Comment navigation


15798

« 1 ... 1287 1288 1289 1290 1291 ... 1580 »

  1. మేడ్‌ ఇన్‌ అమెరికా గురించి అళక్కి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    01/16/2009 12:45 am

    సమస్య ఒక పార్శ్వం కధ చక్కగా ఎత్తి చూపింది. దేశంలో పుట్టి పెరిగిన వారి కంటే, అమెరికాలో పుట్టి పెరిగిన యువకులు (యువతుల్ని కూడా కలుపుకుని) “నవీన” భావాలు కలిగి వుంటారని రచయిత చెప్పక చెప్పినట్టనిపించింది.

    మొదటిసారి చదువుతున్నప్పుడు, కధలో పాఠం చివరికొస్తున్నప్పటికీ, సమస్య సానుకూలమవక, మరింత జటిలమవుతూవుంటే, నేననుమానించిన ప్రకారంగానే కొసమెరుపుతో జిగేలుమంది. అభినందనలు.

    ముఖ్యోద్దేశ్యం. = ముఖ్యోద్దేశం కదా, సంపాదకులు గమనించ ప్రార్ధన.

    [తప్పు సరిదిద్దబడింది. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం. 1/16/2009]

  2. తరవాణి కేంద్రం గురించి నెటిజన్ గారి అభిప్రాయం:

    01/15/2009 4:52 am

    “మనిషి అంటే అనుభవాల సంపుటి. మనిషి అంటే జ్ఞాపకాల సంపుటి. ఈ రెండింటి సారమే బతుకు. ” – రమ
    Quotable Quote!

  3. తరవాణి కేంద్రం గురించి rama గారి అభిప్రాయం:

    01/14/2009 8:46 pm

    సావిత్రి గారూ !!

    ఉప్పల లక్ష్మణరావు గారి ఆత్మకథ “బతుకు పుస్తకం” లో ఆయన మాస్కో లో ఉన్న రోజుల్లో గోంగూర పచ్చడి తయారు చేసుకున్న పద్ధతిని ఆసక్తిగా వివరించింది గుర్తొచ్చింది మీ “తరవాణి” వ్యవహారం చదివాక.

    పాపం ఆయనకి అక్కడ గోంగూర దొరకదు. అక్కడ ఉన్న మిత్రులకి ఆయన ఈ తెలుగు వంటకం ఎలా చేసిచూపించేరన్నదే వివరిస్తారు. ఆ దేశంలో దొరికే ఒక రకమైన పుల్లటి ఆకుకూరతో ఆయన మన గోంగూర పచ్చడి అనుభవాన్ని సాధిస్తారు మొత్తానికి.

    దేశం మనలో ఉంటుంది. ప్రాంతం మనలో ఉంటుంది. ఎంతగా భాషలో ఒక ఒప్పుదలని మనం పాటించినా, యాస మన మాటలో ఎంతో కొంత కదలాడుతుంది. మనిషి అంటే అనుభవాల సంపుటి. మనిషి అంటే జ్ఞాపకాల సంపుటి. ఈ రెండింటి సారమే బతుకు. ఇవి చాలినంత లేనప్పుడు చీకటిలో తడుముకున్నట్టే ఉంటుంది. మీ “తరవాణి” కోసం ఆరాటం స్మృతుల కాంతితోవ కోసం ఆరాటమే !!

    రమ.

  4. బాలమురళీకృష్ణ సంగీతం గురించి taha taha గారి అభిప్రాయం:

    01/14/2009 12:00 pm

    ౧. కర్ణాటక సంగీతం లో సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత , భక్తి ని ప్రకటించే మార్గం దైన్యం ఒక్కటే కాదు అన్న విషయమూ ఈ రెండూ తెలియటం బాల మురళి సంగీతానికి ఆయువు .
    ౨. సుదీర్ఘ స్వర ప్రస్తారానతరం పల్లవి పాడి కీర్తన ముగించటం రికార్డుల్లో సైతం బాల మురళి తప్ప ఎవరైనా ఈ నలభై ఏళ్ళు గా చేసారా అన్నది ఎవరైనా చెప్పగలరా?
    మళ్ళీ కొంత రాస్తాను.

