Comment navigation


15795

« 1 ... 1292 1293 1294 1295 1296 ... 1580 »

  1. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    01/05/2009 10:36 am

    ఇరువురిలో ఏ వొక్కరినీ తక్కువ చేసి చూపడం అనే ఉద్దేశం నన్నయకు ఉండి వుండదు. అయినా కొద్ది పాటి అర్జున పక్షపాతం పైపద్యాల్లో కనిపించక పోదు. -చీమలమర్రి బృందావనరావు

    అప్పటికే పలుమార్లు ప్రదర్శించబడిన విజయుని విద్యాసక్తి, వీరగుణం గురువు ద్రోణుడినే కాకుండా, మహాభారత కథ మనకు చెపుతున్న నన్నయ కవిని కూడా మెప్పించిందేమో!
    “విద్యలెల్ల నభ్యాస వశంబునన్ బడయ భారము లేదని నిశ్చితాత్ముడై” చీకటిలో కూడా విలువిద్య ప్రాక్టీసు చేశాడట అర్జునుడు. అతని పట్టుదల చూసి గురువుకు ఇంకా ఎక్కువ కష్టమైన విద్యలు నేర్పబుద్దయ్యింది. మరి విద్యలు పరీక్షకు వస్తే:

    చెట్టుకొమ్మ మీది పక్షి తలను కూల్చమంటే, మరి ఆ పక్షితల తప్ప కంటికి ఇంకే కనిపించని ఏకాగ్రత కలవాడు. అందుకనే అర్జునుని గురి తప్పదు. ఐనా అది కృత్రిమపక్షితల. కల్పించిన పరీక్ష. అందులో అంత గొప్ప ఏముంది. :)తర్వాత గంగా స్నానాలు చేస్తున్నప్పుడు, ఒక మొసలి, ద్రోణుని తొడ పట్టుకుంటే శిష్యులంతా స్తంభించి పోయి ఉన్నప్పుడు, అర్జునుడు మొసలిని చంపి ద్రోణుని కాపాడాడు. ఇది నిజమైన మొసలి. నిజమైన ఆపద. గురి తప్పరాని సమయము. ఇదీ విద్యకు అసలు పరీక్ష. శ్రద్ధతో చదువు నేర్చి, ఆ చదువునే వాడి, గురువునే ఆపత్తి నుంచి రక్షించగలిగిన సమర్ధుల మీద ఎక్కువ అభిమానం చూపించకుండా, ఎవరైనా ఎలా ఉండగలరు?

    సంతోషమ్ము లభించె చాల, సదయున్ సందీప్తివంతున్, భళా!
    కుంతీపుత్రుని ఆ వదాన్యు నళినాక్షుం గర్ణునిన్, పిమ్మటా
    కుంతీపుత్రుని, ఆ విశేష విజయాఖ్యుం జూచి సంతోషమెం
    తెంతో! సత్కవితా నిధానము సదా నింపేను గాదా ఖుదా!

    లైలా

  2. రచయితలు – ఎడిటర్లు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    01/05/2009 10:07 am

