Comment navigation


15814

« 1 ... 1249 1250 1251 1252 1253 ... 1582 »

  1. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి mOhana గారి అభిప్రాయం:

    05/03/2009 4:34 pm

    శ్రీనివాస్ గారు ఉదహరించిన మరో ప్రపంచం అనే రెండు పదాలు మూడు మారులు ఉపయోగించడము పునరుక్తి ఎలా కాదు, మూడు వేరువేరు మరో ప్రపంచాలు ఉంటే తప్ప? అదే విధంగా మూడు మారులు భజ గోవిందం అన్నది పునరుక్తి కాదా? వేరు వేరు అర్థాలలో ఉపయోగిస్తే తప్ప పై పదాలు పునరుక్తి దోషం కాదా? దేశంలాటి ఒక పదాన్ని మరల మరల వాడితే పునరుక్తి కాదు, ఎందుకంటే అది వాక్య నిర్మాణానికి కావాలి. లేక నేను బాగా అర్థం చేసికోలేదా పునరుక్తిని గురించి? మన జీవితమే ఒక పునరుక్తి కదా? మొన్నటిలా నిన్న, నిన్నటిలా ఈరోజు. అదే ఆఫీసు, అదే పని, అవే కష్టాలు, అవే నష్టాలు. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అదే ఆకాశం. పునరపి జననం పునరపి మరణం, భజ గోవిందం, భజగోవిందం! – విధేయుడు – మోహన.

    [పునరుక్తిని నిఘంటు అర్ధంతో కవిత్వంలో వాడరు. కేవలం పదం పునరుక్తమైతేనే దోషం కాదు. ఒక భావానికి ఊనిక కోసమో, తూగు కోసమో పదాల్ని తిరిగి వాడడం ఇటరేషన్. చెప్పదలచుకున్న విషయాన్నే మళ్ళీ మళ్ళీ అనవసరంగా చెప్పడం రిడండన్సీ. పునరుక్తి అన్న పదాన్ని ఈ రిడండన్సీ అన్న అర్ధంలో వాడతారు. ఇది మొనాటనీ కాదు. మరికొంత చర్చ అవసరం అనుకుంటే దయచేసి చర్చావేదికను ఉపయోగించుకోగలరు. – సం.]

  2. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/03/2009 12:32 pm

    నమస్కారం
    చెప్పిన ఉదాహరణలలో పునరుక్తి దోషం లేదన్నందుకు సంతోషం.
    “పునః ఉక్తి పునరుక్తి” అనుకుంటున్నాను. మరి పునరుక్తి ఎప్పుడు దోషంగా
    మారుతుందో కొంచెం వివరణ, వీలైతే ఎక్కువ పాపులారిటీ పొందిన కవితలలోనుంచేదైనా సాయపడే ఉదాహరణ దయచేసి తెలుప మనవి. పాయింటు బొత్తిగా అర్థం కాలేదు, నాకొక్కనికే కాదేమో అని కూడా అనుమానం, ప్రయత్నిస్తున్నప్పటికినీ.
    ____
    విధేయుడు
    -Srinivas

  3. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/02/2009 10:08 pm

    నమస్కారం
    చమత్కారంగా చక్కగా తెలిపారు, ఒక్కటి మాత్రం అర్థం కాలేదు.
    “ముఖ్యంగా కవితలలో పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి.”
    అన్నదొక్కటి వ్యంగ్యమో హాస్యమో నిజమో తెలియని (దు)స్థితి.

    వచనంలో పునరుక్తి వద్దనేది అర్థంచేసుకోగల్గినా, కవితలలో_ మనకున్న ఎన్నో తెలుగు, తెలుగేతర కవితలలో, అందంగానే కనబడుతుంది, స్పష్టంగానే వినపడుతుంది, సమంజసంగానే అనిపిస్తుంది కదా పునరుక్తి! అపార్థం చేసుకున్నాననేమో అని అనుమానం, అంతకన్నా దాన్ని సరిచేసుకోడానికే ఈ ప్రయత్నం.

