Comment navigation


15803

« 1 ... 1266 1267 1268 1269 1270 ... 1581 »

  1. About eemaata గురించి RANGANATH MIDDELA గారి అభిప్రాయం:

    03/19/2009 9:39 am

    వరంగల్లు
    సాహితీ బంధువులకు నమస్సుమాంజలి.
    మీరు వెలువరిస్తున్న ఈ మాట చూస్తుంటేనే కనువిందుగా ఉంది. మీ సైటుకు పుస్తకాలు ఎలా పంపాలి.. తెలుగు సాహిత్య లోకానికి అవసరమైన మరింత సమాచారాన్ని పొందుపరిస్తే బాగుంటుందని నా ఆలోచన.. ఇంత మంది సాహితీ మిత్రులు కలిసి చేసే సమిష్టి యాగంలో మీకు పూర్ణ ఫలం అందాలని నా ఆకాంక్ష..
    ధన్యవాదాలతో,
    రంగనాథ్ మిద్దెల
    ఎన్ టీవి

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి baabjeelu గారి అభిప్రాయం:

    03/19/2009 7:48 am

    ఇది “మోహన” గారి అభిప్రాయం పై అభిప్రాయం. రాయొచ్చో, రాయకూడదో తెలియదు. వేస్తారో, వేయరో తెలియదు. అయినా సరే త్యాగరాజు రాసిన ఉత్సవ సంప్రదాయ కీర్తన గురించే, త్యాగరాజు సంగీతం, సాహిత్యం గురించే.
    బాలమురళీ పాడిన వరస “మోహన” గారు చెప్పిన పధ్ధతికి సరిపోతుంది.

    శతమఖాహిత విభంగ, శ్రీ రామ
    శమనరిపు సన్నుతాంగ
    శ్రితమానవాంతరంగ, జనకజ
    శృంగార జలజభృంగ

    అయితే ఈ వరస, నా చిన్నప్పట్నించీ వింటున్నదే
    కస్తూరి రంగ రంగ, మాయన్న
    కావేటి రంగ రంగ…

    త్యాగరాజు “కాపీ” కొట్టేరా? బాలమురళీ “కాపీ” కొట్టేడా? లేదా “కస్తూరి…” వాళ్ళు త్యాగరాజుని “కాపీ” కొట్టేరా?

  3. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి surya గారి అభిప్రాయం:

    03/19/2009 6:41 am

    సరైన వ్యాఖ్య రాయడానికే జుత్తు పీక్కో వలసి వస్తోందే! ఇంతంత పెద్ద వ్యాసాలు, అదీ అసందర్భపు వాక్యాలు మచ్చుకైనా కనబడని విధంగా ఎలా రాయగలుగుతున్నారు సార్. టోపీ రహిత ప్రణామాలు. ఈ మాటకి ధన్యవాదాలు. మీరన్నట్టు ఇంటర్నెట్టుది వర్ణనకందని మహాత్యం. జావా మొహం తెలీని కుర్రాళ్ళని మా కంపెనీ రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేతులో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ పెట్టి ఆర్నెల్లయినా కాకుండానే వాళ్ళంతా “జావగార” దొడగారంటే ఆ కీర్తి “అంతరవల” దే ననడంలో సందేహం లేదు.

  4. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/19/2009 3:03 am

    సాహిత్యం – విజ్ఞానం రెందూ నాకత్యంత అభిమాన రంగాలు. దురదృష్ట వశాత్తు రెండిట్లో నాకు అభిరుచే తప్ప అభినివేశం ప్రజ్ఞ చాల స్వల్పం. ఇలాంటి వైజ్ఞానిక వ్యాసాలు చదివి నా అల్ప మేధస్సు ఆకళింపు చేసుకోగలిగినంత చేసుకుని ఆనందిస్తూంటాను. మీ వ్యాసం చాలా బాగుంది బోధ్యంగా వుంది. తరువాతి వ్యాసానికై ఎదురు చూస్తూంటాను.

