Comment navigation


15790

« 1 ... 1302 1303 1304 1305 1306 ... 1579 »

  1. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    12/09/2008 10:18 am

    స్మైల్ ఇక లేరు అన్న వార్త తెలుగు పత్రికల్లో చదివాను. వేలూరి గారి నివాళి కూడా చదివాను. అరే అప్పుడే చనిపోయేంత వయస్సు కాదే! నమ్మలేకపోయాను.

    అది 1999 సంవత్సరం అనుకుంటా. అజో.విభో పురస్కారం రాజమండ్రిలో. పురస్కారగ్రహీత శ్రీ నండూరి రామ్మోహన రావు. అక్కడ చూసాను స్మైల్ గారిని మొదటిసారి. అదే చివరిసారి కూడా.

    ఆ నేపధ్యంలో, పోటీనాటకాల బహుమతి విజేతలు, బహుమతి తీసుకోటానికి కూడా వేదిక మీదకి రాలేని పరిస్థితుల్ని తీవ్రంగా విమర్శిస్తూ కనిపించిన స్మైల్ గార్ని అప్పుడే చూసాను. అప్పుడే స్మైల్ గారితో పాటు, మిత్రులు బేతవోలు రామబ్రహ్మం, తల్లావజఝుల పతంజలి శాస్త్రి గార్లతో కలిసి ఒక సాయంత్రం అంతా సాహిత్య ఇష్టాగోష్టిలో గడిపాం. వృత్తి సాహిత్యం కాకపోయినా, ప్రవృత్తి సాహిత్యమే అని మిత్రులు చెపుతుంటే విన్నా. స్మైల్ గారి రచనలు నేనేవీ చదవలా. అవకాశం వస్తే, ఇప్పుడు కొని చదువుతా.

    ఒక మంచి మనిషిని, సాహిత్యాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తిని మరింత తెలుసుకోలేకపోయినందుకు చింతిస్తూ,

    స్మైల్ గారికి శ్రద్ధాంజలితో,

    లక్ష్మన్న

  2. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Malathi Nidadavolu గారి అభిప్రాయం:

    12/09/2008 4:26 am

    Umadevi garu, thanks for your kind comments. Please visit my tethulika.wordpress.com. I am looking forward to more discussion from you.

  3. జనరంజని: మహానటి సావిత్రి గురించి jagdeesh గారి అభిప్రాయం:

    12/09/2008 3:53 am

    My sincere thanks to my dear friend Vidya from California and to the best Radio station ever “Vijayawada Radio Station” for sending this link to me. I wish the “janaranjani program” to go on for ever.

  4. సువర్ణభూమిలో … గురించి baabjeelu గారి అభిప్రాయం:

    12/08/2008 10:54 pm

    సువర్ణ భూమిలో , సాగదియ్యడం, తిట్టుకోవడం, చుట్టుకోవడం మరియు కొట్టుకోవడం గురించి చర్చించడం తగదు. (మన్లో మాట మూడు అ”ట్టు”లు అద్భుతంగా వేసేరు. నిజవేఁ.టకానీ నేనన్నది మంచి సినిమాల గురించి.)

  5. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి gorusu jagadeeshwar reddy గారి అభిప్రాయం:

    12/08/2008 10:43 pm

    శ్రీవెంకటేశ్వరరావుగారికి, నమస్కారాలు.

    స్మైల్‌గారికి మీరందించిన నివాళి చదివాను. ఈ సందర్భంగా వారితో గడిపిన కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవాలనిపించింది. నా చిన్నతనంలో స్వాతి మంత్లీలో “నాకు నచ్చిన కథ” అనే పరిచయం వచ్చేది. అందులో అత్తలూరి నరసింహారావుగారు పరిచయం చేసిన “ఖాళీ సీసాలు” కథ చదివి ఆ స్మైల్‌ అనేవాడు కనిపిస్తే కాళ్లపైన పడిపోవాలనే ఆవేశం కల్గింది. ఆ తర్వాత కొన్నాళ్లకి నేను హైద్రాబాద్‌ వచ్చేశాక మా కాలేజి లెక్చరర్‌ వివిఎస్‌ఎన్‌ మూర్తి అనే ఆయనతో మాటవరసకి ఆ కథ గురించి అంటేం ‘వాడు నా క్లాస్‌ మేటయ్యా. వాడిక్కడే కమ్మర్షియల్‌టాక్స్‌లో పనిచేస్తున్నాడు’ అంటూ అప్పటికప్పుడు నాతో ఫోన్‌లో మాట్లాడించాడు. అది మొదలు స్మైల్‌గారి ఇంటికి తరచూ వెళ్తుండేవాడిని. వాళ్ల ఇల్లు క్రాస్‌రోడ్స్‌లో సప్తగిరి టాకీస్‌ దగ్గర ఉండేది. ఇది 1992 లోని సంఘటన. తర్వాత భరాగోగారు వచ్చి వాళ్లింట్లో ఉండి “‌ఖాళీ సీసాలు” పుస్తకానికి కావలసిన మెటీరియల్‌ సమకూర్చుకుంటూ ఉండగా స్మైల్‌గారు అనువాదం చేసిన “చుగ్తాయ్‌” “‌కంబలి” కథ దొరకలేదు. నాకు మొదట్నుంచి మంచి కథల్ని కుట్టుకోవడం అలవాటు. అలా నా దగ్గరున్న ఆంధ్రప్రభలో వచ్చిన కంబలి కథని తీసుకెళ్లి ఇచ్చాను. ఆ పుస్తకం ముందు మాటలో తనని పుస్తకం వేయమని సతాయించిన వారిలో నన్ను కూడా చేర్చారు స్మైల్‌గారు. ఆ పుస్తకావిష్కరణ 1995లో ప్రెస్‌క్లబ్‌లో ఎంతో నిరాడంబరంగా, ఇంటి పండగలా జరిగింది. రబ్బరుని చెక్కి బొమ్మలుగా మలిచే ఆర్ట్‌ కూడా వారికి ఉందని నేనా సభలో చెప్పాను. (ఈ విషయం నాకు మా మూర్తి సార్‌ చెప్పారు)

