యదుకుల భూషణ్ గారి అభిప్రాయం ప్రకారం కేవలం చ్చందోవేత్తలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలి.మిగిలిన వారు వారి భావాలని దాచుకోవాలి. నేను గమనించినంత వరకూ కామేశ్వర్రావు గారూ, బృందావన్రావు గారూ,కృష్ణమోహన రావు గారూ మాత్రమే పాత సాహిత్యం గురించి ఈమాట లో మాట్లాడుతున్నవారు. మిగిలిన వారంతా వాటిని చదివి మెచ్చుకుంటూనో లేదా తమకి వచ్చిన సందేహాల్నీ సూచనల్నీ చెప్పేవారే. తెలుగు సాహిత్యంలో నిష్ణాతులు కొద్దిమందే కాబోలు. అలాంటప్పుడు ఎవరి పరిమితుల్లోంచే వారు మాట్లాడటం సహజం. అందుకోసమే కదా వెబ్ పత్రిక నడుపుతున్నదీ! ఈపాటి దానికి ఈ చాలెంజీలు దేనికండీ? జ్ఞానం విషయంలో గాని, సమాచారం విషయంలో గానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి పత్రికలో వాంఛనీయం గాని, ఇదేం విసుర్లూ? నిందాపూర్వకమైంది, ఆధిక్యంతో కూడిందీ గొంతు ఎవరిదైనా బాగుండదు.
తెలుగుదేశంలో ఉన్న పత్రికల్లోని అవలక్షణాల కన్నా దారుణంగా ఇటువంటి పధ్ధతులు మీ పత్రికల్లో ఉండటం ఆశ్చర్యం! చాలా మంచి పధ్ధతి మీ పత్రికలో బెజ్జాల కృష్ణమోహన రావు గారిది. కటువు గా మాట్లాడుకోవటంలో ఘనత ఏమీ లేదు. ఆ ధోరణి బలహీనతకి గుర్తు. అలాగే ఒక సూచన బాగుంటే దాన్ని అనుసరించటంలో తప్పేముందీ ఎవరైనా? అలాకాక అస్పష్టంగా ఎందుకో, ఏమిటో తెలియకనే ఇద్దరు అకారణంగా దెబ్బలాడుకున్నట్టుగా వ్యాఖ్యలు చేసుకోవడం పత్రికని చదివే ఇతర పాఠకుల్ని వీటితో ప్రమేయంలేని వారిని అయోమయ పరచడమే అవుతుంది కద. యదుకులభూషణగారు చ్చందోశాస్త్రంలో నిష్ణాతులా?? ఇటువంటి వ్యాఖ్యల కన్నా ఆయన తనకి తెలిసిన విషయాల్ని వివరంగా వ్యాసంగా రాయడం మంచిదేమో?!
మోహనరావుగారూ, మీ రెండో భాగం కోసం ఎదురుచూస్తాను.
రమ.
మోహనరావుగారు: మీరు నన్నయ, నన్నెచోడులలో ఎవరు ముందు, ఎవరు వెనుక అన్న దానిని గురించి స్థిరమైన అభిప్రాయం చెప్పలేదని నేను చూశాను. మీరు అలాంటి అభిప్రాయన్ని బలపరచాలని ఆ వ్యాసం రాయలేదని కూడా నేను గ్రహించాను. మీరు ఛందస్సుని వాడుకున్న తీరు నిజంగా చాలా బాగుంది. నన్నెచోడులు చాలామంది ఉన్నారనీ, బద్దెనకు కూడా నన్నెచోడుడనే పేరుందని ఇలాంటి సూచనలవల్ల కాలక్రమ సమస్యలు అనవసరంగా జటిలమవుతున్న పరిస్థితిలో మీ వ్యాసంలో ఛందస్సు మీద చేసిన చర్చ నిజంగా ఉపకరిస్తుంది. కానీ నన్నెచోడుడి సంప్రదాయం వేరు, అతనికి అనుయాయులు లేరు అన్న విషయాన్ని గుర్తించడం మీ వ్యాసానికి మరికొంత స్పష్టతనిస్తుందని నా ఉద్దేశం. మీ సౌమనస్యానికి నా కృతజ్ఞతలు.
– శ్రీనివాస్
వ్యాసం నచ్చినవారికి నా నమస్సులు. నచ్చనివారికి ఇక మీద బాగుగా రాయటానికి ప్రయత్నిస్తా. ఒక రెండు విషయాలు. ఈ వ్యాసరచనకు ప్రోత్సాహం శ్రీ బ్రందావనరావుగారి పద్యం. నన్నెచోడుని విపులంగా ఎందుకు పాఠకులకు పరిచయం చేయరాదనే భావం నాకు అప్పుడు కలిగింది. మొదటి భాగంలో అతని కవిత్వాన్ని గురించి వివరించాను. రెండవ భాగం నా అభిప్రాయాలు. పాఠకుల అభిప్రాయాలకు జవాబు ఇవ్వరాదనే
భావం నాకు లేదని వినయపూర్వకంగా విన్నవించుకొంటున్నాను.
