Comment navigation


15790

« 1 ... 1303 1304 1305 1306 1307 ... 1579 »

  1. మూడు జ్ఞాపకాలు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    12/07/2008 9:23 am

    ఇదెందుకు “పూర్తి స్థాయి” వ్యవహారవోఁ సరిగ్గా తెలియలేదుకానీ, ఆద్యతన భవిష్యత్తులో మీరు “పూర్తి స్థాయి” కథలు వ్రాయగలరని నమ్మకం

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాకు పరిచయమైన కొందరు అసాధారణ వ్యక్తులు – 4 « Naga Murali’s Blog గారి అభిప్రాయం:

    12/07/2008 8:48 am

    […] (నా బ్లాగుతో కొత్తగా పరిచయమైన మిత్రుల కోసం: నాకు జ్యోతిషంతో పరిచయం ఉన్నమాట నిజమేగానీ, నేను జ్యోతిష్కుణ్ణి కాను. జ్యోతిషం గురించి నేను తెలుసుకున్న విషయాలూ, నా అనుభవాలూ, అభిప్రాయాలూ ‘ఈమాట’లో నాలుగు వ్యాసాలుగా ఇక్కడ చదవవచ్చు. మొదటి భాగం రెండవ భాగం మూడవ భాగం నాలుగవ భాగం) […]

  3. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నాకు పరిచయమైన కొందరు అసాధారణ వ్యక్తులు – 4 « Naga Murali’s Blog గారి అభిప్రాయం:

    12/07/2008 8:32 am

    […] (నా బ్లాగుతో కొత్తగా పరిచయమైన మిత్రుల కోసం: నాకు జ్యోతిషంతో పరిచయం ఉన్నమాట నిజమేగానీ, నేను జ్యోతిష్కుణ్ణి కాను. జ్యోతిషం గురించి నేను తెలుసుకున్న విషయాలూ, నా అనుభవాలూ, అభిప్రాయాలూ ‘ఈమాట’లో నాలుగు వ్యాసాలుగా ఇక్కడ చదవవచ్చు. మొదటి భాగం రెండవ భాగం మూడవ భాగం నాలుగవ భాగం) […]

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి గారి అభిప్రాయం:

    12/07/2008 7:49 am

    ఉపేంద్ర గారూ, నాడ్యంశ గురించి నేను విన్నాను. జన్మ సమయాన్ని అతి సున్నితమైన ఖచ్చితత్వం ప్రకారం నమోదు చేస్తేగానీ ఇటువంటి విభాగాలమీద ఆధారపడలేము. ఇటువంటి సూక్ష్మ విభాగాల వల్ల మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అని భావిస్తే, ఈరోజు ప్రపంచంలో వ్యవహారంలో ఉన్న జ్యోతిషంలో అత్యధికశాతం నిజం కాదని అంగీకరించాల్సి ఉంటుంది.
    అది అలా ఉంచితే, సెకన్లతో సహా ఖచ్చితమైన జన్మ సమయాన్ని తెలుసుకుని, నాడ్యంశ మొదలైన విభాగాల్ని ఉపయోగించి, జ్యోతిషం నిజమే అని శాస్త్రీయంగా ఋజువు చెయ్యగల అవకాశం ప్రతిభావంతులైన జ్యోతిష్కులకి ఎప్పుడూ ఉంటుంది కదా. అలా చెయ్యగలమని నమ్మేవాళ్ళు ముందుకు వచ్చి, అందరూ అంగీకరించగల ఋజువుల్ని చూపించడానికి గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదనే నా వ్యాసంలో ముక్తాయించాను.

    ఈ వ్యాస పరంపరలోని రెండో భాగంలోని కామెంట్లలో కవలల గురించి లక్ష్మన్నగారితో నేను చేసిన చర్చ ఒకసారి చూడండి. సదుపాయం కోసం అందులోని కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను –
    ఇక కవలల సంగతి. ఏ జ్యోతిష గ్రంథంలోనైనా సరే దీని గురించి చర్చ జరగకుండా ఉండదు. భూమియొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం సుమారుగా ప్రతీ నాలుగు నిమిషాలకీ ఒక డిగ్రీ చొప్పున తూర్పున ఉదయించే బిందువు (లగ్నం), అలాగే మిగతా భావాలూ మారుతూ ఉంటాయి. చాలా మంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ బిందువుల్లో ఎంత సూక్ష్మమైన తేడా వచ్చినా సరే ఫలితాలు మారుతాయి. మరీ ముఖ్యంగా భారతీయ జ్యోతిషంలో రాశి చక్రాన్ని చాలా సూక్ష్మ భాగాలుగా చేసి ఫలితాలు చూసే సాంప్రదాయాలు (నవాంశ, దశాంశ, త్రింశాంశ మొదలైన విభాగాలు) ఉన్నాయి. వాటి ప్రకారం జన్మ సమయంలో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే ఫలితాలు మారిపోతాయిట. అయితే ఆచరణలో మాత్రం అత్యధికశాతం జ్యోతిష్కులు అంత దగ్గరి జాతకాలకి భిన్న ఫలితాలు చెప్పలేరు. అంతేకాదు, చాలా మంది జాతకుల జన్మ సమయాలు కూడా నిమిషంతో సహా ఖచ్చితంగా ఎవరికీ తెలియవు. అందుచేత ఎవరికైనా చెప్పిన ఫలితాలు తప్పిపోతే, ’జన్మ సమయం తప్పై ఉంటుందమ్మా, అది చాలా ఖచ్చితంగా తెలియాలి’ అని జ్యోతిష్కులు తప్పించుకుంటూ ఉంటారు.

