Comment navigation


15780

« 1 ... 1315 1316 1317 1318 1319 ... 1578 »

  1. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/15/2008 1:03 pm

    మాలతి గారికి,

    నేను మేధావినీ కాదు, పండితుణ్ణీ కాదు. అందుకు కావలసిన అర్హతలు నాకు తెలుసు – దీంట్లో false modesty ఏమీ లేదు. నేను రాసేవి కాస్త చదువుకున్న పాఠకులు చర్చించగల విషయాలే కదా.

    పుస్తకం తెలుగు రానివారి కోసం రాస్తున్నానని మీరు ముందుమాటలో చెప్పారు, నిజమే. కాని దాని ముందర మీరీ పుస్తకం రాయడానికిచ్చిన కారణాలు చదివితే ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.

    ముఖ్యంగా, మీరు తీసుకున్న రచయిత్రుల మీద సమగ్రమైన సాహిత్యవిమర్శ రాలేదన్నారు – తెలుగులోనే రాలేదని నేనర్థం చేసుకున్నాను; ఇక ఇంగ్లీషు గురించి చెప్పేదేముంది? అకడెమిక్ వాళ్ళు పాత సాహిత్యం మీదా, పత్రికల వాళ్ళు ప్రస్తుత సాహిత్యం మీదా కేంద్రీకరించడాన, ఈ మధ్య చరిత్ర నెవరూ పట్టించుకోలేదని విచారించారు. మీరీ కార్యం తలపెట్టకపోతే అసలీ సాహిత్యమే కనుమరుగైపోయే ప్రమాదముందన్నారు. మీరు మొదలెట్టిన పనిని తెలుగు పండితులు ముందుకు తీసుకుపోవాలని అభిలషించారు. ఈ కారణాలన్నీ ఇచ్చి వెంటనే ఇది తెలుగు రానివాళ్ళ కోసం రాస్తున్నానడం విరుద్ధంగా (incongruent) అనిపిస్తుంది.

    కల్పన గారి ముందు మాటలో కూడా మీ కృషిని మన సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా, ఇప్పటివరకూ వచ్చిన మూస చరిత్రను ఛేదించేదిగా పొగిడారు. ఇది ముందర చేరవలసింది తెలుగు వాళ్ళకేనని నా అభిప్రాయం. పరులకి తెలపడాన నష్టమేమీ లేదు కాని మీ ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ ఎవరికి? తెలుగు చదివే వాళ్ళకి. మరి వాళ్ళలో ఎంతమందికి మీ పుస్తకం చేరుతుంది?

    అందుబాటులో ఉన్న ఇంగ్లీషు వచ్చిన తెలుగు వాళ్ళయినా చర్చిస్తారని ఆశిద్దాం.

    మార్కెట్ లో ఉన్న పుసకంలోని తప్పులు దిద్దడం కోసం తాత్కాలికంగా అమ్మకాల్ని ఆపడం, మీ అంకిత భావానికి మరో తార్కాణం. వీలయితే, సమయం మించిపోకపోతే, పుస్తకానికి ఇంగ్లీషు పుస్తకాలలో చాలా సామాన్యంగా ఉండే పద పట్టిక (index) ని చేర్చమని మనవి.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి వెన్నెలకంటి వసంతసేన గారి అభిప్రాయం:

    11/15/2008 12:27 pm

    ఇంద్రాణి గారు — మనోహరంగా, కులాసాగా, భావానికీ భాషకూ ఎలాంటిసమన్వయలోపమూ లేకుండా చాలా హృద్యంగా వ్రాశారు! జోహారు! – వె.వ.

