Comment navigation


15803

« 1 ... 1269 1270 1271 1272 1273 ... 1581 »

  1. ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి పవన్ కుమార్ గరికపాటి గారి అభిప్రాయం:

    03/14/2009 10:24 am

    సంపాదకీయం అంటే పత్రిక లేదా పత్రిక నడిపే వారి ఆభిప్రాయాలను వెల్లడి జేయడం. సంపాదకీయాలు, Routine వ్యాసాలకి భిన్నంగా ఉండాలి. ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది. అభిప్రాయ వ్యక్తీకరణే కాబట్టి, చారిత్రక రుజువులతో పని లేదు. ఈ పరిధిలోకి ఇమడక పోతే, సంపాదకీయం అన్న పేరు తొలగించి మామూలు వ్యాసంగా ప్రకటించడమే సబబు.

    గరికపాటి పవన్ కుమార్.

  2. కథ దేని గురించి? గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/14/2009 8:29 am

    సీతారామయ్యగారూ, ఇప్పుడు మంచి కథలు రావటం లేదని నా అభిప్రాయం కాదు. కిందటి ఆదివారం ఖదీర్ బాబు రాసిన మంచి కథ చదివేను ఒక ఆదివారం అనుబంధంలో. కేశవరెడ్డి గారి మునెమ్మ, చివరిగుడిశె లాటి కథలూ వచ్చేయి ఈ మధ్యనే. పసలపూడి కథలూ వచ్చేయి. డెభ్భైల తరవాత విరసం ప్రభావం వల్ల “రొటీను” కథలు ఎక్కువైపోయేయి. కథలు రాసే వారి నిజాయితీ కథలో కనబడదు. అదీ నా వ్యధ. ఇంకొహ విషయం కథలు రాసీవారంటే కవులకూ, నవలా రచయిత(త్రు)లకూ, విమర్శకులకూ ఆఖరికి చదివే వాళ్ళకూ చిన్న చూపు కదా? అప్పుడూ ఇప్పుడూ కూడాను.

  3. కథ దేని గురించి? గురించి ఆరి సీతారామయ్య గారి అభిప్రాయం:

    03/14/2009 5:32 am

    ఈ వ్యాసం మీద అభిప్రాయం వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు.

    బాబ్జీలు గారూ, మంచి కథలు రావిశాస్త్రి, కుటుంబరావులతోనే ఆగిపోయాయనీ, తర్వాత మంచి కథలు రాకపోవటానికి కారణం విరసం అనే అభిప్రాయాలతో నేను ఏకీభవించను. మంచి కథలు ఇప్పుడూ వస్తున్నాయి. విరసానికి ముందుకూడా వ్యాసాల్లాగా కథలు రాసిన వారున్నారు. ఎప్పటికప్పుడు పాతరోజుల్లో మంచి కథలుండేవి అనుకోవటం మనకే కాదు, ఇతర భాషల్లో కూడా కనిపిస్తుంది. అది మానవ సహజమేమో.

    వంశీ గారు, ఈ వ్యాసం “రంజింప చేయటంలో కొద్దిగా వెనక పడింది” అన్నారు. సహృదయంతో కొద్దిగా అన్నారు! మీ అభిప్రాయం నాకు అర్థమయింది. నిజానికి ఈ వ్యాసం మీకు కొద్దిగా నచ్చినా దానికి కారణం ఈమాట వారి రివ్యూవర్సే. లోపాలు మాత్రం నావి.

    సాయి బ్రహ్మానందం గారూ, నేను పొరపాటు చేసి ఉండవచ్చు, కాని, నాకు తెలిసినంతవరకు, ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్ లో చేసే కథనాన్ని తెలుగులో ఉత్తమ పురుష అంటారు. అలాంటి కథల్లో కథకుడి ఆలోచనలు తప్ప ఇతర పాత్రల ఆలోచనల గురించి రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రథమ పురుష కథనంలో రచయితో లేక మరో కథకుడో కథ చెప్తాడు కాబట్టి అన్ని పాత్రల ఆలోచనల గురించీ రాయటానికి అవకాశం ఉంటుంది. పాత్రల ప్రవర్తన చిత్రించటం ద్వారా కథ నడపాలనీ, వాళ్ళ మనోగతాల గురించి ఎక్కువగా రాయటం అంత మంచిది కాదనీ నా అభిప్రాయం. అదీగాక, నేను ముఖ్యంగా చెప్పదలిచింది, స్వంత అభిప్రాయాలను వ్యక్తీకరించటానికే కథ నడిపినట్లు బాహాటంగానే కనిపిస్తే, వీలయిన (కాకపోయినా) ప్రతిచోటా రచయితే వ్యాఖ్యానం చేస్తే, కథ పేలవంగా ఉంటుందని.