    రివ్యూ (ప్రచురణకి ముందు ప్రచురణార్హతని నిర్ణయించటం) చెయ్యకుండా ఏ పత్రికా ప్రచురించదు. సంపాదకుడో, మరొక వ్యక్తో కథనో, వ్యాసాన్నో చదివి అది వారికి నచ్చిందో, లేదో తేల్చాలి కదా. వచ్చే చిక్కల్లా అటు పైనే. “బాగులేనివి” చెత్తబుట్ట పాలవుతాయి. రచయిత అదృష్టం బాగుంటే ఆ విషయం తెలియపరచ బడుతుంది. “బాగున్న” వాటిని యధాతథంగా అచ్చు వేస్తారు, లేదా “చిన్న చిన్న సవరణలు” చెయ్యవలసి వస్తే సంపాదక వర్గమే చేసేసి ప్రచురిస్తారు. ఇక్కడ “చిన్న చిన్న సవరణలు” అంటే వర్ణక్రమదోషాలు, రచయితకి భాషలో వెసులుబాటు లేక ఒకే ఒక్క చోట ఇంగ్లీషు మాట ప్రయోగిస్తే దానికి తెలుగు మాట ప్రతిక్షేపించటం, మొదలైనవి (నేను కథలు రాయటం మొదలు పెట్టిన కొత్తలో ఆంద్రపత్రిక వారు ఈ రకం సహాయం చేసిపెట్టేరు, వారికి నా ధన్యవాదాలు). మరికొంచెం “పెద్ద” సవరణలు” చెయ్యవలసివస్తే సంపాదకుడు రచయితకి ఉత్తరం రాయవచ్చు. (ఉ. భారతి సంపాదకుడు రాచకొండ విశ్వనాధశాస్త్రికి కథ పేరు “అల్పజీవి” గా మార్చమని సలహా ఇస్తూ రాసిన ఉత్తరం.) e-mail, Teliphone సౌకర్యాలు ఉన్న ఈ రోజులలో ఇదేమీ కష్టం కాదు. రచయితని ప్రోత్సహించాలనే కోరిక మరీ బలంగా ఉంటే, రచన మాసపత్రికలో “వసుంధర” దంపతులు చేస్తూన్నట్లు, ప్రచురణకి ముందు కథ చదివి, అందులో లోపాలని ఎత్తి చూపి, తిరగ రాయమని సలహా ఇవ్వ వచ్చు. ఇన్ని అంచెలు దాటుకొచ్చినా ప్రచురణార్హతని నిర్ణయించే అంతిమ హక్కు పత్రికా సంపాదకుడిదే. ఇందులో సందేహం లేదు. ఇదే విధంగా రచనాంశం (content) ని స్వయంప్రపత్తితో, రచయితతో సంప్రదించకుండా మార్చే హక్కు ఏ సంపాదకుడికీ లేదు. రచయిత, సంపాదక వర్గమూ పరస్పరమైన గౌరవభావంతో ఉన్నంత కాలమూ ఈ వ్యవహారం సజావుగా సాగుతుంది. పూర్వంలా రచయితలు సంపాదక వర్గపు ఇష్టాఇష్టాలకు పరిపూర్ణంగా బందీలు కారు; అంతర్జాలం ధర్మమా అని.
    -వేమూరి వేంకటేశ్వరరావు

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి mOhana గారి అభిప్రాయం:

    01/05/2009 10:03 am

    నేను ఇంకా వ్యాసాన్ని సంపూర్ణముగా చదవలేదు. కాని ఈ వట్టి – పట్టి గురించి ఒక రెండు మాటలు. పట్టి తమిళ పదము మాత్రమే కాదు, తెలుగు పదం కూడా, పట్టి అంటే బిడ్డ అని అర్థము. పట్టి గొడ్డు అంటే చిన్న గొడ్డు అని కూడా అనుకోవచ్చు. ప అక్షరానికి వ అక్షరానికి యతి చెల్లుతుంది ఎప్పుడూ! త్యాగరాజు మంచి తెలుగు కవి కూడా, యక్షగానాలను రాశారు. పద్యాలను ఎన్నో రాశారు. ఇక పోతే ప అక్షరానికి వ అక్షరానికి తెలుగు వ్రాతలో సరిగా కొమ్మును కలపక పోతే సందేహం కలగవచ్చు. కానీ తమిళంలో వ-కారానికి, ప-కారానికి ఇలాటి సందేహం లేదు. త్యాగరాజుగారి శిష్యులు కీర్తనలను ఏ భాషలో రాసుకొన్నారో అనే విషయం నాకు తెలీదు.

    విధేయుడు – మోహన

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    01/05/2009 9:20 am

    త్యాగ రాజ స్వామి వారి ‘ఎటుల బ్రోతువో తెలియ’ మొదటి చరణం లో ఉన్నది ‘పట్టి గొడ్డు’ కానీ ‘వట్టి గొడ్డు’ కాదనేందుకు నేనెన్నుకున్న ప్రామాణికాలు రెండు:

    1) కన్నడంలో వచ్చిన ‘కీర్తన దర్పణ’ -సంపుటి 1 లో 100వ పేజీలో ‘పట్టి గొడ్డు’ అనే ఉంది. (సంగీతానికి ఎల్లలు లేవు)

    2) యతి ప్రాసల నియమం బట్టి చూసినా చరణంలో ప్రతి పాదంలోనూ 13 అక్షరాలున్నాయి, 7వ అక్షరం మీద యతి ఉంది. ప-భ, పు-పొ, దు-దు. మొదటి పాదంలో ప్రథమాక్షరం వకారమయితే , 7వది భకారం కాలేదు కదా.

    డా. తాతిరాజు వేణుగోపాల్

  5. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana గారి అభిప్రాయం:

    01/05/2009 5:56 am

    మళ్ళీ ఈ చిత్రాన్ని చూడడానికి ఈ మంచి వ్యాసం ఒక
    అవకాశం కలిగించింది. చిత్రంలో ఎక్కడా హరిహర్
    పేరు వినబడలేదు. కాని Satyajit Ray – The Inner Eye
    పుస్తకంలో అపూ ట్రిలజీ ప్రకరణంలో, అందులో ఇచ్చిన
    ఛాయాచిత్రాలలో హరిహర్ అనే రాయబడింది, హరిహరన్
    అని కాదు. విధేయుడు – మోహన

  6. రచయితలకు సూచనలు గురించి Babu RVB గారి అభిప్రాయం:

    01/04/2009 8:18 am

    ‘ఈమాట’ ప్రచురణ కర్తలకు శుభాభివందనములు. దండాలండీ .

