మోహనగారు చక్కగా వివరించారు. ఇది చదవగానే నాకు శంకరాభరణంలోని “బ్రోచే వారెవరురా…” అన్న పాట గుర్తుకువచ్చింది. అందులో కూడా యిలాగే ప్రాస ఉంది కాని పొడవైన పాదాల వల్ల గుర్తించడం కష్టం.
“ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమె రా”
ఇలా ప్రతి చరణంలోనూ ప్రాస ఉంటుంది. ఈ విషయం గమనించకుండా పాట చివరి చరణంలో మార్పు చేసారు.
“ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా! నా
పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయిబట్టి విడువకు” అన్న సాహిత్యాన్ని
“భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు” అని మార్చారు. బహుశా ఇక్కడ “వాసుదేవుడవు” అన్న పదంతో యతి/ప్రాస కోసం ఈ మార్పు చేసారేమో!
వాసుదేవయని వెడలిన పాటను నేను ఈ విధంగా అర్థం చేసికొన్నాను. ఇందులోని చరణాలలో ప్రతి చరణానికి రెండు పాదాలు. ఒక్కొక్క పాదంలో రెండు అర్ధపాదాలకు అంత్యప్రాస. అర్ధ పాదాలకు యతియో,
లేక ప్రాసయతియో చెల్లుతుంది. రెండు పాదాలకు ప్రాస ఉంది.
ఉదాహరణ –
మాటిమాటికిని మీసము దువ్వి మన్మథరూపుడు తానని క్రొవ్వి
దాటిదాటి పడుచును తా నివ్విధంబున పలుకుచు పకపక నవ్వి
1. రెండు పాదాలకు ప్రాస (ట-కారము) ఉంది.
2. మొదటి పాదములో మాటిలోని మా అక్షరానికి మన్మథ లోని మ అక్షరానికి యతి, రెండవ పాదంలో దాటి లోని దా అక్షరానికి విధంబున లోని ధకారానికి యతి.
3. అర్ధ పాదాలలోని చివరి వ్వి కి అంత్యప్రాస.
చివరి చరణంలో బాగుకు పతితకు అక్షరయతి, రాగ కు త్యాగ కు ప్రాసయతి. పాటలలో యతియైనా ప్రాసయతియైనా ఉంటే చాలు. పద్యాలలో అక్షరయతి మాత్రమే వృత్తాలలో, జాతులలో ఉంటాయి. ఈ పాట ఒక విధంగా ఉపజాతి వంటిది. యతియైనా ప్రాసయతియైనా అక్కడ చెల్లుతుంది. అదనంగా ఇక్కడ ప్రాస, అంత్యప్రాసలు కూడా ఉన్నాయి.
Sir,
I quote from page 1 of your essay
“మధ్యమావతి రాగంలో ‘నగుమోమూ కనలేనీ’, శంకరాభరణంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ వంటివి కొన్ని ఉత్సవ సంప్రదాయకీర్తనలుగా పరిగణిస్తారు. ”
I submit that the song in Madhyamavathi goes “నగుమోము గలవాని నా మనోహరునీ” and not “నగుమోమూ కనలేనీ”.
On the matter of anthya praasa, please quote an example of a song with anthya prasa where the 2nd syllable prasa was not present.
“మనసుకి సుఖాన్నివ్వాలి”..అన్న దాన్ని వివరణ ఇవ్వాలని నాకు అన్పించలేదు..కానీ మరొక్క మాట చేర్చాలంటారా?? నొప్పి కల్గించి..అస్తిమితం చేసి ఆ చదివిన దేదో మనకీ అనువర్తించి..చివరికి దాన్ని మరిచిపోవటం అసాధ్యమై..మళ్ళీ మళ్ళీ దాని వైపే ఆలోచన పరిగెత్తి……….ఇది సుఖమా? అంటే అదే సుఖం..నేను చేప్పింది సాహిత్యంలో అలాటి సుఖాన్ని.
కాఫ్కా నాకు మరీ ఇష్టం. మీరు పేర్కొన్న ఆతని వాక్యం very kafkaesque.
మంచి వివరణ నా భావానికి. థాంక్యూ.
రమ.
“సారమతి రాగం మోక్షముగలదా కృతిలో ఆరాధ్యదైవం శివుడు, రాముడు కాదు. వీణావాదన లోలుడౌ శివ మనోవిధ మెరుగరు అని ఉంటుంది సాహిత్యం” అని రాసారు. మీరు చెప్పింది సరైనదే! నాదే తప్పు. సంపాదకుల్ని రాముణ్ణి: శివుడిగా మార్చమని అడుగుతాను. రెండు “నగుమోము” కీర్తనలున్నాయి. ఒకటి మధ్యమావతిలో, రెండోది ఆభేరిలో. ఇది తప్పు కాదు.
