Comment navigation


15780

« 1 ... 1314 1315 1316 1317 1318 ... 1578 »

  1. పేరు గలవాడేను మనిషోయ్ గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:

    11/17/2008 9:55 am

    “తెలుగు నాడి”లో చదివాక గానీ ఈమాటలో ఈ కథ ప్రచురితమైన సంగతి తెలియలేదు.

    పసి మనసుల ప్రాధామ్యాలనీ, భావ ఘర్షణనీ రానారె అక్షరాల్లోకి అద్భుతంగా తీసుకొస్తారు. నా బాల్యం నా పిల్లలకు వివరించాల్సి వస్తే రానారె కథలనీ సంపుటంగా చేసి చదువుకోమనేంతగా వుంటాయి.

    రేడియో కావాలని మా నాన్నని అడగడం. చదువులు పాడవుతాయని మా నాన్న ఆమోదించకపోవడం. చివరికి రేడియో వచ్చాక, ఇష్టమయిన కార్యక్రమం వినడానికి పడిన తాపత్రయం అన్నిటినీ ఈ కథ కళ్ళ ముందు పరిచింది.

    ఒక కామేశ్వరరావు గారు వుదహరించిన పేరా కొంచం అసహజంగా అనిపించినా, నిజ జీవితాల్లో అసహజమని జరక్కుండా వుండవు కదా?

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. పురూరవ గురించి రాఘవ గారి అభిప్రాయం:

    11/17/2008 1:03 am

    93వ పుట సరిగ్గా లేదు. గమనించగలరు.

    [కృతజ్ఞతలు. పుట సరిదిద్దబడింది – సం.]

  3. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:

    11/16/2008 3:56 pm

    హనుమంతరావు గారూ,
    మీ అభిమానానికి కృతజ్ఞతలు. అమెరికాలోనూ, ఇండియాలోనూ ప్రముఖ సాహిత్యాభిమానులం అంటూ హడావుడి చేస్తున్నవారినందరినీ అడుక్కోడం అయిందండీ.. నేను అడక్కుండా, పుస్తకం కొనుక్కుని మరీ సమీక్ష రాసినవారు వేలూరి వారొక్కరే.. ఈ తానాలూ, ఆటాలూ గురించి నేను మాటాడకపోవడమే మంచిది… మీకున్న నమ్మకాలు నాకు లేవు.

    సరదాగా వుంటే ఈలింకు చూడండి. నాతెలుగుతూలిక లో అచ్చంగా నేనే అచ్చేసుకున్న చిన్ని నాపొత్తము అని పేరుతో.
    Anyway, thanks.

    మాలతి

  4. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/16/2008 12:58 pm

    మాలతి గారికి,

    కల్పన గారు “మైలురాయిగా పొగిడారు” అని రాయడంలో నేను వ్యంగ్యాన్ని సూచిస్తే అది నా తప్పే. మైలురాయి అవునో కాదో తెలుగు సాహిత్య చరిత్ర లోతుపాతులు తెలిసిన వాళ్ళు నిర్ధారించాలి, నేను కాదు. నా దృష్టిలో మీ పుస్తకం కొత్త వెలుగుని ప్రసరించేదీ, కొంత వివాదాస్పదమైనదీ, తెలుగు సాహిత్యాభిమానులు చదవ్వలసినదీ. తగిన ప్రాచుర్యం వస్తుందనీ, విస్తృతంగా చర్చిస్తారనీ ఆశిస్తాను.

    పుస్తక ప్రచురణలో సాధక బాధకాలు నాకు తెలియవు. సాహితీ చరిత్రకి గిరాకీ లేకపోవచ్చు కాని అవసరం ఉంది. ఇలాంటి పుస్తకాలని తెలుగులో ప్రచురించడానికి సహాయం కావలసిన వాళ్ళు తానా ప్రచురణ వాళ్ళని సంప్రదించండి; రచ్చబండ లోనో, ఈమాట లోనో, మీ వెబ్ సైటులోనో ఓ మాట వెయ్యండి. ఓ చెయ్యిచ్చే వాళ్ళుండకపోరు. పరపతి ఉంటేనే ప్రచురించుకునే దుస్థితికి తెలుగు సాహిత్యం దిగజారకూడదు.