    భూషణ్ గారూ, ధన్యవాదాలు. అవును, వాతావరణ కల్పన ఉజ్వలంగా ఉన్న కథలు చదవటం ముగించిన తర్వాత కూడా మనసులో ఉంటాయి.

  4. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి Sudhakar గారి అభిప్రాయం:

    03/14/2009 2:31 am

    Suresh gaaru,
    Your article is an excellent insight into the origins of internet and eemaata. By using the quotations of telugu writers you have created a genuine telugu work.
    Wouldn’t it be a nice idea to encourage famous telugu people to treasure their memories on Eeemata for the future generations?.
    Best wishes.
    Sudhakar

  5. నన్నెచోడుని క్రౌంచపదము గురించి పవన్ కుమార్ గరికపాటి గారి అభిప్రాయం:

    03/13/2009 6:50 pm

    అభిప్రాయాలకు చర్చలకు మధ్య చాలా తేడా ఉంది.
    పాఠకులు వ్యక్తం చేయవలసింది వ్యాసం మీది అభిప్రాయాలను,
    అంతేగాని, ఇతరుల అభిప్రాయాల మీద అభిప్రాయాలను కాదు.
    ఖండన ముండనలు అంతకన్నా కాదు.ఇది అభిప్రాయ వేదికే కాని చర్చా వేదికని నేననుకోను.ఈ మాట సంపాదకులు రచయితకు సూచనలు లాగానే అభిప్రాయాల ప్రకటనలకు కూడా సూచనలు చేయడం వల్ల ఈ ఆరణ్యకాండ (ఒకరినొకరు వేటాడుకోవడం ) సుందరకాండగా (ఒకరితో ఒకరు మాటాడుకోవడం) మారుతుంది.

    అస్మదీయుని సూచనలు (నాకు ఏ వీరతాళ్లు అవసరం లేదు)

    1.అభిప్రాయం రచనకే పరిమితం కావాలి.

    2.ఇతరుల అభిప్రాయాల్లోకి వెళ్ళరాదు.

    3.చర్చలకు వేరొక వేదిక పెట్టుకోవచ్చు.

    (అందులో కొంత వేడి పుట్టినా ఫర్వాలేదు,ఒకరినొకరు
    సమర్థించుకోవడం,ఖండించుకోవడం గట్రా ఉండవచ్చు)

    గరికపాటి పవన్ కుమార్.

    [మీ సూచనలకు కృతజ్ఞతలు. పాఠకుల అభిప్రాయాలు ప్రకటించే విధానంపై కొంతకాలంగా ఈమాట సంపాదకులలో చర్చ జరుగుతున్నది. త్వరలోనే కొన్ని మార్పులు ప్రవేశపెట్టబోతున్నాం. – సం.]

  6. నాచన సోమన చతుర వచో విలాసం గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/13/2009 8:41 am