కలింగత్తుప్పరణి మదురై ప్రాజెక్టులో దొరుకుతుంది. బ్రహ్మానందంగారు చెప్పిన పద్యం చూడగలిగాను. దాని అర్థపర్థాలు అడిగి తెలుసుకోవాలి. ఒక పద్యం ఎవరు ముందు రాశారో ఎవరు అనుకరించారో
చెప్పడం సులభం కాదు. భూషణ్ గారు నాగేంద్ర చోడుడు 940 కాలం వాడన్నది బహుశా కవిగారి సిద్ధాంతాన్ని ఉద్ఘాటిస్తున్నారని అనుకొంటాను. రెడ్డిగారు కూడా నన్నెచోడుడు శాలివాహనశకం కాక విక్రమశకం వాడాడని అనుకొన్నారు.
శ్రీనివాస్ గారూ, నాకు నన్నయ లేక నన్నిచోడులలో ఒకరు ముందు మరొకరు వెనుక అనే స్థిరమైన అభిప్రాయం లేదు, అట్టి అభిప్రాయాన్ని బలపరచాలని ఈ వ్యాసం రాయలేదు. నేను చెప్పిందల్లా రేచన నన్నెచోడుని పిదప అని మాత్రమే. నన్నయ నన్నెచోడులకు ముందు గ్రంథాలు ఉన్నాయని పంపడు తెలుగులో రాశాడని వేంకటరావుగారు అభిప్రాయ పడ్డారు. ఇక పోతే నన్నెచోడులు ఎందరో ఉన్నారు. బద్దెనకు కూడా నన్నెచోడుడని పేరుందని చదివాను. నా ఆశయం ఛందస్సు కొన్ని సంశయాలను తీరుస్తుందేమోననే. చరిత్రగురించి చర్చించడానికి నాకు అర్హత లేదు. ముఖ్యంగా కొత్త వృత్తాల ఉపయోగం, వాటి పేరులు, చిత్రకవిత్వం ఇత్యాదులను చోడుడు ఉపయోగించాడు. వీటిని కన్నడం నుండి గ్రహించి ఉండాలి. కవిరాజమార్గములో చిత్రకవిత్వం ఉంది.
శ్రీనివాస్ గారూ, ఆదిదంపతుల శృంగారాన్ని వర్ణించేటప్పుడు కాలిదాసుకు కూడా సమస్యలే వచ్చాయి. ఈశ్వరునిపై ఎన్నో భక్తిభరితమైన పద్యాలు కుమారసంభవంలో ఉన్నాయి. బహుశా నేను బాగా ఎత్తి చూపలేదేమో, అందుకు నన్ను క్షమించాలి. నన్నెచోడునికి సంగీతంలో కూడా బాగా పరిచయము ఉండి ఉండాలి. అతడు ఒక తరువోజలో ఎన్నో రాగాలను (సాహురి, ఫలమంజరి, పౌరాలి, ఆందోలి, భైరవి, నాట రాగాలను) పేర్కొన్నాడు. ఇవన్నీ పురాతన రాగాలు, అపూర్వ రాగాలు. అందులో కొన్ని బృహద్దేశిలో కూడా ఉన్నాయి. సంగీతజ్ఞానము ఉన్న వాళ్లు పరిశోధనలు చేయవచ్చు. వ్యాసం అచ్చవడానికి ముందు విజ్ఞుల క్రిటిసిసం తీసికోవాలని ప్రయత్నించాను, కాని సఫలీకృతుడిని కాలేక పోయాను.
I have been a big fan of you and your writings and you never disappointed me….As usual – a fantastic piece from you.
శ్లేష ఉపయోగించడం చేతనయిన వారు దానిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఒక కొలిక్కి రావాలి అనుకునే చర్చల్లో శ్లేష ఉపయోగం ఒక రకంగా అపాయాన్నే సృష్టిస్తుందని Sreenivas గారి మాటలు తెలియచేస్తున్నాయి.
