Comment navigation


15800

« 1 ... 1279 1280 1281 1282 1283 ... 1580 »

  1. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/25/2009 9:34 am

    సంపాదకులకి,
    రోహిణీ ప్రసాద్ గారి లింకు ద్వారా ఫియాజ్..విలాయత్ గారల జుగల్ బందీ ఇంకా నాలో మోగుతోంది. నాలుగు మొయిళ్ళు అలా వాటి లోని మెరుపూ..ఉరుము లతో సఃహా ఆలింగనం చేసుకున్న ట్టు గా ఉంది. వాన..అంటే మామూలు వాన కాదు ..ఒకానొక సాంధ్యవేళ ..అటు చంద్రోదయమూ..ఇటు వెన్నెలా ఉన్నప్పుడే …హఠాత్తుగా అతి వేగంగా దూసుకొచ్చిన స్వర మేఘం .జలజలా రాగాన్ని “జ్యొత్స్నా పయఃపిండములు” గా కురిపించిన ట్టుంది. అందువల్లే కాబోలు.. వాళ్ళ గొంతుల్లో వెలుగు..మురజం లాగా మోగింది.

    thanks to rohini prasad,

    రమ.

  2. జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి Ram గారి అభిప్రాయం:

    02/25/2009 7:39 am

    మాస్టారు, మీ కాళ్ళు కాస్త ఫొటొ తీసి పంపుతారా!

  3. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి mOhana గారి అభిప్రాయం:

    02/25/2009 6:30 am

    కర్ణాటక సంగీతములో 72 మేళకర్తలు ఉన్నాయి. వాటి సంఖ్యలను తెలిసికొనడానికి కటపయాది సూత్రం ఉపయోగపడుతుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఖ్య విలువను ఇస్తారు ఇందులో. ఆ విలువలు
    ఇలా ఉంటాయి –
    1 2 3 4 5 6 7 8 9 0
    క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ
    ట ఠ డ ఢ ణ త థ ద ధ న
    ప ఫ బ భ మ
    య ర ల వ శ ష స హ

    సంఖ్య విలువలు కుడి నుండి ఎడమకు (సామాన్యముగా మనము ఎడమనుండి కుడివైపుకు సంఖ్యలను రాస్తాము). కనకాంగి అంటే 1, రత్నాంగి అంటే రెండు, రామప్రియ అంటే 52, ఇలా.

    విధేయుడు – మోహన

  4. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి p.kusumakumari గారి అభిప్రాయం:

    02/25/2009 2:36 am

    ఇంత మంచి విశేషాలను అందించిన కొ.రోహిణీ ప్రసాదు గారికి కృతజ్ఞతలు. సంగీత విశేషాలను ,లలిత కళల గురించీ అక్షర బద్ధం చేసి, పాఠకులకు “అఱటి పండు వలిచి ,అఱచేతిలో పెట్టిన” మీకృషి అద్భుతం!
    ఇదే రీతిగా “కటపయాది సూత్రము ” గురించి వివరిస్తారని ఆశిస్తున్నాను.

  5. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    02/24/2009 10:39 am

    నాగరాజు గారూ – అన్నమయ్య మీద జయప్రభ గారు రాసిన పదపరిచయం చదవలేదా ?? లేకపోతే చదవండి. ఆవిడ అన్నమయ్య మీద రెండో సంపుటం కూడా రాస్తునారని విన్నాను. అన్నమాచార్యుల వారి గురించి ఆసక్తి ఉన్నవాళ్ళకి ఆ పుస్తకాలు ఉపయోగపడొచ్చు. పోలిక సంగీతంలో కన్పించొచ్చు…గానీ..కర్ణాటక సంగీతానికీ..యూరోపియన్ సంగీతానికీ లంకె తక్కువ అనుకుంటాను. అయినా శ్రమ పడ్డారు. అందుకు అభినందనలు.

    అన్నమయ్య సంగీతానికి సంభంధించిన పరిశోధనలు ఏమీ జరిగినట్టు కన్పించదు. కానీ అన్నమయ్య మనవడు -అన్నమయ్య గారి సంకీర్తనా లక్షణానికి తెనుగు అనువాదం చేస్తూ- తన తాతగారి కాలం నాటి సంగీత శాస్త్ర గ్రంధాలని పేర్కొన్నాడు. విజయనగర కాలం నాటికి సంగీతం మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. గనక అన్నమయ్య పదాల లోని సంగీతం గురించి ఎవరైనా పరిశోధన చేయాలని నిజంగా అనుకుంటే అది అసాధ్యం కాకూడదు.
    రమ.

  6. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి రాఘవ గారి అభిప్రాయం:

    02/24/2009 3:11 am

    నాకు కర్ణాటక సంప్రదాయ సంగీతంలో(తో) పరిచయం ఉన్నా పాశ్చాత్య సంగీతంగా పిలువబడుతున్న సంగీతంతో పరిచయం నిండు సున్నా. ఇప్పుడు వ్యాసకర్త పుణ్యమా అని కనీసం ఒక నలుగురి పేర్లు తెలిసాయి.

    ఇక ఇక్కడ ప్రతిపాదించిన కర్ణాటక సంప్రదాయంలో ప్రసిద్ధులైన నలుగురు వాగ్గేయకారుల వివరాలు చక్కటి ఆరంభాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు. శ్యామశాస్త్రిగారి గురించి చెప్తూ సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో సుబ్బరామదీక్షితర్ ఉదహరించిన శ్రీనాథుని పద్యాన్ని ఉటంకించడం సముచితం.

  7. ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం గురించి suribabupusuluri గారి అభిప్రాయం:

    02/24/2009 2:52 am

    the magazine is so good that i have bcome a favorite to it. you please continue this tempo to maintain the magazine.
    I wish u all a success. I shall recommend this magazine to some famous writers of Telugu in VISAKHAPATNAM so that they will bless you all and if possible, they may also contribute some articles to your magazine.

  8. కొండ నుంచి కడలి దాకా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    02/22/2009 9:52 am

    విచ్చేయవమ్మ “వోలేటి వెంకటేశ్వర్లు” గారి గొంతులా ఉంది.

    లక్ష్మన్న

  9. కొండ నుంచి కడలి దాకా గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    02/22/2009 9:33 am

    Ramnath-gaaru,
    Its NCV Jagannathacharyulu. Or is it Ramanamurti? One of them! As such I plan to list all the names involved in this production. Let me listen to the tape.
    — Sreenivas

  10. ఈ మాసపు పాట గురించి hEma veMpaTi గారి అభిప్రాయం:

    02/21/2009 3:42 pm

    ప్రియమైన ఉదయకళ గారూ ! మీ కథను ఈమాసపు కథగా చెప్పావచ్చు ననిపిస్తోంది. గొప్పగా వ్రాశారు. మీకు నా అభినందనలు. ప్రస్తుత పరిస్తితుల్ని మనసుకు హత్తుకునేలా రాస్తూనే చివరిలో భవిష్యత్తు బాగుంటుంది, ఫరవాలేదు – అన్న ఆశా జనకమైన దృక్పధం సూచించడం చాలా అందమైన మలుపు. చక్కని శైలితో, ఎంచక్కని ఉదాహరణలతో , త్యాగరాజ కీర్తనలకు అందమైన పారడీలతో కథ చాలా గొప్పగా ఉంది – అని చెప్పడానికి సంతోషిస్తున్నా.
    వెంపటి హేమ

« 1 ... 1279 1280 1281 1282 1283 ... 1580 »