చిన్న సవరణ. “ముత్తరంగలు” అంటే నాభిపై భాగమ్మీద ఏర్పడే సన్నని మూడు మడతలు అని అర్థం, మూడు పాయలని కాదు. ఈ “ముత్తరంగల”నే “త్రివళులు” అని కూడా అంటారు.
    “మడుగులు వారి” అంటే మడతలు పడి అని అర్థం. వాననీరు కుచఘట్టనతో వేగంగా కిందకి పారి, త్రివళులని చేరి, ఆ మడతలకి మడతపడి వేగంగా నాభిని చొచ్చాయి అని అర్థం. ఈ అర్థంలో నీరు మూడు పాయలుగానే ఎందుకు చీలింది అన్న సందేహానికి తావుండదు.

  2. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana గారి అభిప్రాయం:

    11/04/2008 11:45 am

    నాకు తోచిన రెండు నయాపైసలు!
    విజ్ఞానశాస్త్ర పత్రికలలో రచనలను ప్రచురించడానికి ముందు పత్రికకు రచయిత కాపీరైటు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈమాట వంటి పత్రికలకు రచయితలు అలా కాపీరైటు అందివ్వడం
    లేదు. ఐనా కూడా రచయిత మళ్ళీ తన రచనను మరో చోట ప్రచురిస్తే అక్కడ మొట్ట మొదట ఆ రచన ఈమాటలో ప్రచురించబడినది అని తప్పక చెప్పాలి. ఆ రచనను తన
    ఒక పుస్తకంలో భాగంగా ఉంచినా ఈ విషయాన్ని విదితం చేయాలి. ఈ రెండు సమయాలలో ఈమాట పత్రికకు అలా చేస్తున్నానని తెలియబరచాలి. ఇలా చేస్తే ఈమాట హక్కుదారులు, సంపాదకులు తప్పక అంగీకరిస్తారనే అనుకొంటాను. అలా చేయకపోతే అంత బాగుండదని నా అభిప్రాయం. విధేయుడు – మోహన

  3. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    11/04/2008 11:08 am

    PP Rao గారూ,

    మంచి ప్రశ్న వేసారు. నాకో సందేహం.
    విలువలు / Ethics కేవలం రచయితలకే సంబంధించిన విషయమా? సంపాదకులకది వర్తించదా? ఎందుకిలా అడుగుతున్నానంటే, గతంలో ఒక వెబ్ పత్రికలో వచ్చిన కొన్ని కథలూ, వ్యాసాలూ ఇంకో పుస్తకంలో రచయితల ఆమోదమం లేకుండా వేసేసారు. ఆ పుస్తకాలు అమ్మకానికీ పెట్టారు.
    గతంలో నేనొక పత్రికకి కాలమ్ రాసేవాణ్ణి. నాకు ఏ రకమైన సమాచారం ఇవ్వకుండానే ఓ రెండు రోజులుంచి, ఆ మర్నాడు తీసేసారు. గట్టిగా అడిగితే మళ్ళీ పెట్టారు. అందుకే చాలా పత్రికలు హామీ పత్రం తీసుకుంటాయి. అది పాటిస్తే సంపాదకులకీ, రచయితలకీ ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం, ఏ పత్రికయినా రచయితలకి పారితోషికం చెల్లిస్తున్నారా? అదుంటే పత్రిక వాళ్ళు అడగడంలో అర్థం ఉంది. ఎదో ఒక వెబ్ పత్రిక పెట్టుకొని అందులో వచ్చే వ్యాసాలూ, కథలూ వేరే చోట ప్రచురణ కాకూడదని ఆ పత్రిక వారికనిపిస్తే అది చెప్పాలి. గతంలో ఈ మాటలో వచ్చిన కథలు కొన్ని ఆంధ్రజ్యోతిలోనూ, విపుల లోనూ వచ్చాయి. అలాగే అమెరికాలో అనేక సావనీర్లలో కథలు తిరిగి ప్రచురించబడుతున్నాయి. ప్రస్తుత సాహితీ రంగంలో Ethics నిర్వచనాలు ఎవరికి తగ్గట్లు వాళ్ళు చెప్తున్నారు. అంతే!
    ఇందులో రచయితల్ని Ethics అంటూ నిలదీయడం ఎంత వరకు సబబు? Ethics అందరికీ వర్తిస్తాయి కదా?

  4. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    11/04/2008 9:57 am

    రావు గారూ:

    మీకొచ్చిన సందేహం కొంతవరకు సబబే!

    అందుకు నా సమాధానం ఇది.