ఇక విభేదించడం అనే నాగరికత సంగతికి వస్తే అభ్యాసపూర్వకంగా కానీ, ప్రయత్నపూర్వకంగా కానీ అది పెంపొందే అవకాశాలు ఎక్కువ. ప్రసిద్ధమయిన ప్రతీదీ స్థిరమయింది కాదు కదా… అలాగే ఇదీనూ… తెలుగునాట విమర్శ తక్కువేమీ కాదు… చూసే వారి కళ్ళల్లో , రాసే వారి రాతల్లో ఉంటుంది. మనదగ్గర లేనిది, మనకు తట్టనిది ఇతరుల బుఱ్ఱల్లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయేవారు ఉన్నంత మటుకున్నూ, ఆ పైన రాసిన వాటిల్లోనే వారికి అర్థమయిన, కావలసిన వాక్యాలను మటుకే తీసుకుని వాటి మీద చెలరేగిపోవటం సాధారణమే అన్న ధోరణితో ఉన్నవారున్నంతమటుకున్నూ ఇలా కొనసాగుతూనే ఉంటుంది… అదీ ఈ విమర్శ లేదన్న పార్శ్వపు నొప్పికి కారణం…
ఇక్కడ చర్చకు, అసలు నువ్వు మాట్టాడే మాటలకు తాత్పర్యమే లేదు వెంకోజీ అని అంటే చెప్పేదేమీ లేదు…ఇంతే సంగతులు చిత్తగించవలెను… 🙂
[ఈ వ్యాఖ్య ఎడిట్ చేయబడినది – సం.]
కవిరాజశిఖామణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/11/2009 7:42 am
నమస్కారం. ఎంతో పరిశ్రమతో ఎన్నో విషయాలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మూడవపేజీలో, “తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని *తిక్కనకు* అంకితము చేసి..” అని ఉంది. Typo అనుకుంటాను.
తట్టిన కొన్ని ఆలోచనలు.
కవి తామరలు విష్ణువు, లక్ష్మీదేవి కన్నులలా ఉన్నాయనడం చాలా అసహజంగా, కృత్రిమంగా ఉంది. తెలియని దానిని, తెలిసిన దానితో పోల్చడం, లేక తెలిసిన దానిని సైతం ఇంకో తెలిసిన దానితో పోల్చడం చూస్తాం. ఇక్కడ కళ్ళకు కనబడే తామర పూలను కనిపించని లక్ష్మీనారాయణుల కళ్ళతో పోల్చడం కవిత్వం కన్నా, పాపము శమించుగాక, పైత్యం లాగా అనిపిస్తుంది.
ఎవరి పద్యం ముందో తెలియదుకాని, పోతన గారి “అడిగెదనని కడువడి జను” పద్యం లక్ష్మి తడబడ అడుగులను ఎంతో సహజంగా, సుందరంగా సర్వ లఘు కందంలో అందంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ముందు “తగుదగదని మనమున” అన్న నన్నెచోడుని పద్యం, కాపీ కొట్టింది కాకపోయినా, వెలవెల పోయినట్లే అనిపిస్తుంది.
పాండిత్యం గురించి కాదు కాని, హృదయాన్ని తాకే భక్తి భావం మాత్రం ఇన్ని పద్యాలను చదివినా ఎందుకో, పోనీ పోతన ధూర్జటి స్థాయిలను అందుకోకపోయినా, ఏ మాత్రం కూడా అనుభవంలోకి రావడం లేదు. కవిరాజశిఖామణికైనా కూడా, కామున్ని స్తుతించిన కలంతోనే కామేశ్వరున్ని గొప్పగా స్తుతించడం కష్టమేనేమో!
ఈ మాటలో వచ్చే కధలూ, కవితలూ, వ్యాసాల పైన వచ్చే అభిప్రాయాల్లో చర్చన్నది (ఒకటీ అరా సందర్భాల్లో తప్ప)లేదనే నా అభిప్రాయం. ఎవరైనా ఒక వ్యాసం పైన అభిప్రాయమో, ప్రశ్నో వేసారనుకోండి. దానికి సమాధానం ఇచ్చే బాధ్యత (తీసుకుంటేనే లెండి) రచయితది. చాలాసార్లు రచయిత మౌన ముద్ర పాటిస్తే, ఆ వాఖ్యలు చదివేవారు ఆవేశ పడిపోడం ఎక్కువగా ఉంటోంది. అందులో “నాకే అన్నీ తెలుసు – నీకేం రాదు – నువ్వు చవట దద్దమ్మవి” అని రుజువు చేయడమే ప్రధానోద్దేశ్యంగా అభిప్రాయాల గొంతుంటోంది. అందువల్ల చర్చకి అవకాశం తగ్గిపోతోంది. చర్చకి ప్రధాన లక్షణం ఎదుటి వారి అభిప్రాయాన్నీ గౌరవించడం. అది కొరవడినప్పుడే అది తప్పుదారిపడుతుంది.
ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే వ్యాసాలపైనా, కథలపైనా ఎవరూ అభిప్రాయాన్ని వ్యక్తీకరించరు. దూరంగా ఉంటారు. పాఠకుడికీ, రచనకీ మధ్య రచయితపై నున్న వ్యక్తిగత అభిప్రాయమొచ్చి కూర్చుంటే ఆ రచన ఎప్పటీకీ నచ్చదు. ఒకవేళ అందులో విషయమున్నా మనసొప్పుకోదు. తెలుగులో సాహితీ విమర్శ లేదని మనకి మనమే బాధ పడుతూ ఉంటాం. చర్చించుకుంటూ వుంటాం. కానీ ఆ విమర్శకీ, చర్చకీ మనమెంత ఆసరా ఇస్తున్నామన్నది ఆలోచించుకోవాలి. తెలుగునాట చర్చకీ, విమర్శకీ అవకాశమే తక్కువ. ఇంటర్నేట్ పత్రికల్లో ఆ అవకాశముంది. అదే ఇలా అభిప్రాయం రాయడానికి దోహదం చేస్తోంది.
కథ దేని గురించి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:
03/11/2009 2:20 am
“బడే భాయి “కూడా కలుపుకొండి నా వైపు నుండి.అందుకే,నేను ఆయన కథల గూర్చి నేను మాట్లాడలేదు.కొందరు కథలు బాగా రాయగలరు,నవలల విషయం వచ్చేసరికి వీరేనా ఇవి రాసింది అనిపిస్తుంది.నవలలు రాయగలిగిన వారి కథలు చాలా అధ్వానంగా ఉండటం గమనించాను.కథ రాయడం కష్టమంటాడు ,గాబ్రియెల్ గార్సియా మార్కెజ్. రచయిత ఎంత గొప్పవాడు అని గమనించకుండా అతని రచనలను నిర్లిప్తంగా అంచనా వేయాలి అన్న అభిప్రాయం నాది.
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట. అలా ఉంది పరుచూరి శ్రీనివాస్ వ్యవహారం.తెలియని విషయాల్లో తలదూర్చడం, అనవసరమైన పెత్తనాలు తలకెత్తుకోవడం తెలుగు సాహిత్యంలో కొత్తకాదు.మన స్థాయి ఏమిటి,మనం తూగగలమా లేమా అని ఆలోచించకుండా అహమహమికతో బయల్దేరితే తలబొప్పికట్టడం మినహా సాధించేది ఏమీలేదు. రుజువుకు, ఋజువుకు తేడా తెలియకుండా భాషా, ఛందస్సాహిత్య చర్చల్లోకి దూకెయ్యటమే??
“అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం” అన్న వాక్యం వెనుక స్వారస్యం తెలియడానికి ఇది చాలదూ?? నేను రాసిన వాక్యం, ఇలాంటి దబాయింపు పాండిత్యాలను ఉద్దేశించినదే. శ్రీనివాస్ గారి నన్నెచోడుని ఉడుకుసోదిలోకి నేను పోను.పుస్తకాల్లో చదివిన విషయాలు వల్లించడం సాహిత్య విమర్శ కాదు.మనం ఎంత స్పష్టంగా ఆలోచిస్తున్నాం అన్నది ముఖ్యం.తెలియనిది తెలియదు అని ఒప్పుకోవడం ఆలోచనల్లో స్పష్టతకు తొలిమెట్టు. ఈ మాట పాఠకులు చదువుకున్న వాళ్ళో తెలివితక్కువ వాళ్ళో చర్చలకు సంబంధం లేని విషయం.పాఠకుల తరపున ఎవరూ వకాల్తా పుచ్చుకోనవసరం లేదు.మన సంగతి మనం చూసుకుంటే మంచిది. స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
[ఈ వ్యాఖ్యాత చేసిన మిగతా వ్యక్తిగత నిందలు ఎడిట్ చేయబడ్డాయి – సం.]
శ్రీనివాస్ గారి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.అభిప్రాయాలు విషయాన్ని మరింత స్పష్టం చేయగలగాలి తప్ప మరింత గందరగోళ పరిచేవి కాకూడదు. అనవసరమైన అంశాలనీ..అఖ్ఖర్లేని ఆవేశాలనీ ప్రదర్శించడం దండగ. మన భావాల వల్ల తెలిసే కొత్త విషయం ఉంటే దాన్ని చదవడంలో ఆసక్తి ఉంటుంది. వాక్యాల్లో సంయమనం అవసరం.మన మాటలు నలుగురూ చదువుతారనీ.. ఆ నలుగురూ కూడా అంత గాఢంగానూ ఆలోచించగల వాళ్ళనీ… అభిప్రాయాలు రాస్తున్నప్పుడు గుర్తుంచుకుంటే… అఖ్ఖర్లేని మాటలు దొర్లవు. యదుకుల భూషణ్ మరోచోట కూడా..మార్క్సిజం..ఫెమినిజం..వల్లకాడిజం అని అన్నది కూడా అనవసరమైన ప్రకటనే. అంతకన్నా సంస్కారంగా విషయంతోనీ.. వ్యక్తులతోనీ.. విభేదించటం తెలియటమే నాగరికత.
