Comment navigation


15802

« 1 ... 1276 1277 1278 1279 1280 ... 1581 »

  1. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి Velcheru Narayana Rao గారి అభిప్రాయం:

    03/02/2009 4:10 pm

    సురేష్ గారూ: కంప్యూటర్ నిరక్షరాస్యుణ్ణి నాకు ఒక కొత్త ప్రపంచపు సరిహద్దులు చూపిస్తున్నారు. ఆ సరిహద్దులకి అవతల ఎంత పెద్ద ప్రపంచం ఉందో ఊహించడానికి నాకింకా ధైర్యం చాలడంలేదు. అప్పుడుగాని ఆ ప్రపంచం గురించి సవిమర్శకమైన అవగాహన నాకు కలగదు. ఇంకా రాయండి, ఇంకా వివరంగా రాయండి. ఆ ప్రపంచం లోకి వెళ్లడనికి నాలాటివాళ్లకి ఒక దారి చూపించి, ఒక ఊతకర్ర ఇచ్చినవాళ్లవుతారు. మీరు రాసినంత స్పష్టంగా, అందంగా తెలుగు వచనం రాయగల వాళ్లు ఎక్కువమంది లేరు.
    వెల్చేరు నారాయణ రావు

  2. నాచన సోమన చతుర వచో విలాసం గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    03/02/2009 2:13 pm

    “టొప్పి” అన్న పదం నాచన వాడాడంటే నాకూ ఆశ్చర్యం వేసింది. ఇప్పటి దాకా నేను తెలుగు వారికి పోర్చుగీసు వారి ద్వారా సంక్రమించిన ఆయా, అల్మరా, కమీజు, (తాళం)చెవి, ఆస్పత్రి, మేజోడు, మేజా, మేస్త్రీ, పేన, పీపా, తువ్వాల, సబ్బు, బాతు, బొత్తాము వంటి అనేకానేక పదాలలో టోపీ కూడా ఒకటని అనుకున్నాను. Top అన్న పదానికి సంబంధించి *tuppaz అన్న ధాతువు నుండి పుట్టిన పదాలు జర్మానిక్ భాషలలోనూ, కొన్ని రొమాంటిక్ భాషలలోనూ కనిపించడం కద్దు. కానీ, ప్రాకృతంలోనూ, వేదకాలానంతర సంస్కృతంలోనూ “టోపిఆ”, “టోపిక”, “టుప్పిక” మొదలైన ప్రయోగాలున్నాయని ఇప్పుడే Turner “A Comparative Dictionary of Indo-Aryan Languages” చూస్తే తెలిసింది.

  3. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి mOhana గారి అభిప్రాయం:

    03/02/2009 12:46 pm

    నా ఉద్దేశంలో ఆ సామర్థ్యం చాలావరకు అంతరించి పోయిందనే అభిప్రాయం. అంతెందుకు, ఈమాటనే ఉదాహరణగా తీస్కోండి. అందులో పాఠకులు అందించే అభిప్రాయాలను ఒక కొలబద్దగా ఎంచుకొంటే, అభిప్రాయాలు ఎక్కువగా కథలపైన, తరువాత కవితలపైన. ఆ తరువాత సంగీతం, సినిమా వ్యాసాలపైన. తరువాతే సాహిత్యం వ్యాసాలపైన. ఈమాట రీడర్షిప్ చాల ఎలీట్. మరి ఇక్కడే ఇలా ఉంటే సాహిత్యంపైన, పుస్తకాలపై వ్యాసాలపైన దృష్టి ఎలా పోతుందండీ జనానికి? ఇలాగున్నా రచయితలు రాస్తున్నారంటే ఆ రచనలు వాళ్లకు ఒక తృప్తి కలిగిస్తుందేమో కాని అందరూ చదువుతారనే ఆశతో కాదని అనుకొంటాను నేను. విధేయుడు – మోహన

  4. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/02/2009 11:50 am

    అచ్చేసిన తానాకు, అందుకు విరాళమిచ్చిన హనుమగారికి కృతజ్ఞతలు.