    దండాలు కావేఁశ్వర్రావు గారూ, సిలక్కి సెప్పినట్టు సెప్పేరు. దండాలు.
    దండాలు “మోహన” గారూ, కవి సార్వభౌముడు ప్రశ్నార్థకము మీరు పెట్టిన జాగాలో పెట్టేడా? ఆయన ప్రకారం సింగభూపాలుడు సర్వగ్యుఁడు కదా ఈ కథా కమామీషు మీరిద్దరే విశదీకరించగలరు.
    ఈ మాట, నాలాటివాళ్ళకి చేస్తున్న వుపకారం: కడుపులోని చల్ల కదలకుండా సాహిత్య ధర్మ సందేహాలని తీర్చడం. అదీ కూడా గురుతుల్యులిద్దరితో.
    మీర్రాసినట్టే ఈ మాట పాఠకులకి సాహిత్యం, అది ప్రాచీనవైఁనా, ఆధునికవైఁనా, చాలా యిష్టం. అయితే ప్రాచీన సాహిత్యం మీద మీరిద్దరూ, మీతో బృందావనరావు గారూ అద్భుతంగా రాస్తున్నారు. మీర్రాసిన వ్యాసాలకి, రమ గారూ, లైలా గారూ మరియు నాగులపల్లి గారు లాటివారు, అప్పుడప్పుడు మిగిలిన వాళ్ళూ ఓ చెయ్యి వేస్తున్నారు. అర్థం పర్థం లేని రాతలూ వుంటాయి (నాకీ సంగతి బాగా తెలుసు). అయితే మీరిద్దరూ కలిసి మంచి పాత సాహిత్యం మీద అందరికీ “మోహాన్ని” మరియు “కామాన్ని” మరీ ఎక్కువ చేసెస్తున్నారు. “పాచ్చింతకాయ పచ్చడి రుచి” నాకు అనుభవైకవేద్యము. మరో సారి మీ యిద్దరికీ మనఃపూర్వక దండాలు. అయితే మీరిద్దరూ/ముగ్గురూ “ప్రాచీన” సాహిత్యం గురించి విమర్శనాత్మకవైఁన వ్యాసాలు ఎందుకు రాయరూ? ఎందుకు రాయకూడదు? వాటిలోని “అబ్బో అబ్బో” ల గురించే ఎందుకు రాయాలి? లేకపోతే పెద్దలను విమర్శించకూడదు అనే సంస్కారం వల్ల రాయట్లేదా? అదీ కాదు అప్పటి కావ్యాలని ఇప్పటి కొలతలతో ఎలా తూయగలం అంటే ఇప్పటి కొలతలకి తూగలేని అప్పటి కావ్యాలని ఇప్పటివాళ్ళు ఎలా ఆనందించాలో కూడా మీరే చెప్పాలి. ఇందులో “ఇగటాలేటీ లేవు” తాపత్రయం తప్ప.

  7. నన్నెచోడుని క్రౌంచపదము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/13/2009 7:19 am

    మోహనగారు
    అందుబాటులోలేని పద్యాలను అందించినందుకు మనసారా కృతజ్ఞతలు.

    ఇప్పుడు క్రమంలో పద్యాలను చదివినప్పుడు, “లలితగతి మెఱయు శివుడజుడు” దగ్గరకు రాగానే, మీరు లలితగతిపై చెప్పింది ఇంకా సముచితంగా అనిపిస్తుంది. మొదటిసారి చదివినప్పుడు అర్థమే అయింది, ఇప్పుడు ఆనందాన్నిచ్చింది.

    “సర్వగతు, సర్వమయు, శర్వు నుతింతున్”, “పరమపరు, పరమగురు, పరము నుతింతున్” అన్న పదబంధాలు అలలవలె లయాన్వయంగా లయకారున్ని నుతిస్తున్నట్లున్నాయి.

    ఆ. కావ్యమంత చదువ కాలంబు లేకున్న
    రసము చూపినారు రయము గాను
    ఎవరి చేతి రచనొ యెఱుగక పోయినా
    చేతులిచ్చువాడు శివుడె యెపుడు

    విధేయుడు
    -Srinivas

  8. నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana గారి అభిప్రాయం:

    03/13/2009 2:39 am

    కుమారసంభవము మొదటి భాగము MBPలో, రెండవ భాగము DLIలో ఉన్నది. శ్రీనివాస్ గారు వారడిగిన పద్యాలు –

    ఏ దక్షాధ్వరమును ధ్వంసము చేశాడో అదే దక్షుడు పరమేశ్వరుని సన్నుతి చేయు పద్యములు. మొదటి మూడు లయగ్రాహులు, తరువాతి రెండు లయహారిణులు, చివరిది కందము. కాలాభావమువల్ల మక్కీకి మక్కి మృత్యుంజయరావుగారి తాత్పర్యాలను అలాగే ఇస్తున్నాను.

    ఫాలతల విస్ఫురిత లోలతర భాసుర వి-
    శాల భయ దాసుర కరళ నయనాగ్ని
    జ్వాల లొకొ, పింగళ జటాళి యొకొ, నా బెరసి
    తూలి, దివి భూషణ చయాలుళిత దీర్ఘ
    వ్యాళ నికరంబొకొ, కరాళియొకొ, నాఁ దనరి
    క్రాల, వరనృత్య పరిలోలుఁ డగు శ్రీకం
    కాలధరు, నుజ్జ్వల ఫాలధరు, సన్నిశిత
    శూలధరు, నీశ్వరు, దయాళు నుతియింతున్ (2.99)

    నొసట తోచునట్టియు, చలించునట్టియు, ప్రకాశించునట్టియు, విరివియైనట్టియు, ఘోర రాక్షస భయంకరములయినట్టియు, కంటి మంట లా పింగళవర్ణముగల జడల సమూహమా యన వ్యాపించి చలించి, ఆకాశమున నలంకారములై కదలు పొడవైన పాముల మొత్తమా యన నొప్పి ప్రకాశింపగా, మేలయిన నాట్యమునందు మిక్కిలి యాసక్తిగల శ్రీకంకాలధరుడును, కపాలధరుడును, శూలధరుడును దయాస్వరూపుడును అగు
    నీశ్వరుని స్తుతింతును.

