Comment navigation


15798

« 1 ... 1286 1287 1288 1289 1290 ... 1580 »

  1. రాగలహరి: మోహనం గురించి Pavan Kumar Hari గారి అభిప్రాయం:

    01/18/2009 9:39 am

    లక్ష్మన్న గారూ,
    కొంత మంది పండితుల అభిప్రాయసేకరణకు సమయం పట్టింది.
    సంస్కృతంలో ” శృతి ” అన్న పదం అసలు లేదు. ” శ్రుతి ” యే సరియైన పదము.
    “శృ” మరియు “శ్రు” – ఈ రెంటికీ ఉచ్చారణ ఒకే విధంగా ఉండదు.
    ఎందుకంటే “శృ” అనే అక్షరంలో ఒక హల్లు + ఒక అచ్చు ( శ్ + ఋ ) ఉన్నాయి. ఇది ” శ ” గుణింతములో వస్తుంది.
    కాని ” శ్రు ” లో రెండు హల్లులు, ఒక అచ్చు ఉన్నాయి ( శ్ + ర్ + ఉ ). ఇది సంయుక్తాక్షరము. కనుక దీని ఉచ్చారణ వేరు.
    మూలమైన ధాతువు ” శ్రు – శ్రవణే ” అనేది. అందులో కేవలం వర్తమాన కాలంలో ప్రయోగింపబడే రూపములు ” శృణోతి ” మొదలైన వాటిలో మాత్రమే “శృ” అనేది కనిపిస్తుంది. ఇదొక విలక్షణమైన రూపము.
    ” అమరకోశం ” లో కూడా దీనిని గురించి మంచి వివరణ ఇవ్వడం జరిగినది.
    కాబట్టి ” శ్రుతి ” అన్నదే సరియైనదని పండితుల అభిప్రాయము.
    నేనూ సంగీతాభిమానినే. ఈ విషయం ఎందుకు వ్రాశానంటే, సంగీతశాస్త్రం గురించి వ్రాసేటప్పుడు సంస్కృత వ్యాకరణశాస్త్రం కూడా ప్రధానమైనదే కదా.. అందుకని.
    అన్యథా భావించవలదని మనవి.

  2. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి అరుణ పప్పు గారి అభిప్రాయం:

    01/18/2009 3:06 am

    ‘ఈ శిల శిలేగాని,
    ….. అనురాగం తాగి మత్తెక్కి,
    మంచులో తడిసి
    వెన్నెట్లో మెరిసి
    లలితంగా స్థిర చిత్తలోలితంగా ఈ శిల!’
    స్త్రీ జీవితాన్ని అంతందంగా, అల్పాక్షరాలలో ఆవిష్కరించడం ఎవరికి సాధ్యం?
    ‘అనురాగదగ్థ సమాధి’ వంటి అద్భుతమైన కవితల్ని అందించిన విన్నకోట రేవతీదేవికి మీరన్నట్టు లౌకికంగా రావాల్సినంత పేరు రాలేదు.. కానీ రసహృదయులైన పాఠకుల మనో ప్రపంచంలో ఆవిడ దీపంలా వెలుగుతూనే ఉంటారు. ఆమె గురించి రాసినందుకు మీకు, ఈమాటకు ధన్యవాదాలు.

  3. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి taha taha గారి అభిప్రాయం:

    01/18/2009 1:45 am

    మనము పాఠాలు చెప్పే పద్ధతిలో, నేర్చుకునే పద్ధతిలోనూ కొడవళ్ళ హనుమంత రావు [కొహరా] గారి వ్యాస రచనా పధ్ధతిని అవలంబించాలి. అప్పుడు ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు మన సొంత ఆలోచన కొంతైనా ఉండే అవకాశం ఉంటుంది. నాకు క్రితం వారం దాకా ‘ఈమాట’ గురించి తెలియక పోవటం వల్ల నాకు చాలా నష్టం జరిగిందని అను కొంటున్నాను. చీనావాళ్ళు ఈ మధ్య కాలంలో ఆధునిక శాస్త్ర అధ్యయనంలో శాస్త్ర నిర్మాణ కౌశల్యాన్ని నేర్చుకుని, చూపిస్తున్నారు మనం ముఖ్యంగా మన బుద్ధిలేనితనం వల్ల ఈ విషయంలో చాలా అనాసక్తి చూపిస్తున్నాం కొహరా వ్యాసాల వంటివి తెలుగు లో పుంఖానుపుంఖాలుగా వచ్చి మన భావి తరాన్ని నిజమైన, నిర్మాణాత్మకమైన అధ్యయనం వైపు నడిపించాలని కోరుకుంటున్నాను

