Comment navigation


15795

« 1 ... 1293 1294 1295 1296 1297 ... 1580 »

  1. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి చంద్ర మోహన్ గారి అభిప్రాయం:

    01/03/2009 8:53 am

    చాలా మంచి వ్యాసం, అభినందనలు! ఐతే త్యాగరాజు ఒక్క తమిళపదం కూడా వాడలేదనడం సరికాదు. ఆనాటి పరిస్థితుల్లో అది సాధ్యమూ కాదు. ఒక్క ఉదాహరణ : ఒక కీర్తనలో ” పట్టి గొడ్డు వోలె భక్షించి తిరిగితి… ” అని పాడారు. “పట్టి” అంటే ఏమిటో తెలియక చాలామంది తెలుగు విద్వాంసులు దాన్ని ” వట్టి గొడ్డు వోలె…” అని మార్చి పాడేశారు, అది తెలుగు పదం కనుక. తమిళంలో పట్టి అంటే ‘బందెలదొడ్డి’ అని అర్థం. బందెలదొడ్డి లోనుండి ఎవరూ సొంతదారు అడగక వదిలేసిన గొడ్డు లాగా (అనాథ పశువు) అని భావం. నిజానికి త్యాగరాయ కీర్తనలు పాడేవారికి తమిళ భాషా సాంప్రదాయాలతో పరిచయం ఉండడం ఉపకరిస్తుందని పలువురు విద్వాంసుల భావన.

  2. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    01/03/2009 8:31 am

    మొహన రావు గారికి:

    వ్యాసం నచ్చినందుకు సంతోషం.

    సినిమాలో గాని, ఈ వ్యాసంలో నేను ఇచ్చిన పుస్తకాల్లో గాని, ఎక్కడా హొరిహోర్ పేరు వాడలా! అన్ని చోట్లా Hariharan పేరు వాడారు. మీకొచ్చిన సందేహం నాకూ వచ్చినా, పేరులో ఏముంది? అనుకొని వ్యాసం పూర్తి చేసాను.

    లక్ష్మన్న

  3. ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి Dr.Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    01/03/2009 6:43 am

    తాతిరాజు వేణుగోపాల్ అభిప్రాయం
    చాలా బావుంది మీరు ఇటీవల స్వర్గీయ సాలూరు రాజేశ్వరరావు గురించి ప్రచురించిన అభిప్రాయ తోరణం. లోగడ 1984 ఆ ప్రాంతాల్లో నేను బెంగళూరులోఉన్నప్పుడు ‘మేలు కలయిక’ వారు రాజేశ్వరరావు గారిని సన్మానించారు. ఆయన్ని దగ్గర్లో చూసి మాట్లాడ గలిగాను. ‘పాట పాడుమా’, ‘ఓహో యాత్రికుడా’ పాడండి మాస్టారూ అంటే ‘రెండోది గుర్తు లేదు’ అని మొదటిది భీంపలాస్ లో ఏం ఆలపించారూ—-అంతే కాదు-మేఘమాల (మల్లీశ్వరి) పాట అందుకునే ముందు తబ్లా అబ్బాయిని “అలా కాదు ఇలా, ఇలా కాదు అలా” అంటూ దరువులు వేయించేసి మరీ ఎఫక్టు తెప్పించుకున్నారు. That is yes, raje ‘swara’ rao—-. ఈయన ‘రాజీ’శ్వరుడు కూడా. పాశ్చాత్య పెను తుఫానులోంచి సంప్రదాయాన్ని రక్షించడంలో మేటి. ఆత్మగౌరవం చిత్రంలో ‘అందెను నేడె అందని జాబిల్లి’ వెనక ఆయన పడ్డ శ్రమని కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇప్ప టికీ గుర్తుచేస్తుంటారు.
    బహుశః ఆ పాట హరికాంభోజికి దగ్గర్లో ఉందనుకో వచ్చు. ఇది ఒక రష్యను ట్యూననుకుంటా. చిట్టిచెల్లెలు చిత్రంలోని ‘ ఈ రేయి తీయనిది’ పాటకి మూలం
    ఒక పియానో వరస. అయితే అందులో తెలుగుతనం ఉట్టిపడడమే గొప్ప విషయం. Ron Goodwin వరస ఒకటి ‘వేడుకొనడూ అబ్బాయి’ గా (ఇద్దరు మిత్రులు లో హలో హలో ఓ అమ్మాయి’ ) మారడం విడ్డూరం. వాయిద్యంతో వైవిధ్యం – సాలూరు వారి ప్రత్యేకత. మీరు చెప్పిన ‘చిగురులు వేసిన కలలన్నీ’ (పూల రంగడు) ఒకటయితే భీష్మ లోని ‘మనసు లోని కోరిక’, జై జవాన్ లోని ‘మధుర భావాల సుమ మాల’, పవిత్ర బంధం లోని ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం’ , ఇద్దరు మిత్రులు లోని ‘పాడవేల రాధికా’- మచ్చు తునకలు మరి కొన్ని.
    అంతగా వినిపించని చక్కని పాటలు— శీలము కలవారి చినవాడా (పల్నాటి యద్ధం),
    ఎంతైనా బరువు ఈ బ్రతుకు ( బంగారు తల్లి ), గొంతు పాడితే చాలునా (జీవితాశయం),
    అనురాగపు కన్నులలో ( జై జవాన్ ) —ఇవన్నీ ర’సాలూరు’ రాజే ‘స్వర’ మాధురులు.
    ఈ మధ్య ఒక ‘చిత్ర’ విచిత్రం గమనించాను- హిందీ చిత్రం ‘కోయి మిల్ గయా’ లో
    రాజేష్ రోషన్ ‘ఇన్ పంఛి(యోంకో దేఖ్ కర్ జాగే హై(‘ పాటలో చరణాల్లో (కాకతాళీయం అనుకోవాలా? ) ‘ బహు దూరములో నున్నవి’ (అమర శిల్పి జక్కన – ఈ నల్లని రాలలో) ని బహు చక్కగా ఉపయోగించి నట్లు అనిపిస్తోంది. పోనీలెండి, ఇద్దరూ రాజులే !

