Comment navigation


15792

« 1 ... 1301 1302 1303 1304 1305 ... 1580 »

  1. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి chavakiran గారి అభిప్రాయం:

    12/12/2008 12:19 am

    పొయినోళ్లంతా గొప్పోళ్లు, మంచోళ్లు. ఈ లోకం వీడి పొయిన తరువాతనే వారి విలువ ఇప్పుడే పుట్టిన కుసుమాలకు తెలుస్తుందనుకుంటాను.

    బాబ్బాబూ, ఇలా అందరూ టపా కట్టాకనే మాకు వారి వారి గొప్పతనాన్ని వివరించక, కొంతమంది ఈ లోకంలో ఉండగానే వారి గురించి ఓ ముక్క చెపితే బాగుంటుంది కదా.

  2. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    12/11/2008 12:34 pm

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. -సం]

    1947 నించి వెలువడిన “చందమామ” పుస్తకాలను ఎలెక్ట్రానిక్‌గా Universal Digital Library లో దొరుకుతాయి. వాటిని సంచికలవారీగా డౌన్‌లోడ్ చేసుకోడానికి ఫణి కుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగర్) ఒక జావా ప్రోగ్రాం తయారు చేశారు. ఆ జావా ప్రోగ్రాం డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించే విధానం బ్లాగాగ్ని బ్లాగులో చదవవచ్చు.

  3. చేగోడీ కంప్యూటర్‌కంపెనీ గురించి BPhani Babu గారి అభిప్రాయం:

    12/11/2008 10:03 am

    గురువు గారూ, ఇన్నాళ్ళకి మీరు వ్రాసిన పాత కథలు దొరికాయి. ఇంక నాకు కావలిసినంత కాలక్షేపం.

  4. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి యుగంధర్ గారి అభిప్రాయం:

    12/11/2008 5:06 am

    అప్పుడే పోవాల్సిన వయసు కాదు. ఇంత మంచి వాళ్ళు హడావుడిగా పైకి వెళ్ళిపోయినప్పుడల్లా బహుశా దేవుడికి వాళ్ళ అవసరం మనకంటే ఎక్కువేమో అనిపిస్తుంటుంది నాకు. తన ఆప్త మిత్రుణ్ణి ఇలా వేలూరి గారు తల్చుకోవడం ఎంతైనా సమంజసంగా ఉంది. అస్సలు పరిచయం లేని కొత్తవాళ్ళని కూడా, కేవలం వాళ్ళు తెలుగు సాహిత్యాభిమానులు అన్న కారణం వల్ల, ఆత్మీయుల్లా చేరదియ్యడం స్మైల్ లాంటి స్థితప్రజ్ఞులకే చెల్లుతుంది.

  5. “చందమామ” జ్ఞాపకాలు గురించి మేడేపల్లి శేషు గారి అభిప్రాయం:

    12/11/2008 4:27 am

    ‘చందమామ’ గురించి రోహిణీప్రసాద్ గారు చెప్పిన విషయాలు చదువుతూ ఉంటే, అలా ఎంతసేపన్నా చదువుతూ ఉండిపోవచ్చుననిపించింది. గొప్ప రచయిత అని తెలియకపోయినా, కొ.కు. గారిని చిన్నప్పుడే చదువుకున్నామంటే, ఎంతో గర్వంగా ఉంది. ఖమ్మంలో మా మేనత్త వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం దీన్ని (మేముండేది పల్లెటూరు కాబట్టి అక్కడ దొరకదు). దాన్ని ఒక్కసారి తాకితేనే చాలు అన్నట్టుగా ఉండేది మాకు మనసులో. కొ.కు. గారి శైలి ఎంతటి ఆసక్తి లేని వాడినైనా ఇట్టే చదివిస్తుంది. ఈ మధ్య, నేను కొ.కు. గారి ప్రసిద్ధ నవల ‘చదువు’ మా పదేళ్ళ అబ్బాయికి చదివి వినిపిస్తే, ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది వాడినుంచి. రోహిణీప్రసాద్ గారు చెప్పినట్టు ‘చందమామ’ పిల్లలకు ఎన్నో సద్బుద్ధులు నేర్పించింది. నేర్పిస్తున్నది.
    -మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

  6. అక్షరం పరమం పదం గురించి venkat chitta గారి అభిప్రాయం:

    12/10/2008 11:08 pm

    sandralu is a great philosopher of life. We have much to learn from her to be happy and contented.

  7. కుతంత్రం గురించి Aruna Pappu గారి అభిప్రాయం:

    12/10/2008 1:15 am

    నా గురించి మీకెలా తెలుసు? ఇలా యెలా రాయగలరు అసలు? 60ల్లోనే కాదు, 2000లో కూడా నాది ఇదే కథ. చాలా బావుంది.
    Manjula – I think, that’s not ignorance, reading is a different world that opens a window to a different world. లౌకికమైన విషయాలేమీ పట్టని state of mind ఒకటి ఆవరిస్తుంది చదువుతున్నప్పుడు. we need to experience it to believe it!!

