Comment navigation


15795

« 1 ... 1291 1292 1293 1294 1295 ... 1580 »

  1. కొండ నుంచి కడలి దాకా గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    01/06/2009 7:15 pm

    థాంక్సండీ, ఇక్కడే వింటాను. డౌన్ లోడ్ చేయను. కాపీరైట్ల గురించి చాలా సార్లు మీ బోటి విజ్ఞుల అభిప్రాయాలను చదివాను. వీలైనంత వరకు, గౌరవించే ప్రయత్నమే చేస్తాను.
    – శ్రీనివాస్

  2. పెంపకం గురించి స్నేహ గారి అభిప్రాయం:

    01/06/2009 10:56 am

    మాలతి గారు, చాలా బాగుందండి. చెప్పాలంటే పిల్లల పెంపకం లో నా అభిప్రాయాలు దాదాపుగా మీ కథలో పార్వతి అభిప్రాయాలలాగానే ఉంటాయి.సంవత్సరం వయసున్న మా పాపను చూసిన తరువాత ఒక్కవిషయం బాగా అర్థం అయ్యింది. పిల్లలకు ఏమి కావాలో వాళ్ళకు బాగా తెలుసు మనం వాళ్ళను బలవంతం చేయకుండా వాళ్ళ ఇష్టం ప్రకారం పెరగడానికి సహాయం చేస్తే వాళ్ళదైన వ్యక్తిత్వం తో ఎదుగుతారని తెలుసుకున్నాను.

  3. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    01/06/2009 10:05 am

    మేడేపల్లి శేషు గారికి:

    రాయ్ సినిమాల్లోని పాత్రల బెంగాలీ పేర్లని తెలుగులో రాయటానికి నేను కొంత తికమక పడ్డ మాట మాత్రం సత్యం. చెప్పదల్చుకున్న విషయంలో ఇది అంత ముఖ్యం కాదు కాబట్టి, నాకు తెలిసినంతలో సమీక్ష చేసాను.

    రాయ్ సినిమాలు ఈమాటలో మరిన్ని పరిచయం చెయ్యాలని ఆశ! అవి ఈమాటలో ప్రచురించబడి, పాఠకులు మెచ్చుకుంటే, మీ సలహా ప్రకారం పుస్తకం విషయం ఆలోచించవచ్చు.

    రాయ్ సినిమాలని ఇలా పరిచయం చెయ్యటం వల్ల, నాకు జరిగిన (జరుగుతున్న) మంచి ఏమిటంటే – రాయ్ సినిమాలని మరింత జాగ్రత్తగా చూడటం, ఈ సినిమాలపై ఇప్పటిదాకా వచ్చిన అభిప్రాయాలని చదివి అర్ధం చేసుకుని, అవి నిజమా కాదా అని సినిమా మళ్ళీ చూడటం ద్వారా పరిక్షించుకోటం. ఇందువల్ల నాకు సినిమా అన్న మాధ్యమం గురించి ఇదివరకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి. అవే ‘ఈమాట’ పాఠకులతో పంచుకునే ప్రయత్నం ఇది.

    ఈ నేపధ్యంలో, నేను ఒకప్పుడు ‘ఆహా, ఓహో’ అనుకుంటూ చూసిన తెలుగు సినిమాలు ఈ మధ్య మళ్ళీ చూసినపుడు నా అభిప్రాయాలు చాలా సినిమాలపై అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సినిమాలు తీసేవారు (వ్యాపారాత్మకమైన ధోరణి అయినా సరే) ఇటువంటి సినిమాలు చూస్తే, రాబోయే కాలంలో అయినా కొన్ని మంచి సినిమాలు తీస్తారని ఆశ!

