ఈ రచయిత ఏమి చెప్పదలుచుకున్నది ముందు అనుకోలేదు. చదివితే అలాగే అనిపించింది. నా ఉద్దేశములో కథల్ని కొన్ని రకాలుగా విభజించడం అంత సులువైన పని కాదు. కథ ముఖ్యోద్దేశం కథ కథకూ మారుతుంది. వస్తువూ, శైలీ కంటే కూడా ఆ కథ పాఠకులకు ఎంత నచ్చిందనేది ముఖ్యం. మనస్సులను రంజింపగలిగితే అది మంచి కథే అవ్వాలి.
సుప్రసిద్ధ సంగీత దర్శకుడు రోషన్ దర్శకత్వంలో ఆఖరి చిత్రమైన అనోఖీరాత్ లోని పాట ఇది. తాత్వికమైన హిందీ సినిమా పాటలలో దీనికి ఒక అగ్ర స్థానం ఉంది. ఈ కాలపు వాళ్లకి మరో రోషన్ తండ్రి అని తప్ప ఈ రోషన్ గురించి ఎక్కువ తెలీదు. సంగీత స్వర్ణయుగంలోని సామ్రాట్టులలో ఇతడు కూడా ఒకడు. ఇక ముకేష్ వంటి “మంచి” గాయకుడు అందరికీ పరిచితుడే. విధేయుడు – మోహన
గోదావరి మీద సంగీత రూపకంలో..పాటలు తక్కువ గానూ .మాటలు ఎక్కువ గానూ ఉన్నాయి. నిజానికి బాపిరాజు గారి పాట తో పోలిస్తే కాశీనాధుని రాజశేఖర్ గారు పేర్కొన్న గోదావరి పాటలే ఎక్కువ బాగుంటాయి.
కిన్నెరసాని గేయం బాణీ మొత్తం విశ్వనాధ వారిదే !! రజనీ గారు కవి గారి tune నే వాడుకున్నారు. infact సత్యన్నారాయణ గారి కంఠం లోంచే కిన్నెరసాని వ్యధ ఎక్కువ ఆర్ద్రంగా విన్పిస్తుంది.
మనకి ఇవాళ ఇంతపాటి కూడా చేసే వాళ్ళు లేకపోబట్టి , ఇదే్ మ హ బాగుందని అనుకోవాలంతే!! ప్రళయ గోదావరి అని కృష్ణశాస్త్రి గారి గేయం చాలా బాగుంటుంది. గానీ ఆ గేయాన్ని ఈ రూపకంలో వాడలేదు. ఎందుకో మరి…మనకి పాతవన్నీ బాగున్నాయి అన్పించటం కద్దు.
government propaganda లాగా విసుగు కల్గించే సమాచారపు భారాన్నించి ..గోపాలరత్నం గారి గొంతు ఒక్కటే relief .
బాబా గారూ,
ఇది నేను చదివిన మీ రెండో కవిత. మొదటిది చీకటి నావనెక్కి ప్రపంచం వేకువ తీరం వైపు చేసే ప్రయాణం. (ఆదివారం అనుబంధం లోనేమో?) మోనాలిసా నవ్వున్న, పెళ్ళికానుక. ఇల్లు ఖాళీ చేస్తున్నపుడు డ్రాయర్ సొరుగులో దొరకడం. వరవోఁ శాపవోఁ? బతుకు తెలిసిన వారికి కోటి దండాలు. వెధవ బతుకు. మోనాలిసా నవ్వునీ పట్టించుకోదు. పెళ్ళికానుకకీ దిక్కు లేదు. ఎప్పుడో ఓ దిక్కుమాలిన సమయంలో అడ్డెస్తుంది. ఏది వరమ్మో, ఏది శాపమో తెలిసీ తెలియక అలమటిస్తూ కొండెక్కెస్తాం.
33,000 యెన్ లు బహుమతిగా గెలుచుకున్నదట ఈ రూపకం. అందులో సింహభాగం రజనీ తీసుకుని, మిగిలినదాన్ని అందరికీ వారి వారి “కాంట్రిబ్యూషన్” బట్టి పంచేరుట. దానికి విశ్వనాథ తబ్బిబ్బులైనారట.
