Comment navigation


15780

« 1 ... 1309 1310 1311 1312 1313 ... 1578 »

  1. జనరంజని: మహానటి సావిత్రి గురించి Anil Kumar గారి అభిప్రాయం:

    11/24/2008 6:57 am

    Apologies its http://www.mahanatisavitri.co.in not http://www.mahanatisavitri.com

  2. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/23/2008 9:40 pm

    “కవిత్వం ఒక ఆల్కెమీ”

    Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాల సాహితీ సిద్ధాంతాలని పేర్కొనేవారు తాము సాధారణ పాఠకులమంటే, ఇక “సాధారణ” అన్న మాటకి అర్థమేముంది? “Oh, Lord Venkateswara! If you are only a stone, what are we?” అని ఎక్కడో ఎవరినో అన్నది గుర్తొస్తోంది. 🙂 అల్ప విషయంగా వదిలేద్దాం.

    వేలూరి గారన్న దాంట్లో ఓ చిన్న సందేహం: “వాన ఏ రకమైన వెనకటి జ్ఞాపకాలని గుర్తుకి తెచ్చినా, కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.”

    కొత్త జ్ఞాపకం అంటే ఇటీవలిదనా (recent memory)? మంచి కవితకి అదెందుకు ఉండాలో వివరిస్తే బావుండేది.

    హార్డీ Apology లో Housman పేరు చూశాను. పోయినేడే ఆయన 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసం, “The Name and Nature of Poetry,” [1] చదివాను. కవిత్వ స్వభావం గురించి Housman చెప్పింది నాకు నచ్చింది. దీనినే రచ్చబండలో కాస్త ఘాటుగా ప్రస్తావించి, ఘర్షణ పడ్డాను. (పడిన గాయాలు అందరిలోనూ మానిపోయాయని ఆశిస్తాను.)

    వేలూరి గారు పాఠకుని జ్ఞాపకాలు కవిత్వాన్ని ఆస్వాదించడానికి కావలసిన పరికరం అంటే, Housman, భావోద్వేగాన్ని కలిగించడమే కవిత్వ విశేష లక్షణం అన్నాడు:

    “And I think that to transfuse emotion – not to transmit thought but to set up in the reader’s sense a vibration corresponding to what was felt by the writer – is the peculiar function of poetry.”

    ఉద్వేగం వేలూరి/Benjamin అన్నట్లు జ్ఞాపకాల వలనే వస్తుందనుకుందాం. అయితే ఒక సందేహం వస్తుంది. మన జ్ఞాపకాలని మనమే గుర్తు తెచ్చుకోడానికి వేరేవాళ్ళ కవిత్వం ఎందుకు? దీనికి సమాధానంగా నాకు రెండు విషయాలు గోచరిస్తాయి.

    ఒకటి, కొన్ని జ్ఞాపకాలు గుప్తంగా ఉండొచ్చు; మనకంతుపట్టని అంతర్గత మానవ స్వభావానికి చెంది ఉండొచ్చు. Housman మాటల్లో;

    “But in these six simple words of Milton –
    Nymphs and shepherds, dance no more –
    what is it that can draw tears, as I know it can, to the eyes of more readers than one? What in the world is there to cry about? Why have the mere words the physical effect of pathos when the sense of the passage is blithe and gay? I can only say, because they are poetry, and find their way to something in man which is obscure and latent, something older than the present organisation of his nature, like the patches of fen which still linger here and there in the drained lands of Cambridgeshire.”

    రెండోది మనలో ఉద్వేగం కలిగించాలంటే ఆ భావాలని వ్యక్తీకరించే భాష ప్రత్యేకమైనదిగా ఉండాలి. Housman అన్నట్లు, “Poetry is not the thing said but a way of saying it.”

    రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తన వేమన ఉపన్యాసాలలో అన్నారు: “తీవ్రమైన భావములు మనుష్యులు కందరికిని కలవు, కాని ఆ భావములను బైట పెట్టవలసినప్పుడు మన కందరికిని వచ్చునది కవిత్వం గాదు; నత్తి. కొందరికది నాలుకకే అంటియుండును. మరికొందరికి వ్రాతలోను కలదు. కవులనబడే వారిలో ననేకులిట్టి నత్తివ్రాతవారే. బుద్దిమంతులైన వారి కీరెంటికిని మందొకటే; చేతనైనంతవరకు మౌనము వహించుట.”

    (1929లో కన్నా ఇప్పుడు కవుల్లో నత్తి ఎక్కువయిందా?:-))

    పైదీ, వేలూరి గారన్నదీ నాకు చాలావరకు సమ్మతమే. కాని నేనిది రాయడానికి కారణం, ఆధునికులు ఇదంతా పాత చింతకాయపచ్చడి, అని కొట్టిపారేస్తారేమోనని. మన ప్రముఖ కవి ఇస్మాయిల్ మాటల్లో [2]:

    “మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం. అందరికీ తెలిసిందాన్నే అందంగా చెప్పడం కాదన్నమాట కవిత్వం. ఇది సంప్రదాయవాదులిచ్చిన నిర్వచనం. దీన్ని ఆధునికులు ఒప్పుకోరు. కవిత్వం ఎక్స్ ప్లొరేషన్ కనక, కొత్త సత్యాలని ఆవిష్కరిస్తుందని వీళ్ళంటారు. అందుకే, అస్పష్టం అనే ఫిర్యాదు ఆధునిక కవిత్వం గురించి అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అస్పష్టమంటే కొత్త అని అర్థం చేసుకోవాలి, చదువరికి ఇంతవరకూ అనుభవంలోకి రాని విషయమన్న మాట.”