    మీ అభిప్రాయాలకి అభినందనలతో,

    లక్ష్మన్న

  4. రచయితలు – ఎడిటర్లు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    01/06/2009 8:33 am

    ప్రధాన/ముఖ్య సంపాదకులికి నమస్కారములు.
    సంపాదక వర్గం, ముఖ్య/ప్రధాన సంపాదకుల సారధ్యంలో పత్రిక ఎలా వుండాలో నిర్ణయిస్తారు. “పీర్లు” వెర్రి “పీర్లు”. “జీతం బత్తెం” లేకపోయినా వున్నా సరే. మహానుభావులని ఇవాళ నాలాటి వాళ్ళనుకుంటున్న వాళ్ళ రచనలని అప్పటి సంపాదకులు “ఛీ” కొట్టిన సందర్భాలు మీరే రాసేరు. “లాభనష్టాల” సంగతి మాటాడ్డం సరైనది కాదు. ఎందుకంటే “బేలన్స్ షీట్” ఏడాత్తరవాత తయారు చేస్తారు కదా? మీ (మా) అదృష్టం ఈ మాటకి అదీ లేదు.

    తెలుగు రచయితలకి ఇప్పటి పరిస్తుతుల్లో వాళ్ళ “సృజనని” ప్రజల దాకా తీసుకెళ్ళగలిగిన “మీడియములు”:
    ఒకటి: పత్రికల్లో ప్రచురించబడడం.
    రెండు: వాళ్ళే ప్రచురించుకోడం
    మూడు: ఇప్పుడిప్పుడే “కో ఆపరేటివ్ సొసైటీ” లు తయారవుతున్నాయని చదివేను. అలాటివి.

    ఒకటొ దానికి సంపాదకులు గారే నూటికి నూరు శాతం “దొర”. ఇక్కడ రచయిత సంపాదకుల మధ్య “హీటెడ్” చర్చలకి ఆస్కారం లేదు. సంపాదకులకి ఇష్టవైఁన రచయితల రచనలు ఎంపిక చేసుకోవచ్చు. మచ్చుకి: పురాణం సుబ్రహ్మణ్య శర్మ: రావి శాస్త్రి/ శ్రీశ్రీ/ అటువంటి రచనలు. ఈ మాట వేలూరి వెంకటేశ్వర రావు గారూ: స్మైల్. ఆంధ్రభూమి (అప్పటి) సంపాదకులు: యండమూరి వగైరాలు…

    రెండో దాంట్లో “సంపాదకులూ” రచయితా “త్వమేవాహం” అయిపోతారు కదా. మూడో దాని సంగతి నా అనుభవంలోకి ఇంకా రాలేదు.

    మీరు రాసిన ఇంకో రకం సంపాదకులు, రాసిన వాళ్ళ “సృజనాత్మక ప్రక్రియ” గురించి, రాసిన వాళ్ళతో “హీటెడ్ ” చర్చలు వగైరాలు మన తెలుగు సాహిత్యంలో వున్నాయా? ఏదేవైనా, సంపాదకుల చేయి పైని, రచయితల చేయి కిందనే కదండీ? “బ్లాగైనా, వెబ్జైనైనా, మామూలు పత్రికైనా. రచయితల్ని “హ్యూమర్” చెయ్యడానికి రాసేరేమో మీరు ఈ వ్యాసం.

    సంపాదకుల/ సంపాదక వర్గం స్థాయిని బట్టి పత్రిక స్థాయి. వాళ్ళ అభిరుచిని బట్టి పత్రిక అభిరుచి. వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి పత్రిక సంప్రదాయం. వాళ్ళ రుచిని బట్టి పత్రిక రుచి. వాళ్ళ యిష్టాయిష్టాలని బట్టి పత్రిక యిష్టాయిష్టాలు. వాళ్ళ సంస్కారాన్నిబట్టి పత్రిక సంస్కారం.
    ఇందులో రచయితల ప్రమేయం ఏవుందీ?
    ఇందులో పాఠకుల ప్రమేయం ఏవుందీ?