    రోహిణీ ప్రసాద్ గారి వ్యాసమూ దాని మీద చర్చ చాల బావున్నాయి నేను రోహిణి గారి సమకాలిన విద్యార్థిని ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో
    తహ తహ

  5. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి sathya గారి అభిప్రాయం:

    01/14/2009 5:51 am

    Nachana Somana is my favourite poet and you have done justice to the poet.The author must have read the debates between Rallapalli Anathakrishnasarma and Nadakuduti Veeraraju and many others on who is greater, Somana or Errana. Sri Rallapalli compared Somana to Kotha Aavakaya which gives taste only in the beginning.Still, all love Avakaya.
    The article is excellent
    Palanki Sathya

  6. తరవాణి కేంద్రం గురించి veda గారి అభిప్రాయం:

    01/13/2009 9:29 am

    చిన్న నాటి సంగతులు గుర్తు చేసారు. కృతజ్ఞతలు. తరవాణి అన్నంలో ఆవకాయ వేసుకుని ఎర్రగా కలుపుకుని తినేవాళ్ళం. రోజూ పొద్దుట బడికి వెళ్ళేముందు ఇదే తిని వెళ్ళేవాళ్ళం. ఇపుడు మా పిల్లలకి తరవాణి అంటే ఏంటో తెలియదు. చెప్పినా, నన్ను పల్లెటూరు దాన్ని అని అంటారు. ఆ రుచి వాళ్ళకి తెలియదు కదా! మంచి విషయాలు చెప్పారు.

  7. తరవాణి కేంద్రం గురించి నెటిజన్ గారి అభిప్రాయం:

    01/13/2009 7:03 am

    రోజు మిగిలిన ‘రసం’ ని ఒక కుండలో మూడు, నాలుగు రోజులపాటు చేర్చి తరువాత దాన్ని అన్నంలో కలుపుకుని తమిళ బ్రాహ్మలు తింటారు అని తెలిసినప్పుడు ఒకింత ఆశ్చర్యం వేసింది.

    ద్రవ పదార్ధం పేరు తెలియకుండా ఒక రోజు వారింట్లో భోజనం చేస్తున్నప్పుడు దాన్ని అస్వాదించడం జరిగిన తరువాత అది ఆ ‘రసం’ అని తెలిసినప్పుడు “నిజమా, బాగానే ఉందిగా”అని అనుకోక తప్పలేదు.

    అది వారి ‘తరవాణి’ నా? ఏమో, పేరు గుర్తులేదు.

    మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు భిక్ష ఇవ్వడం ఒక పద్దతి. కాని ఆ మిగిలిన అన్నాన్ని ఎండ బెట్టి, వేయించి, దానికి కొంచెం ఉప్పు కారం జల్లి తింటే రుచిగా ఉంటుందన్నది తెలంగాణ వెళ్ళినప్పుడు తెలిసింది.

    బహుశ అదేనేమో cultural preservation లేదా cultural evolution అంటే!

  8. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/13/2009 3:13 am

    రమగారికి రవిగారికి ధన్యవాదాలు.
    రమగారు,
    మీరు చెప్పిన “ముక్తాఫల” వ్యాఖ్యలో కొన్ని భాగాలు Digital Libraryలో ఉన్నాయి చూసాను. కాని కొన్ని చోట్ల తప్పులున్నాయి. అంచేత అది ఎంతవరకూ సాధికారికమైనదో తెలీదు. మీరన్న జయప్రభగారి కవిత నేను చదవలేదు. ఆ పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
    రవిగారు,
    మీరన్న ఆ రెండు పద్యాలు ఇవి:
    సోమనది:

    అరిజూచున్ హరిజూచు జూచుకములందందంద మందార కే
    సరమాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై
    తొరుగం, బయ్యెదకొం గొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
    దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్

    పోతనది:

    పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
    విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
    జరగన్ గన్నుల గెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహమున్
    సరసాలోక సమూహమున్ నెఱపుచున్ జంద్రాస్య హేలాగతిన్