ఇంకొహటి: ‘ఎవరికెవరు..” పాట ఇప్పటిదాకా హిందీ పాటకి “కాపీ” అనుకుని బాధపడీవాణ్ణి. ముఖేష్ పాట. సినిమా తెలీదు.
“… మిలే నదీకె జల్ మే, నదీ మిలే సాగర్ మే, సాగర్ మిలే కోన్ స జల్ మే కోయీ జానే న.” వెంటనే “ఏర్సెయ్ బార్సెయ్ …” పాడితే సరిగ్గా సరిపోతుంది.
శ్రీనివాస్ గారికి: “ఆఇంరే” వారు అసెంబ్లీ ఎదురుగా వారి ప్రాంగణం లోనే చిన్న దుకాణం పెట్టేరు. కానీ అక్కడ “స్టాండర్డ్” సీడీ లే దొరుకుతాయి తప్ప మరేవీ దొరకవు. అక్కడ కూచున్న అమ్మాయికి వాటి విలువ కూడా తెలీదు. మరి మీ కిలాటివి ఎక్కడ దొరుకుతాయి? గవర్నమెంటాలిటీని ఎలా దాటగలిగేరు మీరు?
పద్యమూ బాగుంది, వ్యాఖ్యానమూ బాగుంది. అయితే సంస్కృత పదాలను వాడడాన్ని గొప్పగా చెప్పడం నాకు కొంత నచ్చలేదు. తేట తెలుగు దూరమవ్వడానికి ఇలాంటి ప్రకియలే చాలవరకు కారణమని నా ఊహ. సంస్కృత పదాలకు సరి అయిన తెలుగు పదాలను కనిపెట్టలేక సంస్కృతాన్ని ఆశ్రయిస్తే అది గొప్పతనమా? మీలాంటి పెద్దలు ఈ విషయమై ఆలోచించగలరని మనవి.
సంపాదకులకు,
నాకు చిన్న కుతూహలం! ఇలా కలిగింది మరి! అది ఎటువలెననంగా!!
కాళ్ళు ఫోటో తీసి పంఫడం ఏం గౌరవమండీ బాబూ! అంత భక్తి కలిగినప్పుడు స్వయంగా వెళ్ళి మొక్కాలి గానీ! మా తరంలో మేము అలా చేసేవాళ్ళం మరి! ఈ మధ్య ఆస్త్రేలియా లో రోడ్డు మీద నిలబడి “free hugs” కోసం ప్రచారం ఒకటి చూసేను. అన్నీ కొరతే అయిపోతున్న ట్టున్నాయి లోకంలో. మాట..స్పర్శ లాంటివి! ప్లాస్టక్ మయం..ఏం తెలుసుకోలేం! పొటోల్లో..కాళ్ళు మొక్కడం..కంప్యుటర్ లోంచి పూజలు చేసుకోవడం! అంతా మాయా ప్రపంచం మరి! భైరవభట్ల వారి కాళ్ళు …ఈసారి వ్యాసంతో పాటు గానే “జమిలి”గా పంపేస్తే సరి!
రోహిణీ ప్రసాద్ గారూ! తెనుగు మగవారి మీద మీ వ్యాఖ్యతో నాకు పేచీ ఏం లేదు గానండీ..అన్ని సంప్రదాయాలూ అలా నిరంతరంగా ఆడాళ్ళ వల్లే వర్ధిల్లే భారం ఇంకా ఇంకా ఆశిస్తూ ఉంటే..అందుకు ఈ ఆడాళ్ళూ ఇవాళ అనేక విధుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు కదా. ఇంకో బరువు కూడానా?? అని విసుగ్గా అనుకుంటాం కదా! ఇప్పటిదాకా మోసిన సంప్రదాయాలు చాల్లేదా ఏమన్నానా? for a change, ఆ విధి ఏదో కనీసం ఇప్పటికైనా “తెనుగు మగ వారే” నెత్తికెత్తుకోవచ్చును కదా! ఇది తప్పకుండా కృష్ణా స్నానమే”! ఏ కొండుభొట్ల అనుజ్న అఖ్ఖర్లేదు. పుణ్యం పురుషార్ధమూను. so ఇటుపై శాస్త్రీయ సంగీతానికి కుటుంబంలోని మగవాళ్ళూ అంతే ఆసక్తి చూపించడం ఆశించ వచ్చునా??
రమ.
