Comment navigation


15789

« 1 ... 1307 1308 1309 1310 1311 ... 1579 »

  1. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Sai Brahmanandam గారి అభిప్రాయం:

    11/28/2008 11:24 am

    రవి గారూ,

    తంజావూరులో అప్పుడు చాలా మతాలున్నా,ఇతర మతాల ప్రస్తావనెక్కడా త్యాగరాజు తన కీర్తనల్లో తీసుకురాలేదు. ఒకే ఒక్క కీర్తనలో ఒక్క ముస్లిం పదమూ, మరో కీర్తనలో ఇంగ్లీషు పదమూ వాడాడు. ఆ వివరాలు ముందొస్తాయి. మీరు చెప్పిన కొనియాడు కీర్తన చరణంలో ఉన్న మతం పదానికర్థం ఆలోచనా విధానం. అభిమతం. హిందూ, ముస్లిమ్, క్రిష్టియన్ అనబడే మతాలు మాత్రం కాదు. కాస్త మరోసారి ఈ చరణం చూడండి.

    ప: కొనియాడే నాయెడ దయ వెలకు
    కొనియాడెదవు సుమీ రామ నిను

    అ. అనయము నీ సొగసును గని పొంగుచు-
    నంతరంగముననతి ప్రేమతో నిను ( కొని )

    చ. వింత వింత మతములలో చొరబడి
    వెత జెందగ లేడను నీ మనసున-
    కింత తెలిసి త్యాగరాజ సన్నుత-
    యే వేళను నీ శుభ చరితమును ( కొని )

    – సాయి బ్రహ్మానందం

  2. అసమర్థులు గురించి subash గారి అభిప్రాయం:

    11/28/2008 9:44 am

    కథ చాలా బాగుంది. కాస్త పెద్దగా రాస్తే బాగుండేది. ఇలాంటి కథలు ఇంకా రాయాలని కోరుకుంటున్నాం.

  3. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి phani గారి అభిప్రాయం:

    11/28/2008 9:05 am

    పద్య అర్థాన్ని అన్వయించు కొవడానికి కాకపొయినా తల మీద పడ్డ వాన చినుకులు కను రెప్పల మీద పెదవుల మీద నుంచి మూడు ధారలుగా నాభిని చేర వచ్చు కదా?

  4. సార్ గారండీ… సార్ గారండీ… గురించి bharath గారి అభిప్రాయం:

    11/28/2008 2:15 am

    ఒక తరం తన నడతను ప్రసవించుకొనే వేళ
    నేను మంత్రసాని నౌతాను

    బాబాగారూ, మీకవిత చాలా బాగుందండీ. ముఖ్యంగా పైన పేర్కొన్న వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది.

  5. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి ravi గారి అభిప్రాయం:

    11/28/2008 1:55 am

    చాలా బావుంది. కాని, రక రకలా మతాల గురించి కొన్ని కీర్తన ల్లొ ప్రస్తావిస్తారు. ఉ: “కొనియాడె నాయడ” చరణంలో చూడండి.

  6. కుతంత్రం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/27/2008 8:29 pm

    బావుంది. కథనం చాలా బావుంది. భాష బ్రహ్మాండంగా ఉంది.

    “ఈ గొడ్లు. వీరి కన్నా అతడే నయం.” ఏ మగాడికైనా అంతకు మించిన పొగడ్త ఏముంటుంది? 🙂

    “లే నగవు చేతను భావముచేత సిగ్గుచే … కలహము చేత … కందువమాటలచే … వలపింతురు కాంతలు పెక్కుభంగులన్.”

    కొడవళ్ళ హనుమంతరావు

  7. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    11/27/2008 6:19 pm

    బాబ్జీలు గారు
    నిజమే మీరన్నట్లకు బోలెడు నిర్వచనాలున్నాయి. పంచుకున్నవి నాకు తెలిసిన కొంచెం మాత్రమే.

    కవిత్వాన్ని నిర్వచించడం కుదరదు అని అనుకున్నా, చేసిన వాళ్ళు చేసారు, చేయని వాళ్ళు ఆగకుండా చేస్తున్నారు, ఇంకా ముందుకు చేయకుండా ఆగుతారనీ లేదు.

    ఇక మీరడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానమే నాది కూడా అని అనుకుంటాను. విశ్వశ్శ్రేయం కావ్యం అంటే విశ్వశ్రేయం కానిదేదీ కావ్యం కాదని కాదు. తీపి మంచి రుచి అంటే తీపి కానిదేదీ మంచి రుచి కాదని అననట్లు.

    మీరన్న ఒక మాట మాత్రం చాలా సత్యం. కవిత చదవగానే చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి అన్నది పాఠకుని పట్ల సహాయమే కాదు, అవసరం కూడా అనిపిస్తుంది. తెలుగు భాష ఉనికే సవాలుగా మరుతున్న సమయంలో “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టంగా అనిపిస్తుంది.
    ————————–
    విధేయుడు
    -Srinivas

  8. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/27/2008 1:32 pm

    బాబ్జీలు గారికి,

    బాధేం లేదు. మో నిరాకారుడి లాగే నేనూ అడివిలో చిక్కుకుపోయాను. 🙂

    ఇస్మాయిల్ చెప్పేదేదో ఈ సందర్భంలో ఆలోచించదగ్గదనిపిస్తోంది కాని, అది అభిప్రాయాల పరిథి దాటిపొయ్యేటట్లుంది. ప్రస్తుతానికి అంతటితో ఆపేస్తాను.

