Comment navigation


15813

« 1 ... 1251 1252 1253 1254 1255 ... 1582 »

  1. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    05/01/2009 6:19 pm

    ఈ వ్యాసావళి ఆరంభం అద్భుతంగా ఉండి, గత మూడు నాలుగు వ్యాసాలలో విషయం బాగా పలుచనైనట్లనిపించింది. నా ఉద్దేశం మొదటి మూడు వ్యాసాలలో చెప్పదలుచుకున్న విషయాలకి సరియైన స్థాయిలో mathematical treatment ఇవ్వడం వ్యాసాలకి బలాన్నిచ్చింది. I will be talking from both sides of my mouth when I say this but I would also be the first one to concede that “సరియైన స్థాయిలో mathematical treatment” is very subjective and depends on the degree of acquaintance a reader might have with the fields of logic and mathematics. ముగింపు ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తూ,
    రాజాశంకర్ కాశీనాథుని

  2. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    05/01/2009 4:16 pm

    నేను నిఘంటువుని నిర్మించిన సందర్భంలోనే ఒక వ్యాకరణం “పుస్తకం”, ఒక స్టయిల్ “పుస్తకం” కూడ రాసుకున్నాను. స్ట్రంక్ ఎలిమెంట్స్ అఫ్ స్టయిల్, వెబ్‌స్టర్ నిఘంటువు నా బల్లమీద ఎప్పుడూ ఉంటాయి. నా స్ట్రంక్ ని ఎవ్వరో కాజేశారు; అదీ మంచికే అని ఊరుకున్నాను. ఇంతకీ ఇన్నాళ్ళూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకపోవటానికి ఒక కారణం ఉంది. ఇప్పటికే తెలుగు మాటలు నేను మరీ ఎక్కువ వాడెస్తున్నాననీ, ఇంగ్లీషు లేకుండా తెలుగులోనే రాస్తే అర్ధం అయి చావటం లేదనీ నన్ను అందరూ ఆడి పోసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో నేను రాసుకున్న శైలి పుస్తకం బయట పెడితే నా మనుగడకే ముప్పేమో అన్న బెదురుతో ఇంతవరకు ఎవ్వరికీ చూపించలేదు.

    ఇది వెటకారానికి రాయటం లేదు. నేను రాసిన వ్యాకరణం పుస్తకం ఒకరికి చూపిస్తే, “తెలుగులో Ph. D. లేని నువ్వు ఈ పుస్తకం రాస్తే శంఖంలో పొయ్యని తీర్థంలా విసర్జిస్తారు. అనవసరంగా ఆయాసపడకు,” అని నాకు వారు సలహా ఇచ్చేరు.

    కనుక పిల్లికి మెళ్ళో గంట కట్టే దమ్ములు నాకు లేవు. నాలాంటి అర్భకుడిని చూస్తే ఆ పిల్లే పులై కరుస్తుంది. ఈ పని వేలూరి గారే చెయ్యాలని నేను లైలా గారిని సమర్ధిస్తున్నాను.

  3. ఇంట్లో ఎవరూ లేరు గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    05/01/2009 3:26 pm

    ఇంద్రాణిగారి కవితలు ఏవి చదివినా ఒక అనిర్వచనీయమైన అనుభూతి. This poem is no exception.

    రాజాశంకర్ కాశీనాథుని.

  4. ఇంట్లో ఎవరూ లేరు గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:

    05/01/2009 2:48 pm

    హాట్స్ ఆఫ్ ఇంద్రాణి గారికి!! ఎంతో క్లుప్తత ఈ కవితలో సాధించారు. వీరిచ్చిన Contrasting భావాలు (చేతి వేళ్ళ మధ్య కాళ్ళు జాపి, ఎండ వేళ హిమానీ పాతం మొదలైనవి ) ఎంతో బాగున్నాయి.

    పవన్

  5. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    05/01/2009 2:22 pm

    అమెరికాకి విశ్వవిద్యాలయంలో పై చదువులకి కాక, నేరుగా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిడానికి వచ్చిన నాకు సురేశ్ గారి వ్యాసం చదివి ఉండక పోతే, అంతర్జాలాన్ని గురించిన ఇంత చరిత్ర తెలిసి ఉండేది కాదు. తొంభై దశకం మొదట్లో, నేను పని చేసిన కంపెనీలు ఏవీ Internet connectivity మీద ఆసక్తి చూపడం నాకు గుర్తు లేదు (understandably so). చదివిన చదువుకీ చేసే ఉద్యోగానికీ ఎటూ సంబంధం లేదు, మళ్ళీ అమెరికాలో పై చదువులు అవసరమా అని తర్కించుకుంటూ తాపించుకుంటూ Computer Science అధ్యయనం చేసేనాటికి Internet Revolution ముదిరి పరిస్థితి చాలా మారిపోయింది. అందువలన ఈ విషయంలోసురేశ్‌లాంటి వాళ్ళకున్న అనుభవం, అవగాహన నాకు ఉండే అవకాశం లేదు. May be that is the reason I am able to fully appreciate his essay.