  5. భద్రిరాజు కృష్ణమూర్తి గారితో ఇంటర్యూ గురించి మేడేపల్లి శేషు గారి అభిప్రాయం:

    01/06/2009 4:32 am

    ఈ ఇంటర్వ్యూ నేను కూడా నా టేప్ రికార్డరులో రికార్డు చేసుకున్నాను. మళ్ళీ దాన్ని ఇక్కడ వినటం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంనుంచి ప్రసారమైన ఈ ఇంటర్వ్యూని అమెరికాలో ఎలా రికార్డు చేయగలిగారు? మీకు ఎవరైనా రికార్డుచేసి పంపించారా? మాండలిక పదకోశాల నిర్మాణం గురించి డా. బూదరాజు రాధాకృష్ణ గారి ఆకాశవాణి ఇంటర్వ్యూ కూడా నా దగ్గర ఉంది (క్యాసెట్టులో). అది మీకు పంపాలంటే ఎలా పంపాలి?
    -మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి మేడేపల్లి శేషు గారి అభిప్రాయం:

    01/06/2009 3:16 am

    బ్రహ్మానందం గారూ,
    మీ వ్యాసం చదివి నిజంగానే బ్రహ్మానందం పొందాను. త్యాగరాజు గురించి, ఆయన సాహిత్యం గురించి ఇంత వివరంగా ఎప్పుడూ చదవలేదు. నేను పంపిన రాళ్ళపల్లి వారి వ్యాసం మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషమైంది. త్యాగరాజు తమిళపదాలు వాడకపోయినా, ఆయన వాడిన కొన్ని పదబంధాల్లో తమిళవాసనలున్నట్టుగా (అంటే తమిళ వ్యవహారాన్ని బట్టి వాడిన తెలుగు పదాలు) రాళ్ళపల్లి వారు అభిప్రాయపడినట్టుగా నాకాయన వ్యాసం చదివిన తర్వాత అనిపించింది.
    – మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ

  7. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి మేడేపల్లి శేషు గారి అభిప్రాయం:

    01/06/2009 1:49 am

    ‘అపరాజితొ’ విశ్లేషణ బాగుంది. ‘పథేర్ పాంచాలి’ డి.వి.డి. కొనుక్కున్నతర్వాత, ‘అపరాజితొ’, ‘అపూర్ సన్సార్’ చిత్రాల డివిడిలు కూడా నేను తెప్పించుకున్నాను. మీ ‘రాయ్’ సినిమాల విశ్లేషణలన్నీ ఒక పుస్తకంగా వేస్తే చాలా బాగుంటుంది. ‘సర్బజయ’ అని బెంగాలీ ఉచ్చారణను అనుకరిస్తూ రాసేబదులు ‘సర్వజయ’ అని రాసుకోవచ్చు. మద్దిపట్ల సూరి గారు తన అనువాదంలో అలానే రాశారు. బెంగాలీలో ‘బ’ వచ్చినచోటల్లా మనం ‘వ’ వాడటం సహజమే. బెంగాలీ ఉచ్చారణ ప్రకారం రాస్తే ‘సత్యజిత్’ పదాన్ని కూడా ‘షొత్తెజిత్’ అనే పలకాలి (బెంగాలీలు ‘స’ ను ‘ష’ అనే పలుకుతారు కాబట్టి). ఈ విషయాలన్నీ పక్కన పెడితే, మీ సమీక్షలు ‘అక్షరలక్షలు’ చేస్తాయి.
    – మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ.

  8. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    01/05/2009 8:50 pm

    మోహన రావుగారూ,
    నాకు తెలుసున్నంత వరకూ, కొన్ని త్యాగరాజు కృతులు తెలుగు ని “తమిళం” లో రాసినట్లుగా కొన్ని తాళపత్ర గ్రంధాలున్నాయి. నేను ప్రత్యక్షంగా చూసాను. అలాగే అచ్చ తెలుగులో వున్నవి కూడా “సరస్వతి మహల్” గ్రంధాలయంలో చూసాను. ఇలా ఒక్కక్షరం తేడాతో ఉన్న పదాలని నిర్ధారించడం కష్టం.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    01/05/2009 8:33 pm