    ఈమాట ఒక నిర్ణీత కాలానికి వెలువడే పత్రిక. ప్రతి రెండు నెలలకి మెదటి తేదీన. నవతరంగం ఎప్పుడైనా ప్రచురించే పత్రిక. దీనికి ఒక నిర్దిష్ట కాలం లేదు. ఒకప్పటి ఈమాట సంపాదకుడిగా నా ఒక ప్రత్యేక లక్ష్యం ఈమాటే!

    నేను కొన్ని నెలల క్రితం ఈమాటలో రాసిన రషోమాన్ (జాపనీస్ సినిమా)లో కొంత భాగం (నా అనుమతి లేకుండా) నవతరంగంలో పెట్టి, నా వ్యాసానికి ఈమాట లింకులిచ్చారు. అది చూసి నేను బాధపడలేదు. మరి కొంతమందికి తెలుస్తుంది కదా అనుకొన్నా! ఆ తరవాత నేను నవతరంగంలో సభ్యుడనై, ఈమాటలో ప్రచురించని వ్యాసాలు రాసా.

    ఈ మధ్య నా కొచ్చిన ఆలోచనల్తో, రాయ్ సినిమాలొ “ఈమాట” పాఠకులకి పరిచయం చేద్దామనుకొని, వ్యాసాలు రాస్తూ, అవి ఈమాటలో ప్రచురించిన తరవాత నవతరంగంలో పెట్టటానికి నవతరంగం మోడరేటరుకి ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగి, లేదని తెలిసిన తరువాత ఈమాటలో ప్రచురితమైన తరవాత నవతరంగంలో ప్రచురించమని కోరుతూ (తేదీ ఎప్పుడో ఎవరికీ తెలియదు), ఈమాట కి రెఫెరెంస్ కోరాను. అది కపడక పోతే, నేనే ఆ విషయం చెప్పాను. ఉదాహరణకి ఈ క్రింది ఈరోజు నా అభిప్రాయం నవతరంగంలో చూడండి. అలాగే చారులత పై నా వ్యాసం, ఈమాటలో ప్రచురించిన తరవాతలోనవతరంగంలో ప్రచురించి, ఈమాట గురించి రెఫెరెన్స్ లేకపోతే, అది నేనే ఇచ్చా!
    *****************************************************
    నవతరంగం మిత్రులకి:

    నేను సినిమాల పై రాసే వ్యాసాలు ముందుగా,”ఈమాట” వెబ్‌మాగజీన్ (www.eemaaTa.com) లో ప్రచురిస్తున్నాను. అనేక విషయాలపై ఈమాట వెబ్ పత్రిక నడుపుతున్న విషయం చాలా మంది నవతరంగం మిత్రులకి తెలిసే ఉంటుంది.

    అయితే, ఇక్కడ ప్రత్యేకంగా సినిమాల పైనే దృష్టి కాబట్టి, ఇక్కడ కూడా ప్రచురించటం జరిగింది. ఇది పునఃప్రచురణ అయినా, ఎక్కువ మంది పాఠకుల దృష్టికి ఈ వ్యాసాలు తీసుకెళ్ళటం తప్ప మరే ఉద్దేశ్యమూ లేదు.

    లక్ష్మన్న

    *******************************************************

    ఇక్కడ కొన్ని చిక్కు ప్రశ్నలున్నాయని నా అభిప్రాయం.

    అంతకు ముందు ప్రచురించిన రచనలని ఈమాట ప్రచురించదని నాకు, ఒకప్పటి సంపాదకుడిగా, తెలుసు. ఒక సారి ప్రచురించాకా, ఈమాట తన హక్కును కొల్పోతుందా? అది పునఃప్రచురింపబడితే, అందులో రచయిత బాధ్యత, ప్రచురణ కర్తల బాధ్యత ఏమిటి? ఇందులో స్వలాభం ఎవరికైనా, ఎంతైనా ఉందా?ఇవి ఆలోచించ వలసిన విషయాలు.

    ఇందుకై పాఠకుల అభిప్రాయం తెలుసుకోటం మంచిది.

    అందరికీ నమస్సులతో,

    లక్ష్మన్న

  5. మరచిపొమ్మంటున్నారు గురించి katti ramdas గారి అభిప్రాయం:

    11/04/2008 9:38 am

    బాగుంది. బాగా పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా వుంది. ప్రేమించి కష్టాలు పడినట్టు వున్నారు.ఇంతకీ మీ ప్రెమ ఫలించిందా?అమృతాన్నే జుర్రుకొంటాను అని అన్నారు , కొన్నారా????

