Comment navigation


15798

« 1 ... 1284 1285 1286 1287 1288 ... 1580 »

  1. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 5:42 am

    అరుణ గారికి,

    శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.

    రమ గారికి,

    మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.

    బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.

    జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.

    [2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.

  2. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి mOhana గారి అభిప్రాయం:

    01/26/2009 6:34 am

    రమగారూ, అందరూ బంగారమ్మలాటి కవయిత్రులను మరచిపోలేదు. నేను రాసిన జూలై నెల ఈమాటలోని వ్యాసంలో “ముగురమ్మలను” పేర్కొన్నాను. వారు విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని గారలు. వారి కవితలను కూడా ఉదహరించాను. బంగారమ్మ కవితలు శాయిగారి సైటులో కూడా ఉన్నవి.
    విధేయుడు – మోహన

  3. ఎంగిలాకులు గురించి యుగంధర్ గారి అభిప్రాయం:

    01/25/2009 7:56 am

    జిన్హే నాజ్ హై హింద్ పర్ .. వో కహాన్ హై?
    ప్యాసా సినిమాలో సాహిర్ లూఢియాన్వీ పద్యాన్ని తలపించారు!

  4. చంద్రుణ్ణి చూపించే వేలు గురించి రాకేశ్వర రావు గారి అభిప్రాయం:

    01/25/2009 7:52 am

    ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించినందుకు ధన్యవాదాలు. హైకూ గుఱించి తెలుసుకున్నాను.

    ఆఖరి పేరా చదువుతుండగా ఓశో వ్రాసిన “సౌందర్యత అంతర్మార్గంలో నుంది”, అన్న వ్యాసం గుర్తుకువచ్చింది.

    – రాకేశ్వర

  5. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama గారి అభిప్రాయం:

    01/25/2009 7:04 am

    వేలూరి గారూ !

    మీరు ఒప్పుకున్నారు, అందుకు సంతోషం. వెల్చేరు నారాయణరావు గారు..తెలుగు కవిత్వానికి సంబంధించి చెప్పుకోవలసిన పని చేసిన మాట నిజమే అయినా…ఆయన కృషి మాత్రమే సరిపోతుందని చెప్పగలమా?బంగారమ్మ గారు కవిత్వం రాసిన తరవాత మరి అర్ధశతాబ్దానికి ఒక విమర్శ వచ్చిందని చెప్పుకోవడం …విమర్శనా రంగానికి నామర్దా కాదా?అది తెలుగులొ మంచి విమర్శ ఏ కారణంగా గానీ లేదని చెప్పడమే కదా ఒకరకంగా!

    ఈ లెఖ్ఖన ఇవాళ కవితారంగంలో అనేక కల్పనా విన్యాసాలు , చతురతలు ప్రదర్శించిన కవయిత్రుల గురించి..వారి కవిత్వం లోని విశేషాంశాలు గురించి విపులంగా వివరించడానికి ఇంకో యాభయ్యేళ్ళు పట్టాలన్నమాట !! వారు జీవించి వుండగా ..వారి కల్పన గురించి పాక్షికంగానే తప్ప విశేషించి చెప్పటం ఏ విమర్శకులూ ఎందుకు చేయకూడదో ?! అపచారమా ? లేక అభద్రతా భావమా?? లేక ” ఈ ఆడాళ్ళ రాతల గురించి మనమెందుకు మాట్లాడాలిలే..అన్న తూష్ణీ భావమా? మీరయినా విశదీకరించ వచ్చునే?

    ఒక కృష్ణశాస్త్రి గురించి చర్చించిన మాదిరిగానే…ఒక శ్రీరంగం శ్రీనివాస రావుని గురించి మాట్లాడిన రీతి లోనే… తెలుగుకవితారంగం లోని స్త్రీలని గురించి అయితే మౌనమో..లేదా అస హనమో తప్ప ఒక్కరయినా వారి కవితల్లోని అందాలకి పరవశం తో మాట్లాడిన వారు లేకపోవడం వెనకవున్న కారణాలని ఆలోచించనవసరం లేదా? ప్రపంచం లోని వేరే ఏ చోటనయినా ఇటువంటి పరిస్థితి కన్పించదే? కవిత్వం విషయంలో స్త్రీల వ్యక్తీకరణల్లో ఉన్న భిన్నత్వం మీద పదుగురూ చర్చించడం మంచిదేమో?! పోయిన శిలాలోలిత విషయం లో ప్రదర్శించిన ఆద్రత … ఆతృత…ఉన్న శిలాలోలితల మీద చూపలేని సంశయానికి గల కారణాలేమిటో?

    రమ.

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal గారి అభిప్రాయం:

    01/24/2009 10:33 am

    జనవరి 8 న రమ గారు అన్నారు- ‘అన్నమయ్య కవులకే కవి, సంగీతం వినడానికి త్యాగరాజు’ అనీ. అందుకే కదా, ఒకరు ‘పద సంకీర్తనాఛార్యులు’, మరొకరు వాగ్గేయకారులు అనే గుర్తింపు పొందారూ. ఈ రెండూ (సాహిత్య సంగీతాలు) తెలుగు వాణి, మన తల్లి, మనకే ఇవ్వడం మన సుకృతం. అన్నమయ్య పదపుష్పాలకి సంగీత పరిమళం ఎమ్మెస్ కలిగిస్తే త్యాగయ్య స్వర మాలికలోని పదపుష్పాలకి సాహితీ సొబగులు మంగళంపల్లి వారు తీసుకొచ్చారు. అయినా త్యాగయ్య రత్నమైన ‘ఎందరో మహానుభావులు’ సాహిత్యపరంగా ఎంత గొప్పదీ! –తాతిరాజు వేణుగోపాల్

  7. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి సూర్యుడు గారి అభిప్రాయం:

    01/24/2009 8:19 am

    మీ వ్యాసం చాలా బాగుంది.

    ద మ్యాథమ్యాటికల్ సెంచురీ అని ఓ పుస్తకం లో హిల్బెర్ట్ కీలకోపన్యాసంలో ఇచ్చిన సమస్యలు గణిత శాస్త్ర అభివృద్ధికి ఎలా ఉపయోగపడ్డాయో బాగా వివరించారు, ఇక్కడ దాని లంకె :

    http://press.princeton.edu/chapters/i7789.html

    నమస్కారములతో,
    /సూర్యుడు 🙂

  8. పడవ మునుగుతోంది గురించి narendra గారి అభిప్రాయం:

    01/24/2009 2:25 am

    చాలా మంచి కథ చదివాను. ధన్యవాదాలు.

  9. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:

    01/24/2009 12:42 am

    చావలి బంగారమ్మగారి కవిత “నీడ“ను వారి కవితాసంకలనము “కాంచనవిపంచి“లో చదువగలరు.

    శాయి

  10. రచయితలు – ఎడిటర్లు గురించి zilebi గారి అభిప్రాయం:

    01/23/2009 9:30 pm

    వెంకటెశ్వర రావు గారు-

    వ్యాసం చాలా బాగున్నది.

    తారాస్థాయి పదం తారస్థాయి అని ఉండాలనుకుంటాను.

    జిలేబి.
    http://www.varudhini.tk

« 1 ... 1284 1285 1286 1287 1288 ... 1580 »