“శ్రీగణనాధం కృతి దగ్గర సాహిత్యాంశాల చర్చలో త్యాగరాజు ఎక్కడా రెండో అక్షరం ప్రాస, అంత్య ప్రాస కలిపి వాడలేదు అన్నారు.” నా దగ్గరున్న తొమ్మిదొందల పైచిలుకు కృతులున్నాయి. అందులో ఏ కృతులోనూ ఆది, అంత్య ప్రాసలు ఒకేసారి వాడినట్లు లేదు. మీ ఎరికలో ఏదైనా ఉంటే చెప్పండి.
మీరు తప్పు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. సవరించమని సంపాదకులకి నా విన్నపం.
చాలా మంచి వివరణ, విశ్లేషణ, మాధవ్ గారూ. మంచి పోలికల్తో, ఉదాహరణల్తో, చారిత్రక నేపథ్యాల్తో చాలా బాగా రాశారు. ఎటొచ్చీ ఈ కథ ఆత్మహత్య గురించని మాత్రం నేనస్సలు కల్లో గూడా అనుకోలేదు.
అంతగా పంచెలెగ్గట్టి చెమడాలెక్కదియ్యడానికి ఇక్కడ ఏమైందో అర్ధం కాదు. “మనసంతా అశ్లీలం” అనే వాడుక తప్ప వేరే అశ్లీలం ఏముందో కూడా అర్ధం కాదు. బైదవే, పుంజీడు వాగుడు కాయలు విమర్శకుల్ని చెయ్యవు.
చాలా బావుంది. సామాన్యంగా తెలియని అనేక విషయాల్ని వివరాల్ని తెలిపారు. అభినందనలు. ఒకట్రెండు చిన్న తప్పులు కన్పించాయి, అచ్చుతప్పులయి ఉండొచ్చు.
మొదటి పేజిలో మధ్యమావతి రాగంలో కీర్తన నగుమోము గలవాని, మూడవ పేజిలో సారమతి రాగం మోక్షముగలదా కృతిలో ఆరాధ్యదైవం శివుడు, రాముడు కాదు. వీణావాదన లోలుడౌ శివ మనోవిధ మెరుగరు అని ఉంటుంది సాహిత్యం.
శ్రీగణనాధం కృతి దగ్గర సాహిత్యాంశాల చర్చలో త్యాగరాజు ఎక్కడా రెండో అక్షరం ప్రాస, అంత్య ప్రాస కలిపి వాడలేదు అన్నారు. దీనికి జస్టిఫికేషనేవిటో అర్ధం కాలేదు. ఆయన కృతులు, కీర్తన లన్నిటిలోనూ రెండో అక్షరం ప్రాస తప్పకుండా ఉంది. లేని కృతి నేనెక్కడా చూళ్ళేదు. అంత్య ప్రాసగానీ, ఇతర శబ్దాలంకారాలు గానీ ఉంటే ఉన్నాయి, లేకపోతే లేవు. ఇదేమీ అభియోగం కాదు, కానీ శాస్త్ర చర్చ కాబట్టి నా అబ్సర్వేషను చెబుతున్నానంతే.
కవిగారే పెట్టిన పేరుకన్నా దీనికి వేరే అభిప్రాయం అనవసరం. ఐతే దీన్నిపద్యం అనడానికి నాకు మనస్కరించటం లేదు. మాత్రా ఛందస్సో లేక వృత్త ఛందస్సో కలిగి ఏ పాదం ఎందుకు ఎక్కడ ఎలా ఆపాలో అనే దానికి విస్ఫష్ట మైన నియమాలు కలిగిన పద్యం అనే సాహిత్య ప్రక్రియకీ దీనికీ ఒకే పేరు తగునా అని సందేహం. బిస్మిల్లా ఖాన్ సన్నాయి పాప అనే పాదంలో “పాప” దగ్గర నెందుకువిరిచారో అవగతం కాలేదు. కవితలో కవి హృదయం గానీ ఉద్దేశం గానీ జటిలమైన ప్రహేళిక అనిపిస్తోంది. నాకైతే అర్థం కాలేదు మరి.
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
03/17/2009 8:44 pm
మోహనగారు చక్కగా వివరించారు. ఇది చదవగానే నాకు శంకరాభరణంలోని “బ్రోచే వారెవరురా…” అన్న పాట గుర్తుకువచ్చింది. అందులో కూడా యిలాగే ప్రాస ఉంది కాని పొడవైన పాదాల వల్ల గుర్తించడం కష్టం.
“ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమె రా”
ఇలా ప్రతి చరణంలోనూ ప్రాస ఉంటుంది. ఈ విషయం గమనించకుండా పాట చివరి చరణంలో మార్పు చేసారు.
“ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా! నా
పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయిబట్టి విడువకు” అన్న సాహిత్యాన్ని
“భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు” అని మార్చారు. బహుశా ఇక్కడ “వాసుదేవుడవు” అన్న పదంతో యతి/ప్రాస కోసం ఈ మార్పు చేసారేమో!
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి mOhana గారి అభిప్రాయం:
03/17/2009 4:22 pm
వాసుదేవయని వెడలిన పాటను నేను ఈ విధంగా అర్థం చేసికొన్నాను. ఇందులోని చరణాలలో ప్రతి చరణానికి రెండు పాదాలు. ఒక్కొక్క పాదంలో రెండు అర్ధపాదాలకు అంత్యప్రాస. అర్ధ పాదాలకు యతియో,
లేక ప్రాసయతియో చెల్లుతుంది. రెండు పాదాలకు ప్రాస ఉంది.
ఉదాహరణ –
మాటిమాటికిని మీసము దువ్వి మన్మథరూపుడు తానని క్రొవ్వి
దాటిదాటి పడుచును తా నివ్విధంబున పలుకుచు పకపక నవ్వి
1. రెండు పాదాలకు ప్రాస (ట-కారము) ఉంది.
2. మొదటి పాదములో మాటిలోని మా అక్షరానికి మన్మథ లోని మ అక్షరానికి యతి, రెండవ పాదంలో దాటి లోని దా అక్షరానికి విధంబున లోని ధకారానికి యతి.
3. అర్ధ పాదాలలోని చివరి వ్వి కి అంత్యప్రాస.
చివరి చరణంలో బాగుకు పతితకు అక్షరయతి, రాగ కు త్యాగ కు ప్రాసయతి. పాటలలో యతియైనా ప్రాసయతియైనా ఉంటే చాలు. పద్యాలలో అక్షరయతి మాత్రమే వృత్తాలలో, జాతులలో ఉంటాయి. ఈ పాట ఒక విధంగా ఉపజాతి వంటిది. యతియైనా ప్రాసయతియైనా అక్కడ చెల్లుతుంది. అదనంగా ఇక్కడ ప్రాస, అంత్యప్రాసలు కూడా ఉన్నాయి.
విధేయుడు – మోహన
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
03/17/2009 11:09 am
యుగంధర్ గారూ,
కళ్యాణి రాగంలో ఈ కృతి గురించి మూడవ భాగంలో చెప్పాను. చూడండి.
ఇందులో అంత్య ప్రాస మాత్రమే ఉంది. గమనించగలరు.
మరోసారి మీకోసం ఈ కృతి మొత్తం ఇస్తున్నాను.
వాసుదేవయని వెడలినయీ
దౌవారికుని కనరే
అనుపల్లవి: వాసవాది సుర పూజితుడై
వారిజ నయనుని మదిని తలచుచును (వాసు)
నీరు కావి దోవతులను కట్టి
నిటలమునను శ్రీచూర్ణము పెట్టి
సారి వెడలియీ సభలో జుట్టి
సారెకు బంగరు కోలను పట్టి (వాసు)
మాటి మాటికిని మీసము దువ్వి
మన్మథ రూపుడు తానని క్రొవ్వి
దాటి దాటి పడుచును తానివ్వి
ధంబున పలుకుచు పక పక నవ్వి (వాసు)
బాగు మీర నటనము సేయుచును
పతిత పావనుని తా వేడుచును
రాగ తాళ గతులను పాడుచును
త్యాగరాజ సన్నుతుని పొగడుచును (వాసు)
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
03/17/2009 10:19 am
Sir,
I quote from page 1 of your essay
“మధ్యమావతి రాగంలో ‘నగుమోమూ కనలేనీ’, శంకరాభరణంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ వంటివి కొన్ని ఉత్సవ సంప్రదాయకీర్తనలుగా పరిగణిస్తారు. ”
I submit that the song in Madhyamavathi goes “నగుమోము గలవాని నా మనోహరునీ” and not “నగుమోమూ కనలేనీ”.
On the matter of anthya praasa, please quote an example of a song with anthya prasa where the 2nd syllable prasa was not present.
కథ దేని గురించి? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/17/2009 8:44 am
హనుమంతరావు గారూ!!
“మనసుకి సుఖాన్నివ్వాలి”..అన్న దాన్ని వివరణ ఇవ్వాలని నాకు అన్పించలేదు..కానీ మరొక్క మాట చేర్చాలంటారా?? నొప్పి కల్గించి..అస్తిమితం చేసి ఆ చదివిన దేదో మనకీ అనువర్తించి..చివరికి దాన్ని మరిచిపోవటం అసాధ్యమై..మళ్ళీ మళ్ళీ దాని వైపే ఆలోచన పరిగెత్తి……….ఇది సుఖమా? అంటే అదే సుఖం..నేను చేప్పింది సాహిత్యంలో అలాటి సుఖాన్ని.
