Comment navigation


15798

« 1 ... 1288 1289 1290 1291 1292 ... 1580 »

  1. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి రవి గారి అభిప్రాయం:

    01/12/2009 3:16 am

    జున్ను తింటున్నట్లుగా ఉంది ఈ వ్యాసం చదువుతుంటే. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టారు.

    “అరి జూచున్ హరిజూచు జూచుకములందంద మందారమాలా..” ఈ పద్యం ఉత్తర హరివంశం లోనిదేనా? పోతన భాగవతం పీఠికలో ఓ చోట ఈ పద్యస్ఫూర్తితో పోతన “పరు జూచున్ వరు జూచు..” అన్న పద్యం రాశాడనీ, అయితే మొదటి పద్యానికంటేనూ రెండవ పద్యం భావస్ఫోరకమైనదని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న గుర్తు.

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి rama గారి అభిప్రాయం:

    01/11/2009 6:19 am

    క్రిష్నమోహన్ గారూ !

    అనవసరమైన sarcasm విమర్శ పరిధిని సంకుచితం చేస్తుంది. అది నాగరిక లక్షణం కాలేదు. బ్రహ్మానందం గారి వ్యాసం మీద మీ వెక్కిరింతలో అభిరుచి లోపించింది. మనకన్నా భిన్నమైన దృష్టికోణం ఉండటంలో ఎదుటివారి విషయంలో అంత అసహనమా !!

    బ్రహ్మానందం గారి నించి మీరాశించిన మరిన్ని విషయాలని రాయమని మీరు కోరవచ్చు, అందులో తప్పులేదు. లేదా ఆయన రాసేదాకా మీరు కాస్త ఆగి చూడొచ్చు. అదీకాదూ బ్రహ్మానందం గారు రాయని విషయాల మీద వేరే
    మరెవ్వరైనా రాయొచ్చు. అంతేగాని ఆయన రాసిన విషయాలు పస లేనివన్నట్టుగా మీరు వ్యంగ్యాలు రాస్తే అది మరి మీరే చెప్పుకున్న ట్టుగా మీ విద్యార్హతనే సూచిస్తోంది.

    అసలు త్యాగరాజు గురించి మనకి ఏపాటి తెలుసు గనక? నా వరకు నాకు త్యాగయ్య గారి వ్యక్తిత్వ విశేషాలని తెలుసుకోగల్గటం ఆసక్తిదాయకమే ! ఇది ఒక అదనపు సమాచారమే ! త్యాగయ్య సంగీతం ఎంత ముఖ్యమో త్యాగయ్య వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యం కాదా?? ఆ రెంటికీ ఏమైనా అవినాభావ సంబంధం ఉందేమో అన్న కుతూహలమే మీకు కలగలేదే ? ఆశ్చర్యం !

    రమ.

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    01/10/2009 10:57 pm

    చివుకుల కృష్ణ మోహన్ అని పేరుండాలి. పొరపాటున చంద్ర మోహన్ గా రాసాను. క్షమించాలి.

  4. కొండ నుంచి కడలి దాకా గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:

    01/10/2009 10:54 pm

    “కృష్ణశ్రీ”గారి సంపాదకత్వంలో 1956లో ప్రచురితమైన “పల్లెపదాలు” నుంచి

    114. ఐలేసా
    ఏలియాలా ఏలియాలా
    ఏలియాలా ఏలియాలా
    ఐలేసా జోరు సెయ్యి
    ఐలేసా జోరు సెయ్యి

    అయిలపట్టు ఐలేసా, బల్లకట్టు ఐలేసా
    అద్దిరబాబు ఐలేసా, అక్కడ పట్టు ఐలేసా
    సాపసుట్టి ఐలేసా, సంకనెట్టి ఐలేసా
    సందమామ ఐలేసా, అందముగా ఐలేసా
    ఐలేసా జోరుసెయ్యి, ఐలేసా బారుసెయ్యి
    సన్నజాజి ఐలేసా, సీరకట్టి ఐలేసా
    పొన్నపూలు ఐలేసా, అహ కొప్పునెట్టి ఐలేసా
    సిన్నదొచ్చి ఐలేసా, కన్నుగీటె ఐలేసా

    వేదము వేంకటరాయ శాస్త్రి గారుజోర్శెయ్ బార్శెయి” అన్న పాదాంత పదాలతో కొన్ని పడవ పాటలు రచించినారు. వానిలో సొగసుకత్తె ప్రశంస లేదు.

