ఏడాది చదివిన చదువుకి నిగ్గు తేల్చేది సంవత్సరాంతంలో వచ్చే పరీక్ష ఐనట్లే ఈ కథల పోటీలు కూడా అనుకోవచ్చుకదా! బహుమతి పొందిన కథ వ్రాసిన రచయిత పరీక్షలో నెగ్గిన విద్యార్ధిలా ఆనందించడం సహజం. లోగుట్టు పెరుమాళ్ళకెరుక! కానీ, బహుమతి పొందిన రచయితకి గౌరవం హెచ్చుగా ఉంటుంది లోకంలో.
పరిస్థితులకు లొంగి సరిపెట్టుకోలేక మనం చెయ్యగల్గింది యేమిటి? వ్రాయడం మానెయ్యాలి. దానివల్ల లాభం కంటె నష్టం ఎక్కువ. దానివల్ల పత్రికలూ, రచయితలూ కూడా నష్టపోక తప్పదు.
కానీ, ఆపని అంత తేలిక కాదు. వ్రాయకుండా ఉండలేము కదా! ఆ తరవాత?
శంఖంలోపోస్తేగాని తీర్థం కాదు కదా. అలాగే పబ్లిష్షయితే గాని వ్రాసిన కథకు విలువలేదు. అందుకే పోటీకి పంపితే కనీసం సాధారణప్రచురణకైనా ఎంపిక కాకపోతుందా అనే ఆశతో ఉంటారు రచయితలు. ఇది వ్రాసేవాళ్లు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కష్టం.
ఇటువంటివన్నీ పరస్పరాశ్రయవిషయాలు కావడంతో అందరూ ఉదాత్తంగా ఉండడం ఉచితం.
లైలా గారూ:
1. పద్యం లోంచి శ్లేషను మనం లాగవచ్చు. కానీ కవి ఉద్దేశించి వున్నట్లు అనిపించదు. (మాధవ్ అన్నట్లు ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టం).
2. కుమార సంభవం సర్వస్వతంత్ర కావ్యం. అనువాదం కాదు. ఎంత స్వతంత్ర కావ్యమైనా, కవి అదే విషయం మీద అంతకుముందే వెలువడిన ఒక ప్రసిద్ధ మహాకవి కావ్యాన్ని చూడకుండా ఎలా ప్రారంభిస్తాడు? అందులో కన్పించిన అందమైన ఊహలను ఎలా వదిలి వేయగలడు? పై పద్యం మాత్రం కాళిదాసు శ్లోకానికి ఖచ్చితమైన అనువాదమే. ఒక మంచి భావాన్ని వదిలివేయలేని రసికతగా దీన్ని భావించవచ్చు.
కామేశ్వర రావు గారూ:
పద్యాన్ని విశ్లేషించేటప్పుడు తెలుగు పద్యాన్నే పరామర్శించాను కానీ దానికి మూలమైన సంస్కృత శ్లోకం నా దృష్టిలో లేదు. ఐనా, తరంగ అంటే వళి అనే అర్ధం నాకు కన్పించలేదు. అందుకని ముత్తరంగలు అంటే మూడు ధారలనే ఉద్దేశించాను. అలాగే, ‘మడుగులు వారి’ అనే పదానికి గూడా ముడుతలు పడి అనేదానికన్నా హ్రదాలై ప్రవహించి అనే అర్ధమే న్యాయంగా వుంటుందనుకుంటాను. కానీ, సంస్కృత శ్లోకం చూసింతర్వాత – నన్నెచోడుడు కూడా త్రివళులనే ఉపలక్షించి వుంటాడని అనిపిస్తున్నది. మీకు కృతజ్ఞతలు.
నటనకే భాష్యం చెప్పిన మహా నటి సావిత్రి స్వరం వినటం ఎంతో ఆహ్లాదకరం గా ఉంది. Most expressive face movie world had ever seen! NTR, ANR, SVR సరసన సూపర్‌స్టార్‌గా వుండదగిన ఏకైక నటీమణి మన సావిత్రి. Thousand thanks to eemaaTa for bringing back her memories. Thank you. Keep going!
మీ వ్యాసం చాలా బాగుంది. మీ పరిశోధన కు నా హృదయపూర్వక అభినందనలు.
ఘనరాగ పంచరత్న కీర్తనలు అంటే ఏమిటి? వాటికి ఆ పేరెలా వచ్చింది? ఈ విషయాలు తెలుపగలరు.
కృతజ్ణతలు.
పైన వెలిబుచ్చిన పెద్దల అభిప్రాయాలతో నేను ఏమాత్రం విభేదించక పోయినప్పటికీ, పోటీల వల్ల కధా సాహిత్యానికి కొద్దో గొప్పో మేలే జరుగుతుందని నా విశ్వాసం. పోటీ ప్రేరణతో కొత్త కధకులు పుట్టుకొస్తారు. ఈ పోటీలు పూర్తి తేజం తో జరిగే రోజుల్లో, చెయ్యి తిరిగిన రచయితలు ఈ లక్ష్య సిద్ధికే పోటీల్లో పాలు పంచుకునే వారు కాదు. ప్రస్తుతం వస్తున్న కధల్లో లోతూ, వాసీ లేకపోవడం చింతింపదగ్గ విషయమే. చెయ్యి తిరిగిన రచయితలు, చెయ్యి వేసి కధ కి వూపిరులూదవలసిన అవసరం వుంది.
