ఈ వివరణ చాలా విషయాలు స్పష్టం చేస్తుంది. బాగుంది. ధన్యవాదాలు.
మరొక సందేహం. ఈమాటలో ప్రచురించిన రచనలు తొలిగించినప్పుడు రచయితలకు తెలియజేసే అవకాశం వుందా? నా రచనలు రెండు (“రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం” అన్న వ్యాసమూ, “అంపకాలు” అన్న కవితా తొలిసారిగా ఈమాట.కాంలోనే ప్రచురింపబడినాయి) ఇప్పుడు కనిపించడంలేదు.
– నిడదవోలు మాలతి
[ఈమాటలో ప్రచురించబడిన రచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతనూ తొలగించబడవు.
మీ ‘రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం‘ వ్యాసం, మీ ‘అప్పగింతలు‘ కవిత (‘అంపకాలు’ కాదు) తిక్కన ఫాంట్‌లో లేని కొన్ని ఇతర రచనలతో పాటుగా సాంకేతిక కారణాల వల్ల ఇంకా పీ.డీ.ఎఫ్ ఫైళ్ళు గానే ఉన్నాయి. వీటిని కూడా యూనికోడ్‌కి మార్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మరి కొంతకాలం పట్టవచ్చు. పాత సంచికల్లో తమ రచనలు కనిపించని రచయితలు వాటి వివరాలతో మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుతున్నాం – సం.]
రోహిణీ ప్రసాద్!
సంగీత జ్ఞానము, భక్తి -రెండూ లేని పాఠకులము కొందరము ఉంటాం కదా! :)మీకు ఐతే రెంటిలో ఒకటైనా మస్తుగా ఉంది. కాని మీరు పాఠకులు కారయ్యే! మా బోంట్లకు – అంటే సైన్సు, ఆర్ట్సు అసలు ఏవీ రాని, మామూలు పాఠకులకు- అందునా ఆడవాళ్ళకు, అర్థమయ్యేట్లు తేలిక మాటల్లో వ్యాసాలు రాసి, చదువు చెప్పి, సన్మార్గంలో పెట్టే రచయితలు మాత్రమే మీరు.
దుడుకు గల లైలాను ఏ దొర బ్రోచురా – అని నవ్వుకుని ‘వీణ తీగల గురించిన చర్చ’ ఎటువంటిదో చెప్పగలరు. నాకు ఏమీ అర్థం కాలేదు.
పోనీ త్యాగరాజు సంగీతములో ఎందుకు అద్వితీయుడో , ఈ ఒక్కసారికి పాఠకుడి స్థానానికి దిగజారి మీరే స్వయంగా ఒక్క కామెంటైనా చెయ్యరాదూ.
అందరు మహామహోపాధ్యాయులూ – ఎవరికి వారే -ఇతరులకు ఉపయోగించే విషయాలు పరాపరా రాసేస్తూ, బిజీగా ఉండి, వేరేవారి రచనలు, పుస్తకాలు చదవ(లే)క పోయినా, అలాటి పరోపకార బుద్ధి ఏ మాత్రం లేని నేను చదువుకుంటాను. తెలియని విషయాలు కొంచెమైనా తెలుసుకుని ఆనందిస్తాను. కోరిక మన్నించి రాస్తారుగా.
మీరు రాసే లోపు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ సాధన చేస్తూ ఉంటాను. ఎంత గింజుకున్నా రాదనుకోండి.:) ఐతే ఏం.
పాఠకుల సాహిత్యాభిమానం ఎక్కువ కావడం వల్లనో, సంగీతాభిమానం తక్కువ కావడం వల్లనో తెలియదు కాని, త్యాగరాజు సృష్టించిన అద్వితీయమైన సంగీతం గురించి మటుకు ఒక్క కామెంటు కూడా కనబడటం లేదు! వీణ తీగల గురించిన చర్చ కూడా అటువంటిదే.
కథ వాస్తవానికి చాలా దగ్గరగా వుంది. నిజానికి పిల్లల పెంపకము లో ప్రతి క్షణము యుద్ధమే. మంచి, చెడు ఏదో వారికి తెలియజేస్తె వారే నిర్ణయించుకుంటారు ఎమిచేయాలో.