    వెల్చేరుగారన్నట్లు పూర్వ గ్రంధాలకు ఇప్పటి భాషలో వ్యాఖ్యలు కావాలి. తేవాలి. మరి అట్లా చేసే సామర్థ్యం అంతరించిపోతుందనుకుంటున్నప్పుడు, దాన్ని మాత్రం ఎట్లా కాపాడుకోవాలి అని ప్రశ్న. వ్యాఖ్యానాలు చేసే సమర్థత, అన్వయించే చతురత ఉంటే ఈ రోజుకాకపోతే రేపైనా వ్యాఖ్యలు రాసి అచ్చేసుకుంటాం. కాని ఆ సమర్థత, పాండితి కోల్పోతే తిరిగి వాటిని పోందడం సాధ్యమేనా! ఇక దాన్ని కాపాడుకోవడం పిల్లి మెడలో గంట కట్టే పని లాగుంది.

    భాషలో బలమైనదేదైనా నిలుస్తుంది అని అనుకోవడానికి ఈ కృషి నిదర్శనం కాకపోయినా కొంతైనా ఊరట అనిపిస్తుంది.
    ===
    విధేయుడు
    -Srinivas

  5. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    03/02/2009 11:31 am

    ఇది కేవలం ప్రస్తావన మాత్రమే. తెలుగు రాయటం, చదవటం కంప్యూటర్ల సహాయంతో ఈ రోజుల్లో ఎంత సులువైపోయాయంటే దానికి ఎందరో కృషి చెయ్యడంవల్లనే అని మనం తెలుసుకోవాలి. వారిలో కొందరి పేర్లనైనా సురేశ్ గారు తన మలివ్యాసాల్లో ప్రస్తావిస్తారనుకుంటాను. ముందొచ్చిన చెవుల గురించి మనకు కాస్త తెలుస్తుంది. భాష, టెక్నాలజీ రెంటి మీదా అధికారం ఉన్న ఇటువంటి రచయిత చెప్పినది తెలుసుకోవడం బావుంటుంది.

  6. అతడు, నేను, అతడి కథ గురించి afsar గారి అభిప్రాయం:

    03/02/2009 11:12 am

    Dear Madhav:

    ఇలాంటి కథల గురించి మాట్లాడ్డం కష్టం. తీరా మాట్లాడ్డం మొదలెడితే అది కాస్తా కవిత్వమయి కూర్చుంటుంది. మీరూ అలాంటి ప్రమాదం లొ కాస్త పడ్డారు కాని. వచనానికీ- కవిత్వానికీ మధ్య అంచు పట్టుకుని జారిపొకుండా, పైకి వచ్చెశారు.

    విశ్లేషణ బాగుంది, త్రిపుర కథలు కొత్తగా, ఇష్టంగా చదివె వొకానొక కాలం లొ ఇలాంటి వాక్యాల కథలు బాగా నచ్చేవి. త్రిపుర తర్వాత, చంద్రశేఖర రావు, తుల్లుమిల్లి విల్సన్, అనిసెట్టి శ్రీధర్, మధ్యలొ కాస్త సుమనస్పతి రెడ్డి ఇలాంటి వచనంలోకి వెళ్ళి కథల్ని రాబట్టారు.

    మీ విశ్లేషణ ఆ అరుదయిన సాంప్రదాయానికి కొండంత బలం…మీ విమర్శ ఆ కథల చీకట్లో గొరంత టార్చ్ లైట్.

    అఫ్సర్

  7. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/02/2009 10:36 am

    ముందుగా ఇలాటి పుస్తకాన్ని ప్రచురించిన తానా ప్రచురణల విభాగం వారికి, దానికి భూరి విరాళాన్ని అందించిన హనుమంతరావుగారికి జోహార్లు.
    ప్రాచీన సాహిత్యం నిరాదరణకు గురికావడానికి ఒక కారణం దానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అనడంలో సందేహం లేదు. అయితే, ప్రాచీన సాహిత్యం మీద అభిమానం, అందులో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు దాన్ని వైజ్ఞానికంగా పరిశోధించకపోవడం కూడా అంతే కారణమని నా అభిప్రాయం. సాంప్రదాయిక సాహిత్యం మీద చర్వితచర్వణమైన పరిశోధక గ్రంథాలు కాకుండా వైజ్ఞానిక విశ్లేషణతో కూడిన పరిశోధక గ్రంథాలు ఎంతవరకూ వచ్చాయి. మన పండితులలో ఎంతమంది పరిశోధకులున్నారు? అటువంటి పరిశోధన జరగనప్పుడు ఆ గ్రంథాల విలువ ఈ కాలంవాళ్ళకి ఎలా తెలుస్తుంది? పండితులు పరిశోధకులు కారు, పరిశోధకులకి తగిన పాండిత్యం లేదు అనే స్థితి ఏర్పడింది.
    ఏదైనా గతంగతః కనీసం ఇప్పుడైనా ఉన్న కొద్దిమందినీ వినియోగించుకొని, పండితులు పరిశోధకులు కలిసి ప్రాచీన సాహిత్యంపై వేల్చేరువారు సూచించినట్టు మరింత శాస్త్రీయ అధ్యయనం జరిపితే బావుంటుంది.