    కొన్ని పుస్తకాల్లో ఒక్క నిమిషం ఎడంగా పుట్టిన కవలల జాతకాలని ఉదాహరణగా ఇచ్చి, ‘చూశారా ఒక్క నిమిషమే తేడా ఉన్నా, ఫలానా సూక్ష్మాంశం మారిపోవడం వల్ల అసలు ఇద్దరి జీవితాలకీ పొంతనే లేదు!’ అని రాస్తూ ఉంటారు. అయితే ఆ కవలల విషయంలో అన్వయించిన అదే సూక్ష్మాంశం మరొక మామూలు జాతకానికి ఎందుకు అన్వయించరో బోధ పడదు. అంతే కాకుండా అటువంటి సూక్ష్మాంశాలవల్ల నిజంగా మిగతా జాతకాల్లో కూడా ఫలితాలు ఎలా తేడాగా వస్తున్నాయో వివరణలు ఉండవు. వాటికి మాత్రం ఎక్కువ కాలావధిలో మారిపోని అంశాలనే పరిగణనలోకి తీసుకుని ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు.

  5. సువర్ణభూమిలో … గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/06/2008 9:30 pm

    భూషణ్ గారి కవితా దృక్పథం గురించి కామేశ్వరరావు గారన్నది సరిగానే ఉంది. అయితే కవిలో థాయిలాండ్ యాత్ర కలిగించిన గొప్ప అనుభూతిలో అణుమాత్రమైనా చాలా మంది పాఠకులకి కలగడం లేదు. గొప్ప హృదయకంపన కలగకపోతే ఈ కవి రాసి ఉండేవాడు కాదు:

    “కవిత్వం భూకంపం లాంటిదే. పునాదులతో సహా పెళ్ళగించివేయడం దాని స్వభావం. నీ అస్తిత్వ మూలాలు కదిలితే గాని కవిత్వ ప్రకంపన నీలో మొదలు కాదు. వెరసి ప్రపంచాన్ని చేరదు. ఏ కారణాల వల్ల లోపలి పొరల రాపిడితో ఆవని హృదయం బద్దలవుతుందో ఇదమిత్థంగా చెప్పలేకున్నాం. నేడు వెలువడుతున్న కవిత్వాలు రోకలి పోటు లాంటివి. వాటి అదుటు పక్కింటి వసారాను కూడా తాకదు. నీలో భూకంపం వుందా? కలం పట్టు.. ఆదిమోద్రేకాల శిలాద్రవాలను ప్రవహించనీ .. ఘనీభవించనీ .. ఆత్మను భస్మీపటలం చేయగల భయానక సౌందర్యాన్ని ఆరాధించగల చేవగలవాడే కవిత్వం చెప్పగలడు .. తతిమ్మా అందరూ ఆటలో అరటిపళ్ళు .. పనికిరాని దండుగ్గణాలు .. హృదయ పరిపాకం లేకుండానే రచనకు ఉపక్రమించిన కరటకదమనకులు.” [1]

    అందుకనే గూడార్థం ఏదన్నా ఉండి ఉంటుదని వెతుకుతున్నారనుకుంటాను.

    మొదటి మూడు కవితలలో బుద్ధుని గొప్పతనం కళ్ళకు కట్టినట్టున్నదనీ, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేని పిల్లి, కుక్క (మనలాటి పాఠకుల్లాగే) కూడా ఉన్నారనీ, నాలుగవ కవితని, మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చనీ అన్నారు గరికపాటి. సముద్రం అడుగున చేపల్ని చూసి ఆనందించమన్నది కవిత్వం ఎలా చదవాలి అన్నదానికి ఉపమా? దీనికి చాలా బుద్ధి బలం కావాలనిపించింది నాకు. అది భూషణ్ తత్వానికి వ్యతిరేకం:

    “పుస్తకానికి, జీవితానికీ మధ్య దూరం పెంచేది కవిత్వం కాదు. సరైన కవిత్వం చదివాక నీవు పఠిస్తూ వచ్చిన వంద పుస్తకాలను గోదాట్లో గిరవాటు వేయగల తత్వ నిశ్చయం కలగాలి. అంతరాత్మను ముంచెత్తేదే అసలు సిసలు కవిత్వం. హృదయవర్తనను సాకల్యంగా ఎరిగిన వాడే పదహారణాల కవి. బుద్ధి బలంతో మిడిసి పడేవాడు పుస్తకాలను మోసే గాడిద .. అధముల్లో అధముడు. గణుతి కెక్కడు, పైగా వాడికి కవిత్వం నిషిద్ధం.” [1]