    ఓపికగా సురేశ్ గారు తన అనుభవాలు ఈ వ్యాసం ద్వారా పంచుకున్నందుకు, కొత్త విషయాలు తెలిపినందుకు, ముఖ్యంగా తెలుగు Font విషయంలో కృషి చేసిన ఎందరో మహానుభావుల్ని పరిచయం చేసినందుకు నెనర్లు.

    భవదీయుడు,
    రాజాశంకర్ కాశీనాథుని.

  6. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి lyla yerneni గారి అభిప్రాయం:

    05/01/2009 2:10 pm

    పిల్లి మెడలో గంట కట్టేదెవరు? -వేలూరి వేంకటేశ్వర రావు

    అంటే? అందరికీ పనికొచ్చే ఆ పుస్తకం ఎవరు రాస్తారూ అనేనా? మీరే :-)ఎందుకంటే మీకు చిన్నయ సూరి వ్యాకరణము అంతా అర్థమవుతుంది.
    That grammar book also appears to me, as a simplified manual, small in size, written to give guidance to the writers of his time. If it is outdated, update it. Such technical manuals need updating.

    Take cinnaya suri’s grammar -simplify, modify, modernize the rules. Discard and add rules , as you see fit and give us the new Telugu grammar/style book / ‘తెలుగులో రాయటమెలా?’ అన్న పుస్తకం.

    What is so hard about that? And who says no, if you want to do it? Not me.

    లైలా

  7. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/01/2009 7:44 am

    తోచిన సూచనలిచ్చింది నిజమే కాని, ముఖ్యంగా నేను చెప్పిన దొక్కటి మాత్రం పూర్తిగా వదిలేసారు సురేశ్. అందుకే చెప్పుకోవడం.

    సంస్కృత శ్లోకాలు, పోతన పద్యాలు మొదలగునవేవీ ఇంటెర్నెట్టులో లభించని రోజుల్లో వాటిని అందించి, అర్థ వివరాలను తెలిపి, అన్వయించుకోవడానికి ఆనందించడానికి అప్పట్లో సాయపడిన వారిలో గుర్తున్నంతవరకు సురేశ్ పేరే మొట్టమొదటిగా తడుతుంది. అంతే గాక, సురేశ్ అప్పట్లో SCIT కి “తెలుసా” గ్రూపులకు bridge తయారు చేసారు. దాన్ని వాడినవారికి కూడా తెలుసో లేదో.

    WordPress ద్వారా “ఈ మాట” ను ప్రచురించే సాంకేతికపరమైన వివరాలను ఇంకెంతోమంది తెలుగు వారికి కూడా ఉపయోగపడాలనే పెద్ద మనసుతో, “పొద్దు”, “భూమిక”, “ప్రాణహిత” మొదలగు సైట్ల నిర్మాణానికి కూడా దాచుకోకుండా అందజేయడం, వారు చెప్పడం దాచారు కాబట్టి చెప్పడం. శిఖర శిలలు కనిపించినంతగా పునాది రాళ్ళు కనపడవు కదా!

    జ్ఞాపకాలు తెలుపుకోవడంలో ఒక ప్రమాదం ఉంది. రాసిన గంటకో రెండ్రోజులకో అయ్యో ఫలానా సంగతే చెప్పడం ఎట్లా మరిచాను అనిపించడం. అట్లా అని చాంతాడంత రాస్తూపోతే మొహమెత్తవచ్చు, తీపి కూడా ఎక్కువైతే అయినట్లు. గుర్తుకొచ్చినవాటికీ, రానివాటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు.
    ______
    విధేయుడు
    -Srinivas

  8. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    05/01/2009 7:21 am

    మొత్తం మీద సురేష్ చాలా సమాచారం సేకరించి పొందుపరచారు ఈమాటలో! దీని ఉపయోగం ముందుముందు ఇంకా బాగా తెలుస్తుంది. అమెరికాలో ఉన్న తెలుగువారు చాలా మందికి ఉన్న కంప్యూటర్ (ఇన్ఫర్మేషన్) టెక్నాలజీతో పరిచయం కూడా ఇంటర్నెట్లో తెలుగు వికాసానికి తోడ్పడింది. రోహిణీప్రసాద్ గారన్నట్టు, తెలుగు యూనీకోడ్ లో సురేష్ కృషి వివరాలు కూడా అక్షరబద్ధం కావాలి!

    అభినందనలతో,
    లక్ష్మన్న

  9. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:

    05/01/2009 7:04 am

    అతి చక్కని వ్యాసానికి అద్భుతమైన పాటల సేకరణ! మనం మరచిపోతున్న ఒక మంచి గాయకుడిని కృష్ణ మోహన రావు, శ్రీనివాస్ గార్లు మళ్ళీ గుర్తుకు తెచ్చారు. అన్నట్టు, 1993 సంవత్సరం తానా సభలకి వచ్చిన లీల, జిక్కీ వంటి గాయనిలతో పాటు వచ్చిన రాజా కుమారుడు (పేరు చంద్రశేఖర్ అని గుర్తు) గొంతు అచ్చు రాజా గొంతులా ఉండటం నేను ప్రత్యక్షంగా గమనించాను. వీరు రాసింది నిజమే!

