Comment navigation


15814

« 1 ... 1250 1251 1252 1253 1254 ... 1582 »

  1. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి sUryuDu గారి అభిప్రాయం:

    05/02/2009 6:50 am

    బాగుంది, అనుకోకుండా నిన్న బ్లాగులో కామెంటులో ఈ పుస్తకాన్ని ప్రస్తావించాను, దానికి 50 సంవత్సరాలు నిండాయని చూసుకోలేదు. చాలా మంచి పుస్తకం.

    సూర్యుడు 🙂

  2. గాలిపటం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/02/2009 3:40 am

    బాగా నచ్చింది. ఆనందో బ్రహ్మ అంటారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. నిస్వార్ధంగా ఎవరు ఆనందాన్ని అందిస్తారో వారు భగవంతులే. ఆ పిల్ల ఇన్ని ఆలోచించలేదు కానీ ఆమె నమస్కరించడానికి కారణం అదే.

  3. ఒక్కతే… మృత్యువు గురించి bollojubaba గారి అభిప్రాయం:

    05/02/2009 1:25 am

    ముందుగా నా పేరు కూడా ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.

    భలే ఉంది. నేనెక్కడెక్కడ బొక్కబోర్లా పడ్డానో తెలిసింది. (రింగ్ అనే మాటను ఘంటారావం అనే అర్ధంలో అనువదించాను. మీరు ఉంగరం అన్నారు. మీరే కరక్ట్ . ఇంకా చాలాచోట్ల 🙂 కవిత్వానికి క్లుప్తత ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తూంది.

    కొన్ని సందేహాలు

    with bakers white as angels, = గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు – అన్నారు ఎందుకు అందంకోసమా? లేక మరేమైనా అర్ధాలున్నాయా?
    like a shoe without a foot, like a suit without a man, = ఈ వాక్యాన్ని మొత్తం వర్జించారు. కారణం తెలుసుకోవాలని ఉంది.

    మొత్తంమీద అనువాదం బాగా వచ్చింది.

    బొల్లోజు బాబా

  4. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/02/2009 1:21 am

    ఇదే చిత్రంలో శ్రీశ్రీ, ఆరుద్రలిరువురూ తమ రచనగా గొప్పగా చెప్పుకున్న ‘సదసత్కళా’ అనే సీసపద్యం చాలా చక్కనిది.
    ఒకే పద్యాన్ని ప్రఖ్యాతులైన ఇద్దరు మహా కవులు తమ రచనగా ఎలా చెప్పుకోగలిగారు. ఆ సందర్భం వివరించగలరా. అలాగే సప్త స్వరాలను ముఖం-పాదాంతంలో నిలుపుకున్న ఆ సీస పాదాలను తెలుపగలరా?

    కృష్ణా ముకుందా మురారీ అనే పాటను అత్యంతంగా అభిమానించే నేను అదే శైలి దైన “చూడుమదే చెలియా” అనే పాట కూడా ఘంటసాలే పాడితే చాలా బాగుండేదని చాలా సార్లు అనుకునే వాడిని. ఎవరి వైశిష్ట్యం వైవిధ్యం వారిదే ఐనా రాజా గారిని ఘంటసాలకు సమవుజ్జీగా భావించలేము. Survival of the fittest పరిణామ సూత్రం వలన రాజా గారు తెలుగు సీమకు దూరం అయ్యారని అనుకుంటాను.

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/01/2009 11:27 pm

    వ్యాసకర్తగారికి అనేకానేక ధన్యవాదాలు. ఈ వ్యాసం ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు జగదారాధ్యులైన త్యాగబ్రహ్మం గారి గురించి తెలుసుకున్నాము.

    బ్రహ్మ జ్ఞానము గలుగగ
    బ్రహ్మానందంబు గలుగు భాతిని త్యాగ
    బ్రహ్మజ్ఞానము గూర్చిరి
    బ్రహ్మాండంబైన శైలి బ్రహ్మానందా!

    దశ సహస్ర శత కోటి వందనాలతో
    భవదీయుడు

  6. ఈమాట పాఠకులకు… గురించి bollojubaba గారి అభిప్రాయం:

    05/01/2009 11:06 pm

    ఎడిటర్ గారికి
    మీరు చెప్పిన విషయాలు సమంజసంగానే అనిపిస్తున్నాయి.
    నామట్టుకు చాలా సార్లు వాదప్రతివాదనలు మాంచి థ్రిల్లింగుగానూ, భిన్న విషయాలపట్ల అవగాహన కల్గించేవిగానూ అనిపించాయి. చాలా సందర్భాలలో అసలు రచనలకు మించి కూడా.