  3. కుతంత్రం గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:

    11/15/2008 9:56 am

    అర్థరాత్రి, కుక్కలూ నక్కలూ కూసేవేళ, బెజవాడలో ఇళ్ళల్లో దొంగలు పడేవేళ, — ఈ ఒక్క వాక్యం కథ అంతటికీ ఆయువుపట్టు. లైలా, చాలా బాగా ఆవిష్కరించారు అరవయ్యవ దశాబ్దపు మధ్యతరగతి ఇంటి వాతావరణం, చదువుకున్న అమ్మాయి మనస్తత్త్వం, సంఘర్షణా, అన్నీ…
    నేను మీపేరు చాలాకాలంగా చూస్తూనే వున్నా మీరచనలు ఎప్పుడూ చదవలేదు.
    ముగింపులో కూడా ఆనాడు సంఘంలో వస్తున్నమార్పుని చక్కగా సూచించారు. ఆ కోణంలోనుండి చూస్తే, కుట్ర అన్న శీర్షిక తగదేమో అనిపించింది. ఎంచేతంటే, కుతంత్రం అన్నపేరు చూసినప్పుడు, పెద్దల కుట్ర మూలంగా జరిగే అనర్థమే తోచింది నాకు. ఏమైనా చాలా మంచి కథ. అభినందనలు.

  4. మార్పు గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:

    11/15/2008 6:29 am

    Good attempt, Radhika. You have identified the problem well.
    Thanks
    Malathi

  5. రెండు తీరాలు గురించి umadevi cuddapah గారి అభిప్రాయం:

    11/14/2008 2:21 pm

    అద్భుతం, చాలా బాగుంది

  6. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    11/14/2008 8:56 am

    “The women writers of this era were quiet and unassuming in real life,cherished traditional values,while registering their dissent in their fiction”- N.Malathi

    The above paragraph quoted from the book seems more observational than judgmental to me. In my opinion, it appears more of a statement based on her observations rather than her view on how they should be.

  7. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:

    11/14/2008 8:43 am

    లైలా,
    వేలూరి గారు తన సమీక్షలో అచ్చుతప్పులున్నాయి అనడం చేత, తాత్కాలికంగా అమ్మకాలు ఆపి, తప్పులు దిద్దుతున్నాను. మరో రెండు రోజుల్లో మళ్లీ ఎమెజాన్.కామ్ లో దొరుకుతుంది.
    చదివి మీ అభిప్రాయాలు రాయగలరని ఆశిస్తాను.
    You or anyone else would like to contact me in this ragard, my ID is thulikan@yahoo.com.

  8. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:

    11/14/2008 8:41 am

    హనుమంతరావు గారూ – మీరు పుస్తకం చదివేరు కనక, మీకు కనిపించిన దోషాలు ఇక్కడ చెప్పండి. నా ముందుమాటలో, ఈపుస్తకం తెలుగు చదవడం రానివారి కోసం రాస్తున్నాననీ, అంచేతే మూడో ఛాప్టరులో కథలు సంగ్రహంగా ఇచ్చేననీ కూడా రాసేను. ఇది నా పర్సనల్ జర్నీ లాటిదనీ, నా దగ్గర సమాధానాలకంటే సందేహాలే ఎక్కువ అనీ కూడా ముందుమాటలో మనవి చేసుకున్నాను. నాకు తెలిసినంతవరకూ, ఇంగ్లీషులో వున్న తెలుగు సాహిత్యచరిత్రలో ఈభాగం ఎక్కడా కవర్ కాలేదనే అనుకుంటున్నాను. మీలాటి మేధావులు సవివరంగా చర్చించి మరో పుస్తకం రాస్తే సంతోషిస్తానే కానీ బాధ పడను.

    బాబ్జీలు గారూ – నేను స్త్రీవాద చర్చ మధ్యలో తేలేదండీ. చివర్న కంక్లూషన్ ఛాప్టరులో నా వైయక్తికమైన అభిప్రాయాలు వెలిబుచ్చాను. నన్ను ఫెమినిస్ట్ అన్ననారికీ, యాంటీ ఫెమినిస్ట్ అన్నవారికీ సమాధానంగా.

    I don’t think I can explain why anybody should be or must be unassuming. All I said was that it worked for them. Once again, if you are interested, read my book and only then you will know my opinions.
    Thanks

  9. రాగలహరి: ఆభేరి గురించి VIKRAM గారి అభిప్రాయం:

    11/14/2008 7:36 am

    Thank you sir for Telugu Notations. Really it’s a Great job

  10. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Tarakaram గారి అభిప్రాయం:

    11/14/2008 7:34 am

    బాబోయి ఎంత రీసెర్చ్ చేశారు. మీ కాళ్ళ కి మొక్కుతున్నా.

« 1 ... 1315 1316 1317 1318 1319 ... 1578 »