  8. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/02/2009 9:31 am

    వెల్చేరు నారాయణ రావు గారికి నమస్కారములు.

    ఆధునికత గురజాడతో మొదలవలేదు, వెంకటాధ్వరి గారి లాటి వారితోనో ఇంకా ముందుగానో మొదలయ్యుండొచ్చు లాటి వాదన నిజవేఁ కావొచ్చు. కాకనూ పోవచ్చు. ఆధునికత ఎక్కడ మొదలైతేనేం? ఆధునికం అంటే ఇప్పటికీ వుండాలి. బహుశా అన్నమయ్యని “నొక్కీసినట్టు” వెంకటాధ్వరి గారినీ “నొక్కీసుంటారు” అప్పటి తరం వాళ్ళధ్వనిజం నిలకడ మీద తెలిసిపోతుంది కదూ?

    ఈ పుస్తకంలో పరమ రమణీయకరవైఁన కవిత్వం వుందన్నారు. దాని గురించి ఎక్కువ రాయలేదు మీరీ వ్యాసంలో. పోన్లెండి ఎలాగోలాగ చదివి చూస్తాం.”రీడబిలిటీ” వున్న వాళ్ళందర్నీ సామాన్య పాఠకులు నెత్తిన పెట్టుకున్నారు. వుదాహరణకి యం.వీ.నాథ్, మ.వెం.కృష్ణమూర్తి, “షాడో” మధుబాబు వగైరాలు. ఈ పుస్తకం కూడా అలాటిదే అయితే, ఇన్నాళ్ళకి దొరికింది కాబట్టి తప్పకుండా నెత్తిన పెట్టుకుంటాం.
    ఇహ భాష విషయం: జనజీవనంలో వుపయోగపడని భాషని ఆ జనులు వదిలేస్తారు. దీనికి అమెరికాలూ, యూరోపులూ వెళ్ళక్కర్లేదు. ఖర్గ్ పూరూ, కలకత్తా, తమిళ్నాడూ, బొంబాయీ వగైరాలు వెళ్తే తెలుస్తుంది. అందులో వాడి, వేడి ఆధునికత్వంతో నిండిపోయిన కవిత్వం రాసినా ఎవరూ పట్టించుకోరు. అంతేకాని సమర్ధులయిన కవులు లేరని ఏ భాషా ఆత్మహత్య చేసుకోదు.

    కొడవళ్ళ వారికి: పుస్తక ప్రచురణకి భూరి విరాళం ఇవ్వడం “జయ హో” అని “డేంచు” కట్టవలసిన విషయం. అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.

  9. నాచన సోమన చతుర వచో విలాసం గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/02/2009 9:21 am

    చక్కని వ్యాసం, ఎప్పటిలాగానే.

    “మేరా జోతా హై జపానీ, యె పత్లోన్ ఇంగ్లిస్తాని, సర్ పైన్ లాల్ టోపి రూసి, ఫిర్ భీ దిల్ హైన్ హిందుస్తానీ” ..పాట అప్రస్తుతం అనుకోకండి! అందులో ఉన్న “టోపి” పదం నాచన సోమన పద్యంలో కూడా ఉందటే, “టోపి” అనే పదం తెలుగులో ఎప్పుడు అడుగుపెట్టిందో అని అనుమానం, ఆశ్చర్యం.

    కావ్యం చదివి, అర్థం చేసుకోవడమే కష్టం. అంతచేసినా ఇట్లాంటి విశ్లేషణ చేయడం ఇంకా కష్టం. కృతజ్ఞతాభినందనలతో
    విధేయుడు
    – Srinivas

  10. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి vrdarla గారి అభిప్రాయం:

    03/02/2009 9:14 am

    వ్యాసం బాగుంది. పరిశోధన దృష్టి ఉంది.

« 1 ... 1276 1277 1278 1279 1280 ... 1581 »