  7. నాకు నచ్చిన పద్యం: ఉత్తర రామాయణంలో సీత గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/01/2009 9:43 pm

    ఏకో రసః కరుణ ఏవ. తెలుగులో కరుణారసపోషణలో కంకంటి పాపరాజు గారు వ్రాసిన ఈ ఘట్టం పరాకాష్ట. ఈ సందర్భంలో ఆయన వ్రాసిన ప్రతి పద్యం కంట నీరొలికించక మానదు. నచ్చిన దేదో ఒక పద్యమే ఎన్నుకొని వ్రాయాలనే నిబంధనలేకపోతే ఈ ఘట్టంలోని ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే.
    ఇటువంటి సందర్భాలలోనే (లేదా ఈఒక్కసందర్భంలోనే) “నాకు నచ్చిన పద్యం” అనే శీర్షిక క్రింద గాక “నాకు నచ్చిన ఘట్టం” అనే శీర్షిక క్రింద ఈ సందర్భంలోని అన్ని పద్యాలను వ్రాస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఈ పద్యంతో ఈ ఘట్టం అంతా గుర్తుకు తెచ్చి మనస్సు వికలం చేసి రాముని పైన అనంత కోపం మరొక్కసారి తెప్పించిన మీకు కృతజ్ఞతలు.

  8. వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి దుప్పల రవికుమార్ గారి అభిప్రాయం:

    05/01/2009 9:05 pm

    పతంజలి గురించి ఎవరేమి మాట్లాడినా గుండె కలుక్కుమంటోంది. ఒక గొప్ప రచయితనీ, గొప్ప పాత్రికేయుణ్నీ, గొప్ప మనిషినీ పోగొట్టుకున్నాం. చివరిసారిగా పతంజలిబావును చూడగలిగిన మీరంతా అదృష్టవంతులు.

  9. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి దుప్పల రవికుమార్ గారి అభిప్రాయం:

    05/01/2009 8:48 pm

    బూదరాజు రాధాకృష్ణ ‘భాషా స్వరూపం’ “ఈనాడు” అచ్చేసింది. కానీ, అన్ని విలువల్నీ క్రమక్రమంగా వదిలేసిన ఈనాడు ఆ పుస్తకాన్ని కూడా పక్కన పెట్టేసింది. కానీ అది జర్నలిస్టులకు ప్రామాణికంగా పనికొచ్చేది …అస్పష్టత లేని వాక్యం రాయడం కోసం. కాబట్టి ప్రాచీ పబ్లికేషన్స్ పూనుకొని ఆ పుస్తకం కూడా ప్రచురిస్తే మీరన్న దిశలో ఒక మంచి పుస్తకం తెలుగులో విస్తృతంగా చలామణీలోకి వస్తుంది.

  10. ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/01/2009 8:39 pm

    నాకు తెలిసి, అటువంటి ప్రయత్నమే ఒకటి డాక్టర్ చంద్రశేఖరరెడ్డి గారు కొన్నేళ్ళ క్రింద “వార్త” పత్రికలో “మన భాష” శీర్షికగా వ్రాసిన వ్యాసపరంపర అనిపిస్తుంది.

    సాధ్యమైనంత ఎక్కువ మందికి సాధ్యమైనంత తక్కువ వెలతో అందించే విధంగా నూరు వారాలపాటు ధారావాహికంగా సాగిన ప్రయత్నం, రచయిత పరిశ్రమకూ, అప్పటి “వార్త” సంపాదకులైన శ్రీ కె.రామచంద్రమూర్తి గారి దార్శనికతకూ, ఇప్పుడు కూడా ఆశ్చర్యపడుతుంటాను. ఆ నూరూ వ్యాసాలను సంకలం చేసి “మన భాష” అనే పేరుతో 2001 లో పుస్తకంగా ప్రచురించారు. అది భాషా పరిజ్ఞాన సాధనకు చాలా ఉపకరమైన రచన అని బూదరాజు రాధాకృష్ణ గారు బహుధా ప్రశంసిస్తూ “పరిచయం” వ్రాసారు. భాషాపరంగా, వాడుక పరంగా అది తెలిపిన ఎన్నో విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి.

    Elements of Style లో అన్య భాషాలోనుంచి ఇంగ్లీష్లోకి చేరిన పదాలను ఎట్లా ఏ రూపంగా వాడాలి అన్న ప్రస్తావన లేదు, సంశయాలు లేవు కాబట్టి! కాని తెలుగుకు సంస్కృతానికి పెద్ద సంబంధమే ఉంది. “ఏది తెలుగు – ఏది సంస్కృతం”,
    “తద్భవాలా – తత్సమాలా”, “శషలు తెలుగులో లేవు”,
    “తత్సమాలు ఏర్పడే పద్దతి” “భాషల పరస్పర ప్రభావం” మొదలగు ఎన్నో అంశాలు, పొరపడే ప్రయోగాలు, పదాలు
    ఉన్నాయందులో.

    ముఖ్యంగా, పత్రికలో వచ్చింది కాబట్టి సాధారణ పాఠకులకు అందుబాటులో ఉండి, ప్రతి అంశం రెండు పేజీలకు మించకుండా (రెండువైపులున్న ఒక్క పేజీనే!) ఒక చక్కని Style లో ఉంది.
    ఎప్పుడు చదివినా ఏవో కొత్త అంశాలు (నాకు!) నేర్పే పుస్తకం. సందర్భం వచ్చింది కాబట్టి దాని ఉనికిని తెలియజేసే ప్రయత్నం
    మాత్రమే. ఆ పుస్తకమొక్కటే సరిపోతుందని కాదు. ఆ కృషి మాత్రం గుర్తించదగింది, ఇంకా విస్తరించదగింది అనుకుంటాను.
    ———
    విధేయుడు
    -Srinivas

« 1 ... 1250 1251 1252 1253 1254 ... 1582 »