గొర్తిగారిలా అన్నారు ..
“తెలుగు నాటకం పేరున ఒక బ్లాగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. అందులో నాటక ప్రతులూ, వీడియోలూ అన్నీ ఉండేలా చేయాలన్న ఆలోచన ఉంది. అది రూపుదిద్దుకుంటే ఈ పుస్తకం అక్కడ పెడదాం. ”
అయ్యా మీ ఉద్దేశం గనక జయప్రభగారు రాసిన నాలుగోగోడ పుస్తకం అయితే ఆవిణ్ణి సంప్రదించకుండా ఇలాంటి ప్రణాళికలు వెయ్యకండి. తన కాపీరైట్లని సంరక్షించుకోవడంలో ఆవిడకి చాలా పట్టింపు ఉంది.
‘గంగా స్నానానికి కొండుభొట్ల ఆజ్ఞ’ అన్న పద్ధతిలో కాకుండా శాస్త్రీయసంగీతాన్ని ఇంటర్నెట్ ద్వారానూ, ఇతర సాధనాలతోనూ ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా విని ఆనందించవచ్చు. నేను చేసేదల్లా దానికి నేపథ్యాన్ని గురించిన సమాచారం కాస్త అందజేయడమే. దానివల్ల రమగారిలాగా ఎవరైనా సంతోషం పొందితే నా పని నెరవేరినట్టే.
శాస్త్రీయసంగీతం బ్రహ్మపదార్థమేమీ కాదని నా ఉద్దేశం. (నీచోపమానం కాదనుకుంటే) సాఫ్ట్ డ్రింక్స్ మానేసి స్కాచ్ ఆస్వాదించడం మొదలుపెట్టినట్టు తేలిక పాటల్నించి కాస్త గ్రాడ్యుయేట్ కావడం సాధ్యమే.
పెద్ద సంగీతజ్ఞులందరూ తమ తల్లులనుంచే సంగీతానికి ప్రేరణ పొందినట్టు చెపుతారు. ‘మగవెధవలు’ (అందునా తెలుగువారు) ఈ విషయంలో కాస్త వెనకపడ్డారేమో ఆలోచించాలి. కుటుంబాల్లో సంగీతం పెరగాలంటే మహిళలే నడుం కట్టాలనిపిస్తుంది.
కథ దేని గురించి? గురించి akella ramakrishna గారి అభిప్రాయం:
03/01/2009 6:05 am
ఈ రచయిత ఏమి చెప్పదలుచుకున్నది ముందు అనుకోలేదు. చదివితే అలాగే అనిపించింది. నా ఉద్దేశములో కథల్ని కొన్ని రకాలుగా విభజించడం అంత సులువైన పని కాదు. కథ ముఖ్యోద్దేశం కథ కథకూ మారుతుంది. వస్తువూ, శైలీ కంటే కూడా ఆ కథ పాఠకులకు ఎంత నచ్చిందనేది ముఖ్యం. మనస్సులను రంజింపగలిగితే అది మంచి కథే అవ్వాలి.
కొండ నుంచి కడలి దాకా గురించి mOhana గారి అభిప్రాయం:
02/28/2009 2:50 am
సుప్రసిద్ధ సంగీత దర్శకుడు రోషన్ దర్శకత్వంలో ఆఖరి చిత్రమైన అనోఖీరాత్ లోని పాట ఇది. తాత్వికమైన హిందీ సినిమా పాటలలో దీనికి ఒక అగ్ర స్థానం ఉంది. ఈ కాలపు వాళ్లకి మరో రోషన్ తండ్రి అని తప్ప ఈ రోషన్ గురించి ఎక్కువ తెలీదు. సంగీత స్వర్ణయుగంలోని సామ్రాట్టులలో ఇతడు కూడా ఒకడు. ఇక ముకేష్ వంటి “మంచి” గాయకుడు అందరికీ పరిచితుడే. విధేయుడు – మోహన
కొండ నుంచి కడలి దాకా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
02/27/2009 8:05 pm
సంపాదకులకి,
గోదావరి మీద సంగీత రూపకంలో..పాటలు తక్కువ గానూ .మాటలు ఎక్కువ గానూ ఉన్నాయి. నిజానికి బాపిరాజు గారి పాట తో పోలిస్తే కాశీనాధుని రాజశేఖర్ గారు పేర్కొన్న గోదావరి పాటలే ఎక్కువ బాగుంటాయి.