    మో ఆధునిక కవి. ఆయన కవిత్వం అస్పష్ట పాకమా? లేక మనకింతవరకూ అనుభవంలోకి రాని సరికొత్త పాకమా?

    ఎప్పటికైనా మో “కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేస్తుందని నా ఆశ. అప్పటిదాకా “శాంతి ఒక్కొక్క బొట్టూ పడ్తుంది వేకువ కళ్ళల్లోంచి. కట్టేసిన కన్నీటి మేలిముసుగు కుళాయిల్లోంచి.” అన్న నిరాకారుణ్ణి “లైఫ్ బాయ్ సబ్బుతో కడిగిన గ్లాసులో తాగిన చవకరకం జిన్‌ అండ్ టానిక్” తో పోల్చడం మాత్రం అన్యాయమే!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “The Name and Nature of Poetry and Other Selected Prose,” by AE Housman. Cambridge University Press, 1961.

    [2] “కవితా విహంగానికి స్వేచ్ఛ ఊపిరి,” అన్న ఇస్మాయిల్ 1981 వ్యాసం. “కవిత్వంలో నిశ్శబ్దం,” నుండి.

  3. జనరంజని: మహానటి సావిత్రి గురించి Anil Kumar గారి అభిప్రాయం:

    11/23/2008 12:45 pm

    Amazing ..i don’t have any words to express …Masterpiece . Please look forward to a dedicated site http://www.mahanatisavitri.com. Currently it is under construction. Srinivas, will you be able to send this file so that I can upload it on site. This site a tribute to savitri from all fans. Request you to forward any information & material to my email id naanil07@gmail.com. Your cooperation is required to make it successful . Thanks a ton in advance.

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి నరేంద్ర భాస్కర్ S.P. గారి అభిప్రాయం:

    11/23/2008 2:53 am

    ఒక మహా కళా కారుని గూర్చి సమగ్రమైన వ్యాసం రాశారు.

    నాకెప్పుడూ ఒక ఆలోచన: ఒక పాట దాదాపు 250 ఏళ్ళు కాలపు పరీక్షకు నిలిచి ఉన్నదంటే, ఆ పాట లో ఎంత ఆత్మ నిండి ఉన్నదో కదా !
    అంత లోతైన ఆత్మ దైవికమైనదంటే ఆశ్చర్యమేముంది? మరో సారి మీ ద్వారా ఆ సంగీత సాగర విహార పరమ హంసకు శరీరమంతా చెవులవ్వగా ప్రణామాలు.

  5. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Dr. M.V.Rama Rao గారి అభిప్రాయం:

    11/22/2008 10:33 pm

    మీ వ్యాసం చదివి నాకు చాలా సంతొషం కలిగింది. నాకు పూర్తిగా అర్ధం కాలేదు కానీ , చాలా inspiration కలిగింది. నాకు ఈ రోజు వరకు అనంతాలు వుంటాయని తెలీదు. మన తెలుగు భాషలో , సరళంగా విషయాన్ని వివరించినందుకు ధన్యవాదాలు.
    To be honest, after reading your essay I remembered my late father who used to tell me several things about mathematics in my childhood.
    Please keep writing such essays in future as well.
    ధన్యవాదాలతో
    మల్లెల వెంకట రామారావు
    భెల్జియం
    (http://www.cs.kuleuven.be/~mallela)

  6. కన్యాశుల్కానికి వెల్చేరు అనువాదం, వ్యాఖ్యానం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    11/22/2008 7:48 am

    రామారావ్ గారూ,
    ఏవిషిష? మీరు రాసేరు కాబట్టి, “గురుజాడ” గురించి కాబట్టి, ఏ వొక్క వాక్యాన్నీ అన్వయించుకోకుండా, “ప్రతిపదార్ధం” రాసుకోకుండా, మిమ్మల్నే అడిగేస్తున్నాను.
    మీ నిందా స్తుతి (కాకపోయినా సరే) కి టీకా టిప్పణీ అవసరం.

    అన్నట్టు “పెన్నేపల్లి గోపాలకృష్ణ” మధురవాణి” ఆత్మ కథ రాసేరండీ. “బేహద్బీ” గా వుంది. చదివేరో లేదో? అలాగే “జయప్రభ” గారి వ్యాసం, “మధురవాణి” గురించే, చదివేరో లేదో?
    “గురుజాడ” వారి పంచె కొంగు పట్టుకుని పుంఖానుపుంఖానులుగా రాసే వాళ్ళని, వాళ్ళ మానానికి వాళ్ళనొదిలెయ్యాలేమో? లేదా “మై డియర్ షేక్స్పియర్, కానీ ” అనాలేమో?