    ఏది ఎక్కువ భావస్ఫోరకమూ అని చెప్పడం కష్టం (అనవసరం కూడా). దేని ప్రత్యేకత దానికుంది. సోమన పద్యంలోని ప్రత్యేకతంతా “చూచుకములందు మందార కేసరమాలా మకరందపు నీటి బొట్లు స్రవించడం”లో ఉంది. దాన్ని చిత్రించడంలో సోమన ఉద్దేశం ఏమిటన్నది పాఠకులెవరికి వారు ఊహించుకోవలసిందే.
    పోతన పద్యం చిత్రాన్ని స్పష్టంగా రూపుకడుతుంది. రోషము – రాగోదయమూ, అవిరత భ్రూకుటి – మందహాసము, కెంపు – సొంపు ఇలా వీర శృంగార రసాలు స్పష్టమైన జంటగా కనిపిస్తాయి. పైగా వాచ్యంగా కూడా కనిపిస్తాయి. సోమన పద్యంలో అది లీలగా మాత్రమే గోచరిస్తుంది. “సరసాలోక సమూహము” కన్నా “దరహాసామృతపూరము” నాకు అందంగా అనిపించింది. సోమన సత్యభామ పయ్యెదని ఒకింత తొలగించాడు, పోతన ఆ పని చెయ్యలేదు. ఈ ఒకింత తొలగిన పయ్యెదని కృష్ణుడా తర్వాత సరిజేస్తాడు. ఆ పద్యం వ్యాసంలో పేర్కొన్నాను. వ్యాసంలో చెప్పినట్టుగా, సోమన ఈ ఘట్టంలో శృంగార రసాన్నే ఎక్కువగా ధ్వనించాడు అని నాకనిపిస్తుంది. పోతన రెంటినీ సమానంగా పోషించాడు.
    సత్యభామ యుద్ధానికి లేచి నిలుచున్న తీరుని వర్ణించిన యీ పోతన పద్యం చక్కని చలనచిత్రాన్ని మన కళ్ళకి కట్టిస్తుంది.

    వేణిం జొల్లెము వెట్టి, సంఘటిత నీవీబంధయై, భూషణ
    శ్రేణిం దాల్చి, ముఖేందుమండల మరీచీజాలముల్ పర్వగా,
    బాణిం బయ్యెద జక్కగా దుఱిమి, శుంభద్వీర సంరంభ యై
    యేణీలోచన లేచి నిల్చె దన ప్రాణేశాగ్ర భాగంబునన్

    పోతన భాగవతంలో సత్యభామ కృష్ణుని యుద్ధానికి తీసుకువెళ్ళమని మురిపెంగా అడుగుతుంది. కృష్ణుడు ముందు వారించినా చివరికి తన మాట చెల్లించుకుంటుంది. అది యీ కథలో పోతన ప్రవేశపెట్టిన అందం.

  9. రాగలహరి: మోహనం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    01/12/2009 5:05 pm

    హరి గారూ:

    మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం.

    నాకు ఇప్పటకీ ‘శృతి’ ‘శ్రుతి’ ల మధ్య తేడా తెలియదు. నా ముఖ్యలక్ష్యం సంగీతం. పలికేటప్పుడు రెంటినీ ఒకేలా అంటాం కదా!

    వ్యాసం నచ్చినందుకు ఆనందంతో,

    లక్ష్మన్న

  10. రాగలహరి: మోహనం గురించి Pavan Kumar Hari గారి అభిప్రాయం:

    01/12/2009 3:39 am

    లక్ష్మన్న గారి కృషి ప్రశంసనీయము. చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. అయితే… ఒక్క విషయం మనవి చేస్తాను. ” శృతి ” అనే పదము ఇక్కడ వాడకూడదు. ” శ్రుతి ” అని నా అభిప్రాయము. ” చతుశ్శ్రుతి ఋషభము ” సరియైనదని నా అభిప్రాయము.

« 1 ... 1287 1288 1289 1290 1291 ... 1580 »