    ఉర్వర చలింపఁ, గులపర్వతచయం బడరఁ,
    బర్వ భువి నంబునిధు, లౌర్వ శిఖి యాడన్,
    బూర్వసుర నాగ సుర పూర్వదిగధీశ యమ
    వార్విభు ధనేశ్వరుల గర్వము లడంగన్,
    సర్వగణముఖ్యులును, సర్వగణ భూతములు
    నార్వ, నహి భూషణము లార్వ, దిశలం గం-
    ధర్వతతి పాడఁగ, నపూర్వనటనాదిగురు,
    సర్వగతు, సర్వమయు, శర్వు నుతియింతున్ (2.100)

    భూమి చలింపగను, కులపర్వతము లేడును అదరగను, సముద్రము లేడును భూమిపై వ్యాపింపగను, బడబాగ్ని యాడగను, రాక్షసుల, నాగుల, దేవతల, ఇంద్రుని, యముని, వరుణుని, కుబేరుని గర్వము లడగగను,
    ఎల్ల గణాధీశ్వరులును,ఎల్ల భూతగణములును అర్వగను, సర్పాభరణములు ఊర్పులు పుచ్చగను, దిశల గంధర్వ సమూహము పాడగను అపూర్వ నటనము చేతకు మొదటి గురువైన వాడును, సర్వమును పొందిన వాడును, అన్నిట నిండినవాడును అగు ఈశ్వరుని స్తుతింతును.

    101వ పద్యము కవిరాజశిఖామణి వ్యాసములో ఉన్నది.

    కఱ గళము ఘనఘనము తెఱఁగనగ, నుఱికలును
    గఱడియలు ద్రిపుదలును గిఱిడియలుఁ బెల్లై
    యుఱుము లన వడిఁ జెలఁగఁ, గొఱ నెలయుఁ దనురుచులు
    మెఱుగు లన దశదిశల మెఱవఁ, దలమీఁదన్
    వఱలు సురనది దొలఁకి నెఱిఁ జినుకులనుగురియఁ
    దఱిమికొని తొలుమొగులు తఱియనగ, నృత్యం
    బొఱ నమరుఁ లలితగతి మెఱయు శివుఁ డజుఁ డమరుఁ
    డుఱుఫలము లొసఁగు నని యెఱిఁగి నుతియింతున్ (2.102)

    నల్లని కంఠము దట్టమైన మేఘ మనగను, ఉఱికలు, కఱడియలు, త్రిపుదలు, కిఱిడియలు అను వాద్యవిశేషము లధికమై ఉఱుము లనునట్లు ధ్వనింపగను, చంద్రకళయు శరీరకాంతులు మెఱుగులన పది దిక్కులందును ప్రకాశింపగను, తలమీద నున్న ఆకాశాగంగ తొనకి చినుకులను కురియగను, తొలకరి సమయమో యన నృత్య మమరు శివుడు, అజుడు అమరుడు నైనవాడు సముచితములైన ఫలము లొసగునని తెలిసి వానిని నుతింతును.

    ఈ పద్యములోని లలితగతినే వ్యాసములో లయహారిణికి నన్నెచోడుడు ఇచ్చిన పేరో అని ప్రస్తావించాను.

    కరనికర మురు వితపవరము లనఁ, గరతలము
    లరుజరుచిఁ దలిరు లనఁ, గరజములు పుష్పో
    త్కర మనఁగ, వనరుహజ హరి దనుజ ముని మనుజ
    సుర గగనచర భుజగ గరుడగణ యక్షే
    శ్వరుల కతిదయ నొసఁగు వరఫలము లనిశమును
    భరిత మయి మధుసమయ సురవర మహీజ
    స్ఫురణ కెన యనఁ, దనరు వరదు, హిత నటనరతుఁ,
    బరమపరుఁ, బరమగురుఁ, బరము నుతియింతున్ (2.103)

    చేతులమొత్తము మేలయిన గొప్ప కొమ్మలనగను, అరచేతు లెర్రని కాంతిచే చివురు లనగను, గోరులు పూల మొత్త మనగను, బ్రహ్మ విష్ణువు రాక్షసులు మునులు మనుష్యులు దేవతలు ఖేచరులు నాగులు గరుత్మంతుడు ప్రమథ గణములు కుబేరుడు నను వారి కిచ్చు వరము లనెడు ఫలములు ఎప్పుడును నిండి వసంతకాల కల్పవృక్షమును స్ఫురింపజేయు వరదుడును, నాట్యరతుడును, పరాత్పరుడును, పరమగురువును పరముడును అగు శివుని స్తుతింతును.