    ఆయన్ని చివరి సారిగా పోయిన ఏడాది అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీకె.రామచంద్రమూర్తిగారి వారబ్బాయి పెళ్లిలో హైదరాబాద్‌లో చూశాను. నా పుస్తకాన్ని అక్కడే ఇచ్చాను – వారు రాజమండ్రి వెళ్లాక ఫోన్‌ చేశారు. నా ‌”ఉసుళ్లు” అనే కథకోసం వారి “తూనీగ” కవితలోంచి కొన్ని పదాలు వాడుకున్నాను. వారి “ఖాళీసీసాలు” కథలోని “పాడు పిల్లల”తో నేను “జగదాంబ జంక్షన్‌” అనే కథ రాశాను. (ఈ కథ ఆంగ్లానువాదం టెక్సాస్‌ యూనివర్సిటీ వారేసిన “సాగర్‌”(2002)లో వచ్చింది) అవన్నీ నా పుస్తకంలో ఉటంకించాను. స్మైల్‌గారు ఎంతో సంతోషించారు.

    వారి పెద్దమ్మాయి పెళ్లి హైద్రాబాద్‌లో పింగళి వెంకట్రామారెడ్డి హాల్లో అయినప్పుడు అందరం వెళ్లాం. అది పెళ్లిలా జరగలేదు. ఏదో మహా ఉత్సవంలా అనిపించింది. ఆ పెళ్లి విందుని మా అమ్మాయి ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది, జరిగి పుష్కరం దాటినా.

    ఆయన అందం పున్నమి చందమామ – ఆయన మాట్లాడినా, నవ్వినా కురిసేది వెన్నెలే!

    అశ్రునివాళితో – గొరుసు జగదీశ్వరరెడ్డి.

  6. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి himabindu గారి అభిప్రాయం:

    12/08/2008 8:21 pm

    మీ కృషి స్పూర్తిదాయకంగా ఉంది. నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మిగతా భాగం కూడా చదివాక నా పూర్తి అభిప్రాయం రాస్తాను. మీ మంచి ప్రయత్నం సాఫీగా సాగాలని అశిస్తూ,
    హిమబిందు

  7. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    12/08/2008 2:43 pm

    ప్రముఖ కథా రచయిత “స్మైల్” ఇకలేరు. చాలాకాలం వరకూ పేరు వినడమే కానీ ఆయన పరిచయం లేదు. ఆరేళ్ళ క్రితం అనుకోకుండా హైద్రాబాదు నుండి కాకినాడ వెళుతుండగా ఆయనతో కలిసి కొద్దిసేపు ప్రయాణించాను. మా బెర్తుల పక్కనే ఓ ముస్లిం కుటుంబం వుంది. రైలు సికింద్రాబాదు దాటిందో లేదో మావాళ్ళు టిఫిన్ కారీర్లు తెరిచారు. తెచ్చుకున్న పులిహార ఆ ముస్లిం ఫామిలీ కీ ఆఫర్ చేసింది మా అక్కయ్య. “పులిహారా! దాని వాసనకి చలించలేనంత స్థిత ప్రజ్ఞుణ్ణి కాదు లెండి!” అంటూ ఆయన తీసుకున్నారు. ఓ ముస్లిం వ్యక్తి ఇంత స్వచ్చంగా తెలుగు మాట్లాడుతూ, “స్థిత ప్రజ్ఞుడు” లాంటి పదం వాడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మాటల్లో పేరూ, వూరూ అడిగితే అప్పుడు తెలిసింది ఆయనే ప్రముఖ కథా రచయిత స్మైల్ అని. మాది అమలాపురం అని చెప్పగానే “కోన సీమా? చెప్పరేం! పులిహార రుచి చూడగానే అనుమానం వచ్చింది. మీ వైపు కందా బచ్చలీ కూర వండుతారు. నాకు ఆ కూర అంటే చాలా ఇష్టం..” అంటూ చెప్పుకొచ్చారు. ప్రయాణమంతా ఆయన చిరునవ్వుల ముచ్చట్లతోనే గడిచిపోయింది. తిరుగు ప్రయాణంలో ఆయన రాసిన ఖాళీ సీసాలు కథని సంపాదించి చదివాను. మరలా కలుసుకునే అవకాశం రాలేదు.