06-01-2009 నాటి శేషు గారి లేఖ పైన డా. తాతిరాజు వేణుగోపాల్ అభిప్రాయం :
ఏ భాషకా భాషే గొప్పది. భావం ఒక్కటే అయినా ఒక్కో భాషలో ఒక్కో అందం కనబడుతుంది. ‘తమిళ వాసన’ అనే వెటకారం, ప్చ్ ! ఇంకా ఈ రోజుల్లో కూడానా? అమాయకుడు భారతి ‘సుందర తెనుంగ్’ అని అంటే, మనమేఁవో ఇలా. అర్ధమవుతున్న కొద్దీ అన్ని భాషల్లో అమృతం దొరుకుతుంది. ఇప్పుడు త్యాగయ్యలో తమిళం, రేపు రామదాసులో ఉర్దూ, ఎల్లుండి అన్నమయ్యలో కన్నడం- ఇలా వెతుక్కునే కన్నా ఈ మహానుభావుల కృషికి అబ్బురపడుతూ వారు వేసిన ‘చక్కని రాజమార్గములు’ యేవో తెలుసుకొనీ నడుచుకుందాం.
వచనానికీ కవనానికీ మధ్య భేదం లేదనిపించేట్లు రాయగల వాళ్ళు చలం, కృష్ణశాస్త్రి, రావి శాస్త్రి అని. సరిగ్గా ఆకోవలో రచనలు చేసిన వాడు స్మైల్ అని.
చాలా బాగా చెప్పారు.
చలం వచనం ఎందుకు అంత బాగా నచ్చుతాదో ఇన్నాళ్ళకు అర్ధం అయ్యింది నాకు.
రచయితలకు సూచనలు గురించి Malathi Nidadavolu గారి అభిప్రాయం:
01/08/2009 7:15 am

మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి lyla yerneni గారి అభిప్రాయం:
01/07/2009 8:30 pm
రోహిణీ ప్రసాద్!
సంగీత జ్ఞానము, భక్తి -రెండూ లేని పాఠకులము కొందరము ఉంటాం కదా! :)మీకు ఐతే రెంటిలో ఒకటైనా మస్తుగా ఉంది. కాని మీరు పాఠకులు కారయ్యే! మా బోంట్లకు – అంటే సైన్సు, ఆర్ట్సు అసలు ఏవీ రాని, మామూలు పాఠకులకు- అందునా ఆడవాళ్ళకు, అర్థమయ్యేట్లు తేలిక మాటల్లో వ్యాసాలు రాసి, చదువు చెప్పి, సన్మార్గంలో పెట్టే రచయితలు మాత్రమే మీరు.
దుడుకు గల లైలాను ఏ దొర బ్రోచురా – అని నవ్వుకుని ‘వీణ తీగల గురించిన చర్చ’ ఎటువంటిదో చెప్పగలరు. నాకు ఏమీ అర్థం కాలేదు.
పోనీ త్యాగరాజు సంగీతములో ఎందుకు అద్వితీయుడో , ఈ ఒక్కసారికి పాఠకుడి స్థానానికి దిగజారి మీరే స్వయంగా ఒక్క కామెంటైనా చెయ్యరాదూ.
అందరు మహామహోపాధ్యాయులూ – ఎవరికి వారే -ఇతరులకు ఉపయోగించే విషయాలు పరాపరా రాసేస్తూ, బిజీగా ఉండి, వేరేవారి రచనలు, పుస్తకాలు చదవ(లే)క పోయినా, అలాటి పరోపకార బుద్ధి ఏ మాత్రం లేని నేను చదువుకుంటాను. తెలియని విషయాలు కొంచెమైనా తెలుసుకుని ఆనందిస్తాను. కోరిక మన్నించి రాస్తారుగా.
మీరు రాసే లోపు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ సాధన చేస్తూ ఉంటాను. ఎంత గింజుకున్నా రాదనుకోండి.:) ఐతే ఏం.
లైలా.
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి akella ramakrishna గారి అభిప్రాయం:
01/07/2009 7:22 pm
బాగుంది. అక్కడక్కడా కావ్యము లొ ఉన్న పద్యాలు కూడా ప్రచురిస్తె బాగుంటుంది.
మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/07/2009 4:32 pm
సంగీతమనేది ప్రధానంగా చెవులకు సంబంధించినది కనక ఇందులో ప్రస్తావించిన త్యాగరాజు రచనలు కొన్ని వినవచ్చు.
నమో నమో
జానకీ రమణ
దొరకునా
నిధిచాల
మరిమరి
భవనుత
నాదుపై
మా జానకి
ఎన్నాళ్లు
వనజనయనుడని
kshira
రామ రామ
నీకే తెలియక
తరగని దూరం గురించి రానారె గారి అభిప్రాయం:
01/07/2009 2:46 pm
ఆహా! నిజమే!! భలే చిత్రమైన సంగతి. దేశాల మధ్య దూరాలను మాపే ఈ సాధనాలే మనిషికీ మనిషికీ మధ్య దూరాన్నెక్కువ చేస్తున్నాయ్!!!
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/07/2009 2:45 pm
పాఠకుల సాహిత్యాభిమానం ఎక్కువ కావడం వల్లనో, సంగీతాభిమానం తక్కువ కావడం వల్లనో తెలియదు కాని, త్యాగరాజు సృష్టించిన అద్వితీయమైన సంగీతం గురించి మటుకు ఒక్క కామెంటు కూడా కనబడటం లేదు! వీణ తీగల గురించిన చర్చ కూడా అటువంటిదే.
పెంపకం గురించి Krishna గారి అభిప్రాయం:
01/07/2009 2:31 pm
కథ వాస్తవానికి చాలా దగ్గరగా వుంది. నిజానికి పిల్లల పెంపకము లో ప్రతి క్షణము యుద్ధమే. మంచి, చెడు ఏదో వారికి తెలియజేస్తె వారే నిర్ణయించుకుంటారు ఎమిచేయాలో.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal గారి అభిప్రాయం:
01/07/2009 11:28 am
06-01-2009 నాటి శేషు గారి లేఖ పైన డా. తాతిరాజు వేణుగోపాల్ అభిప్రాయం :
ఏ భాషకా భాషే గొప్పది. భావం ఒక్కటే అయినా ఒక్కో భాషలో ఒక్కో అందం కనబడుతుంది. ‘తమిళ వాసన’ అనే వెటకారం, ప్చ్ ! ఇంకా ఈ రోజుల్లో కూడానా? అమాయకుడు భారతి ‘సుందర తెనుంగ్’ అని అంటే, మనమేఁవో ఇలా. అర్ధమవుతున్న కొద్దీ అన్ని భాషల్లో అమృతం దొరుకుతుంది. ఇప్పుడు త్యాగయ్యలో తమిళం, రేపు రామదాసులో ఉర్దూ, ఎల్లుండి అన్నమయ్యలో కన్నడం- ఇలా వెతుక్కునే కన్నా ఈ మహానుభావుల కృషికి అబ్బురపడుతూ వారు వేసిన ‘చక్కని రాజమార్గములు’ యేవో తెలుసుకొనీ నడుచుకుందాం.
కవి స్మైల్ గురించి మరొక్కసారి… గురించి bollojubaba గారి అభిప్రాయం:
01/07/2009 10:10 am
వచనానికీ కవనానికీ మధ్య భేదం లేదనిపించేట్లు రాయగల వాళ్ళు చలం, కృష్ణశాస్త్రి, రావి శాస్త్రి అని. సరిగ్గా ఆకోవలో రచనలు చేసిన వాడు స్మైల్ అని.
చాలా బాగా చెప్పారు.
చలం వచనం ఎందుకు అంత బాగా నచ్చుతాదో ఇన్నాళ్ళకు అర్ధం అయ్యింది నాకు.
ఖాళీ సీసాలు గురించి bollojubaba గారి అభిప్రాయం:
01/07/2009 9:59 am
చానాళ్ల క్రితం చదివానీ కధని. ఈ కధలోని కొన్ని టాబూ ఇమేజెస్ ఇప్పటికీ హాంటింగ్ మెమరీస్ గానే ఫ్రెష్ గా ఉన్నాయి. మరలా చదివించారు థాంక్స్.