    వేదమువారి పడవ పాటలు ఎవరివద్దనన్నా ఉంటే తెలుప ప్రార్థన.

    శాయి.

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    01/10/2009 8:36 pm

    చివుకుల చంద్ర మోహన్ గారూ,

    మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను కానీ అంగీకరించలేను.

    ఖచ్చితంగా చెప్పలేని చరిత్రని ఆపోశన పట్టడానికి మీకున్న సర్వశక్తులనూ వినియోగించడం దేనికని? అని మీరన్నారు.
    “తెలుగు సాహిత్యం లో రాజుల జీవిత చరిత్రలకీ, రాజుల గొప్పతనాల్ని చాటి చెప్పే కథలకీ ఇచ్చిన ప్రాముఖ్యత కవుల జీవిత చరిత్రకి లేదు. కవులు రాసిన కావ్యాలకే ప్రాముఖ్యత ఇచ్చారు కానీ కవెలా జీవించాడన్నది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. లిఖిత పూర్వకంగా చాలామంది కవులూ రాసుకోలేదు. మిగత కవులూ రాయలేదు. అందువల్ల సాహితీకారుల చరిత్రలకి ప్రస్తుతమున్న సాహిత్య గ్రంధాలూ, రాజుల జీవిత చరిత్రలే ప్రమాణికంగా తయారయ్యాయి. మధ్యలో కల్పితాలూ విరివిగా కనిపిస్తాయి. కట్టుకథల ఉక్కుపాదాల క్రింద వాస్తావాలు అతి సులభంగా నలిగిపోతాయి” అంటూ సమగ్రాంధ్ర చరిత్రలో ఆరుద్రగారు వాపోయారు.

    మీలాగే నేనూ త్యాగరాజు అభిమానిని. ఆయన తన జీవిత చరిత్ర రాసుకోలేదు. బ్రిటీషు వాళ్ళు ఎక్కించిన చరిత్రలో ఇలాంటి విషయాలు ఎంతుంటాయో అందరికీ తెలుసున్నదే! ఇహ ఆయన శిష్యులు రాసిన జీవిత చరిత్రలే మనకాధారం. ఏ మాత్రం దాపరికం లేకుండా ఏ పుస్తకాల్లో ఎలా రాసారో చెప్పాను.

    త్యాగరాజు జీవితంలో జరిగిన సంఘటనా క్రమంలోనే వ్యాసం మొత్తమూవుంది. త్యాగరాజుకి రెండు సార్లు రాజాస్థానం నుండి పిలుపొచ్చిందని చెప్పాను. మొదటి సారి పాతికేళ్ళ వయసప్పుడూ, రెండో సారి సుమారు 35 ఏళ్ళ వయసప్పుడూ. తంజావూరుని పరిపాలించిన రాజుల కాలాలూ, వారి పేర్లతో సహా చెప్పాను. ఇది చారిత్రిక ఆధారంగానే ఇది చెప్పాననుకుంటున్నాను. ఈ విషయం రెండో భాగంలో వుంది. కాకపోతే మీరాశించినట్లుగా ఖచ్చితమైన తేదీలూ, గంటలూ లేవు. శిలాశాసనాలు లేవు.

    అలాగే ఇల్లు వేరుపడడం సంఘటనా ఎప్పుడు జరిగిందో చెప్పాను. దానికి తంజావూరు 1802 మెజిస్ట్రేట్ దగ్గర పత్రాల సంగతి చెప్పాను. అలాగే వివిధ రచయితలూ ఎలా తప్పుగా భావించారో చెప్పాను. అలాగే త్యాగరాజు రెండో భార్య కమలాంబ ఆయన 44వ ఏటే పోయిందనీ సూచించాను. ఇవి కాదూ, నాకు తాళ పత్ర గ్రంధాలూ, శిలాశాసనాలే చారిత్రిక ఆధారం అంటారా, దానికి నమస్కరించడం తప్ప, నేనేమీ చెయ్యలేను.