    కొహరా కు నా అభినందనా పూర్వక కృతజ్ఞతలు

  4. బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి సాయి బ్రహ్మానందం గారి అభిప్రాయం:

    01/17/2009 9:23 pm

    క్రితం ఏడాది అక్టోబర్ లో నాటక రంగ ప్రముఖ వ్యక్తి దుగ్గిరాల సోమేశ్వరరావు 77వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యూనివర్శిటీ ప్రాంగణంలో రావికొండల రావు స్వీయరచన దర్శకత్వంలో “బాంబు పేలింది” అని ఓ నాటకం వేస్తే నేను చూసాను. వయసు శరీరానికి కానీ మనసుకి కాదు అని నిరూపిస్తూ ఇరవై ఏళ్ళ వ్యక్తిలా ఎంతో ఉత్సాహంతో రావి కొండల రావూ, ఆయన సతీమణి రాధా కుమారీ నటించారు. ఇద్దరికీ నటనలో, ముఖ్యంగా హాస్యం పండించడంలో బ్రహ్మాండమైన టైమింగ్ వుంది. ఈ నాటకానికి పట్టుమని పది పుంజీల జనం కూడా లేరు. వచ్చిన వారిలో దాదాపు సగానికి పైగా దుగ్గిరాల వారి అభిమానంతో వచ్చిన వారే! ఇది చూసి పక్కనే ఉన్న నాటకరంగంలో మరో ప్రముఖ వ్యక్తి చాట్ల శ్రీరాములు గార్ని మొత్తం హైద్రబాదులో తెలుగు నాటకరంగానికి చెందిన కళాకారులెంత మందని అడిగితే, దాదాపు రెండు వేల పైగా ఉన్నారని చెప్పారు. అంతమంది ఉంటే అదేమిటి పట్టుమని పదిమంది కూడా లేరేమిటని అడిగితే, ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆ నవ్వులో నిరాశా, నిర్వేదం కనిపించాయి. ఆ ప్రాంగణంలో ఖాళీ కుర్చీల సంఖ్యే నాటక రంగంలో ఉన్న ఐకమత్యాన్ని చెప్పకనే చెప్పింది. హైద్రాబాదు నగరంలో ఉన్న రెండు వేలమంది కళాకారులూ రావాలని ఆశించక పోయినా, కనీసం అందులో పదో వంతుకూడా రాకపోవడం విచారించదగ్గ విషయం. నాటకం పూర్తయ్యాక నటీనటుల పరిచయ కార్యక్రమంలో పరిచయమక్కరలేని రావికొండల రావు గారికి ఓ నలుగురు అతి బలవంతమ్మీద తప్పట్లు కొట్టారు. ఈ తప్పట్ల శబ్దం పాత్రల సంఖ్య పెరిగే కొద్దీ క్షీణిస్తూ వచ్చింది. ఆఖరి నటుని పరిచయమొచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి వినిపించింది. అదీ ఆ సభకు విచ్చేసిన వారి గోలలో కలిసిపోయింది. ఇదీ నేటి నాటకరంగ పరిస్థితి. ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, అసలు కమిట్మెంట్ లేనిది నాటక రంగంవారికని ఇలాంటి సంఘటనలు మరింత బలపరుస్తాయి. ఈ విషయంపై నేను స్పందించి రాసిన వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చింది. చాట్ల వారు ఓ పది కాపీలు తెలుగు యూనివర్శిటీ ధియేటర్ ఆఫ్ ఆర్ట్స్ కి పంపానని చెప్పారు. ఇలాంటిదే జి.ఎల్.ఎన్. మూర్తిగారు ఇవాళ ఆంధ్రజ్యోతి లో రాసిన “మంచి నాటకం ఎక్కడ?” వ్యాసంలో రాసారు.