  8. జనరంజని: మహానటి సావిత్రి గురించి prema manvi గారి అభిప్రాయం:

    12/10/2008 12:14 am

    ఆవిడ ముఖములోని అమాయకత్వం ఆవిడ సుమధురమైన గొంతులో ప్రతిబింబించింది. ఈమాటకి ధన్యవాదాలు.

  9. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    12/09/2008 10:43 pm

    ఖాళీ సీసాల స్మైల్

    స్మైల్ చనిపోయారంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ “ఖాళీ సీసాలు” చదివాను. అది స్మైల్ రాయడం మొదలెట్టిన ఒకటి రెండేళ్ల లోపునే, 1965లో రాసిన కథ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, సాహిత్య అకాడెమీ (వాకాటి, వేదగిరి) కూర్చిన “బంగారు కథలు” లో పొందుపరచిన కథ. బెడ్ టైమ్ రీడింగ్ కి పనికిరాని కథ!

    స్మైల్ కవిత్వం ఏమీ నేను చదవలేదు కాని, ఆ కథ ముగింపు:

    “… రెప్పలు మూయని కళ్ళు వెయ్యి చావులు శపించాయో.
    హాయి హాయిగా వున్న గాలికి, పల్చ పల్చగా వున్న ధూళికి, పచ్చపచ్చగా వున్న చెట్లకి, వెచ్చవెచ్చగా వున్న ఎండకి, దూరంగా హోరు హోరుగా వున్న సముద్రానికి, పైడి మీద బోర్లించిన మూకుడు సమాధి ఆకాశానికి తెలిసి వుండాలి.
    తెలియకపోయీ వుండాలి.”

    చదివిన వెంటనే రెండేళ్ళ క్రితం ఓ సైన్సు వ్యాసంలో చూసిన ఒమర్ ఖయ్యాం కవిత గుర్తొచ్చింది:

    And that inverted Bowl we call The Sky,
    Whereunder crawling coop’t we live and die,
    Lift not thy hands to It for help – for It
    Rolls impotently on as Thou or I.

    2006లో ఇండియా వెళ్ళినప్పుడు, అప్పుడే మో, స్మైల్ ఇరువురి సంపాదకత్వాన వెలువడిన “కొమ్మలు రెమ్మలు” చూశాను. “ప్రపంచీకరణ, వాణిజ్యీకరణలకు బలయిపోతున్న ఆంధ్రదేశపు యువతీయువకులకు వారి తెలుగు నేలలో మొలిచిన మహా వృక్షాలనీ, వాటి కొమ్మల్నీ రెమ్మల్నీ పిందెల్నీ పువ్వుల్నీ కాయల్నీ,” పరిచయం చేసే పుస్తకం. స్మైల్ కొమ్మని కూడా వారి మిత్రులు మిగిలిన వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.

    చివరగా, పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది. స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను. ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు. “బంగారు కథలు” ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో. పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం.

    కొడవళ్ళ హనుమంతరావు.

  10. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి vinnakota ravisankar గారి అభిప్రాయం:

    12/09/2008 8:10 pm

    ఇస్మాయిల్ గారు హైదరాబాదు వచ్చినప్పుడల్లా స్మైల్ గారు వచ్చి పలకరించేవారు. ఆ రకంగా ఆయన్ని అనేకసార్లు కలుసుకున్నాను. ఆయన మంచి మాటకారి. ఇస్మాయిల్ గారు ఎప్పుడూ ఏదో ధ్యానంలో మునిగి ఉండే వటవృక్షమైతే, స్మైల్ గారు ఆకులతో నిత్యం గలగలా సంభాషించే రావిచెట్టు. ఏదైనా విషయం మీద ఆయన వాదించే తీరు నాటకీయంగా, ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.”ఖాళీసీసాలు” పుస్తకావిష్కరణ జరిగినప్పుడు హాజరయ్యాను. దేవుడిపెళ్ళిలా జరిగిన ఆ సభలో అందరూ పెద్దలే.ఎవరికి మాట్లాడాలనిపించినా, వచ్చి మాట్లాడమన్నారు. ఇస్మాయిల్ గారి చివరిరోజుల్లో ఆయన్ని ఏదోవిధంగా సత్కరించాలనే ఉద్దేశ్యంతో ఒక అభినందన సభని హైదరాబాదులో స్మైల్ గారు ఎంతో శ్రమపడి నిర్వహించారు. ఆ సభలోనే, ఇస్మాయిల్ గారికి అంకితమిచ్చిన నా “వేసవివాన” ఆవిష్కరణకి కూడా అవకాశం కల్పించారు. స్మైల్ గారి స్నేహ స్వభావంవల్ల, ఆయన్ని కొద్దిగా ఎరిగున్నవారు కూడా మర్చిపోవటం కష్టం. ఆయన నవ్వు, మాట పదేపదే మనసులో మెదుల్తున్నాయి. మళ్ళీ ఆయన్ని కలుసుకోవటం వీలుపడదంటే నమ్మశక్యం కావటం లేదు.

« 1 ... 1301 1302 1303 1304 1305 ... 1580 »