    To be or not to be: that is the question” అనే అంటాం కాని ఎంత Elements of Style ఘోషించినా To be or not: that is the question” అని అనం కదా! “మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది” అనీ, “భజ గోవిందం, భజగోవిందం, గోవిందం భజ” అనీ, “సంభవామి యుగే యుగే” అనీ, “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ” అనీ, “వాగర్థావివ సంప్రృక్తౌ” అని తిరిగి “వాగర్థ ప్రతిపత్తయే” అనీ, “దేశమంటే మట్టికాదోయ్ దే శమంటే మనుషులోయ్”-పునరుక్తులు లేక్కపెట్టుకుంటూపోతే, కత్తిరిస్తూవుంటే మిగిలేదేమిటో conclusion ఏమిటో తెలియదు!
    ప్రార్థన చివర్లో కూడా పునరుక్తే ఓం శాంతిః శాంతిః శాంతిః !
    “And miles to go before I sleep, And miles to go before I sleep”
    —–
    విధేయుడు
    -Srinivas

    [శ్రీనివాస్ గారూ: మీరు పైన ఉదహరించిన వేటిల్లో కూడా పునరుక్తి దోషం లేదు. -సం.]

  4. మే 2009 సంచిక విడుదల గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    05/02/2009 7:59 pm

    ఒక ప్రత్యేకవైన సంచికను తేలేదు సరే, కనీసం ఒక వ్యాసాన్ని కూడా శ్రీ శ్రీ గార్ని స్మరించుతూ ప్రచురించకపోవటం ఎల్లలు లేని ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక ప్రత్యేకతా?

    రవి

  5. ఈమాట పాఠకులకు… గురించి సుజాత గారి అభిప్రాయం:

    05/02/2009 4:46 pm

    చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా తమది పాండిత్యం, ఎదుటివారిది అజ్ఞానం అనే భ్రమలో(పోనీ నమ్మకంలో) ఉన్నపుడు,రచన తమ మనోభావాలకు అనుగుణంగా లేనపుడు ఇటువంటి “నొప్పించే” అభిప్రాయాలు వ్యక్తమవుతాయనుకుంటాను.

    “ముఖ్యంగా ఒక నమ్మిక కోసం తమ ఉనికిని గోప్యంగా వుంచుకునే వెసులుబాటును చీకటిలో నిలబడి మిగతావారిపై బురద జల్లడానికి వాడుకోవడం (తమ అభిప్రాయాలని వెలుగులో నిలబడి ప్రకటించలేని అధైర్యం కూడా కావచ్చునేమో”

    . ఇదీ నిజమే! కానీ అది అధైర్యం కాదు, తమ నమ్మిక ఒకటీ, ఇక్కడ వ్యక్తపరుస్తున్న అభిప్రాయం మరొకటీ అయినపుడు, ఈ గోప్యతను అడ్డు పెట్టుకోవడం జరుగుతుంది. రెండు నాల్కల ధోరణి అన్నమాట!

    ఇది నా అభిప్రాయం. ఎవరి మనోభావాలనూ గాయపరిచే ఉద్దేశం నాకు లేదు. (సంకల్పం చెప్పుకున్నట్లు ఇవాళ ప్రతి మాటకూ ముందు ఇది చెప్పుకోవాల్సిన స్థితి) ఆరోగ్యకరమైన చర్చకు దారితీసే విధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయం సమర్థనీయమే!

  6. ఒక్కతే… మృత్యువు గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    05/02/2009 4:37 pm

    బాగా అనువాదం చేసారు కామేశ్వరరావు గారు. బల్లోజు బాబా గారు చెప్పినట్లు ఒకటి రెండు ఒమిషన్సు వున్నా, నెరూడా గార్ని చక్కగా తెనిగించారు, మెత్త మెత్తగా, చల్ల చల్లగా, సడి చేయని ఒక ఆఖరి, దీర్గ నిశ్వాసాన్ని బాగా చెప్పెరు తెలుగులో.

    రవి

  7. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి sUryuDu గారి అభిప్రాయం:

    05/02/2009 12:31 pm

    చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.