  4. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana గారి అభిప్రాయం:

    01/03/2009 6:24 am

    వ్యాసం చాలా బాగుంది. పాత జ్ఞాపకాలను కూడా వెలికి తెచ్చింది. యాభైతొమ్మిదిలో లేక అరవైలో అనుకొంటా, నేను దీన్ని మొట్టమొదట తిరుపతిలో చూచా. తరువాత అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నా. చివరకు కేసెట్ కొనుక్కొన్నా. అప్పుడు నేను కాలేజీలో చదివే రోజుల్లో నాకు ఖగోళ శాస్త్రం అంటే ఇష్టం. రాశులను గుర్తు పెట్టే వాణ్ణి. ఈ సినిమాలో కూడా అపూకు హెడ్మాస్టర్ నక్షత్రాలను చూపుతాడు. మరొకటి ఇంటి యజమాని తలనుండి నెరసిన వెండ్రుకలను పీకడం. మొదట హరిహర్ గంగానది ఒడ్డులో నడవడం, వ్యాయామం లాటిది చేయడం, తరువాత హరిహర్ చచ్చి పోయేప్పుడు అపూ గంగ నీటిని తేవడానికి వెళ్ళినప్పుడు ఒక వస్తాదు గరిడీలు తిప్పడం లాటి దృశ్యాలు మరచి పోలేనివి.
    ఒక సందేహం. బెంగాలీ హొరిహొర్ ఎలా తమిళ హరిహరన్ అయ్యాడో ఈ వ్యాసంలో 🙂 విధేయుడు – మోహన

  5. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి mOhana గారి అభిప్రాయం:

    01/02/2009 6:43 pm

    చాలా బాగుంది బృందావనరావు గారూ:
    మీ కృషికి ఎందరో ఋణపడి ఉన్నారు. కర్ణుని ప్రవేశము ఆదిపర్వములో పంచమాశ్వాసములో కూడా ఉంది. అది అతని జననం. ఆ పద్యం –

    ఛం. సలలితమైన పుట్టుఁగవచంబు నిసర్గజమైన కుండలం-
    బుల యుగళంబు నొప్పఁగ సుపుత్త్రుఁడు కర్ణుఁడు పుట్టె సూర్యమం-
    డలమొకొ భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో
    వెలుఁగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండగన్ (ఆది 5.26)