రమ.
The author has vividly narrated the new world order created by the internet. Though highly technical, yet, Suresh has made it easy for even a layman to understand and inculcated interest to know more about it. I am awaiting the remaining parts of his article and I hope he would continue to contribute many more such articles.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/12/2009 12:28 am

నన్నెచోడుని క్రౌంచపదము గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
03/11/2009 2:07 pm
మోహనరావుగారు: మీరు నన్నయ, నన్నెచోడులలో ఎవరు ముందు, ఎవరు వెనుక అన్న దానిని గురించి స్థిరమైన అభిప్రాయం చెప్పలేదని నేను చూశాను. మీరు అలాంటి అభిప్రాయన్ని బలపరచాలని ఆ వ్యాసం రాయలేదని కూడా నేను గ్రహించాను. మీరు ఛందస్సుని వాడుకున్న తీరు నిజంగా చాలా బాగుంది. నన్నెచోడులు చాలామంది ఉన్నారనీ, బద్దెనకు కూడా నన్నెచోడుడనే పేరుందని ఇలాంటి సూచనలవల్ల కాలక్రమ సమస్యలు అనవసరంగా జటిలమవుతున్న పరిస్థితిలో మీ వ్యాసంలో ఛందస్సు మీద చేసిన చర్చ నిజంగా ఉపకరిస్తుంది. కానీ నన్నెచోడుడి సంప్రదాయం వేరు, అతనికి అనుయాయులు లేరు అన్న విషయాన్ని గుర్తించడం మీ వ్యాసానికి మరికొంత స్పష్టతనిస్తుందని నా ఉద్దేశం. మీ సౌమనస్యానికి నా కృతజ్ఞతలు.
– శ్రీనివాస్
నన్నెచోడుని క్రౌంచపదము గురించి mOhana గారి అభిప్రాయం:
03/11/2009 11:03 am
వ్యాసం నచ్చినవారికి నా నమస్సులు. నచ్చనివారికి ఇక మీద బాగుగా రాయటానికి ప్రయత్నిస్తా. ఒక రెండు విషయాలు. ఈ వ్యాసరచనకు ప్రోత్సాహం శ్రీ బ్రందావనరావుగారి పద్యం. నన్నెచోడుని విపులంగా ఎందుకు పాఠకులకు పరిచయం చేయరాదనే భావం నాకు అప్పుడు కలిగింది. మొదటి భాగంలో అతని కవిత్వాన్ని గురించి వివరించాను. రెండవ భాగం నా అభిప్రాయాలు. పాఠకుల అభిప్రాయాలకు జవాబు ఇవ్వరాదనే
భావం నాకు లేదని వినయపూర్వకంగా విన్నవించుకొంటున్నాను.
కలింగత్తుప్పరణి మదురై ప్రాజెక్టులో దొరుకుతుంది. బ్రహ్మానందంగారు చెప్పిన పద్యం చూడగలిగాను. దాని అర్థపర్థాలు అడిగి తెలుసుకోవాలి. ఒక పద్యం ఎవరు ముందు రాశారో ఎవరు అనుకరించారో
చెప్పడం సులభం కాదు. భూషణ్ గారు నాగేంద్ర చోడుడు 940 కాలం వాడన్నది బహుశా కవిగారి సిద్ధాంతాన్ని ఉద్ఘాటిస్తున్నారని అనుకొంటాను. రెడ్డిగారు కూడా నన్నెచోడుడు శాలివాహనశకం కాక విక్రమశకం వాడాడని అనుకొన్నారు.
