మరక్కడే గారికి:
నా సంపాదకీయంలో శ్రీశ్రీ పద్యం టైపు చెయ్యడంలో “కలదు” అన్న మాట ఎగిరిపోయింది. అది నా తప్పే! తప్పు పట్టుకుని మందలించినందుకు కృతజ్ఞుణ్ణి.
–వేలూరి వేంకటేశ్వర రావు.
ఈమాట సంపాదకులద్వారా…బాబ్జీలు గారికి,
మీ అబిప్రాయాల్లో ఉండే వాడీ వేడీ చదివి సంతోషించేదాన్ని ఇదివరకూ !!
ఈమ ధ్య ఈమాట లో మీమాటలేం కన్పించడం లేదే? రచనల మీద చురకలూ..పదునైన అభిప్రాయాలూ ..పత్రికలో అంతే ముఖ్యం. పత్రికని ఆసక్తిగా చదివించడానికి భిన్న గొంతుకల అవసరం చాలా ఉంటుంది. కాకాల..బాకాలతో పత్రికలు నిండిపోకుండా..విషయానికి మరోకోణాన్ని చూపించేవి అవే మరి. మీ చురుకు అభిప్రాయాలు అందిస్తూ ఉండమని ఒక పాఠకురాలిగా నా కోరిక.
సంపాదకుడు అంటే రచనలను రచయితలనుంచి సంపాదించి/సేకరించి గుదిగుచ్చి ప్రచురించడానికి ఒక క్రమపద్ధతిలో పెట్టువాడు అనే అర్ధమేమో అనుకుంటున్నాను. తదుపరి వ్యాసం కోసం ఎదురు చూస్తూ,
శివ
-నా సంపాదకీయాలు కూడా పది మంది చేతుల్లో పడి నలిగిన తరువాతే బయటకు వస్తాయి- అని చెప్పుకొన్న వేలూరి వారి రచనలో, మొట్ట మొదటి కంద పద్యమే క్రింద పడింది. కనీసం మరొకరి పద్యాలనుదహరించేటప్పుడైనా పదాలన్నీ పడ్డాయో, లేవో, గణాలు కుదిరాయో లేదో చూసుకొంటే బాగుంటుంది. మన పత్రిక నాణ్యత చాలా బాగుందని మనకు మనమే ముక్తాయించేసుకొంటే బాగుండదు. చదివే వాళ్ళున్నారు. వారిలో కొందరికైనా పద్యానికీ, పదానికీ, కవితకీ, కథకీ తేడా తెలుస్తుంది. ఇదే వ్యాసం మరొక రచయిత ద్వారా వచ్చి వుంటే, ఇలాగే చూసీ చూడక ప్రచురించే వారా? లేక మరింత పదును పెట్టి తిరగ వ్రాయమని పంపేసే వారా?
[శ్రీశ్రీ కందాన్ని ‘సిప్రాలి, 1987 నవంబర్, విరసం ప్రచురణ, పేజీ 44’ నుంచి తీసుకున్నాం. ఎడిట్ చేయడంలో ఎక్కడో ‘కలదు’ అన్న పదం ఎగిరిపోయింది, చూసుకోకపోవడం మా పొరపాటే. క్షమాపణలు. అచ్చుతప్పులేవైనా కనపడితే పాఠకులు మాకు ఎత్తి చూపటమూ, వాటిని మేము క్షమాపణలు చెప్పి మరీ తప్పు దిద్దటమూ జరుగుతున్నదే, ఇక ముందు కూడా జరగబోయేదే. కానీ, ఇలా నొప్పించే విధంగా, పరదాల చాటు పుంగవులు చేసే ఈ రకమైన అనుచితపు దబాయింపులు ఎంత సమంజసమో సాటి పాఠకులే నిర్ణయించుకుంటారని మా విశ్వాసం – సం.]