  5. విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    03/19/2009 2:28 am

    పండిత వ్యాఖ్యానాలు పక్కన లేకుండా ప్రాచీన సాహిత్యం పూర్తిగా అర్థం చేసుకోవదం, గురుముఖతః గాక ఔత్సాహికంగా సంస్కృతాంధ్రాలని స్వయం కృషితో అభ్యసించిన మా బోటి వారికి సాధ్యం కాదు. సాహిత్య ఎకాడమీ వారు ప్రచురించిన వసుచరిత్ర, మనుచరిత్రాదులను పఠించినా అవి ఏవీ 20్ సంవత్సరాల క్రింద శరదాగమ వ్యాఖ్యా సహితంగా చదివిన చంద్రికా పరిణయం అంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. రామరాజభూషణుడితో సమానమైన లేదా అంతకు మించిన విద్వత్కవితా పాటవాలు కలిగిన సురభి మాధవరాయని ప్రజ్ఞ నాకా వ్యాఖ్య లేకుందా అవగతమయ్యేది కాదు. అందుకే నేను పండిత వ్యాఖ్యాసహిత కావ్యాలను స్వాగతిస్తాను, ఎదురుచూస్తాను ఆదరిస్తాను. ఇంతకీ మీరు పరిచయం చేసిన పుస్తకం ఎక్కడ ఎంతకు లభ్యమౌతుందో వివరించలేదు.

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    03/18/2009 6:53 am

    నియమాలూ, సూత్రలూ తెలీవు కానీ, సంగీతంలో చరణాలకి ద్వితీయాక్షర ప్రాస వాడడం అనేది అనాదిగా వుంది. దీనికి ఆద్యులెవరో చెప్పలేం. ఒకటీ రెండు సందర్భాల్లో తప్ప, నూటికి తొంభైతొమ్మిది శాతం, అన్నమయ్య, క్షేత్రయ్య రచనల్లో ఇది స్పష్టంగా ఉంది. పురందర దాసు కీర్తనల్లోనూ కనిపిస్తుంది. త్యాగరాజూ ఇదే పద్దతనుసరించాడు. వీరి కొన్ని రచనల్లో అంత్య ప్రాసుంది. శ్రావ్యత కోసం శబ్ద ప్రాస పాటించారనే అనుకుంటున్నాను.

    తాళ ఆవృతాన్ని బట్టే చరణంలో పాదాలు నిర్ధారించారని నా నమ్మకం. నాకు తెలుసున్నంత వరకూ ఇదే ఒరవడి అందరూ పాటిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు సంగీతజ్ఞుల్ని సంప్రదిస్తే ఇలాగే చెప్పారు.

    యుగంధర్ గారూ – “ఒక తాళ ఆవృత్తం ఒక పాదమనే సూత్రం కూడా ఏమీ లేదు” అన్నది ఏ ఆధారంతో చెప్పారు? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ప్రాస నియమం పాటించేది చరణాలకే. పల్లవి, అనుపల్లవులకి కాదు.

    కేవలం ఛందస్సు కోసం నాలుగు చరణాలని రెండుగా భావించడమన్న ప్రతిపాదన అన్ని కృతులకీ, కీర్తనలకీ అన్వయించబడితే అదొక సిధ్ధాంతమవుతుంది. ఇలాంటి పరిశోధనలు మోహన రావు గారి వల్లే సాధ్యం.
    చివరగా – త్యాగరాజు రాసిన కొన్ని పద్యాలలో ఛందస్సు భంగమయ్యిందన్న విషయం పండితులు నిర్ధారించారు. నౌకాచరిత్రం, ప్రహ్లాద విజయం సంగీత రూపకాల్లో వాడిన పద్యాల్లో ఇది చక్కగా కనిపిస్తుంది.

  7. బోడి పద్యం గురించి surya గారి అభిప్రాయం:

    03/18/2009 6:33 am

    అంటే వ్యాఖ్య రాసిన వాళ్ళందరూ వాగుడు కాయలన్న మాట. అయినా ఈ మధ్య ఈ మాటలో ఇలాంటి moral policing వాగుడు అధికమవ్వటం బాధాకరం.