    ఒకమాట. తెలుగు లోని ‘అచ్చ తెలుగు’ క్రమంగా కనుమరుగమతోంది. అవును సంస్కృతం, ఆంగ్లం ఇవన్నీ తెలుగు భాషకు వన్నెతెచ్చి మెరుగులు దిద్ది ఉండవచ్చు. పదజాలాన్ని పెంచి యుండవచ్చు తద్వారా తెలుగును మరింత ఆధునిక భాషగా రూపొందిచి ఉండవచ్చు. ఐతే తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చిన ఈ సందర్భంలో మనం అంతా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. అదే తెలుగు లోని ‘తెలుగు’ను కాపాడుకోవడం. నిజం. ఎన్నెన్ని అచ్చతెలుగు పదాలు మన కళ్ళ ముందే అదృశ్యం కావటం… సారీ… కనుమరుగు అవ్వడం లేదూ?

    తెలుగంటే సంస్కృతం కాదు, అరవం కాదు ఆంగ్లం కాదు. తెలుగంటే తెలుగే కదా! మెరుగులు మెరుగులుగానే ఉండాలిగాని ‘అసలు’ను మరుగుపరచేదిగా ఉండకూడదుకదా!

    ఉదాహరణకు మన ఈ ‘ఈ మాట’ సయిట్‌లోనే ఈ క్రింది మార్పులు చేయుచ్చుకదా.

    ఎలాగంటే, సెర్చ్ అంటే ‘శోధన’ బదులూ ‘వెతకండి’ అనీ అడ్వాస్డ్‌ సెర్చ్ ‘మరింత వెదకండి’ అనీ .

    అలానే హోంపేజ్‌ ‘ముఖపత్రము’ కాకుండా ‘మా ముంగిలి’ కావచ్చు కదా . అలాగనే ‘పాఠకుల అభిప్రాయాలు’ మారి ‘మీ యడద’ కావచ్చేమో.

    చివరిగా ఈ కింది పదాలను ఎన్నాళ్ల క్రితం వాడి ఉంటారూ? ‘సముద్రము’ బదులుగా ‘కడలి’ అనీ ‘మనసు’ కాకుండా ‘మది’ అనీ ‘హృదయము’ బదులూ ‘గుండియ’ అనీ .

    ఇంకా ఎన్నో! ప్రారంభిద్దాం, ‘సారీ’, మొదలెడదాం! తెలుగును రక్షించు కుందాం! సరేనా?

    బై. వీడుకోలు.

    [గమనిక: మీ అభిప్రాయాలు తెలియపర్చడానికి, దయచేసి నాన్-యూనికోడ్ ఫాంట్లు (హేమలత, ఈనాడు, శ్రీ900 వగైరా) వాడకండి. RTS లేదా యూనికోడ్ వాడితే, లేదా నేరుగా మా అభిప్రాయాల పెట్టెలోనే టైపు చేస్తే ప్రచురణకు సులభంగా వుంటుంది – సం.]

  7. కొండ నుంచి కడలి దాకా గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    01/04/2009 6:02 am

    శ్రీనివాస్-గారు,
    మీరన్నట్లు, సమస్య “కాపీరైట్ల”తోనే. హక్కులు ఖచ్చితంగా అకాశవాణి వారివే! వాళ్ళు బయటకు తేరు, ప్రసారం చేయరు, నాకు కానీ ఈమాట సంపాదకవర్గానికి కానీ యెలాంటి commerical motives లేవు, కాబట్టి తప్పుకాదేమో. ఇది కొంచెం గ్రే ఏరియానే అయినా అప్పుడప్పుడు ఇలా కొంచెం తెగించి/సాహసించి … అందువల్ల, నేను కానీ, ఈమాట వారు కానీ డౌన్‌లోడ్ సదుపాయం కలిగించలేరు, అనుమతి ఇవ్వలేరు. (నెట్‌లో stream అవుతున్న శబ్దతరంగాల్ని grab చేసే ప్రోగ్రాములున్నాయని విన్నాను. వాడటం తప్పేమో. నేను ప్రోత్సహించను గానీ ఇది ఎవరికివారు నిర్ణయించుకోవాల్సిన విషయం.)

