Comment navigation


15798

« 1 ... 1283 1284 1285 1286 1287 ... 1580 »

  1. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/28/2009 9:13 pm

    రవి కిరణ్ గారూ..

    తెలుగు కవిత్వం లో మరీ ముఖ్యంగా late80 ల్లో, అలాగే early 90 ల్లో స్త్రీలు అన్ని రకాల ప్రశ్నలూ అడిగేరు. అలా అడిగిన కారణానికి అనేక నిందలూ పడ్డారు. పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం వలన నాకు అర్ధమైందేమంటే ఇప్పటికీ ఎంత చదువుకున్నా ఆలోచనా విధానాల్లో ఏమంతగా తర్వాతి తరాల్లో సైతం పెద్ద మార్పులేమీ లేవని.

    ముందటి తరాల కన్నా అటు పిమ్మటి తరాలు భిన్న సిధ్ధాంతాల విషయంలో [కనీసం అభివృధ్ధి చెందిన దేశాల్లో ఐనా] మరింత సంయమనంతో ఉంటారనుకోవడం అత్యాశేనని శ్రీనివాస్ గారి గొంతు విన్నాక నాకు అర్ధమైంది. అయితే దాని వలన స్త్రీల కవితా సంపదకి వచ్చిన లోటు ఏమీ లేదు. ఎప్పుడైతే తమ కన్నా మంచి వ్యక్తీకరణ ఆడవాళ్ళు చేస్తున్నారని అన్పించినప్పుడల్లా వారి విషయంలో అయితే మౌనం పాటించడమో లేదా వారి రచనల మీద కాకపోతే ఆ రాసిన వారి మీద బురద చల్లడమో అన్ని కాలాల్లోనూ చేసారని మనం గమనించవచ్చు. అందువల్ల శ్రీశ్రీ, బంగారమ్మ గారి కవిత్వం గురించి మాట్లాడివుం టే ఆశ్చర్యపోవాలి గానీ లేకుంటే కాదు.

    scandals మీదకి దృష్టిని మళ్ళించడం తేలిక కదా? మార్పు శాశ్వతం గానీ. ఏ కాలంలోనైనా నీతి శాశ్వతం కాదు. కవితా విశ్లేషణ ఒక శ్రీశ్రీ కవిత్వంకి జరిగినట్టో ఒక కృష్ణశాస్త్రికీ, ఒక నండూరి ఎంకిపాటలకీ జరిగినట్టో, ఇప్పటికీ కవయిత్రుల కవిత్వం గురించి మరింత విస్తృతంగా ఇంకా జరగడం లేదేమని నేను ప్రశ్నించాను. బంగారమ్మ గారు కవిత్వం రాసి ఒక 60 ఏళ్ళు దాటాయా? చర్చఎక్కడన్నా మీరు చది వారా ఆమె కవిత్వం మీద? ఆధునిక కాలంలో సైతం కవయిత్రుల కవిత్వం మీద ఆరోపణలు చేసినంత జోరుగా వారి కవితావిశేషాల మీద చర్చని చేయలేదే? వారి కవిత్వం వచ్చి కూడా రెండు దశాబ్దాలు దాటిందే?? ఈ జాప్యం సమర్ధనీయమా? వాంఛనీయమా అన్నది నా ప్రశ్న. నా ప్రశ్నని పక్కదారి పట్టించ వద్దని నా మనవి.

    రమ.