    Good Luck

  6. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి Anveshi గారి అభిప్రాయం:

    11/04/2008 9:33 am

    ఇది ఎథిక్స్ గురించిన ప్రశ్న అన్నారు రావు గారు.
    అయితే ఇలా రెండు చోట్లా ప్రచురించడం వల్ల జరిగే నష్టం కొంచెం వివరిస్తే బావుండేది.
    నవతరంగం లో పూర్తిగా సినిమాకి సంబంధించిన సమాచారం ఉంటుంది. అ సైట్లో ఈ వ్యాసం ఉంచితే ఆ సైటు కొచ్చి ఈ సైటు కు రాని పాఠకులు చదివి ఒక మంచి సినిమా గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇందులో ఏ నష్టమూ లేదు. చివరకి ఒక మంచి సినిమా గురించి ఎక్కువ మందికి తెలియచేయడమనే రచయిత లక్ష్యమైతే అది ఇలా చేయడం వల్ల లాభదాయకమే అనుకుంటూన్నాను. ఇక్కడ ఎథిక్స్ విలువల ప్రస్తావన నాకర్థం కాలేదు.

  7. రచయితలకు సూచనలు గురించి katti ramdas గారి అభిప్రాయం:

    11/04/2008 9:22 am

    బాగుందండి. ఛాలా బాగుంది ఈ వెబ్ సైటు.

  8. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి PPRao గారి అభిప్రాయం:

    11/04/2008 9:08 am

    వ్యాసం బాగుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకుంటే పదేళ్ళుగా ఈమాట పాఠకుడిగా నాకో సందేహం. ఇదే వ్యాసాన్ని, ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా నవతరంగం డాట్ కాం అన్న వెబ్ సైట్ లో 3రోజుల క్రితం చదివాను.ఇంతకీ మొదటిగా ఎక్కడ ప్రచురితమైనట్లు? ఎందుకడుగుతున్నానంటే గతంలో republished materials పైన కాస్త వేడి చర్చ జరిగిందిక్కడ. ఒకవేళ ఇక్కడే మొదటిగా పబ్లిష్ అయినా, అదే రోజున మరో పత్రికకు పంపడం కూడా కాస్త ఆశ్చర్యం కలిగించింది. రెండవ ప్రచురణలో కొత్త విషయాలు చేర్చ/చెప్పబడివుంటే ఈ సందేహం/ప్రశ్న నాకైతే వచ్చుండేది కాదు. ఎన్నిసార్లైనా, ఎక్కడైనా పబ్లిష్ చేసుకునే హక్కు రచయితలకుండవచ్చు గాక, కానీ ఏకకాలంలో ఆ పని చేయడం ఎంతవరకు ఆమోదకరం? లేక సమంజసం? రచయితలు అన్యదా భావించరని తలుస్తాను. ఇది legal చర్చ కాదు, its a question of ethics.

  9. అసమర్థులు గురించి Naresh V గారి అభిప్రాయం:

    11/04/2008 8:46 am

    బాగా చెప్పారు… దీన్ని మరింత పెద్దదిగ చెసి, విశదంగ రాస్తీ చాలా బాగుంటుంది.

  10. విన్నపము గురించి bhEsghajaM agnihOtruDu గారి అభిప్రాయం:

    11/04/2008 8:42 am

    హనుమంతరావు గారూ!
    గాంధీ గురించి కమ్మ్యూనిష్టులు ఇదివరలో చేసిన పరిహాసం, ఇప్పటికీ కరుడు గట్టిన మార్కిస్టులు చేస్తున్న పరిహాసం ( ఎ.బి.కె. ప్రసాద్ కి ఈ విషయం స్వానుభవం!), ప్రచారం తెలిసి వుంటే, హనుమంత రావు గారు నన్ను ఇంత ఆత్మీయంగా ” తూలనాడేవారు” కారు. అమర్త్య సేన్ పై గాంధీ, మార్క్స్ ల ప్రభావం ఉండటం ఆశ్చర్య పడవలసినది కాదు. అతను academician. మార్కిస్ట్ అవునో కాదో నాకు తెలియదు. సుందరయ్య గారి సంగతి నాకు తెలియదు; క్షంతవ్యుణ్ణి.

    నంబూద్రిపాద్ గాంధిపై ఒక చక్కని పుస్తకం రాసాడు. అప్పట్లో మార్కిస్టు సిద్ధాంతులు అతణ్ణి గేలి చేసి న విషయం, నాకు బాగా తెలిసిన విషయం.

    “మార్కిస్టుల” పై గాంధీ ప్రభావం పరిశీలనాంశం అని మీరన్నది ముమ్మాటికీ నిజం, కరుడు గట్టిన మార్కిస్టులు ఏమంటారో? ఈ విషయంపై చలసానినో, వరవరరావునో కదిలించి చూడాలి!

    విధేయుడు,
    భేషజం అగ్నిహోత్రుడు

« 1 ... 1328 1329 1330 1331 1332 ... 1580 »