  5. తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    01/17/2009 9:08 am

    త్ర్యంబకము అన్న ప్రయోగమే సరి అయినది. సంస్కృత పదాలని తెలుగులో రాసేటప్పుడు వికృతి రూపాలు రాయచ్చు కదా అనిన్నీ, మూడేసి అక్షరాల దొంతరలు రాయటం ఇష్టం లేకనున్నూ త్రయంబకుడు అని కావాలనే రాసేను. ఇతర భాషలలోని మాటలని రాసేటప్పుడు ఈ రకం స్వతంత్రం తీసుకోవటంలో తప్పులేదనే అనుకుంటున్నాను. రష్యన్ మాటలని, ఫ్రెంచి మాటల్ని ఇంగ్లీషులో రాసేటప్పుడు తప్పని సరిగా స్పెల్లింగు మార్పులు జరిగినట్లే, కష్టమైన సంస్కృతం మాటలని తెలుగులో రాసేటప్పుడు కొంచెం స్వతంత్రించేను. పద్ధతి పాటించాలంటే త్ర్యంబకము అనే రాయాలి.

  6. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/17/2009 7:32 am

    ఈ ఉస్తాద్ ఎవరో తెలియదుగాని తమ ఘరానాల ‘రహస్యాలను’ సులువుగా ఇతరులతో పంచుకోని ధోరణి ఈ వార్తవల్ల మనకు తెలుస్తుంది.

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి JSN గారి అభిప్రాయం:

    01/16/2009 3:34 pm

    మీ వ్యాసం చాలా బాగుంది. త్యాగరాజు గురించి కొత్త విషయాలు తెలిసాయి.

    త్యాగరాజు శిష్యులు వారు స్వరపరిచిన కీర్తనల్ని గురువు గారి మరణాంతరం అయన పేరు మీదుగా ప్రచారం చేసారని అంటారు. నిజమేనా?

  8. నిరసన (గల్పిక) గురించి అళక్కి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    01/16/2009 8:56 am

    రాసి పదేళ్లయినా ఎంత చెదరని “సత్యం”? చరిత్ర పునరావృతమవుతూనే వుంది. ప్రభువుల అండదండలు లేకుండా, మదుపుదారుల ఆశలు ఆవిరయ్యేనా? మీరు ప్రస్తావించింది బాధ్యతారహిత బహిరంగ విధ్వంసం అయితే, ఈరోజు పట్ట పగలే దోపిడీ జరిగింది.

  9. తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 గురించి Pavan Kumar Hari గారి అభిప్రాయం:

    01/16/2009 4:21 am

    వేంకటేశ్వరరావు గారి వ్యాసం చాలా బాగుంది.. చక్కటి వ్యాసాన్ని వ్రాసినందులకు కృతజ్ఞతలు.
    ఒక్క చిన్న మనవి.
    శివుణ్ణి “త్ర్యంబకుడు” అంటారు కదా… త్ర్యంబకము కలవాడు త్ర్యంబకుడు…
    త్ర్యంబకము = త్రి + అంబకము, అంబకము అంటే కన్ను అని అర్థము (బాణం అని కూడా అర్థం ఉంది)… “త్రయంబకుడు” అన్న ప్రయోగం సరియైనది కాదేమోనని నా ఉద్దేశ్యం…

  10. కావలెను గురించి అళక్కి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    01/16/2009 1:20 am

    ఎంచుకున్న వ్యాస విషయం సార్వ జనీనమయింది. ఎదురు దెబ్బల బాధని వ్యంగం జోడించి వ్యక్తీకరించడం భేషైన ప్రక్రియే! కాని ఎక్కుపెట్టిన బాణాలే కొన్ని గురి తప్పినట్టనిపించింది. వ్యాసకర్త తనని తాను నిర్వాహకుని (ఉత్తమ పురుష లోనున్న వ్యాసంలో) గా పరిచయం చేసుకుని నిర్వాహకులమీదే వేసిన విసుర్లు నన్ను విస్మయానికి లోను చేసేయి. ఇంత సమస్యకి అద్దం పట్టిన వ్యాసకర్త “నివాసి” కాదు ప్రవాసి అని నా నమ్మకం. మరిన్ని జన రంజకమైన రచనలు చేస్తారని ఆశిస్తాను.

« 1 ... 1286 1287 1288 1289 1290 ... 1580 »