    మనకందు బాటులో ఉన్న త్యాగరాజు కృతుల మూల ప్రతులేవీ ఆయన స్వదస్తూరీవి కావు. కాబట్టి “వట్టి” యా లేక “పట్టి” యా అన్నది నిర్ధారించడం కష్టం. రెండూ అర్థం చెడకుండా నప్పాయి కనుక ఎవరికి నచ్చింది వారు పాడుకున్నారనుకోవాలి. మీ అభిప్రాయాలు చూసాక రెండు మూడు పుస్తకాలు తిరగేసాను.
    Dr.వి. రాఘవన్ గారి “The Spiritual Heritage of Tyagaraja” లో వట్టి యనే ఉంది. అలాగే టి. పార్థసారధీ, మంచాల జగన్నాధ రావు గార్ల పుస్తకాల్లో “వట్టి” అనే వుంది. ఈ మధ్యనే వచ్చిన టి. కె. గోవిందరావు గారి “ Compositions of Tyagaraja” ఓ మాత్రం “పట్టి” అనుంది. Dr.వి. రాఘవన్ పుస్తకం కొన్ని మూల ప్రతులనుండి సంగ్రహించినట్లుగా ముందుమాటలో వుంది. ఈ ఒక్క “పట్టి” లేక “వట్టి” అన్నది మినహాయించి ఇంకేమయినా పరభాషా పదాలుంటే తెలియజేయండి. అందరికీ తెలుస్తాయి.

  10. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి baabjeelu గారి అభిప్రాయం:

    01/05/2009 10:37 am

    “కథకుడుగా కొండలరావు” అనే శీర్షికన నండూరి రామ్మోహన రావుగారు ర్రవి కొండలరావు గారి ద్విశత చిత్రోత్సవ అభినందన సంచికలో (1983) ఒక వ్యాసం రాసేరు. అందులో రావి కొండలరావు గారి “ముమూర్ష”, “దిదృక్ష”, “చంద్రశేఖరుని కథ” మరియూ “స్నేహం” కథల గురించి క్లుప్తంగా సమీక్షించేరు రామ్మోహన రావు గారు.

    రావి కొండల రావు గారి “టెక్నిక్” గురించి చెబ్తూ “కొండల రావు తన కథలను ముగిస్తూ ముగింపు తరవాత జరిగేదాన్ని వాచ్యంగా చెప్పడు. పాఠకుల ఊహకు వదిలెయ్యడం అతని “టెక్నిక్” అంటారు.

    “ఇలాగే కొండలరావు రాసిన నిరుద్యోగపర్వం, మాయమైనపర్సు,తప్పిపోయినాడు లాంటి కథలు లబ్జుగానూ, రంజుగానూ వుండి పాఠకుల్ని గిలిగింతలు పెడతాయి” అంటారు నం.రా.రావు గారు.

    వ్యాసం చివర్లో “…కథలు రాయని భాస్కరుడు (జూ) గా కొండలరావు పై ఆయన స్నేహితుడు ముళ్ళపూడి పరోక్ష ప్రభావం ఎంతైనా వుంది (సీనియరు ముళ్ళపూడా? ఎక్కడ చదివేనో గుర్తు రావటం లేదు కృ.శాస్త్రి గారితో ఎలాగొలాగ కష్టపడి రాయించొచ్చుగానీ, ము.వెం.రవఁణ గారి చేత మరీ కష్టవఁని). ఆ ప్రభావంలో నుంచి బయటపడి కథకుడిగా కొండలరావు మళ్ళీ విజృంభిస్తే బావుంటుందనే దిదృక్ష కలవారిలో నేనొకడిని” అని ముగిస్తారు నండూరి రామ్మోహన రావు గారు.

    చూద్దాం. ఈమాట కోసం రా.కొండలరావు గారి చేత కథో, నాటికో ఏదో ఒకటి రాయించగలనేమో? అది మన “పీర్స్” కి “పర్లేదు” అనిపిస్తుందేమో?

« 1 ... 1291 1292 1293 1294 1295 ... 1580 »