    పాత కవిత్వంలో పదాల అర్థాలు తెలియకా, కొత్త కవిత్వంలో పద చిత్రాల అనుభూతి చేరకా, నలిగిపోయే వాళ్ళలో నేనొకణ్ణి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] గరికపాటి పవన్ కుమార్ కవితా సంపుటి, “ఆ సాయంత్రం,” కి తమ్మినేని యదుకుల భూషణ్ రాసిన ముందుమాట, “ఒక్క క్షణం …” నుండి. 2003.

  6. సువర్ణభూమిలో … గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    12/06/2008 11:12 am

    దృశ్యానుభూతి కవిత్వ లక్షణాల గురించి ఒక వ్యాసంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఇలా అంటారు:

    “దృశ్యంలోకి అనుభవం, అనుభవంలోకి దృశ్యమూ పరావర్తనమయ్యే విశిష్ట గుణం అనుభూతి కవిత్వానికి మూలం. నువ్వు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకడమే ఇక్కడ ప్రాధమిక సూత్రం. కవి అనుభవానికే కాదు, పాఠకుల అనుభూతిక్కూడా ప్రాధాన్యత ఉన్నప్పుడే అది నిలబడుతుంది. అస్పష్టం గా ఉన్న అనుభవం ఇంకొకరి అనుభూతిలోకి ప్రసరించదు.

    ఈ కవితలో ప్రధాన లోపం స్పష్టత. అనుభవమే కనిపిస్తోంది – అనుభూతి మాత్రం శూన్యం.

    -సాయి బ్రహ్మానందం

  7. సువర్ణభూమిలో … గురించి baabjeelu గారి అభిప్రాయం:

    12/06/2008 7:46 am

    ఇప్పటిదాకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాసేరు ఈ కవిత మీద.
    ఆరి సీతారామయ్యగారి వ్యాఖ్య చదివేక మరీ విడ్డూరంగా వుంది.
    మొదట్లో మూలా వారు “ఆరో ఖండిక” అద్భుతం అన్నారు. ఆతరవాత నానాజాతి సమితీ చేతికొచ్చినట్టూ రాసేరు. మధ్యలో “గురుతుల్యులు” అలాక్కాదిలాగ, ఇలాక్కాదలాగ అని అందర్నీ దార్లో పెట్టడానికి నానా ప్రయాసా పడ్డారు. ఇప్పుడు ఆరి వారు “ఆరో ఖండిక” ఈ కవితని గొప్ప కవిత కాకుండా అడ్డీసిందని బాధ పడ్డారు.
    మహన్నభావుల్లారా!మీకందరికీ జవాబు తెలుసు. తెలిసీ చెప్పకపోతే మా(సాధారణ పాఠకుల) తలలు వేయి వ్రక్కలైపోతాయి.

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,
    మీ అంత చక్కగా, నిష్కర్షగా, నిస్సంకోచంగా, నిర్భయంగా,నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా అభిప్రాయాలు రాసేవాళ్ళని ఇంతవరకూ నేను చూళ్ళేదు. ధన్యోస్మి.

  8. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    12/06/2008 5:43 am

    ఉపేంద్ర గారూ:

    నాగమురళి గారి వ్యాసం పై మీ అభిప్రాయాన్ని చూసాను. ముఖ్యంగా కవలలపై మీరు ఇచ్చిన లింకు చూసాను. అది చదివి నేను కొంచెం ఆశ్చర్యపోయి, ఆలోచనలో పడ్డాను. ఈ లింకులో ఇచ్చిన వివరాలపై నాగమురళి గారి అభిప్రాయం ఏమిటో!

    కవలల జాతకాల్లో తేడాలు గురించి చర్చలు చూసాను. ఒకే రకంగా ఉన్న కవలల జాతకాలు ఎక్కడన్నా ఉన్నాయా?

    మొత్తం మీద ఈ వ్యాసాలు వాటి పై అభిప్రాయాలు బాగున్నాయి.

    అభినందనలతో,

    లక్ష్మన్న

  9. మీరు కవిత్వం ఎందుకు రాస్తారు? గురించి k sekhar గారి అభిప్రాయం:

    12/06/2008 12:02 am

    ముఖ్యంగా ఈమాట సంపాదకులకు నమస్కారాలు. చాలా, చాలా బాగుంది, చాలా కొత్త విషయాలు తెలిసాయి.

  10. కవిత్వం చేసే పని మనస్సులో దీపం వెలిగించడమే గురించి k sekhar గారి అభిప్రాయం:

    12/05/2008 11:45 pm

    చాలా బాగుంది. ఇంకా ఉండి వుంటే బాగుండేది అనిపించింది.

« 1 ... 1303 1304 1305 1306 1307 ... 1579 »