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Malika గారి అభిప్రాయం:

    01/28/2009 3:47 pm

    నాకు కూడా సంగీతం కాని, సాహిత్యం గురించి కాని ఎమి తెలియదు. Comment చెయడానికి అర్హత లెదు అనుకుంటాను ఎప్పుడు, కాని మీ వ్యాసం చాలా intresting గా ఉంది. త్యాగరాజు గురించి ఇంకా తెలుసుకొవాలని అనిపించెలా చెసారు.
    Thanks

  3. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    01/28/2009 9:22 am

    హనుమంత రావు గారు,

    “అలాటి జీవితవే గడిపిన మగవాళ్ళ రచనలకి కూడా అదే గతి పట్టిందా?” అని మీరు ప్రత్యేకంగా ప్రశ్నించనవసరం లేదండి. ఎలాంటి జీవితం గడిపినా మనల్ని మన జీవితం గురించి ప్రశ్నించే వాళ్ళు అంతగా వుండరు, వున్నా దాన్ని చాలా సులభంగా సమర్ధించుకోడానికి మనకు సవాలక్ష వాదాలు మన ప్రక్కనే వున్నాయి కదా. మనకొకటుంది కాబట్టి మరి మనం ఇక దేన్ని గురించి సందేహ పడాల్సిన అవసరం లేదు.

    రమ గారు,

    బతుకు పరిధిలో మరెక్కడాలేని గుర్తింపు వొక్క కవితా లోకంలోనె కావాలనుకోవడం అత్యాశేవో కదా. జీవితంలో మరే కోణంలోనూ పోట్లాడినా చానా సార్లు దొరకని గుర్తింపు కవిత్వంలో మాత్రం ఎలా లభిస్తుందండి, నాయన పరలోకంలో వున్నా సరె, ఇంటికి పోతే అన్నం పెట్టే అమ్మ సలక్షణంగా వున్నా సరే నేను ఫలానాయన బిడ్డనని చెప్పుకునే లోకంలో, తలలో వున్న బుర్ర కంటే జననాంగానికి ప్రాముఖ్యమిచ్చీ సంఘంలో (అల్లూరే కాదండి, ఆడంస్ విల్ ఐనా అంతే).

    ఐతే ప్రశ్నించ గలిగిన మీ నైజం మాత్రం ప్రశంశనీయం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  4. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 10:24 pm

    వ్యాస పరిధి దాటినందుకు సంపాదకులు దీనిని తిరస్కరిస్తే నాకభ్యంతరం లేదు. పరుచూరి వ్యాఖ్య నిగూఢంగా ఉండటానేమో అర్థం కాలేదు.

    ఓరల్ హిస్టరీ అంటే Studs Terkel చేసినట్లు రికార్డు చేసిందే కదా. అలా రికార్డు చేసిన మన సాహితీ చరిత్ర మామూలు పాఠకులకి అందుబాటులో లేదా? పెద్దమనుషులెవరినో పోయి అడిగితే గాని తెలిసే అవకాశం లేదా?

    కొకు కి చలమంటే వ్యక్తిగతంగా ఇష్టమా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. చలం రచనలని కొకు పరామర్శించకపోయినా పెద్దగా నష్టం లేదు – అనేకులు ఆపని చేశారు కనుక. ప్రచురించని దేవులపల్లి (అశ్లీల?) రచనల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వీటికీ బంగారమ్మ రచనలని ప్రస్తావించకపోవడానికీ సారూప్యత కనబడదు.

    ఆమె కవిత్వాన్ని గురించి ఇప్పటికీ మాట్లాడకపోవడానికి కారణం ఆవిడ కవిత్వం కాదు, ఆవిడ వ్యక్తిగత జీవితం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకావిడ జీవితం గురించి ఏమీ తెలియకపోయినా అది చాలా అన్యాయంగా తోస్తుంది. అలాంటి జీవితమే గడిపిన మగవాళ్ళ రచనలకి కూడా అదే గతి పట్టిందా?