శ్రీనివాస్ గారూ, నాకు నన్నయ లేక నన్నిచోడులలో ఒకరు ముందు మరొకరు వెనుక అనే స్థిరమైన అభిప్రాయం లేదు, అట్టి అభిప్రాయాన్ని బలపరచాలని ఈ వ్యాసం రాయలేదు. నేను చెప్పిందల్లా రేచన నన్నెచోడుని పిదప అని మాత్రమే. నన్నయ నన్నెచోడులకు ముందు గ్రంథాలు ఉన్నాయని పంపడు తెలుగులో రాశాడని వేంకటరావుగారు అభిప్రాయ పడ్డారు. ఇక పోతే నన్నెచోడులు ఎందరో ఉన్నారు. బద్దెనకు కూడా నన్నెచోడుడని పేరుందని చదివాను. నా ఆశయం ఛందస్సు కొన్ని సంశయాలను తీరుస్తుందేమోననే. చరిత్రగురించి చర్చించడానికి నాకు అర్హత లేదు. ముఖ్యంగా కొత్త వృత్తాల ఉపయోగం, వాటి పేరులు, చిత్రకవిత్వం ఇత్యాదులను చోడుడు ఉపయోగించాడు. వీటిని కన్నడం నుండి గ్రహించి ఉండాలి. కవిరాజమార్గములో చిత్రకవిత్వం ఉంది.
శ్రీనివాస్ గారూ, ఆదిదంపతుల శృంగారాన్ని వర్ణించేటప్పుడు కాలిదాసుకు కూడా సమస్యలే వచ్చాయి. ఈశ్వరునిపై ఎన్నో భక్తిభరితమైన పద్యాలు కుమారసంభవంలో ఉన్నాయి. బహుశా నేను బాగా ఎత్తి చూపలేదేమో, అందుకు నన్ను క్షమించాలి. నన్నెచోడునికి సంగీతంలో కూడా బాగా పరిచయము ఉండి ఉండాలి. అతడు ఒక తరువోజలో ఎన్నో రాగాలను (సాహురి, ఫలమంజరి, పౌరాలి, ఆందోలి, భైరవి, నాట రాగాలను) పేర్కొన్నాడు. ఇవన్నీ పురాతన రాగాలు, అపూర్వ రాగాలు. అందులో కొన్ని బృహద్దేశిలో కూడా ఉన్నాయి. సంగీతజ్ఞానము ఉన్న వాళ్లు పరిశోధనలు చేయవచ్చు. వ్యాసం అచ్చవడానికి ముందు విజ్ఞుల క్రిటిసిసం తీసికోవాలని ప్రయత్నించాను, కాని సఫలీకృతుడిని కాలేక పోయాను.
విధేయుడు – మోహన
నన్నెచోడుని క్రౌంచపదము గురించి Vamsi M Maganti గారి అభిప్రాయం:
03/11/2009 10:21 am
మోహనరావుగారూ,
I have been a big fan of you and your writings and you never disappointed me….As usual – a fantastic piece from you.
శ్లేష ఉపయోగించడం చేతనయిన వారు దానిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఒక కొలిక్కి రావాలి అనుకునే చర్చల్లో శ్లేష ఉపయోగం ఒక రకంగా అపాయాన్నే సృష్టిస్తుందని Sreenivas గారి మాటలు తెలియచేస్తున్నాయి.
ఇక విభేదించడం అనే నాగరికత సంగతికి వస్తే అభ్యాసపూర్వకంగా కానీ, ప్రయత్నపూర్వకంగా కానీ అది పెంపొందే అవకాశాలు ఎక్కువ. ప్రసిద్ధమయిన ప్రతీదీ స్థిరమయింది కాదు కదా… అలాగే ఇదీనూ… తెలుగునాట విమర్శ తక్కువేమీ కాదు… చూసే వారి కళ్ళల్లో , రాసే వారి రాతల్లో ఉంటుంది. మనదగ్గర లేనిది, మనకు తట్టనిది ఇతరుల బుఱ్ఱల్లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయేవారు ఉన్నంత మటుకున్నూ, ఆ పైన రాసిన వాటిల్లోనే వారికి అర్థమయిన, కావలసిన వాక్యాలను మటుకే తీసుకుని వాటి మీద చెలరేగిపోవటం సాధారణమే అన్న ధోరణితో ఉన్నవారున్నంతమటుకున్నూ ఇలా కొనసాగుతూనే ఉంటుంది… అదీ ఈ విమర్శ లేదన్న పార్శ్వపు నొప్పికి కారణం…
ఇక్కడ చర్చకు, అసలు నువ్వు మాట్టాడే మాటలకు తాత్పర్యమే లేదు వెంకోజీ అని అంటే చెప్పేదేమీ లేదు…ఇంతే సంగతులు చిత్తగించవలెను… 🙂
[ఈ వ్యాఖ్య ఎడిట్ చేయబడినది – సం.]
కవిరాజశిఖామణి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
03/11/2009 7:42 am
నమస్కారం. ఎంతో పరిశ్రమతో ఎన్నో విషయాలను అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మూడవపేజీలో, “తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని *తిక్కనకు* అంకితము చేసి..” అని ఉంది. Typo అనుకుంటాను.