    సురపానలాంతకసుర
    వరుణానిల ధనద రుద్ర వందిత చరణున్
    ధరణి జల వహ్ని మరు దం-
    బర రవి సోమాత్మమూర్తిఁ బరము నుతింతున్ (2.104)

    అష్ట దిక్పాలకులచే నమస్కరింపబడు పాదములుగలవాడును, పంచభూతములు సూర్యచంద్ర యజమాను లనెడి అష్టముర్తుల స్వరూపమైనవాడును అగు పరమేశ్వరుని నుతింతును. (ఒక చిన్న ప్రశ్న – ఈశానుడు, ఈశ్వరుడు వేరు వేరా?)

    విధేయుడు – మోహన

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Ramesh Kumar Buddu గారి అభిప్రాయం:

    03/12/2009 11:39 pm

    నాగ మురళీకృష్ణ గారు,
    మీరు వ్రాసిన వ్యాసము వలన చాలా మంచి విషయములను తెలుసుకున్నాను. చాల సరళంగా అన్ని విషయములను వివరించారు. హస్థసాముద్రిక శాస్త్రము గురించి కూడా వీలుకుదిరినన్ని విషయములను వివరించగలరని కొరుకుంటున్నాను.

    రమెష్ కుమార్, అహ్మదాబాద్ .

  10. నన్నెచోడుని క్రౌంచపదము గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    03/12/2009 6:12 am

    వ్యాసం పైన గాక, ఇంకొకరి అభిప్రాయాలపైనే ఎక్కువగా రాయడం చూసిన తరువాత వ్యాసం చదవడానికి కొంత ధైర్యం, కాదు కొత్త కారణం దొరికింది. పదాల వాడుకను బట్టి మాత్రమే కాక, ఛందస్సును బట్టి కాలాన్ని, అనుకరణలను బేరీజువేసే పద్దతి చాలా సకారణంగా, ఆసక్తికరంగా ఉంది. ఇటువంటి యత్నం ఇంతకుపూర్వం ఎవరైనా చేసారో లేదో తెలియదు.

    మోహనగారూ, మీ వ్యాసం పుణ్యమా అని ‘కుమారసంభవం’ చదవాలనే కోరిక సంభవించింది. మళ్ళీ కృతజ్ఞతలు. ద్వా.నా.శాస్త్రి గారు నన్నెచోడుడు పది (or 12?) లయగ్రాహి, లయ* (?), మరియు ఒక కందంలో ఎంతో ఆవేశంతో శివున్ని స్తుతించాడు అన్నారు. నా దగ్గరున్న రెండవ భాగం (7 నుంచి 12 ఆశ్వాసాలవరకు) లో అది కనబడలేదు. మొదటి భాగంలో ఉందనుకుంటాను. ఆ ప్రతి నా దగ్గర లేదు, దాని వివరాలేమైనా తెలిస్తే దయ చేసి చెప్ప మనవి. దశమాశ్వాసంలోని దారిద్రావణాదశకం పద్యాలు బాగున్నాయి.

    శివ కథాపరమైన వ్యాసం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో, చివరగా అభిప్రాయాలపై చిన్న అభిప్రాయం. శివుడు అందరిలోనూ ఉన్నాడు, కాని తెలుగువారిలో కొంచెం ఎక్కువున్నాడనిపిస్తుంది. ఎందుకంటే మనం తొందరగా శివమెత్తిపోతుంటాం కనుక. అనుగ్రహిస్తే అవధులులేవు. ఆగ్రహించినా అడ్దులేదు. నిలకడగ ఉండే శక్తి, అదే శక్తిరూపిణి, కూడా మనతోడే ఉండాలనుకుంటూ,
    విధేయుడు
    -Srinivas

« 1 ... 1269 1270 1271 1272 1273 ... 1581 »