కిన్నెరసాని గేయం బాణీ మొత్తం విశ్వనాధ వారిదే !! రజనీ గారు కవి గారి tune నే వాడుకున్నారు. infact సత్యన్నారాయణ గారి కంఠం లోంచే కిన్నెరసాని వ్యధ ఎక్కువ ఆర్ద్రంగా విన్పిస్తుంది.
మనకి ఇవాళ ఇంతపాటి కూడా చేసే వాళ్ళు లేకపోబట్టి , ఇదే్ మ హ బాగుందని అనుకోవాలంతే!! ప్రళయ గోదావరి అని కృష్ణశాస్త్రి గారి గేయం చాలా బాగుంటుంది. గానీ ఆ గేయాన్ని ఈ రూపకంలో వాడలేదు. ఎందుకో మరి…మనకి పాతవన్నీ బాగున్నాయి అన్పించటం కద్దు.
government propaganda లాగా విసుగు కల్గించే సమాచారపు భారాన్నించి ..గోపాలరత్నం గారి గొంతు ఒక్కటే relief .
రమ.
టేబుల్ పై చేతి వాచీ గురించి baabjeelu గారి అభిప్రాయం:
02/27/2009 10:57 am
బాబా గారూ,
ఇది నేను చదివిన మీ రెండో కవిత. మొదటిది చీకటి నావనెక్కి ప్రపంచం వేకువ తీరం వైపు చేసే ప్రయాణం. (ఆదివారం అనుబంధం లోనేమో?) మోనాలిసా నవ్వున్న, పెళ్ళికానుక. ఇల్లు ఖాళీ చేస్తున్నపుడు డ్రాయర్ సొరుగులో దొరకడం. వరవోఁ శాపవోఁ? బతుకు తెలిసిన వారికి కోటి దండాలు. వెధవ బతుకు. మోనాలిసా నవ్వునీ పట్టించుకోదు. పెళ్ళికానుకకీ దిక్కు లేదు. ఎప్పుడో ఓ దిక్కుమాలిన సమయంలో అడ్డెస్తుంది. ఏది వరమ్మో, ఏది శాపమో తెలిసీ తెలియక అలమటిస్తూ కొండెక్కెస్తాం.
కొండ నుంచి కడలి దాకా గురించి baabjeelu గారి అభిప్రాయం:
02/27/2009 10:40 am
33,000 యెన్ లు బహుమతిగా గెలుచుకున్నదట ఈ రూపకం. అందులో సింహభాగం రజనీ తీసుకుని, మిగిలినదాన్ని అందరికీ వారి వారి “కాంట్రిబ్యూషన్” బట్టి పంచేరుట. దానికి విశ్వనాథ తబ్బిబ్బులైనారట.
ఇంకొహటి: ‘ఎవరికెవరు..” పాట ఇప్పటిదాకా హిందీ పాటకి “కాపీ” అనుకుని బాధపడీవాణ్ణి. ముఖేష్ పాట. సినిమా తెలీదు.
“… మిలే నదీకె జల్ మే, నదీ మిలే సాగర్ మే, సాగర్ మిలే కోన్ స జల్ మే కోయీ జానే న.” వెంటనే “ఏర్సెయ్ బార్సెయ్ …” పాడితే సరిగ్గా సరిపోతుంది.
శ్రీనివాస్ గారికి: “ఆఇంరే” వారు అసెంబ్లీ ఎదురుగా వారి ప్రాంగణం లోనే చిన్న దుకాణం పెట్టేరు. కానీ అక్కడ “స్టాండర్డ్” సీడీ లే దొరుకుతాయి తప్ప మరేవీ దొరకవు. అక్కడ కూచున్న అమ్మాయికి వాటి విలువ కూడా తెలీదు. మరి మీ కిలాటివి ఎక్కడ దొరుకుతాయి? గవర్నమెంటాలిటీని ఎలా దాటగలిగేరు మీరు?
నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి akella ramakrishna గారి అభిప్రాయం:
02/27/2009 6:07 am
పద్యమూ బాగుంది, వ్యాఖ్యానమూ బాగుంది. అయితే సంస్కృత పదాలను వాడడాన్ని గొప్పగా చెప్పడం నాకు కొంత నచ్చలేదు. తేట తెలుగు దూరమవ్వడానికి ఇలాంటి ప్రకియలే చాలవరకు కారణమని నా ఊహ. సంస్కృత పదాలకు సరి అయిన తెలుగు పదాలను కనిపెట్టలేక సంస్కృతాన్ని ఆశ్రయిస్తే అది గొప్పతనమా? మీలాంటి పెద్దలు ఈ విషయమై ఆలోచించగలరని మనవి.
చాటుపద్య రూపకం గురించి రాఘవ గారి అభిప్రాయం:
02/26/2009 2:51 am
ఇలాంటివి వేరే రూపకాలు కూడా ఈమాటలో ప్రచురించారా? వీలుంటే ఈ రూపకానికి అనుబంధంగా ఆ లంకెలు కూడా ఇవ్వగలరు.
జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
02/25/2009 11:30 pm
సంపాదకులకు,
నాకు చిన్న కుతూహలం! ఇలా కలిగింది మరి! అది ఎటువలెననంగా!!
కాళ్ళు ఫోటో తీసి పంఫడం ఏం గౌరవమండీ బాబూ! అంత భక్తి కలిగినప్పుడు స్వయంగా వెళ్ళి మొక్కాలి గానీ! మా తరంలో మేము అలా చేసేవాళ్ళం మరి! ఈ మధ్య ఆస్త్రేలియా లో రోడ్డు మీద నిలబడి “free hugs” కోసం ప్రచారం ఒకటి చూసేను. అన్నీ కొరతే అయిపోతున్న ట్టున్నాయి లోకంలో. మాట..స్పర్శ లాంటివి! ప్లాస్టక్ మయం..ఏం తెలుసుకోలేం! పొటోల్లో..కాళ్ళు మొక్కడం..కంప్యుటర్ లోంచి పూజలు చేసుకోవడం! అంతా మాయా ప్రపంచం మరి! భైరవభట్ల వారి కాళ్ళు …ఈసారి వ్యాసంతో పాటు గానే “జమిలి”గా పంపేస్తే సరి!
రోహిణీ ప్రసాద్ గారూ! తెనుగు మగవారి మీద మీ వ్యాఖ్యతో నాకు పేచీ ఏం లేదు గానండీ..అన్ని సంప్రదాయాలూ అలా నిరంతరంగా ఆడాళ్ళ వల్లే వర్ధిల్లే భారం ఇంకా ఇంకా ఆశిస్తూ ఉంటే..అందుకు ఈ ఆడాళ్ళూ ఇవాళ అనేక విధుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు కదా. ఇంకో బరువు కూడానా?? అని విసుగ్గా అనుకుంటాం కదా! ఇప్పటిదాకా మోసిన సంప్రదాయాలు చాల్లేదా ఏమన్నానా? for a change, ఆ విధి ఏదో కనీసం ఇప్పటికైనా “తెనుగు మగ వారే” నెత్తికెత్తుకోవచ్చును కదా! ఇది తప్పకుండా కృష్ణా స్నానమే”! ఏ కొండుభొట్ల అనుజ్న అఖ్ఖర్లేదు. పుణ్యం పురుషార్ధమూను. so ఇటుపై శాస్త్రీయ సంగీతానికి కుటుంబంలోని మగవాళ్ళూ అంతే ఆసక్తి చూపించడం ఆశించ వచ్చునా??
రమ.
బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
02/25/2009 5:15 pm
గొర్తిగారిలా అన్నారు ..
“తెలుగు నాటకం పేరున ఒక బ్లాగు పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. అందులో నాటక ప్రతులూ, వీడియోలూ అన్నీ ఉండేలా చేయాలన్న ఆలోచన ఉంది. అది రూపుదిద్దుకుంటే ఈ పుస్తకం అక్కడ పెడదాం. ”
అయ్యా మీ ఉద్దేశం గనక జయప్రభగారు రాసిన నాలుగోగోడ పుస్తకం అయితే ఆవిణ్ణి సంప్రదించకుండా ఇలాంటి ప్రణాళికలు వెయ్యకండి. తన కాపీరైట్లని సంరక్షించుకోవడంలో ఆవిడకి చాలా పట్టింపు ఉంది.
హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
02/25/2009 2:44 pm