తట్టిన కొన్ని ఆలోచనలు.
కవి తామరలు విష్ణువు, లక్ష్మీదేవి కన్నులలా ఉన్నాయనడం చాలా అసహజంగా, కృత్రిమంగా ఉంది. తెలియని దానిని, తెలిసిన దానితో పోల్చడం, లేక తెలిసిన దానిని సైతం ఇంకో తెలిసిన దానితో పోల్చడం చూస్తాం. ఇక్కడ కళ్ళకు కనబడే తామర పూలను కనిపించని లక్ష్మీనారాయణుల కళ్ళతో పోల్చడం కవిత్వం కన్నా, పాపము శమించుగాక, పైత్యం లాగా అనిపిస్తుంది.
ఎవరి పద్యం ముందో తెలియదుకాని, పోతన గారి “అడిగెదనని కడువడి జను” పద్యం లక్ష్మి తడబడ అడుగులను ఎంతో సహజంగా, సుందరంగా సర్వ లఘు కందంలో అందంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ముందు “తగుదగదని మనమున” అన్న నన్నెచోడుని పద్యం, కాపీ కొట్టింది కాకపోయినా, వెలవెల పోయినట్లే అనిపిస్తుంది.
పాండిత్యం గురించి కాదు కాని, హృదయాన్ని తాకే భక్తి భావం మాత్రం ఇన్ని పద్యాలను చదివినా ఎందుకో, పోనీ పోతన ధూర్జటి స్థాయిలను అందుకోకపోయినా, ఏ మాత్రం కూడా అనుభవంలోకి రావడం లేదు. కవిరాజశిఖామణికైనా కూడా, కామున్ని స్తుతించిన కలంతోనే కామేశ్వరున్ని గొప్పగా స్తుతించడం కష్టమేనేమో!
విధేయుడు
-Srinivas
[టైపో సరిదిద్దాము. చూపినందుకు కృతజ్ఞతలు – సం]
నన్నెచోడుని క్రౌంచపదము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:
03/11/2009 7:08 am
ఈ మాటలో వచ్చే కధలూ, కవితలూ, వ్యాసాల పైన వచ్చే అభిప్రాయాల్లో చర్చన్నది (ఒకటీ అరా సందర్భాల్లో తప్ప)లేదనే నా అభిప్రాయం. ఎవరైనా ఒక వ్యాసం పైన అభిప్రాయమో, ప్రశ్నో వేసారనుకోండి. దానికి సమాధానం ఇచ్చే బాధ్యత (తీసుకుంటేనే లెండి) రచయితది. చాలాసార్లు రచయిత మౌన ముద్ర పాటిస్తే, ఆ వాఖ్యలు చదివేవారు ఆవేశ పడిపోడం ఎక్కువగా ఉంటోంది. అందులో “నాకే అన్నీ తెలుసు – నీకేం రాదు – నువ్వు చవట దద్దమ్మవి” అని రుజువు చేయడమే ప్రధానోద్దేశ్యంగా అభిప్రాయాల గొంతుంటోంది. అందువల్ల చర్చకి అవకాశం తగ్గిపోతోంది. చర్చకి ప్రధాన లక్షణం ఎదుటి వారి అభిప్రాయాన్నీ గౌరవించడం. అది కొరవడినప్పుడే అది తప్పుదారిపడుతుంది.
ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే వ్యాసాలపైనా, కథలపైనా ఎవరూ అభిప్రాయాన్ని వ్యక్తీకరించరు. దూరంగా ఉంటారు. పాఠకుడికీ, రచనకీ మధ్య రచయితపై నున్న వ్యక్తిగత అభిప్రాయమొచ్చి కూర్చుంటే ఆ రచన ఎప్పటీకీ నచ్చదు. ఒకవేళ అందులో విషయమున్నా మనసొప్పుకోదు. తెలుగులో సాహితీ విమర్శ లేదని మనకి మనమే బాధ పడుతూ ఉంటాం. చర్చించుకుంటూ వుంటాం. కానీ ఆ విమర్శకీ, చర్చకీ మనమెంత ఆసరా ఇస్తున్నామన్నది ఆలోచించుకోవాలి. తెలుగునాట చర్చకీ, విమర్శకీ అవకాశమే తక్కువ. ఇంటర్నేట్ పత్రికల్లో ఆ అవకాశముంది. అదే ఇలా అభిప్రాయం రాయడానికి దోహదం చేస్తోంది.