    కొడవళ్ళ హనుమంతరావు

  5. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/27/2009 9:33 pm

    శ్రీనివాస్ గారూ,

    మీ వ్యక్తిగత అభిప్రాయం లోనూ మీ గొంతు biased గానే విన్పిస్తోంది. మీరు కవుల విషయంలో “లిఖిత” విమర్శనీ, కవయిత్రుల సమాచారానికైతే మాత్రం వెతుక్కుని ఇవాళ భావకవిత్వం తెలిసిన వారినించీ “మౌఖిక”మైన సంగతులనీ సేకరించుకోవచ్చుననీ సలహా ఇవ్వడం ఆశ్చర్యమే! ఫలానా పుస్తకం అంటే ఎవరైనా సేకరించుకోవచ్చు, కానీ ఫలానా తరం వాళ్ళని కలుసుకుని విషయాలని సేకరించుకోమని అనడం ఏమిటో? ఇక్కడ నేను ప్రస్తావించిన అంశం ఒకటే. స్త్రీల సాహిత్యం మీద విమర్శ చాలా తక్కువ అన్న ది. నేను బంగారమ్మ గారి సాహిత్య విశ్లేషణలో జరిగిన జాప్యాన్ని గురించి మాట్లాడేను. స్త్రీల సాహిత్యం పై విమర్శ లోని అసమగ్రత, నా అభిప్రాయం. వారి వ్యక్తిగతాలు కాదు. శ్రీశ్రీ ఎందుకు ప్రస్తావించ లేదన్నది “మౌఖిక” చరిత్ర ద్వారా సేకరించు కోవడం మీద నాకు సమ్మతీ లేదు. ఆసక్తీ లేదు. అది స్త్రీల సాహిత్య విమర్శని సృష్టించదు. స్త్రీల సాహిత్యాన్ని పక్కకు నెట్టి స్త్రీల జీవితాన్ని gossip గా మాట్లాడుకుందికి బహుశా ఉపయోగపడొచ్చు. దాని వల్ల స్త్రీల సాహిత్యానికి మరింత నష్టం తప్ప మేలు లేదు. కవుల విషయంలో అక్షరాన్నీ, కవయిత్రుల విషయంలో మాత్రం జీవితాన్నీ గుర్తించే ఈ “మౌఖిక” విమర్శ అన్న సూచన వెనక ఉన్న ప్రమాదం ఇదీ! దీని వల్ల ఎవరికి లాభమో నేను వేరే వివరించి చెప్పనఖ్ఖర లేదు.

    రమ.

  6. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    01/27/2009 2:17 pm

    I don’t want to comment on the alleged bias towards women writers, nor on lack of literary criticism in modern Telugu literature. However I believe that an issue is made, unnecessarily I may add. If any bias were made towards Bangaramma its definitely not because she is woman. Fact is that even in 20th century we have more oral history (and lit. criticism) than written one. There are reasons why Bangaramma’s name is not mentioned even today. If you are curious, go and talk to people who are well acquainted with భావకవిత్వం period, and there are still a few around. It has nothing to do with the quality of her poetry but her personal life. I don’t want to go into details here. On that note we never talk about why ko.ku disliked Chalam, or all those unwritten verses of Devulapalli, or all those literary happenings of 1920s, 30s and 40s.

    If I sound cryptic, yes its intentional!

    Regards,
    Sreenivas

  7. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    01/27/2009 10:55 am

    హనుమంతరావు గారూ!

    నాది బాధ మాత్రమే ! అభిశంసన కాదు. మీకు నా ఆరోపణ సవ్యం గానే అర్ధమయింది. thank you. మీ భార్యగారికి వచ్చిన సందేహం ఇన్నేళ్ళలోనూ ఈ తెలుగు సాహిత్యలోకంలో ఒక్క విమర్శకుడికీ రానేలేదే? మరి ఇది ఆలోచించ వలసిన విషయం కాదా? ఒకనాటికి స్త్రీలీ ప్రశ్నలేయగలరని పురుషసాహిత్యలోకం ఊహించలేదు. మీ వివరణ లోనే శ్రీశ్రీ చూపించిన నిర్లక్ష్యం గురించి ఉంది.ఆనాటి వారికే కాదు..ఇవాళ్టికీ చాలా మందికి స్త్రీల గురించి చెప్పాలంటే ఎందుకో మరి మనసు రాదుస్మండీ !! అందునా మంచి సంగతులు చెప్పడానికి అసలే రాదు. కావాలంటే తెలుగు విమర్శ ని ఒకసారి పరికించి చూడండి మీరే! సరి అయిన దృష్టి కోణం తో..స్త్రీల రచనలని ఇంకా బేరీజు వేయగల స్థితి ఈనాటికీ ఇంకా లేదు. సాహిత్య పరంగా చాలా నష్టం ఇది.