  8. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    12/08/2008 1:36 pm

    బాబ్జీలు గారు
    నిజమే. రచయితలు నిరుత్సాహపడతారని ఊరికే బాగుంది అని రాయడం నా అభిప్రాయం కాదు. అట్లా కాదు అందరూ బాగుందనే రాయాలి అంటే, అభిప్రాయాలు రాసేవాళ్ళు నిరుత్సాహపడిపోతారు! అభిప్రాయాలు రాయడం కబుర్లాడుకోవడం అన్నదానికి, కొన్నిసార్లు (చాలాసార్లు?) రచనలు సైతం కబుర్లాడుకోవడం లాంటివే అని చేర్చవచ్చేమో. ఏమిటి ఉపయోగం అన్నది నాకు నేను వేసుకునే ప్రశ్న, వచ్చే అనుమానం మాత్రమే. ఇంకొకరి కోసం దాన్ని బేరీజు వేసే తాహతు నాకు లేదు.

    “ఆయా సినిమాల లోని సంగీతం గురించో, సాహిత్యం గురించో, నటన గురించో మిగిలిన వాటి గురించో అయితే మంచి పనే అని నా నమ్మకం.” అన్నారు.
    అయ్యా మంచి పని గురించి తర్వాత. (ఇటీవలి) సినిమాలలో సంగీతం, సాహిత్యం, నటన అనేవి కూడా ఉంటున్నాయి అని అనుకోమంటారా?
    సాగదీస్తే సంగీతం. తిట్టుకుంటే సాహిత్యం. చుట్టుకుంటే నాట్యం. కొట్టుకుంటే నటనం.
    ========
    విధేయుడు
    -Srinivas

  9. సువర్ణభూమిలో … గురించి baabjeelu గారి అభిప్రాయం:

    12/08/2008 9:38 am

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,

    నాదృష్టిలో అభిప్రాయాలు రాస్తూ ఇక్కడ చేస్తున్నది “ఖానా గట్ల” మీద కూచుని కబుర్లాడుకోవడమే. అది కూడా ఖాళీగా వున్నప్పుడు. దాని వల్ల ఉపయోగం ఏవిటన్నది ప్రశ్నే. అన్నిటికన్నా ముందుగా “దురభిప్రాయాలకి” రచయితలు నిరుత్సాహపడతారని ప్రతీ రచనని బాగానే వుందని అభిప్రాయాన్ని ప్రకటించడం ఆయా రచయితలకి ఎంత ఉపయోగకరం? ఫలానా విషయం తక్కువో ఎక్కువో అయిందని రాయడం అందరికీ రాదు. దానికి బదులుగా నాలాటి వాళ్ళు వాళ్ళ అనుభూతిని ప్రకటిస్తారు. అందులోనూ వారి భాషా, స్థాయీ లలో. వాటిలో కొన్ని చికాగ్గా వుండొచ్చు. రచయిత మనసుకి కష్టం కలిగించొచ్చు. నచ్చని వాటి గురించి అభిప్రాయం రాయడం ఎందుకూ అని అడగొచ్చు. నిజవేఁ, నావరకూ అప్పుడు కూడా రచయితకి ఎంత ఉపయోగకరం?
    ఇక్కడ అభిప్రాయాలు రాసుకోవడం గురించి: ఒకటే పోలిక కనబడుతోంది నాకు. “ఖానా గట్టు” మీద కూచుని ఏ సినిమా ఎక్కడ ఎంత కలెక్ట్ చేసింది? ఎన్ని రోజులాడింది? ఆడించేరా? దాని బలం మీదే ఆడిందా? హీరో హీరోయిన్లు పాటల్లో ఎన్ని “డ్రెస్సులు” మార్చేరు? లాటి విషయాల మీదనైతే నిస్సందేహంగా వేరే వ్యాపకం చూసుకోడం సరైన పని. కానీ వాటి బదులు ఆయా సినిమాల లోని సంగీతం గురించో, సాహిత్యం గురించో, నటన గురించో మిగిలిన వాటి గురించో అయితే మంచి పనే అని నా నమ్మకం.

  10. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    12/07/2008 3:00 pm

    బాబ్జీలు గారు
    Thanks for your many generous and kind words. I am not sure I deserve them.

    నిజం చెప్పాలంటే- చాలాసార్లు, నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో అనీ, రాసిందేదైనా అపార్థం చేసుకోవచ్చేమోననీ, అసలీ పని వల్ల నేర్చుకుందేమిటి, ఒరిగే ఉపయోగం ఏమైనా ఉందా (నాకైనా సరే!) అనీ, ఇది ప్రోత్సాహం చేయకపోతే పోనీ, అనవసరంగా నిరుత్సాహపరుస్తుందేమోననీ – అనుమానాలు, ఒకోసారి భయం కలుగుతూనే ఉంటాయి నాకు.
    విధేయుడు
    ————–
    -Srinivas

« 1 ... 1302 1303 1304 1305 1306 ... 1579 »