    అందమైన పుట్టుకవచము, సహజమైన కుండలముల జతతో సుపుత్రుడు కర్ణుడు పుట్టాడు. సూర్యమండలమే భూమికి దిగివచ్చి వేయివెలుగుల కాంతితో ప్రకాశిస్తున్న విధంగా అందట ఆ దృశ్యం. ఒక విధంగా ఈ పద్యం కూడా కర్ణుని ప్రవేశమే. ఈ పద్యం తరువాత మరొక అతి సుందరమయిన పద్యం ఉంది. ఇందులో నన్నయ పద్యౌచిత్యమును పాటించాడు. నన్నెచోడుడు ఎలా తరువోజను స్త్రీలకు వాడాడో అదే విధంగా నన్నయ కూడా ఈ పద్యంలో –

    తరువోజ – ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర
    మిమ్మంత్రశక్తి యేనెఱుగంగ వేడి
    యేల పుత్త్రకుఁ గొరి యెంతయు భక్తి
    నిను దలంచితి బ్రీతి నినుఁడును నాకు
    నేల సద్యోగర్భ మిచ్చెఁ గుమారు
    డేల యప్పుడ యుదయించె నింకెట్టు
    లీలోక పరివాద మే నుడిగింతు
    నింతకు నింతయు నెఱుఁగరె జనులు

    ఈ పద్య శిల్పాన్ని గమనించండి. ఇందులో పదాలు ఆ యా గణాలకు విరుగుతాయి. అదియునుకాక సూర్యుని కారణముగా సూర్యగణము ఉండే స్త్రీల పదమైన తరువోజను నన్నయ వాడినట్లుంది ఇక్కడ. విధేయుడు – మోహన

  6. స్మైల్‌ – ఓ జ్ఞాపిక గురించి mOhana గారి అభిప్రాయం:

    01/02/2009 2:46 pm

    చాలా బాగుంది జ్ఞాపిక. నా అజ్ఞానానికి మన్నించండి. ఈ మో-ని గురించి వివరాలు తెలియజేస్తారా ఎవరైనా? మో ఎవరు? వారు ఇంకా ఏమేమి రాశారు?
    విధేయుడు – ఇంకో మో

  7. ఈ మాసపు పాట గురించి Naresh గారి అభిప్రాయం:

    01/02/2009 12:25 pm

    ఉదయ కళ గారు,
    మీరు చెప్పినది రియాల్టి కి చాలా దగ్గర గా ఉంది. అలాంటి పరిస్థితులను ఊహించుకొవటానికి భయానకంగా ఉంది. కథ నాకు నచ్చింది. ఈ పీడ కల నిజ జీవితంలొ ఎవరికి రాకూడదని కొరుకుంటూ…
    – నరేష్ కుమార్

  8. పెంపకం గురించి Naresh గారి అభిప్రాయం:

    01/02/2009 10:57 am

    మాలతి గారు,
    మీ వర్ణన బాగుంది. చెప్పిన దాంట్లొ నిజం ఉంది. వారిద్దరి పెంపకంలొ మరిన్ని సారూప్యతలు చూపించాల్సింది.
    – నరేష్ కుమార్

  9. కొండ నుంచి కడలి దాకా గురించి Srinivas Vuruputuri గారి అభిప్రాయం:

    01/02/2009 7:49 am

    శ్రీనివాస్ గారికి/సంపాదకులకి
    శబ్దతరంగాలని డౌన్ లోడ్ చేసుకుని, ప్రయాణిస్తూ వినే సౌకర్యం లేదా? కాపీరైటు చిక్కులేవన్నా ఉన్నాయా?

    శ్రీనివాస్

  10. రచయితలు – ఎడిటర్లు గురించి Malathi Nidadavolu గారి అభిప్రాయం:

