Comment navigation


15803

« 1 ... 1274 1275 1276 1277 1278 ... 1581 »

  1. నన్నెచోడుని క్రౌంచపదము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    03/05/2009 7:51 am

    కృష్ణ మోహన రావు గారూ,

    మీ వ్యాసం అద్భుతంగా వుంది. సాహిత్యంలోంచి చరిత్రని తవ్వి తీసే కోణం బాగుంది. ఈ తరహా వ్యాసాలు ఈమధ్య తెలుగులో చూసినట్లు లేదు. మీ సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిపాదించారు.
    నాదొక చిన్న సందేహం. వీరేశలింగం, బుర్రా శేషగిరిరావు, కోరాడ రామకృష్ణయ్య, వీరందరూ నన్నెచోడుడు క్రీ.శ 1160 – 1170 తరవాత వాడనీ ఒక సిద్ధాంతాన్ని బలపరిచారు. దానికి చాలా కారణాలు చూపించారు. అంతకుముందు వేటూరి ప్రభాకర శాస్త్రి క్రీ.శ. 1120 కాలం వాడనీ చెప్పారు. కానీ ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేదు. అయ్యుండచ్చు, కావచ్చు నంటూ సందిగ్ధంలో వదిలేసారు. అలాగే ఇతను ఖచ్చితంగా 1160 కాలానికి చెందినవాడనీ చెప్పడానికి ఈ ఆధారంగా ఈ క్రింది పద్యం చూపించారు.

    ఆతపభీతి నీడలు రయంబున మ్రాకులక్రిందు దూరెనో
    ఆ తరులుం దృషాభిహతులై తమ నీడలు తార త్రాగెనో
    భాతి ననంగ నీడ లురుపాదపమూలమలం దడంగె గ్రీ
    ష్మాతపమధ్య వాసరములందు జలింపకయుండు నెండలన్

    ఈ పద్యం అర్థం ( మీకోసం కాదు, మిగతావారికి ) – “ఎండ వేడికి భయపడి చెట్ల నీడలు చెట్ల క్రింద దూరాయి. దాహానికి తట్టుకోలేక చెట్లు తమ నీడల్ని తామే తాగేసాయన్నట్లు ఎక్కడా నీడే లేదు. అంత భయంకరమైన వేసవది”.
    ఈ పద్యం నన్నెచోడుడు “కళింగత్తు పరణి” అనే తమిళ కావ్యాన్నుండి సంగ్రహించాడనీ చెబుతారు. ఈ పద్యం తమిళ ప్రతి నాకు తెలీదు. (సంపాదించడానికి ప్రయత్నిస్తాను).

    కళింగత్తు పరణి రాసింది జయంగొండాన్ అనే కవి. ఇతను మొదటి కులోత్తుంగ చోళుడి ఆస్థాన కవి. ఈ చోళ రాజు కాలం సుమారుగా 1135. దీన్ని బట్టి జూస్తే క్రీ.శ 1160 – 1170 తరవాత కాలం అయ్యే అవకాశం వుంది కదా? ఏమంటారు?

  2. కొండ నుంచి కడలి దాకా గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/05/2009 7:35 am

    శ్రీనివాస్ గారికి,
    వుభయకుశలోపరి.
    అర్థం కాని భాషలో వ్రాసిన దానిని, అర్థం కాదని వదిలెయ్యడం, ఎవరి mail వల్లో కష్టపడి చదవడం, చదివి దానికి సమాధానమీయడం మీ సహృదయతకు తార్కాణాలు. మరేట్లేదుకానండీ. మా మంచిపని చేసేరండీ. ఈ మాట ప్రతీ సంచికలోనూ ఏదో వొహటి పెట్టాల మీరు. లేకపోతే వొల్లకోం.

  3. ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/05/2009 7:12 am

    లక్ష్మన్న గారూ,
    ఆయొక్క “సిగరెట్ పేకెట్ సీను” నాకిప్పటికీ గుర్తుంది. ఎందుకో గానీ, ఈ సినిమా, జల్సాఘర్, పథేర్ పాంచాలి కన్నా బాగున్నాదనిపిస్తుంది. ఆచేత్తోనే, శ్యామ్ బెనెగళ్ సినిమాల గురించి కూడా రాద్దురూ. ముఖ్యంగా భూమిక సినిమా గురించి.అదే చేత్తో, బాబ్బాబూ, తెలుగు సినిమాల గురించి కూడారాయండీ. సినిమాని మేధావులు ఎంత “అసుంటా” పెట్టినా, దాని ప్రభావం జన జీవనం మీద చాలా ఎక్కువ. మీ లాటి వాళ్ళు రాసి, ఈ మాటలో పడితే, పక్కన పెట్టడానికి కుదరని సినిమాకి మర్యాదా మన్ననా. దయచేసి తెలుగు సినిమాల గురించి కూడా రాయండి.

  4. అనంతకవితాకాంచి గురించి రాఘవ గారి అభిప్రాయం:

    03/04/2009 8:38 am

    భలే. నవీనబంధకవిత్వం. ప్రేమబంధానికి సూచికగా కాఞ్చీబంధం వాడడం బావుందండీ.

  5. కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar గారి అభిప్రాయం:

    03/04/2009 7:28 am

    శ్రీనివాస్ గారూ,

    నేను ఉదహరించిన సైట్, మీరు ఇచ్చిన సైట్ ఒకటే అని ఇప్పుడే గ్రహించాను.
    నేను bookmark చేసుకున్న mainpage url, మీరు ఇచ్చిన దానికంటే భిన్నంగా ఉండడంతో వెంటనే గుర్తు పట్టలేక పోయాను. Thanks for your effort anyways.