    వేలూరి గారికి నిరాకారుణ్ణి ప్రస్తావించినందుకు కృతజ్ఞతలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

  9. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/27/2008 8:12 am

    నాగులపల్లి శ్రీనివాస్ గారూ,
    నిర్వచనం, అందులోనూ కవిత్వాన్ని నిర్వచించడడం, మీరు చెప్పినట్టు కుదరదు. “సామాన్య, సాంగీక” శాస్త్రాల్లో కుదురుతాయి.

    మీరు 12 రకాల నిర్వచనాలు రాసేరు. ఇంకా బోల్డు వుండే వుంటాయి. ప్రస్తుతానికి ఇవే అనుకుందాం. అంటే 12 రకాల కవిత్వాలనా? లేదా పన్నెండింటినీ కలగలపాలా? విశ్వ శ్రేయస్సు కోరని రసాత్మకవైఁన వాక్యం ఏఁవఁవుతుంది? Tranquility లో ఎమోషన్ రికలక్ట్ అవకపోయినా మిగిలిన పదకొండు నిర్వచనాల్లో ఏదో ఒకదానికి సరిపోయీ రచన ఏఁవఁవుతుందీ?
    వేలూరి వారు, పై వ్యాసంలో, ఆశించింది ఇలాటి సందిగ్ధావస్థని నివారించడానికే ఏదో ఒక “టెక్నిక్” కోసవేఁ కదా?
    హనుమంత రావు గారూ, “మో” కవిత్వం, దాన్ని వేలూరి వారు వుదాహరణగా వాడుకున్న పధ్ధతికీ, లేదా చేరా చేసిన వ్యాఖ్యలకీ, మీరెందుకు ఇంత బాధపడుతున్నారూ? ఏం నిరూపిద్దావఁని?

  10. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/27/2008 6:16 am

    పాఠకుడి గారికి:
    ఇస్మాయిల్ గారి వ్యాఖ్యనీ, కన్యాశుల్కాన్నీ ఒకే గాటని కట్టకండి. ఇస్మాయిల్ గారే వొప్పుకోరు. కన్యాశుల్కం జీవితం. జీవితం గురించి మరో వెయ్యేళ్ళ తరవాత కూడా “హాట్ హాట్” చర్చలు జరుగుతాయి. మీరొక్కరే హనుమంతరావు గారడిగిన చర్చ చేశేరు. విపులంగా చేయాలి, దయచేసి.

    సురేష్ కొలిచాల గారికి:
    వేలూరి వారు “సాధారణ పాఠకుడు”. ఇది వేలూరి వారికి అవమానం కాదు. శ్రీశ్రీ చివరివరకూ “సాధారణ పాఠకుడే” సాధారణ పాఠకుడి మొదటి లక్షణం, నూతనత్వాన్ని, అదెలాటిదయినా, అందులో మంచి లేశమాత్రమైనా, “కానీయండి” అని. అసాధారణ పాఠకులు ఎక్కడో ఒకదగ్గర ఆగిపోతారు.కొత్త జ్నాపకాన్ని సృష్టించడవేవిఁటీ? వేలూరి వారు రాసింది రైటు. కొత్త జ్నాపకాన్ని నెమరు వేయడం. మీరు ఇస్మాయిల్ గారి గురించీ, “మో” గారి గురించీ ఏవీఁ అన్లేదు. అన్నట్టు “అసాధారణ పాఠకుడి” గురించి: “అమ్మమ్మా! కందిగుండలో ఇంగువ వెయ్యవా, ప్లీజ్. మా అత్తారింట్లో కందిగుండ ఘుమఘుమ లాడుతుందే, ఇంగువతోటి. ప్లీజ్ ప్లీజ్” అని బతిమాలినా “నో ఇంగువ. ఓన్లీ జీలకర్ర” అనే రకం.

    వైదేహీ శశిధర్ గారికి:
    నిజవేఁనండోయ్. “ట్రాన్స్పెరెంట్ చీకటి” .

    హనుమంతరావు గారూ, మహానుభావుల వ్యాఖ్యల గురించి నా అజ్నానపు విజ్నానపు అభిప్రాయాల్ని క్షమించీయండి.
    ట్రాన్స్పెరెంట్ చీకటి, స్పష్టవైఁన అస్పష్టం, అస్పష్టవైఁన స్పష్టం, తీరిపోయిన దాహం, అంతవైఁన అనంతం. హనుమంతరావుగారూ! ఇదేవిటండీ. బాబ్జీలూ, ఇదనంతం.

« 1 ... 1307 1308 1309 1310 1311 ... 1579 »