తెలుగు కథల పోటీ గురించి హేమ వెంపటి గారి అభిప్రాయం:
12/16/2008 9:43 pm

పైనున్న సమీక్షలను చూసాక నాకు ఇది రాయాలనిపించింది.
వెంపటి హేమ
కలంపేరు: కలికి
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి బృందావన రావు గారి అభిప్రాయం:
12/16/2008 4:11 pm
(ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి).
లైలా గారూ:
1. పద్యం లోంచి శ్లేషను మనం లాగవచ్చు. కానీ కవి ఉద్దేశించి వున్నట్లు అనిపించదు. (మాధవ్ అన్నట్లు ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టం).
2. కుమార సంభవం సర్వస్వతంత్ర కావ్యం. అనువాదం కాదు. ఎంత స్వతంత్ర కావ్యమైనా, కవి అదే విషయం మీద అంతకుముందే వెలువడిన ఒక ప్రసిద్ధ మహాకవి కావ్యాన్ని చూడకుండా ఎలా ప్రారంభిస్తాడు? అందులో కన్పించిన అందమైన ఊహలను ఎలా వదిలి వేయగలడు? పై పద్యం మాత్రం కాళిదాసు శ్లోకానికి ఖచ్చితమైన అనువాదమే. ఒక మంచి భావాన్ని వదిలివేయలేని రసికతగా దీన్ని భావించవచ్చు.
కామేశ్వర రావు గారూ:
పద్యాన్ని విశ్లేషించేటప్పుడు తెలుగు పద్యాన్నే పరామర్శించాను కానీ దానికి మూలమైన సంస్కృత శ్లోకం నా దృష్టిలో లేదు. ఐనా, తరంగ అంటే వళి అనే అర్ధం నాకు కన్పించలేదు. అందుకని ముత్తరంగలు అంటే మూడు ధారలనే ఉద్దేశించాను. అలాగే, ‘మడుగులు వారి’ అనే పదానికి గూడా ముడుతలు పడి అనేదానికన్నా హ్రదాలై ప్రవహించి అనే అర్ధమే న్యాయంగా వుంటుందనుకుంటాను. కానీ, సంస్కృత శ్లోకం చూసింతర్వాత – నన్నెచోడుడు కూడా త్రివళులనే ఉపలక్షించి వుంటాడని అనిపిస్తున్నది. మీకు కృతజ్ఞతలు.
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి prabhakar గారి అభిప్రాయం:
12/16/2008 10:18 am
థ్యాంక్ యూ. ఈ వ్యాసం చదవడానికి బాగుంది.
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:
12/15/2008 6:00 am
పోయినోళ్ళందరూ మంచోళ్ళు. పోయాక వాళ్ల విలువ “ఆలస్యం” గా నైనా తెలుస్తుంది.
ఒక సంగతి. నేను చాలా రోజులో, ఏళ్ళ క్రితమో ఒక “ఇస్మాయిలుని” కవిత / హైకూ చదివా :
పచ్చని పొద
ఒకటికి
పోయాలనిపించింది […]
మరి ఆ ఇస్మాయిలు, ఈ ఇస్మాయిలు ఒక్కరేనో కాదో నాకు తెలియదు. మళ్ళీ ఇస్మాయిలు అని పేరు కనపడితే ఉన్న “స్మైలు” కూడా పోయి … ఇంతే సంగతులు, చిత్తగించవలెను.
రెండు తీరాలు గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:
12/14/2008 9:34 am
చాలా బాగుంది.
మీరు ఒక కావ్యం వ్రాయరాదు ?
జనరంజని: మహానటి సావిత్రి గురించి vinaykumarnadella గారి అభిప్రాయం:
12/13/2008 10:29 am
నటనకే భాష్యం చెప్పిన మహా నటి సావిత్రి స్వరం వినటం ఎంతో ఆహ్లాదకరం గా ఉంది. Most expressive face movie world had ever seen! NTR, ANR, SVR సరసన సూపర్‌స్టార్‌గా వుండదగిన ఏకైక నటీమణి మన సావిత్రి. Thousand thanks to eemaaTa for bringing back her memories. Thank you. Keep going!
కుతంత్రం గురించి dvrao గారి అభిప్రాయం:
12/13/2008 1:42 am
నాకూ మంజుల గారికి వచ్చిన సందేహం వచ్చినది.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Venkatachalam గారి అభిప్రాయం:
12/12/2008 5:28 am
మీ వ్యాసం చాలా బాగుంది. మీ పరిశోధన కు నా హృదయపూర్వక అభినందనలు.
ఘనరాగ పంచరత్న కీర్తనలు అంటే ఏమిటి? వాటికి ఆ పేరెలా వచ్చింది? ఈ విషయాలు తెలుపగలరు.
కృతజ్ణతలు.
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
12/12/2008 4:08 am
ఊరి బయటే వూరంతా (కళాకారులంతా) కనబడిపోతే వూళ్లోకి వెళ్లాల్సిన అవసరం కలగలేదనుకుంటాను. జోళ్లు అరుగుతాయి, మేజోళ్లు (సాక్సులు లేదా స్టాకింగులు) చిరుగుతాయి అనుకుంటున్నాను. మేకలు తోలుకునే పల్లెటూరమ్మాయి, మేజోళ్లేసుకోవడం నప్పలేదేమో!
తప్పులెన్నువారు తండోపతండమ్ములు. భవిష్యత్తులో మరిన్ని మంచి కవితలు రాస్తారనీ ఆశిస్తాను.
తెలుగు కథల పోటీ గురించి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
12/12/2008 3:43 am