    మీ పుస్తకం మీద “చిరు సమీక్ష” లాంటిది రాయాలనే ఉద్దేశం ఉంది. వీలు చూసుకొని రాయాలి.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:

    11/16/2008 5:12 am

    హనుమంతరావు గారు,
    అయితే మీరు దోషాలు అన్నది కేవలం మీడియమ్ విషయంలో అని అర్థం అయింది. నా పుస్తకం ప్రధాన భాగంలో కూడా మీకు దోషాలుగా తోచినవి చెప్పండి.
    మీరు అన్న incongruity నాకు తోచలేదు. తెలుగువాళ్లకే “ప్రతిపాదనలని చర్చించి, విమర్శించవలసిన అవసరం ఎక్కువ“ అన్న మాట కొంతవరకూ నిజం కావచ్చు. నా అభిప్రాయాలు మరోసారి చెప్తాను.
    1. తెలుగు పరిశోధకులూ, విమర్శకులూ, నాపుస్తకం స్థాయి పుస్తకాలు చదివేవాళ్లూ ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదువుతున్నారు. మన తెలుగు పరిశోధకులు, విమర్శకులు ప్రచురించిన పుస్తకాలలో ఉపయుక్త గ్రంథాల జాబితా చూస్తే ఇది స్ఫష్టం.
    2. తూలిక 8 ఏళ్లగా నడుపుతున్నాను. తూలిక పాఠకుల్లో సగం మంది తెలుగువాళ్లే. — ఇంగ్లీషుబళ్ళలో చదువుకున్న తెలుగువాళ్లూ, ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు అయిపోయిన తెలుగువాళ్లూను. అంచేత నిజంగా చదవాలనుకుంటే భాష అడ్డు వస్తుందనుకోను.
    3. నాపుస్తకం ఇండియాలో ప్రచురించడానికి నానా విధాలా ప్రయత్నించాను. దేశవ్యాప్తంగా, ఇతర భాషలలో స్త్రీల రచనలు పరిశీలించేవారికి కూడా ఉపయోగంగా వుంటుందని నా అభిమతం. కాని అది జరగలేదు.
    4. పోతే కల్పన నాపుస్తకాన్ని “మైలురాయిగా పొగిడారు“ అన్నారు. ఇంతకుముందు ఈ విషయంమీద ఇంత వివరంగా చర్చించిన పుస్తకాలు ఏమైనా దృష్టికి వచ్చివుంటే చెప్పండి. మరి.
    5. ఇంక అందుబాటు మాట అంటారా. నాకున్న పరపతీ, నేనున్న పరిస్థితుల్లో తెలుగులో రాసినా ఎవరూ కొనరు. ఆవిషయంలో నేను చేయగలిగినది ఏమీ లేదు.
    6. మీరు చెప్పిన ఇండెక్స్, వేలూరి సలహా వివరణలు చివరికి మారిస్తే బాగుంటుంది లాటివి నాకు createspace.com ఒప్పందం ప్రకారం సాధ్యం కాదు. అక్షరదోషాలు దిద్దడం మాత్రమే సాధ్యం.

    పుస్తకం తిరిగి మార్కెట్ లో వుంది. కావలసినవారు నాకు రాయండి. లేదా ఎమెజాన్.కామ్ లో చూడండి.
    మీ ఆదరణకి ధన్యవాదాలు.
    మాలతి.

  6. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/16/2008 4:36 am

    వేలూరి వారికి. దండాలు.

    ఇదేట్రా, special issue లో మీదని “సెక్రం” తిప్పడం తప్ప కిందని ఏటీ special లేదు, బెంగెట్టీసుకున్నాను. సంపాదకులు రాసినవి చదవకూడదని ఎంకట్రవణమూర్తికి మొక్కుకోడం వల్ల, ఇది చదవలేదు ఇప్పటిదాకా. తప్పైపోయింది.

    మొక్కుకున్నాక కూడా కొన్ని చదివి లెంపలేసుకున్నాను. అయినా “దాలిగుంట బతుకు” కదా మళ్ళీ చదివేను. అద్రుష్టం.నిజంగా మీరు సాధారణ పాఠకుడే. లేపోతే ఇంత చక్కగా రాయరు. మధ్యలో హుషారు ఇచ్చే వైనాలు.

    సాధారణపాఠకుడికి “group లు” వుండవు. వాదాలుండవు. ఏ రసం నచ్చిన వాడు ఆ రసాప్లావితం లో కొట్టుకుపోతాడు. తమ్మినేని వారి “థాయి ల్యాండు” టూరు కవిత మీద మనలాటి సాధారణ పాఠకుల అభిప్రాయలకి, గురుతుల్యులు భైరవభట్ల వారూ, జెజ్జాల వారూ “గెడ్డ’ లో ఈత కొట్టేరు. గజీతగాళ్ళని “గెడ్డ” లో దింపనక్కరలేకుండా ఈ “వైన్వ్యాసం” మన్లాటోళ్ళందరిచేతా టోకున చదివించేస్తే కవిత్వపు మత్తొదిలిపోతుంది. లేదా కవిత్వపు సత్తువా తేలిపోతుంది.