నాకు గానీ ..హనుమంతరావు గారికి గానీ శ్రీనివాస్ గారి వ్యాఖ్య మీద అపార్ధం కలిగితే..అందుకు శ్రీనివాస్ గారి వాక్యాలే కారణం. అయినా ఆయన వివరంగా రాస్తానని అన్నారు గనక ఈ సారి నాలాంటి పాఠకులకి మరింత స్పష్టత కలుగుతుందని ఎదురుచూస్తాను. శ్రీనివాస్ గారు నా పేరుని quote in quote లో పెట్టరని ఆశిస్తాను.
రమ.
It is really amusing to read the last two comments by “Rama”, attributing things to me that I haven’t said. I stick to my earlier comment, that no bias was made towards Bangaramma for her gender reasons. Nor was I talking about “gossip” and “scandals”. Also, women writings of later years received no less attention. I intend to write a long note responding to “Rama” and Sri KHR’s comments on this thread and submit for publication to this webzine (subject to editor’s approval) in the coming weeks.
రచయితలు – ఎడిటర్లు గురించి vrveluri గారి అభిప్రాయం:
02/03/2009 7:57 am
మరక్కడే గారికి:
నా సంపాదకీయంలో శ్రీశ్రీ పద్యం టైపు చెయ్యడంలో “కలదు” అన్న మాట ఎగిరిపోయింది. అది నా తప్పే! తప్పు పట్టుకుని మందలించినందుకు కృతజ్ఞుణ్ణి.
–వేలూరి వేంకటేశ్వర రావు.
రచయితలు – ఎడిటర్లు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
02/02/2009 10:59 pm
ఈమాట సంపాదకులద్వారా…బాబ్జీలు గారికి,
మీ అబిప్రాయాల్లో ఉండే వాడీ వేడీ చదివి సంతోషించేదాన్ని ఇదివరకూ !!
ఈమ ధ్య ఈమాట లో మీమాటలేం కన్పించడం లేదే? రచనల మీద చురకలూ..పదునైన అభిప్రాయాలూ ..పత్రికలో అంతే ముఖ్యం. పత్రికని ఆసక్తిగా చదివించడానికి భిన్న గొంతుకల అవసరం చాలా ఉంటుంది. కాకాల..బాకాలతో పత్రికలు నిండిపోకుండా..విషయానికి మరోకోణాన్ని చూపించేవి అవే మరి. మీ చురుకు అభిప్రాయాలు అందిస్తూ ఉండమని ఒక పాఠకురాలిగా నా కోరిక.
రమ.
రచయితలు – ఎడిటర్లు గురించి శివ బండారు గారి అభిప్రాయం:
02/01/2009 11:18 pm
సంపాదకుడు అంటే రచనలను రచయితలనుంచి సంపాదించి/సేకరించి గుదిగుచ్చి ప్రచురించడానికి ఒక క్రమపద్ధతిలో పెట్టువాడు అనే అర్ధమేమో అనుకుంటున్నాను. తదుపరి వ్యాసం కోసం ఎదురు చూస్తూ,
శివ
రచయితలు – ఎడిటర్లు గురించి marakkaDE.. గారి అభిప్రాయం:
02/01/2009 7:30 pm
-నా సంపాదకీయాలు కూడా పది మంది చేతుల్లో పడి నలిగిన తరువాతే బయటకు వస్తాయి- అని చెప్పుకొన్న వేలూరి వారి రచనలో, మొట్ట మొదటి కంద పద్యమే క్రింద పడింది. కనీసం మరొకరి పద్యాలనుదహరించేటప్పుడైనా పదాలన్నీ పడ్డాయో, లేవో, గణాలు కుదిరాయో లేదో చూసుకొంటే బాగుంటుంది. మన పత్రిక నాణ్యత చాలా బాగుందని మనకు మనమే ముక్తాయించేసుకొంటే బాగుండదు. చదివే వాళ్ళున్నారు. వారిలో కొందరికైనా పద్యానికీ, పదానికీ, కవితకీ, కథకీ తేడా తెలుస్తుంది. ఇదే వ్యాసం మరొక రచయిత ద్వారా వచ్చి వుంటే, ఇలాగే చూసీ చూడక ప్రచురించే వారా? లేక మరింత పదును పెట్టి తిరగ వ్రాయమని పంపేసే వారా?