    వెల్చేరు వారి పుస్తకం ఎక్కడా?

  7. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/21/2008 10:01 pm

    కామేశ్వరరావు గారూ,

    నా అభిప్రాయంలో మొదటి వాక్యాన్ని వదిలెయ్యండి – మీరు శుద్ధ గణిత దృష్టిలోనే వాడామన్నారు కనుక.

    జీనో వాదనకి పూర్తి సమాధానం కావాలంటే ఇంకాస్త లోతుకి పోవాలని తోస్తుంది నాకు. Stanford లింకు ఉపయోగపడచ్చు ఆసక్తి కలవాళ్ళకి.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    11/21/2008 9:18 pm

    కామేశ్వరరావు గారికి,

    శుద్ధ తర్కం/గణితం ఆధారంగా వాదిస్తున్నప్పుడు కొలవగలమా లేదా అన్న ఆచరణపరమైన ఇబ్బందిని తీసుకురాకూడదు కదా.

    జీనో ప్రకారం (మీ ప్రకారం కూడా) అకిలీస్ కీ తాబేలుకీ మధ్య దూరం సున్నాకి అతి దగ్గరగా వస్తుంది కాని, ఎప్పటికీ సున్నా కాదు. సున్నా కానిది అకిలీస్ తాబేలుని అందుకోలేడు!

    మిమ్మల్ని Stanford ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో వదిలి నేను సెలవు తీసుకుంటాను. 🙂

    కొడవళ్ళ హనుమంతరావు

  9. అసమర్థులు గురించి bhavani గారి అభిప్రాయం:

    11/21/2008 7:08 pm

    చాలా బాగుంది మీ కధ.

  10. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    11/21/2008 12:22 pm

    >>అప్పుడు కూడా “అకిలీసు” తాబేలు ను దాటుకుని
    >>వెళ్ళే ప్రసక్తే ఉండదు. కాంతి (కాలం) వేగంతో పోటీ పడితే
    >>తప్ప అకిలీసు తాబేలును దాటే ప్రసక్తే ఉండదు. (విప్లవ్)

    >ఇక్కడ మాట్లాడుతున్నది స్థలాన్ని గురించైతే మధ్యలో మీరు >కాలాన్ని తెచ్చి మరింత గడబిడ చెయ్యడం భావ్యమా!
    >(కామేశ్వర రావు)

    కామేశ్వర రావు గారు:

    నేను రాసిందీ స్థలాన్ని గురించే! ఈ రేసు జరిగే చోటు లేక స్థలం అనేది బ్లాక్ హోల్ అయి ఉంటే, ఎట్లా ఉంటుందీ అన్నది: అకిలీసు తాబేలును దాటదు(డు).

    ఇంకో రకంగా కూడా చూడండి, అకిలీసు తాబేలును దాటటం సాధ్యమేనా: రేసు జరిగేది బ్లాక్ హోల్ హొరైజన్ మీద లేక సింగ్యులారిటీకి దగ్గరలో అనుకోండి, కానీ మనం దూరంగా ఉండి అదే రేసును అంచనా వేస్తూ ఉంటే, మనక్కనిపించేది, జరిగేది వేరు వేరుగా ఉండవా? ఏది నిజం? [కనిపించేవన్నీ నిజాలు కావు.]

    “అసత్యాలు” గా నిరూపించినంత మాత్రాన, అవి “సత్యం” కావు.

    అంతవరకే నేను రాయాలనుకున్నది.

    ఇక,
    Proof by Contradiction కాంటెక్స్ట్ లో మీరు రాసిన రెండు వాక్యాలు నాకు కొంచెం విరుధ్దంగా అనిపించే, ఆ చివరి వాక్యం మాత్రమే విడదీసి చూసాను. వ్యాసంలో హనుమంతరావు గారు చెప్పిన నిర్వచనం వరకూ నాకు తెలిసింది, మీ మొదటి వాక్యం ఆ నిర్వచనానికి దగ్గర్లో ఉంది అన్నది. మీ రెండవ వాక్యం మీ మొదటి దానికి విరుద్ధంగా తోచింది. అందుకే మిగతాదంతా వదిలేసి ఆ చివరి దాన్నే చూసాన్నేను. May be I am wrong.

    మళ్ళీ ఎప్పుడైనా, ముఖ్యంగా హనుమంత రావు గారి వ్యాసానికి ఆంగ్ల అనువాదం ఎక్కడైనా దొరికితే చదివాక 😉 వివరంగా రాయగలనేమో.

    ఈ వ్యాసపరంపర ఇదివరకు చదవలేదు నేను, ఈ ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిందే, అయిదో భాగం మత్రమే చదివాను నిన్ననే.

    విప్లవ్

« 1 ... 1309 1310 1311 1312 1313 ... 1578 »