కథ దేని గురించి? గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:
03/11/2009 2:20 am
“బడే భాయి “కూడా కలుపుకొండి నా వైపు నుండి.అందుకే,నేను ఆయన కథల గూర్చి నేను మాట్లాడలేదు.కొందరు కథలు బాగా రాయగలరు,నవలల విషయం వచ్చేసరికి వీరేనా ఇవి రాసింది అనిపిస్తుంది.నవలలు రాయగలిగిన వారి కథలు చాలా అధ్వానంగా ఉండటం గమనించాను.కథ రాయడం కష్టమంటాడు ,గాబ్రియెల్ గార్సియా మార్కెజ్. రచయిత ఎంత గొప్పవాడు అని గమనించకుండా అతని రచనలను నిర్లిప్తంగా అంచనా వేయాలి అన్న అభిప్రాయం నాది.
తమ్మినేని యదుకుల భూషణ్
నన్నెచోడుని క్రౌంచపదము గురించి తమ్మినేని యదుకుల భూషణ్. గారి అభిప్రాయం:
03/11/2009 1:46 am
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట. అలా ఉంది పరుచూరి శ్రీనివాస్ వ్యవహారం.తెలియని విషయాల్లో తలదూర్చడం, అనవసరమైన పెత్తనాలు తలకెత్తుకోవడం తెలుగు సాహిత్యంలో కొత్తకాదు.మన స్థాయి ఏమిటి,మనం తూగగలమా లేమా అని ఆలోచించకుండా అహమహమికతో బయల్దేరితే తలబొప్పికట్టడం మినహా సాధించేది ఏమీలేదు. రుజువుకు, ఋజువుకు తేడా తెలియకుండా భాషా, ఛందస్సాహిత్య చర్చల్లోకి దూకెయ్యటమే??
“అరకొర పాండిత్యాలతో గ్రంథరచనకుపక్రమించే గాలివాటు పండితులకు చెంపపెట్టు మీ వ్యాసం” అన్న వాక్యం వెనుక స్వారస్యం తెలియడానికి ఇది చాలదూ?? నేను రాసిన వాక్యం, ఇలాంటి దబాయింపు పాండిత్యాలను ఉద్దేశించినదే. శ్రీనివాస్ గారి నన్నెచోడుని ఉడుకుసోదిలోకి నేను పోను.పుస్తకాల్లో చదివిన విషయాలు వల్లించడం సాహిత్య విమర్శ కాదు.మనం ఎంత స్పష్టంగా ఆలోచిస్తున్నాం అన్నది ముఖ్యం.తెలియనిది తెలియదు అని ఒప్పుకోవడం ఆలోచనల్లో స్పష్టతకు తొలిమెట్టు. ఈ మాట పాఠకులు చదువుకున్న వాళ్ళో తెలివితక్కువ వాళ్ళో చర్చలకు సంబంధం లేని విషయం.పాఠకుల తరపున ఎవరూ వకాల్తా పుచ్చుకోనవసరం లేదు.మన సంగతి మనం చూసుకుంటే మంచిది. స్వస్తి.
తమ్మినేని యదుకుల భూషణ్.
[ఈ వ్యాఖ్యాత చేసిన మిగతా వ్యక్తిగత నిందలు ఎడిట్ చేయబడ్డాయి – సం.]
నన్నెచోడుని క్రౌంచపదము గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
03/11/2009 12:33 am
శ్రీనివాస్ గారి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.అభిప్రాయాలు విషయాన్ని మరింత స్పష్టం చేయగలగాలి తప్ప మరింత గందరగోళ పరిచేవి కాకూడదు. అనవసరమైన అంశాలనీ..అఖ్ఖర్లేని ఆవేశాలనీ ప్రదర్శించడం దండగ. మన భావాల వల్ల తెలిసే కొత్త విషయం ఉంటే దాన్ని చదవడంలో ఆసక్తి ఉంటుంది. వాక్యాల్లో సంయమనం అవసరం.మన మాటలు నలుగురూ చదువుతారనీ.. ఆ నలుగురూ కూడా అంత గాఢంగానూ ఆలోచించగల వాళ్ళనీ… అభిప్రాయాలు రాస్తున్నప్పుడు గుర్తుంచుకుంటే… అఖ్ఖర్లేని మాటలు దొర్లవు. యదుకుల భూషణ్ మరోచోట కూడా..మార్క్సిజం..ఫెమినిజం..వల్లకాడిజం అని అన్నది కూడా అనవసరమైన ప్రకటనే. అంతకన్నా సంస్కారంగా విషయంతోనీ.. వ్యక్తులతోనీ.. విభేదించటం తెలియటమే నాగరికత.
రమ.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి kshareesh kumar గారి అభిప్రాయం:
03/10/2009 10:23 pm