    01/02/2009 5:19 am

    ఎమి దిని సెపితివి కపితము
    బెమ పడి వెరి పుచ్చకయ దిని సెపితివొ
    ఉమెతః దిని సెపితివొ
    అమవసనిశి యనుచు అలసని పెదన
    అంటూ రామకృష్ణుడు వత్తులూ, దీర్ఘాలూ తీసేసి, అల్లసాని పెద్దన పేరుని కూడా హేళన చేసేడు.
    (ఈపద్యం నాకు జ్ఞాపకం వున్నట్టు రాసేను. తప్పులుండొచ్చు. ప్రధానాంశం అమవసనిశి. అన్నపదం వాడకం). ఇది కూడా ఒకరకంగా ఎడిటోరియల్ కామెంటే.
    మార్క్‌ట్వైన్ తన కథని ఒక పత్రిక తిప్పి పంపుతూ, “ఇందులో నువ్వు విరామ చిహ్నాలు సరిగ్గా పెట్టలేదు. కామాలు వుండవలసినచోట లేవు, అవి పెట్టి మళ్లీ పంపించు” అన్నారుట. దానికి జవాబుగా మార్క్‌ట్వైన్ మరో కాయితంనిండా కామాలు టైపు చేసి పంపుతూ “ఇవిగో కామాలు. మీకిష్టం వచ్చినచోట పెట్టుకోండి” అని రాసేడుట.
    సంపాదకుల-రచయితలమధ్య రాగద్వేషాల విషయం నేను నా తెలుగు తూలికలో రచయితలకోణం నుండి ప్రస్తావించాను. నిజానికి దాన్ని “ఊసుపోక” వ్యాసంగా రాయడంలో నావుద్దేశ్యం హాస్యప్రధానం చేద్దామనే. (ఊసుపోక వ్యాసాలు కాఫీటేబుల్ కబుర్లలాటివి) అయితే అందులో హాస్యం పలకలేదు. ఆదోషం నాదే. వ్యాఖ్యాతలు సీరియస్‌గానే తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
    రచయితకి తనరచనల్లోనూ ఎడిటరుకి తన సలహాల్లోనూ లోపాలు కనిపించవు. కారణం రచయిత తనమనసులో వున్నది తాను రాస్తాడు. ఎడిటరు అది చదువుతున్నప్పుడు తనకి కలిగిన స్పందన ప్రాతిపదికగా తన అభిప్రాయాలు వెల్లడిస్తాడు. కానీ ఎడిటరు బాధ్యత అంతటితో ఆగిపోదు. తన పాఠకులకోణంలోనుండి కూడా ఆలోచించాలి. అంతే కాదు. ఈనాడు ప్రాచుర్యంలో వున్న మంచి కథ లక్షణాలు కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు ఒకకథమీద తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నప్పుడు. నాకు వచ్చే చిక్కంతా ఇక్కడే. ఏది మంచికథ అన్నదానికి ఈనాడు ప్రాచుర్యంలో వున్న ప్రమాణాలు నాకు పూర్తిగా అంగీకారం కాదు. ఆకారణంగానే కొన్ని పత్రికలు నాకథలు వేసుకోవు కూడాను. వారికోసం నేను నా రచనావిధానాన్ని మార్చుకోలేను.
    నేను రచయితనీ సంపాదకినీ కూడా. అంచేత సంపాదకుల సాధకబాధకాలు నాక్కూడా అవగతమే. ఎటొచ్చీ నాసైటులో షేక్స్ పియరులు (those who can shake my views) లేరు. నేను కూడా అందరు ఎడిటర్లలాగే నా సైటు పాఠకులని దృష్టిలో పెట్టుకుని అనువాదకులకి అంతో ఇంతో సలహాలు ఇస్తాను. (నిజానికి అనువాదాల్లో బాధలు వేరు కనక ఇది పూర్తిగా ఇక్కడ వర్తించదేమో).
    ఇంతకీ నా తెలుగుతూలికలో నా వ్యాసంమీద వెలువడిన అభిప్రాయాలూ, ఇక్కడ వేలూరివారి వ్యాసం చూసిన తరవాత నాకు అర్థం అయింది ఏమిటంటే రచయితలకీ, ఎడిటర్లకీ, రెవ్యూయర్లకీ, మధ్య సయోధ్య లేదు. వారూ వీరూ కూడా ఎదటివారు సహకరించడంలేదు అనే అంటున్నారు.
    ఈవిషయం ఈ రెండు వ్యాసాలలోనూ తెల్లమయింది కనక ఇహమీదట ఇరువైపులా తమ దృక్కోణాలలో కొంత మార్పూ, ఇద్దరిమధ్యా రవంత సామరస్యం ఆశించడానికి ఇక్కడ అవకాశం ఏర్పడిందనుకుంటాను. అందుకు కృతజ్ఞతలు.
    . -నిడదవోలు మాలతి.

« 1 ... 1293 1294 1295 1296 1297 ... 1580 »