Comment navigation


15802

« 1 ... 1277 1278 1279 1280 1281 ... 1581 »

  1. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/02/2009 8:47 am

    జయహో! సురేష్ కొలిచాల గారూ.
    వచ్చే సంచికలో వచ్చే “గ్యాఁపకాల” కోసం ఎదురు చూస్తూ….

  2. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/02/2009 4:16 am

    కనీసం ఇప్పటికైనా కొన్ని కొత్త సంగతులు — తప్పక ఆలోచించాల్సినవి, చర్చచేయాల్సినవీ –ఈ రివ్యూ వలన ముందుకి రావడం ముదావహం! అయితే ఇటువంటి స్థితి ఇప్పటికిప్పుడే రాలేదే? ఆధునికతకీ, సాహిత్యానికీ మధ్య అనివార్యంగా ఒక లంకె పెట్టిన మొదటి తరం నారాయణరావు గారి కాలానిదే కద? శ్రిశ్రీ కవిత్వం మీద విప్లవాత్మకంగా మొదలైన ఈ మోజు పెరిగి పెరిగి చివరికి పాత సాహిత్యం మీదా, సంస్కృత భాష మీదా కూడా వైముఖ్యంగా మారలేదా?

    వాల్మీకి రామాయణాన్ని తెనుగు చేసిన విశ్వనాధని ఎంతగా వెక్కిరించడానికి వీలుందో, అంతగానూ వెక్కిరించిన ఆధునికులూ, విప్లవ వర్గాలూ ఈ విషయంలో చాలా ప్రముఖమైన పాత్ర నే పోషించాయి. మల్లంపల్లి శరభయ్య గారి లాంటి మహా పండితులని ఏం గౌరవించిందీ తెనుగు సమాజం? ఆయన వ్యాఖ్యానాలు ఇప్పటి తరాలకి అర్ధమయ్యే తెనుగులోనే ఉన్నాయే? అంతటి పండితుడూ, ఆఖరి దశలో ఎంత ఇబ్బంది పడ్డారూ? ఎం దక్కిందీ ఆయన కృషికి తెనుగుల నించీ?

    నాకు శ్రీశ్రీ ప్రతిభ మీద గౌరవం ఉంది. కానీ ఆయనకి పాత సాహిత్యం విలువ తెలిసికూడా తనని అనుసరించే యువతరానికి దానిమీద వెగటు కల్గించాడు. నారాయణ రావు గారు ఆనాటి యువతరమే! ఆయన ఇవాళ మేలుకోవడం సంతోషమే! కానీ చాలా ఆలస్యం గా మేల్కోన్నారు. ఈ మాటలు ఆయన నలుగురితోనూ పంచుకునే కాలానికి ఆ పాత పండితులు లేరు; కొత్త పండితులు తయారు కాగల వీలులేదు. మరి ఆయన ఈ సందేశం ఎవరినుద్దేశ్యించి ఇస్తున్నారా అని ఆశ్చర్యంగా ఉంది. “గతజల సేతు బంధనం”!

    రమ.

  3. బోడి పద్యం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/02/2009 3:13 am

    మీ అశ్లీలమైన పద్యం మీ బలవంతపు బాధ లాగే..బోడి గా ఉంది.

    రమ.

  4. శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి యువ గారి అభిప్రాయం:

    03/01/2009 11:03 am

    బాగుందండీ.
    నిద్ర మేలుకోటానికి సస్పెన్స్ నవల నేను చాలాసార్లు ప్రయత్నించా. పది నిమిషాల కంటే ఎక్కువ చదవకుండానే నిద్ర వచ్చేది అదీ ఆ నవల తాలూకు కలలతో 🙂
    – యువ

  5. భ్రంశధార గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    03/01/2009 9:00 am

    మౌని చేవ్రాలు
    మున్నీటి పాలు.