[శ్రీశ్రీ కందాన్ని ‘సిప్రాలి, 1987 నవంబర్, విరసం ప్రచురణ, పేజీ 44’ నుంచి తీసుకున్నాం. ఎడిట్ చేయడంలో ఎక్కడో ‘కలదు’ అన్న పదం ఎగిరిపోయింది, చూసుకోకపోవడం మా పొరపాటే. క్షమాపణలు. అచ్చుతప్పులేవైనా కనపడితే పాఠకులు మాకు ఎత్తి చూపటమూ, వాటిని మేము క్షమాపణలు చెప్పి మరీ తప్పు దిద్దటమూ జరుగుతున్నదే, ఇక ముందు కూడా జరగబోయేదే. కానీ, ఇలా నొప్పించే విధంగా, పరదాల చాటు పుంగవులు చేసే ఈ రకమైన అనుచితపు దబాయింపులు ఎంత సమంజసమో సాటి పాఠకులే నిర్ణయించుకుంటారని మా విశ్వాసం – సం.]
నందిని గురించి ఉష గారి అభిప్రాయం:
02/01/2009 6:12 am
మాటల్లొ చెప్పలేని అనుభూతి. మళ్ళి చదవాలనే ఆత్రుత. నిజానికి ఒకసారిదివరలో చదివిందే. కొత్త పాళీ గారు మళ్ళీ గుర్తుచేసారు. చాలా చక్కని శిల్పం.
జనరంజని: మహానటి సావిత్రి గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:
01/31/2009 4:56 pm
ఎంత చక్కటి చోటికి వచ్చానండీ. ఎంత చక్కటి శబ్దతరగం. ఇంతకాలంనుండి ఈ చోటుకు రాలేనందుకు బాధపడుతున్నాను.
సేకరించి ఇక్కడకు లింక్ చేసిన మహానుభావులకు వందనములు.
మరిన్ని ఇటువంటి చక్కటి శబ్దతరంగాలను అందిస్తారని అసిస్తున్నాను.
శివరామప్రసద్ కప్పగంతు
ముంబాయి, భారత్
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal గారి అభిప్రాయం:
01/29/2009 10:39 am
‘పట్టి’-‘వట్టి’-సమస్య (జనవరి 5, 2009) (వేణుగోపాల్ – మోహన)
భకారానికి వకారం యతి సరిపోదనుకున్నాను. మోహన గారు కరెక్టు.
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/29/2009 6:06 am
నాకు గానీ ..హనుమంతరావు గారికి గానీ శ్రీనివాస్ గారి వ్యాఖ్య మీద అపార్ధం కలిగితే..అందుకు శ్రీనివాస్ గారి వాక్యాలే కారణం. అయినా ఆయన వివరంగా రాస్తానని అన్నారు గనక ఈ సారి నాలాంటి పాఠకులకి మరింత స్పష్టత కలుగుతుందని ఎదురుచూస్తాను. శ్రీనివాస్ గారు నా పేరుని quote in quote లో పెట్టరని ఆశిస్తాను.
రమ.
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
01/29/2009 4:55 am
It is really amusing to read the last two comments by “Rama”, attributing things to me that I haven’t said. I stick to my earlier comment, that no bias was made towards Bangaramma for her gender reasons. Nor was I talking about “gossip” and “scandals”. Also, women writings of later years received no less attention. I intend to write a long note responding to “Rama” and Sri KHR’s comments on this thread and submit for publication to this webzine (subject to editor’s approval) in the coming weeks.
Regards,
Sreenivas
వానకు తడిసిన పువ్వొకటి గురించి sree rama murthy గారి అభిప్రాయం:
01/28/2009 10:56 pm
ఇంద్రాణి గారికి,
మీ కవితలు పొందికగా ఉన్నాయి.”వానకు తడిసిన పువ్వొకటి” కవిత మంచి పదచిత్రం.ఇలాంటి కవితలు మీరు మరిన్ని రాయాలని ఆశిస్తూ__
శ్రీరామమూర్తి.