  7. ఈమాట – నామాట గురించి సుధాకర బాబు గారి అభిప్రాయం:

    11/16/2008 12:43 am

    పదేళ్ళ నిర్విరామ కృషికి కృతజ్ఞతగా ఈ మాట పత్రికకు, సంపాదకులకు నా శుభాభినందనలు. తెలుగు పత్రికా రంగంలో ఈ మాట ఒక చక్కని ఒరవడి సృష్టించిందని, తక్కిన వెబ్ పత్రికలకు మార్గదర్శకంగా నిలిచిందని భావిస్తున్నాను.

    అత్యాశ అనిపించినా నాకొక కోరిక కలుగుతున్నది. “భారతి” పత్రిక ఆగిపోయింది. ఆ స్థానాన్ని పూరించే నాణ్యత “ఈమాట”కున్నదని, అచ్చు పత్రికగా వెలువడి రోడ్ల ప్రక్క దుకాణాలలోను, విద్యాలయాల రీడింగ్ రూములలోను ఈమాట (భారతి-II) దర్శనమివ్వాలని ఆశిస్తాను.

  8. ఈమాట కొత్త వేషం గురించి e.bhaskaranaidu గారి అభిప్రాయం:

    11/15/2008 9:05 pm

    ఈ పత్రిక చాలబాగుంది. దీనికి ఇంకొన్నిమెరుగులు దిద్దితే ఇంకా ఎంత బాగుండేదో కదా అని అనిపిస్తుంది. మెరుగులు అంటే ప్రశ్నలు-జవాబులు, సాహిత్య పదబందాలు, లాంటివన్నమాట.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి mOhana గారి అభిప్రాయం:

    11/15/2008 3:42 pm

    బ్రహ్మానందం గారూ, మీ వ్యాసం బాగుంది. త్యాగబ్రహ్మం గారు వ్రాసిన యక్షగానాలపైన ఎందుకో ఎక్కువ మక్కువ చూపలేదు జనాలు? ఈ యక్షగానాలు ఆంధ్రభారతి వెబ్ సైటులో చదువ వీలగును.
    నౌకాచరిత్రము
    ప్రహ్లాద భక్త విజయము
    నౌకాచరిత్రంలోని సంగీతపు విషయాలను సాంబమూర్తిగారు చక్కగా వివరించియున్నారు. మరొక విశేషం ఏమంటే నౌకాచరిత్రాన్ని వేంకటసూరి అనే కవిగారు సంస్కృతంలో అనువదించారు. ఈ రెండు యక్షగానాలను చదివితే త్యాగరాజుగారికి ఛందోబద్ధమైన పద్యాలను చక్కగా అల్లడం వచ్చనే విషయం తెలుస్తుంది. త్యాగరాజుగారిపై మరొక అంశం – ముత్తయ్య భాగవతర్ అనే వారు సంస్కృతంలో త్యాగరాజవిజయమని ఆ కళాకారుని జీవితచరిత్రను వ్రాసినారు. విధేయుడు – మోహన

  10. రామా కనవేమిరా! గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/15/2008 2:29 pm

    “కలడు కలండనెడు వాడు కలడో లేడో?”

    ఆధునిక సాహిత్యంలో దేవుళ్ళూ దయ్యాలూ ఉంటే అభ్యంతరం లేదు కాని, మనుషుల్ని దుర్బలులుగా చూపెడితే ఏమిటి ప్రయోజనం? మానవ ప్రయత్నానికి కదా విలువ నివ్వమని ఘోషించేది – ఆస్తికులూ, నాస్తికులూ కూడా.

    నిష్ట పాటించని భక్తుని కాళ్ళు బొబ్బలెక్కేలా వేన్నీళ్ళతో కాల్చి, కేవలం సాంబారుతో కడుపు కాల్చి, కార్ల టైర్లు పగలగొట్టి, దేవుడు బుద్ధి తెప్పిస్తే, భక్తుడు చెంపలేసుకొని సన్మార్గుడవుతాడు – ఇక జన్మలో ప్రదక్షిణం చేసికాని ప్రసాదం పుచ్చుకోడు! దీంట్లో ఆస్వాదించాల్సిందేమిటి? హాస్యమా?

    కొడవళ్ళ హనుమంతరావు

« 1 ... 1314 1315 1316 1317 1318 ... 1578 »