కాఫ్కా నాకు మరీ ఇష్టం. మీరు పేర్కొన్న ఆతని వాక్యం very kafkaesque.
మంచి వివరణ నా భావానికి. థాంక్యూ.
రమ.
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:
03/17/2009 7:02 am
యుగంధర్ గారూ,
“సారమతి రాగం మోక్షముగలదా కృతిలో ఆరాధ్యదైవం శివుడు, రాముడు కాదు. వీణావాదన లోలుడౌ శివ మనోవిధ మెరుగరు అని ఉంటుంది సాహిత్యం” అని రాసారు. మీరు చెప్పింది సరైనదే! నాదే తప్పు. సంపాదకుల్ని రాముణ్ణి: శివుడిగా మార్చమని అడుగుతాను. రెండు “నగుమోము” కీర్తనలున్నాయి. ఒకటి మధ్యమావతిలో, రెండోది ఆభేరిలో. ఇది తప్పు కాదు.
“శ్రీగణనాధం కృతి దగ్గర సాహిత్యాంశాల చర్చలో త్యాగరాజు ఎక్కడా రెండో అక్షరం ప్రాస, అంత్య ప్రాస కలిపి వాడలేదు అన్నారు.” నా దగ్గరున్న తొమ్మిదొందల పైచిలుకు కృతులున్నాయి. అందులో ఏ కృతులోనూ ఆది, అంత్య ప్రాసలు ఒకేసారి వాడినట్లు లేదు. మీ ఎరికలో ఏదైనా ఉంటే చెప్పండి.
మీరు తప్పు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. సవరించమని సంపాదకులకి నా విన్నపం.
[తప్పు సవరించబడినది – సం. 3/17/09]
అతడు, నేను, అతడి కథ గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
03/17/2009 6:32 am
చాలా మంచి వివరణ, విశ్లేషణ, మాధవ్ గారూ. మంచి పోలికల్తో, ఉదాహరణల్తో, చారిత్రక నేపథ్యాల్తో చాలా బాగా రాశారు. ఎటొచ్చీ ఈ కథ ఆత్మహత్య గురించని మాత్రం నేనస్సలు కల్లో గూడా అనుకోలేదు.
బోడి పద్యం గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
03/17/2009 6:25 am
అంతగా పంచెలెగ్గట్టి చెమడాలెక్కదియ్యడానికి ఇక్కడ ఏమైందో అర్ధం కాదు. “మనసంతా అశ్లీలం” అనే వాడుక తప్ప వేరే అశ్లీలం ఏముందో కూడా అర్ధం కాదు. బైదవే, పుంజీడు వాగుడు కాయలు విమర్శకుల్ని చెయ్యవు.
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ గారి అభిప్రాయం:
03/17/2009 6:20 am
చాలా బావుంది. సామాన్యంగా తెలియని అనేక విషయాల్ని వివరాల్ని తెలిపారు. అభినందనలు. ఒకట్రెండు చిన్న తప్పులు కన్పించాయి, అచ్చుతప్పులయి ఉండొచ్చు.
మొదటి పేజిలో మధ్యమావతి రాగంలో కీర్తన నగుమోము గలవాని, మూడవ పేజిలో సారమతి రాగం మోక్షముగలదా కృతిలో ఆరాధ్యదైవం శివుడు, రాముడు కాదు. వీణావాదన లోలుడౌ శివ మనోవిధ మెరుగరు అని ఉంటుంది సాహిత్యం.
శ్రీగణనాధం కృతి దగ్గర సాహిత్యాంశాల చర్చలో త్యాగరాజు ఎక్కడా రెండో అక్షరం ప్రాస, అంత్య ప్రాస కలిపి వాడలేదు అన్నారు. దీనికి జస్టిఫికేషనేవిటో అర్ధం కాలేదు. ఆయన కృతులు, కీర్తన లన్నిటిలోనూ రెండో అక్షరం ప్రాస తప్పకుండా ఉంది. లేని కృతి నేనెక్కడా చూళ్ళేదు. అంత్య ప్రాసగానీ, ఇతర శబ్దాలంకారాలు గానీ ఉంటే ఉన్నాయి, లేకపోతే లేవు. ఇదేమీ అభియోగం కాదు, కానీ శాస్త్ర చర్చ కాబట్టి నా అబ్సర్వేషను చెబుతున్నానంతే.
బోడి పద్యం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
03/17/2009 3:40 am