    ఎక్కడో ఓ సందర్భంలో చెప్పిన ఓ వాక్యాన్ని తీసుకొని దాన్ని వ్యాసం మొత్తమూ పులమడం భావ్యం కాదు. అంతటా అదే అర్థాన్ని తీసుకోడం న్యాయం కాదు. అనుమానం వచ్చినప్పుడు అనుమానంగానే చెప్పాను. అలాగే అదెందుకొచ్చిందో చెప్పాను. వాయుగుండం వస్తోందీ, అది విశాఖ తీరాన్ని తాకచ్చని శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెబితే, ఆ వాయుగుండం కాస్తా బుద్ధి మార్చుకోని వేరే దారినెళితే వాతావరణ కేంద్రానిదే తప్పనడం అతి సులువైన పని. అక్కడ ప్రకటనలు హెచ్చరికలు. హెచ్చరికలకి వాస్తవాన్ని ముడివేస్తే నవ్వుకోడానికి బాగానే ఉంటుంది.

    ఈ వ్యాసం ద్వారా త్యాగరాజు సంగీతం సృజన పై పాఠకుల అభిప్రాయం మార్చడం నా వుద్దేశ్యం కాదు. సరితూచలేని ప్రతిభ ఆయనది. అలాగే ఈ వ్యాస రూపంలో సంగీత ప్రియుల మనసు మార్చేద్దామన్న బృహత్తర ప్రణాలిక్కూడా నాకేం లేదు.

    ఆ మధ్య రామదాసూ, అన్నమయ్య సినిమాలొచ్చాయి. చరిత్ర, శోధనా పక్కనబడేసి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కల్పించి రాసేసారు. అడిగే నాధుడులేడు. త్యాగరాజు చరిత్రా అలాగే తయారయ్యింది. అందరికీ ఆయన గురించి సవివరంగా చెప్పాలన్న తపనే తప్ప, ఎదో పీ హెచ్ డీ పరిశోధనగా నేను భావించడం లేదు. వీలయితే ఆరుద్ర గారి సమగ్రాంధ్ర చరిత్ర చదవండి. కవుల కాలాల గురించీ, జీవితాల గురించీ చెప్పడానికి ఆయనకీ కొన్ని సార్లు పుస్తకాలే ఆధారమయ్యాయి.

    వున్నంతలో, నాకున్న పరిధిలో ఆధారాలు చూపించాను. అవి చాలవనే పెద్దలకి నమస్కరించడం ఒకటే నాకున్న మార్గం.
    త్యాగరాజుకి కాస్త కోపం జాస్తనీ, ఆయన దగ్గర కొంతమంది శిష్యులిమడ లేకపోయారన్నది లిఖిత పూర్వకమైన వాస్తవం. కోప ప్రకటననేది ఒక వ్యక్తి గుణం. దానికీ, వారి సంగీత ప్రతిభకీ, అనుసరించిన ధర్మానికీ, నమ్మిన సిద్ధాంతాలకీ ముడి వేయకూడదు. మనక్కావల్సింది సంగీతం కానీ త్యాగరాజు ఎలా వస్త్రధారణ చేస్తే మనకేవిటి అనచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా అభిమానులు ఆయన వేషాన్నెలా మార్చారన్నది తెలియ చెప్పడమే నా వుద్దేశ్యం. గాంధీ గురించి తెలుసుకోవాలంటే ఆయన సిద్ధాంతాల గురించే కాదు, ఆయన వస్త్ర ధారణ గురించీ, ఆయన అలవాట్ల గురించీ ప్రస్తావన వచ్చి తీరుతుంది. అవి చదివినంత మాత్రాన గాంధీ పై నున్న అభిప్రాయం మారుతుందని నేనకోను. లేదని ఖండిస్తే నేనేమీ చెయ్యలేను.