    తెలుగు లలిత సంగీతం అంటే ఆసక్తి ఉన్న వారు, “ఎత్తవోయీ కేల” పాటని ఇక్కడ విని ఆనందించవచ్చు

    Thanks to Sri B. N. Murty who originally recorded these songs.

    రాజాశంకర్

  6. కొండ నుంచి కడలి దాకా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/04/2009 6:01 am

    శ్రీనివాస్ గారూ!
    మీరు ఇబ్బంది పడకండి. మీ అభిప్రాయానికి తెనుగు అనువాదం పంపినా నేను respond కాను.నా భావాలు నావి.

    రమ.

  7. నన్నెచోడుని క్రౌంచపదము గురించి రాఘవ గారి అభిప్రాయం:

    03/04/2009 4:32 am

    కృష్ణమోహనరావుగారూ, మీరు నన్నెచోడుని కాలాన్ని నిర్ధారించడానికై లక్షణగ్రంథాలని ఇతర కవుల ప్రయోగాలనీ వాడుకుంటూ వ్యాసాన్ని తార్కికంగా నడిపించిన తీరు ఆద్యంతమూ చాలా బావుంది.

    ఇలాంటి అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు.

  8. నాచన సోమన చతుర వచో విలాసం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/04/2009 3:21 am

    సంభాషణాశైలిలోనూ నాటకీయతలోనూ గౌరనను (హరిశ్చంద్రోపాఖ్యానము) మించిన కవి లేడనే నా భావమ్ ఈ వ్యాసమ్ చదివిన తరువాత ఇనుమడించింది. మీరు చూపిన లక్షణాలన్నీ నాచనలో చంద్రరేఖా సదృశంగా వుంటీ గౌరనలో సూర్య ప్రభగా గోచరిస్తాయి. దయచేసి ఈ మహాకవి గూర్చి మీ యంత ప్రతిభాశాలులు వ్రాస్తే చదవాలని వుంది.

  9. నాచన సోమన చతుర వచో విలాసం గురించి రాఘవ గారి అభిప్రాయం:

    03/04/2009 3:20 am

    ౧ (సందర్భాన్నిబట్టి) సాధారణంగా సంభాషణలలో వ్యావహారిక భాష వాడడం వల్ల వచ్చే అందం, వచ్చే రససిద్ధి వ్యావహారికేతర భాష వలన కలగడం కొంచెం కష్టం.

    ౨ మంచి ప్రశ్న అడిగారు. సంస్కృతిలో కూడా ఈ రకమైన మార్పులూ చేర్పులూ సహజమే అనుకుంటే ఈ ప్రశ్న కొంత అసంబద్ధంగా అనిపిస్తుంది. కానీ అయ్యో నా భాష నా సంస్కృతి అనుకునేవాళ్లలో చాలామందికి కచ్చితంగా జీర్ణించుకోలేని సమాధానమే వస్తుంది ఈ ప్రశ్న వేసుకుంటే. ఈ ప్రశ్నని ఎవరికి వారు తెలుగువారిలో ఒకరిగా వేసుకుంటే వచ్చే సమాధానం, తెలుగవారందరి పరంగా ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం కూడా వేరేగా ఉండచ్చు కూడా. ఏదేమైనా తెలుగువారందరూ దీని గురించి ఆలోచించవలసినదే.

    ఇక నాకు అనిపించినదిదీ… తెలుగు భాషలో ఇంగ్లీషు పదాల వాడకం ఎక్కువైంది. ఎంత భాషపై మమకారం ఉన్నా ఎంత కాదనుకున్నా నాబోటివాళ్లకి అక్కడక్కడా ఆంధ్రభాష చ్యుతమై ఆంగ్లభాష అయ్యి కూర్చుంటూనే ఉంది. భాషలో ఈ మార్పు సహజం అనుకుందాం అంటే, వేషభాషలు విద్యావ్యవస్థ నిద్రాహారపుటలవాట్లూ ఇలా ఒకటీ రెండూ కాదు దాదాపు అన్నీ మారాయి. మారుతునే ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో చూస్తే ఇదివరకు ప్రాంతీయమై ఉన్న అలవాట్లూ గట్రా ఇప్పుడు ప్రాంతభేదాలు తగ్గుముఖం పట్టడం వల్ల మారుతూ వస్తున్నాయి. దీని వల్ల ఒకటి మాత్రం సూటిగా తెలుస్తోంది. ఇంకొక శతాబ్దం తర్వాత తెలుగు కావ్యాలు చదవాలంటే ప్రస్తుతం కంటే ఎక్కువగా చరిత్రలో జ్ఞానం కూడా అవసరమౌతుందీ అని!

  10. ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    03/03/2009 10:19 pm

    వెంకటేశ్వర్రావు గారూ!

    whistle blow చేసేరు. కానీ వినేవాళ్ళున్నారా అని !? మీరు వివరించిన పుస్తక పఠనానుభవంలో రేపటి తరాలు భాగస్వామ్యం అయే అవకాశం ఉందా? వాళ్ళు లాప్ టాప్ ముందే… మీ వాలుకుర్చీని మించిన ఆనందాన్ని పొందుతారో ఏమో?! మీ బాధ.. మీ హెచ్చరిక సబబైనవి. అయితే పుస్తకాల విలువని గుర్తించిన వాళ్ళకి మాత్రమే అవి అర్ధం అవుతాయి. వారి సంఖ్య ఇవాళ ఎంతా అన్న దే నా సందేహం.
    రమ.

« 1 ... 1274 1275 1276 1277 1278 ... 1581 »