    — శ్రీనివాస్

  8. నా రామాయణం గురించి vamshi గారి అభిప్రాయం:

    01/04/2009 1:28 am

    చాలా బావుంది….. కానీ, వేల మంది రాముళ్ళా …అదెంటి…

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    01/03/2009 11:53 pm

    చంద్ర మోహన్ గారూ,
    మీ అభినందనలకి కృతజ్ఞతలు!
    మీరు చెప్పింది చక్రవాక రాగంలో ఎటుల బ్రోతువో తెలియ ఏకాంత రామా అన్న కృతి చరణం లోది. పరికించి చూడండి వట్టి గొడ్డు అన్న అర్థం సరిగ్గా సరిపోతుంది. వట్టి గొడ్డు అన్న పదం తెలుగులో వాడుకలోదే! “వట్టి” అంటే నిరుపయోగమైనదనే అర్థంలో వాడుతాం. ఒక్క సారి కీర్తన చూడండి.

    వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితిపుట్టు లోభులను పొట్టకై పొగడితి
    దుష్టులతో గూడి దుష్కృత్యముల సల్పి
    రట్టు జేసిన త్యాగరాజుని దయతో (ఎ)

    ఇక్కడ పట్టి కంటే వట్టి యన్నదే సరైన అర్థాన్ని చక్కగా చూపిస్తుంది. వట్టి కాదూ, పట్టి అంటారా? మీరు చెప్పినట్లుగా ఇక్కడ “అనాధ పశువు” అంతగా నప్పలేదని నాకనిపిస్తోంది. అదీ కాక మూల ప్రతిలో ఏముందో తెలీదు. కాబట్టి అక్కడున్నది “వట్టి” యా లేక “పట్టి” యా అన్నది తేల్చడం కష్టం. ఇలాంటి అనుమానాస్పద సందర్భాల్లో అర్థాన్ని అనుసరించి చూడాలి.
    త్యాగరాజు కృతులన్నీ ఆయన శిష్యులే నిక్షిప్తం చేసారు. వారందరికీ తెలుగొచ్చినా, మాతృభాష తమిళమే ! కాబట్టి ని గా అనుకునే అవకాశముంది. అలాగే వారందరికీ తెలుగు వ్యవహారికం అంతగా తెలియకపోవచ్చు కూడా.
    ఈ వట్టి ఎద్దు అన్న పద ప్రయోగం తోడి రాగంలోని “ప్రొద్దు పొయ్యెను శ్రీరాముని పూని భజింపవే మనసా” అన్న కృతిలోనూ కనిపిస్తుంది.

    ప్రొద్దున లేచి త్రి-తాపములను నరుల
    పొగడి పొగడి కొన్నాళ్ళు పట్టి-
    యెద్దు రీతి కన్న తావున భుజియించి
    ఏమి తెలియక కొన్నాళ్ళు
    ముద్దుగ తోచు భవ సాగరమున
    మునిగి తేలుచు కొన్నాళ్ళు
    పద్దు మాలిన పామర జనులతో వెర్రి
    పలుకులాడుచు కొన్నాళ్ళు ఓ మనసా

    “వట్టి” అన్నట్లుగా తెలుగు వాళ్ళు మార్చలేదనే నా అభిప్రాయం. ఇది కాక మీ ఎరికలో ఉన్న ఖచ్చితమైన తమిళ పదాన్ని( అది తెలుగులో ఉండకూడదు ) చూపించండి, నేను చెప్పింది ఉపసం హరించుకుంటాను. సరిదిద్దడానికి నాకభ్యంతరం లేదు.

    నాకు తమిళం రాదు. ఒకవేళ ఒకటీ అరా పదాలు వాడినా, అవి ఉర్దూ పదాల గురించి ప్రస్తావించినట్లుగానే ఉంటాయి. నూటికి ఎనభై శాతం తెలుగులోనూ, మిగతావి సంస్కృతంలోనూ ఉన్నాయి. ఈ వ్యాసం కోసం త్యాగరాజ కృతులు చాలానే సేకరించాను. అన్నీ కూలకషంగానే చదివాను. అనుమానాలొచ్చినప్పుడు సంగీతజ్ఞుల్ని సంప్రదించాను. మీరు చెప్పినట్లుగా వారెవరూ చెప్పలేదు.

  10. కొండ నుంచి కడలి దాకా గురించి Nandula Srinivas గారి అభిప్రాయం:

    01/03/2009 9:09 am

    Srinivas

    Dhanyavadamulu for introducing this rare masterpiece to us. Wishing that you will showcase many more such gems to Telugu lovers

    Nandula Srinivas

« 1 ... 1292 1293 1294 1295 1296 ... 1580 »