  8. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి mOhana గారి అభిప్రాయం:

    03/18/2009 6:31 am

    యుగంధర్ గారూ –
    క్షీరసాగరవిహార ఛందస్సు చాల విశేషమైనది. ఈ పాట అమరిక ఇలా ఉంటుంది –
    ప్రతి పాదంలో మూడు భాగాలు, అవి ఐదు, మూడు, మూడు మాత్రలు
    ఐదు మాత్రలు ఐదు, మూడు, మూడు మాత్రలు
    మొదటి మూడవ భాగాలకు యతి, అంత్య ప్రాస.
    ఇలా పాదాలు తీసికొంటే పాదాలకు ద్వితీయాక్షర ప్రాస కూడా చెల్లుతుంది. పాడేటప్పుడు చివరి త్రిమాత్ర చతుర్మాత్రగా అవుతుంది.
    శతమఖాహిత విభంగ శ్రీ రామ శమన రిపు సన్నుతాంగ
    శ్రిత మానవాంతరంగ జనకజ శృంగార జలజ భృంగ
    ఇందులో తకార ప్రాస చెల్లుతుంది. రెండు పాదాలలో శత, శమన, శ్రిత, శృంగార లకు యతి. అంత్యప్రాస ంగతో ఆఖరయ్యే పదాలు.
    ఇందులోని అందమేమంటే రెండవ భాగములోని పంచమాత్ర. ఇది రెండు భాగాలను చేర్చడం మాత్రమే కాక పాటకు ఒక విధమైన తూగు నిస్తుంది. అర్ధ పాదాలకు అంత్యప్రాస ఉంచడం సంస్కృత సాహిత్యంలో తరచుగా చూస్తుంటాము. ఆశ్వాసాంత పద్యాలలో కూడా (ఉదా. మాలినీవృత్తము) ఇది అతి సామాన్యము.

    వృత్తాలలో ఇలాటి అమరికను గురించి నేను ఛందస్సు రచ్చబండ గుంపులో ఎన్నో మారులు చర్చించినది మీకు గుర్తు ఉందనుకొంటాను.

    విధేయుడు – మోహన

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ గారి అభిప్రాయం:

    03/18/2009 5:05 am

    రెండవ అక్షరం ప్రాస గురించి నా ఉద్దేశాన్ని మోహన గారు చక్కగా వివరించారు.
    సాయిబ్రహ్మానందం గారూ, త్యాగరాజ కృతులకి వాటి నిర్దిష్టమైన ఛందస్సు ఉన్నదనేది నిర్వివాదాంశం. అన్ని కృతులకీ ఒకటే ఛందస్సు కాదు. ఐతే మరి ఈ ఛందస్సు నియమాలూ సూత్రాలూ ఏవిటీ అన్నది నాకు స్పష్టంగా తెలియదు. కొన్ని కొన్నిటిలో మాత్రా ఛందస్సు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చాలా కృతుల్లో కనబడదు. కనీసం నేను పట్టుకోలేక పోయాను.
    అలాగే ఒక తాళ ఆవృత్తం ఒక పాదమనే సూత్రం కూడా ఏమీ లేదు. నిన్న మీకు వ్యాఖ్య రాశాక అంత్య ప్రాస ఉన కృతి ఏమిటా అని ఆలోచిస్తే క్షీరసాగర విహారా గుర్తొచ్చింది. అందులో కూడా రెండేసి ఆవృత్తాలు ఒక పాదం అనుకుంటే రెండో అక్షరం ప్రాస చక్కగా సరిపోతుంది. చాలా కృతులలో పల్లవి ఒక ఆవృత్తమే అయినా, అనుపల్లవి ఒకటికి మించిన ఆవృత్తాలు ఆక్రమించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    03/17/2009 9:21 pm

    మోహన గారూ,

    మీ వివరణ బాగుంది. మీరు చూపించిన పద్ధతికి అన్ని ప్రాసలూ చక్కగా కుదిరాయి. కానీ సంగీత పరంగా చూస్తే చరణంలో ఒక్కో పాదం తాళానికొక ఆవృతంతో ముగుస్తుంది. ఈ కృతిలో తాళం ప్రకారం మొత్తం నాలుగావృతాలున్నాయి. ఆ రకంగా చూస్తే నాలుగు పాదాలున్నాయననుకోవచ్చు. కాబట్టి ఈ కృతిలో చరణానికి నాలుగు పాదాలున్నాయని అంటారు. ఈ పద్ధతి ప్రకారమే అంత్య ప్రాస గురించి రాసాను.

    మీరు చూపించినట్లుగా రెండేసి కలిపి ఒక పాదంగా ఎలా పరిగణిస్తారో నాకు తెలీదు. కేవలం ఛందస్సు కోసం అలా అనుకోవాలా?

« 1 ... 1266 1267 1268 1269 1270 ... 1581 »