    కవితంతా నిండిన తడి పాఠకుడి కళ్ళలోనూ చేరుతుంది కవిత పూర్తవగానే.. “ఈ ముసలి ఏరెంత ఒంటరిది” అన్న ప్రయోగం ఎంత నచ్చిందో చెప్పలేను. నిజంగా వంశధార ఒడ్డుకి వెళ్ళొచ్చినట్టుంది. తప్పక రాస్తూ ఉండండి.

  6. అతడు, నేను, అతడి కథ గురించి Maddipati Krishna Rao గారి అభిప్రాయం:

    03/01/2009 8:46 am

    రచనకు వన్నె తెచ్చేది విమర్శకుడని విన్నాను. మన భాగ్యమేమోగానీ, తెలుగులో విమర్శ ఎక్కువగా దూషణ భూషణాలకే పరిమితమైపోయింది. కథను ఆస్వాదించడంలో పాఠకుడి పాత్ర ఎంతో ఉన్నా ఆ పాత్ర నిర్వహణకు తర్ఫీదునిచ్చే వ్యాసాలు నాకున్న పరిమిత అనుభవంలో చాలా తక్కువ చూశాను. చాలా సంవత్సరాల క్రితం నాదగ్గర పనిచేసిన ఒక స్టూడెంటు music appreciation class తీసుకుంటున్నాను అంటే తేలిగ్గా గ్రేడు సంపాదించడానికనుకున్నాను, అప్పట్లో. “నా కళ్ళతో చూడ”మన్నట్టు పాఠకులకు మంచి సులోచనాలందించిన మాధవ్ కు ధన్యవాదాలు.

    కృష్ణారావు

  7. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి vrveluri గారి అభిప్రాయం:

    03/01/2009 8:38 am

    ఈ పుస్తక ప్రచురణ గురించి మరొక ముఖ్య విషయం మనవి చేస్తున్నాను.
    శ్రీ కొడవళ్ళ హనుమంత రావు గారు ఇచ్చిన భూరి విరాళం మూలంగానే ఈ పుస్తక ప్రచురణ సాధ్యం అయ్యింది.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  8. కథ దేని గురించి? గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/01/2009 8:20 am

    “వస్తువు గురించి చెప్పే విధానం వ్యాసానికి ఎంత దూరంగా వుంటే అంత మంచిదని మాత్రమే నా వుద్దేశ్యం”
    మంచి వుద్దేశ్యవేఁ. అయితే ఇప్పుడెవరు కథలు రాస్తున్నారు?. వ్యాసాలే రాస్తున్నారు.
    విరసం వారి పుణ్యవాఁని, రావిశాస్త్రి గారు, కుటుంబరావు గారు మరియూ కారా మేష్టారు గారు స్థాయిలో కథలు రావడం మానీసి ముప్ఫైయేళ్ళవుతున్నయి గదా?
    మధ్యలో నామిని, వంశీ ల్లాటి వాళ్ళు ఏవో గిలికినా.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి chavakiran గారి అభిప్రాయం:

    03/01/2009 8:14 am

    బాగా వ్రాస్తున్నారు. నెనర్లు. మీ ఆసక్తి ప్రతి పేజీలోను ద్యోతమౌతుంది.

  10. బోడి పద్యం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/01/2009 8:05 am

    అఫ్సరుడు గారికి. (“వరద” లో కొట్టుకొచ్చిన ప్రయోగం ఇది)
    గురుతుల్యులు లాటి వారు తప్ప మరొహళ్ళు ఈ “బోడి పద్యానికి” టీకా టిప్పణీ ఇవ్వలేరు.
    “సగం దళితం సగం ఖండితం” అంటే?
    “సగానికి కూలిన మసీదు గోడ మీద
    పడీ పడీ ఏడుస్తున్నాను ఇవ్వళ్టికీ” అంటే? ఎందుకూ?
    “ఆ సగం ముక్కకి ఎప్పుడో మోక్షం దొరికింది కదరా” హమ్మయ్య. మిగిలిన ముక్క సంగతి?
    ఈ మాటకి ధన్యవాదాలు.

« 1 ... 1277 1278 1279 1280 1281 ... 1581 »