    మోహనరావు గారూ…ప్రస్తావన చేయడం …విశ్లేషణ చేయడం రెండూవేర్వేరు. రెండో దాని పరంగా మీ వ్యాసం బలమైంది కాదని మీకే తెలియగలదు మరోసారి చదువుకుని చూడండి. మీరు”ముగురమ్మల్ని గురించి ప్రస్తావనే చేసారు…వారి కవితా విశ్లేషణ కాదు. విమర్శ పరిధి వేరు. దాని దిశ వేరు. తెలుగులో సృజనాత్మక సాహత్యం వృధ్ధి పొందింది..కానీ విమర్శ ఏదీ?

    నేను మాట్లాడుతున్న అంశం ఇదీ! ఎవరైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించండి…అదీ ముఖ్యం.

    రమ.

  8. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 6:58 am

    తహ తహ గారికి,

    మీ అభిమానానికి కృతజ్ఞతలు. భావి తరాల గురించి ప్రస్తావించారు కనుక:

    మా ఊరు, రావినూతల, వెళ్ళినపుడల్లా, హైస్కూలు కెళ్ళడం, టీచర్లని కలవడం, పిల్లలనుద్దేశించి ప్రసంగించడం, నా పర్యటనలో ఓ ముఖ్యమైన నాకు చాలా ఇష్టమైన భాగం. నేను ఇండియా వెళ్ళి మొన్ననే తిరిగివచ్చాను. ఆ అనుభవం గురించి, చదువుకి సంబంధించి, ఓ వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. స్మైల్‌ – ఓ జ్ఞాపిక గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 6:44 am

    మోహన గారికి,

    1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడు” కవితని వేలూరి చవకరకం జిన్‌ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.

    మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “వ్యాసాలు, ద్వేషాలు,” సౌభాగ్య. 2004.

  10. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/27/2009 6:14 am

    సూర్యుడు గారికి,

    మీ వ్యాఖ్య చదివి, హమ్మయ్య, ఒక్కరైనా నా వ్యాసం చదివారు, శ్రమ నిరర్థకం కాలేదు, అన్న సంతోషం కలిగింది.

    వాస్తవానికి, నేనీ వ్యాసం ముగించి, గత శతాబ్దంలో గణితశాస్త్రంలో వచ్చిన మూడు విపత్తులని సగటు పాఠకునికి వివరించడంలో విఫలమయ్యాననే నాకు నేను బేరీజు వేసుకున్నాను. మరీ మిక్కిలి అమూర్త (abstract) విషయాలని వివరించడంలో కలిగే చిక్కులు నాకెక్కువే ఎదురయ్యాయి. అయినా దీని వలన కొంత మేలు జరిగిందనీ, ముందు ముందు మీలాంటి వారెవరైనా ఇంకా సరళంగా చెప్పగలరనీ ఆశ.

    మీరు ప్రస్తావించిన పుస్తకం నేను చదవలేదు కాని చదవదగ్గదిలా ఉంది. అందరూ మీరిచ్చిన లింకులోని పరిచయం అన్నా చదువుతారని ఆశిస్తాను. నేనీ వ్యాసం రాసే సమయంలోనే, గణితంలో నోబెల్ బహుమతి లేదని తెలిసి ఒకరు నా ముందర విస్మయపడితే, ఆమాత్రం తెలియని ఇంజనీర్లు ఉన్నారా అనుకొని అవాక్కయ్యాను.

    కొడవళ్ళ హనుమంతరావు

« 1 ... 1283 1284 1285 1286 1287 ... 1580 »