  8. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి darla గారి అభిప్రాయం:

    05/02/2009 10:32 am

    నమస్కారం,
    వెంకటేశ్వరరావు గారు వ్యాసంలో అక్కడక్కడా ఆధునిక అప్పకవి కనిపించినా, చాలా విషయాలను సూటిగా స్పష్టంగా చెప్పారు. మన తెలుగు వ్యాసాలను ఎం.ఎల్.ఏ స్టైల్ షీట్ కూడా తెలియని/ అసలు పాటించన పరిశోధన వ్యాసాలు మాత్రమే అధికంగా ప్రచురితమవుతున్నాయి. కవిత, కథ, వ్యాసాల్లో వాక్యాల గురించి కొన్నింటిని ప్రస్తావించారు. పునర్తుక్తి గురించి రాశారు. కావ్యాలంకార సంగ్రహం లో ప్రత్యేకించి దోష ప్రకరణం ఉంది. అందులో ఉన్నవన్నీ శాశ్వత ప్రామాణికాలని అనలేం, కానీ, అత్యధిక శాతం అవి ప్రామాణికాలే! ఇలాంటి వన్నీ మన భాషా, సాహిత్యాలను మరింత ముందుకు తీసుకువెళతాయి. అలాగే ఇలాంటి వ్యాసాలు కూడా కొందరినైనా కదిలిస్తాయి.
    మంచి ప్రయత్నం. అభినందనలు అనలేను…. ఇంకా వారికంటే చాలా చిన్నవాణ్ణి. ఉపయోగపడే వ్యాసం అని మాత్రం చెప్పగలను.
    దార్ల

  9. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    05/02/2009 7:50 am

    రచనలు ఎలా ఉండాలి అన్న అంశం మీద సోమర్సెట్ మామ్ (William Somerset Maugham)ఒక మంచి వ్యాసం వ్రాసాడు. ఈ వ్యాసం శీర్షిక “Three aims for writers”. ఈ వ్యాసంలో ముఖ్యంగా చర్చింపబడిన అంశాలు మూడు. అవి “Lucidity, Simplicity and Euphony”. ఒక శిల్పి తన పనిముట్లతో ఒక అందమైన శిల్పాన్ని చెక్కినట్టు, ఒక రచయిత(త్రి) ఈ మూడు పనిముట్లతో ఒక చక్కని రచనని సృష్టింపవచ్చు అని అంటాడు మామ్. అందరూ చదవదగ్గ మంచి వ్యాసం ఇది.

    చిన్నయ సూరి తెలుగు వ్యాకరణం మీద పుస్తకం వ్రాయాలని ప్రయత్నించి మూడు సార్లు విఫలమయ్యాడు. నాలుగవ సారి బాల వ్యాకరణం వ్రాయడంలో సఫలీకృతుడయ్యాడు. దీనిని ఆధునీకరించడం అంత తేలిక కాదేమో (though not impoissible for someone like Sri Veluri).

    రాజాశంకర్ కాశీనాథుని.

  10. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    05/02/2009 7:16 am

    1. 1951-55 మధ్యకాలంలో ఆరుద్ర-శ్రీశ్రీలిరువురూ “జంటకవులు”గా కొన్ని సినిమాలకి పాటలు రాసారు. అమరసందేశం కూడా వాటిలో ఒకటి. ఆ పాటల రికార్డులపైన ఇద్దరి పేర్లుంటాయి. ఎన్నడూ ఈ మాటో, చరణమో, పాటో, నాదంటే నాదని గొప్పలు చెప్పుకున్న దాఖలాలు లేవు. ఇద్దరి మధ్య స్నేహం చెడిన తరువాత కూడా! ఈ పద్యానికొచ్చేసరికి ఇద్దరూ తమదంటే తమదని చెప్పుకున్నారు. (శ్రీశ్రీ ఈ పద్యంలోని 2-3 పంక్తులు చదివే ఒక జనరంజని కార్యక్రమన్ని మరొకసారి వినిపిస్తాను.). శ్రీశ్రీ-తాపీ ధర్మారావులు కలిసి కూడా ఒకట్రెండు పాటలు రాసారు. పై వ్యాసంలో ఒక ఉదాహరణ ఉంది.
    2. సీస:
    సద సత్కళా …. విలాస
    రిపు వ దజ్ఞాన ….. సుకుమారి
    గగనా … గీతికాతరంగ
    మధుమాధురీ … సదక్ష దామ
    గీత:
    పరభృత … స్వరకలాప
    దరహసన … మకరంద
    నిరుపమాన … జనని
    సరస … మస్మత్ప్రశంస

    — శ్రీనివాస్

« 1 ... 1249 1250 1251 1252 1253 ... 1582 »