    అభినందనలతో,

    లక్ష్మన్న

  10. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/01/2009 6:42 am

    మంచి వ్యాసం. మరికొన్ని ముచ్చట్లు.

    రాజా పచ్చయప్ప కాలేజిలో చదువుతూండగా పాటల పోటీలో ఘంటసాల, భానుమతి లైలామజ్నూలో పాడిన చెలునిగని అనే పాట పాడి మొదటి బహుమతి పొందాడట. న్యాయనిర్ణేతగా ఘంటసాలే వచ్చారట.

    రాజా గురించి తన ఒక వ్యాసంలో పి.బి.శ్రీనివాస్ ఆసక్తికరమైన విషయాలు రాశారు.

    విప్రనారాయణ తీసే రోజుల్లో ఘంటసాలకు చుట్ట కాల్చే అలవాటుండేదట. అప్పట్లో యుగళగీతాలకు ఒకే మైక్ వాడేవారు కనక ఆ వాసన పడని భానుమతి ఘంటసాలతో పాడనని అన్నదట. అది రాజాకు వరప్రసాదం అయింది.

    అలాగే విజయావారు చంద్రహారం టైములో సినీనిర్మాణంలో అనేక డిపార్ట్మెంట్లు మొదలుపెట్టి నెల జీతాలు ఏర్పాటు చేశారట. ఉదాహరణకు కళాదర్శకుడు గోఖలే. అందులో వడ్రంగుల దగ్గర్నుంచీ అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలూ, నెల జీతాలూ. అలాగే సంగీతానికి ఘంటసాల. అయితే నిబంధన ఏమిటంటే వీళ్ళెవ్వరూ మరే సంస్థకూ పనిచెయ్యకూడదు. అప్పటికే అగ్రహీరోలిద్దరూ ఘంటసాల పాడకపోతే నటించము అని చెప్పే స్థితికి చేరుకున్నారట. ఇది గమనించిన ఘంటసాల విజయావారిని ఒక పెద్ద మొత్తం ఇమ్మని అడిగారట. అది సమ్మతం కాకపోవడంతో విజయావారు ఆయనను తమ ‘ఆస్థాన విద్వాంసుడి’ స్థానం నుంచి తొలగించి, మిస్సమ్మకు రాజేశ్వరరావును పెట్టుకున్నారట. ఇక పాడడానికి ఘంటసాలను పిలవడం ఇబ్బంది అవుతుందని రాజాను పిలిచారట. ఆ పాటలు సాధించిన విజయం రాజేశ్వరరావు ప్రతిభకూ, రాజా కంఠానికీ కూడా మంచి నిదర్శనం.

    కల్యాణ పరిశు విజయం తరవాత రాజాకు అహం పెరిగి, ఎక్కువ పారితోషికం అడగడం మొదలుపెట్టాడనీ, ఆ కారణంగా అతనికి అవకాశాలు తగ్గాయనీ అప్పట్లో మేము మద్రాసులో విన్నాం. శ్రీధర్ తీసిన తేన్ నిలవు సినిమాపాటలు కూడా బాగా జనాదరణ పొందాయి. కల్యాణపరిశు విజయం తలకెక్కిన హాస్యనటుడు తంగవేలు కూడా శివాజీ గణేశన్ తో సమానంగా పారితోషికం అడగనారంభించాడనీ, దానితో అతన్ని పక్కన పెట్టారనీ విన్నాం.

    అమరసందేశం సినిమాకు సంగీతాన్నిచ్చినది మా గురువుగారు ఎల్.ఆర్. కేళ్కర్. ఆయన మరాఠీవాడు కనక ఆయనకు తెలియకుండా ఆయనకు అసిస్టెంటుగా పనిచేసిన ప్రసాదరావు పేరు వేశారట (తెలుగు పేరు కదా అని). ఆ తరవాత ఆ సంగతి తెలిసి కేళ్కర్ గారు సినిమావాళ్ళని శాపనార్థాలు పెట్టి, సంగీతం టీచరుగా మాత్రమే మద్రాసులో కొనసాగారు. సినిమా ఫ్లాప్ అయింది. బైజూ బావ్రాలాగా పోటీ పాట పెట్టారుగాని రాజాకు అంతటి పటిమ లేదు. రఘునాథ్ పాణిగ్రాహితో పోటీ పాట మానస లాలస సంగీతం.

    రాజా కాస్త అనుమానం మనిషనీ, దగ్గరున్న రైలుపెట్టెలో ఎక్కకుండా జిక్కీ ఉన్న బోగీనే అందుకోవడానికి ప్రయత్నించి అనవసరంగా దుర్మరణం పాలయాడనీ అన్నారు. 1993లో న్యూయార్క్లో ఒక కార్యక్రమంలో రాజా కుమారుడూ, కోడలూ పాడారుగాని అంత ఇమ్ప్రెసివ్ గా అనిపించలేదు.

« 1 ... 1251 1252 1253 1254 1255 ... 1582 »