    అతి పిన్న వయసులో అసమాన సంగీత ప్రతిభ కలిగీ, కర్ణాటక సంగీతాన్ని ఒక మలుపు తిప్పిన ఓ మహా వ్యక్తి జీవిత చరిత్ర గురించి రాయడమే నా ఉద్దేశ్యం. కొత్త విషయాలు తెలిసి ఆనందించామంటే మంచిదే! నేనూ సంతోషిస్తాను. లేదూ మాకన్నీ తెలుసు నువ్వేమిటి చెప్పడమంటారా, నా అజ్ఞానాన్ని మన్నించండని వేడుకోడం తప్ప ఏం చెయ్యలేను.
    మీ సలహా మేరకు ఏ ఏ సంవత్సరాల్లో ఏ ఏ ప్రముఖ సంఘటనలు జరిగాయో చివర్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  6. జనరంజని: మహానటి సావిత్రి గురించి rohin kumar గారి అభిప్రాయం:

    01/10/2009 12:49 pm

    అద్బుతం ఈ ప్రొగ్రామ్. సావిత్రి గారి స్వరం వినడం ఎంతొ ఆనందంగా ఉంది. చాలా థాంక్స్.

  7. కొండ నుంచి కడలి దాకా గురించి Dr.Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    01/10/2009 11:40 am

    ‘ఉప్పొంగిపోయింది గోదావరి- ఆ పాత మధుర గీతం, రూపకం :
    మీరు వినిపించిన రూపకం వింటుంటే బాల్యంలో మా అద్దింట్లో వాకిట్లో ‘ఫ్రీ’గా కురుస్తున్న వెన్నెల్లో పరీక్షలయ్యాక పట్టని నిద్ర వల్ల రేడియో వింటున్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.

    రూపకం చివర్లో శ్రీరంగం గోపాలరత్నం శ్రావ్య కంఠం ఆహా!

    అన్నట్టు ‘జోర్ సెయ్ ‘ని ‘సిరి సిరి మువ్వ’ సిన్మాలోని ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ పాట లోనూ వినవచ్చు. అంతెందుకూ, దేవులపల్లి వారి లలిత గీతం ‘ఎయ్ రా ఏసెయ్ రా గడ’ లో ‘జోరు సెయ్ బారు సెయ్ / కోరంగి రేవుకీ, కోటిపల్లి రేవుకీ (క)వినిపిస్తుంది. —-తాతిరాజు వేణుగోపాల్

  8. కొండ నుంచి కడలి దాకా గురించి రాఘవ గారి అభిప్రాయం:

    01/10/2009 1:53 am

    మా గోదారమ్మతల్లి గురించి ఈ రూపకం వింటున్నంత సేపూ నా కళ్లు రెండు గోదారి పాయలయ్యాయి. అహో… సంగీతం అద్భుతం. నడిపిన విధానం అద్భుతం. ఆద్యంతం అత్యద్భుతం.

  9. ఈమాట గురించి గురించి సాయిరామ్ రాజు గారి అభిప్రాయం:

    01/09/2009 11:50 pm

    ఏమాటకామాటే చెప్పుకొవాలి. ఈమాట నిజంగా చాలా బాగుంది. మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈమాటలో మన మాటలు కలుపుకోవచ్చు.. మంచిచెడులు చెప్పుకోవచ్చు.

  10. ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి B.Ajay Prasad గారి అభిప్రాయం:

    01/09/2009 11:27 pm

    లక్ష్మన్నగారికి
    రాయ్ సినిమాల మీద మీరు రాస్తున్న వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. అలానే రోషమాన్ సినిమా మీద మీరు రాసిన వ్యాసం కూడా చాలా బాగుంది. వీటన్నిటిని పుస్తకరూపంలో తెస్తె మన తెలుగువారికి మరింత ప్రయోజనకరమంగా ఉంటుంది.
    అభినందనలతో
    బి.అజయ్ ప్రసాద్

« 1 ... 1288 1289 1290 1291 1292 ... 1580 »