Comment navigation


15814

« 1 ... 1248 1249 1250 1251 1252 ... 1582 »

  1. ఒక్కతే… మృత్యువు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    05/04/2009 6:10 am

    అభిప్రాయాలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. పవన్ గారి అభిప్రాయంలో ఉన్న అంశాలగురించి నా ఆలోచనలని చర్చావేదికలో పెట్టాను. అక్కడ అనువాదాల గురించి మరింత వివరంగా విస్తృతంగా చర్చించుకుందాం. బాబాగారి సందేహాలకి కూడా అక్కడ చర్చలో భాగంగా నా అభిప్రాయాలని వివరిస్తాను.

  2. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి చావాకిరణ్ గారి అభిప్రాయం:

    05/04/2009 4:39 am

    ఇంత ఘాడ పానియాన్ని సేవించిన తరువాత కూడా ఈ మాటకు రచనలు పుంఖాను పుంఖాలుగా వస్తుంటే అది మాత్రం నిజ్జంగా మనకు కవి, రచయిత మంద ఎక్కువ అయిందన్న దానికి సూచనే అని అనిపిస్తుంది.
    -ఇంకో వ్యాఖ్య వ్రాయాలి, సమయం ఉన్నప్పుడు. కాకుంటే ఇవే విషయాలు రచయిత దృష్టిలో నుంచి చూస్తూ.

  3. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Meher గారి అభిప్రాయం:

    05/04/2009 3:15 am

    Typical editors’ jargon. వాక్యాల్నీ, వ్యాకరణాన్నీ, విరామచిహ్నాల్నీ పట్టించుకున్నంతగా రచన మొత్తంగా పాఠకునిపై కలిగించాల్సిన అనుభూతిని ఎక్కడా నొక్కిచెప్పకపోవడం ఆశ్చర్యం. బహుశా అది ఇలా టెస్ట్‌ట్యూబ్‌ సమీకరణాల్లో పట్టుబడేది కాకపోవడం వల్లనేమో. అయినా ప్రస్తావిస్తే బాగుండేది. లేకపోతే ఈ ఉత్తరాన్ని అందుకున్నవారు ఇలాంటి నియమాల్ని scalpels లాగా చేతబూని రచనల మీద పడతారు. సంపాదకులంతా వీటికి కట్టుబడితే జాయ్స్ “యులిసెస్”, రాబీ గ్రియే “జెలసీ” లాంటి రచనలు బయటపడేవి కావు.

    మెహెర్

  4. ఈమాట పాఠకులకు… గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/04/2009 1:45 am

    మీరు ఎన్నుకున్న మార్గం చాలా సమంజసమైనది, యుక్తమైనది. అలాగే కొనసాగించండి. మీరు మాకు చూపిన మార్గదర్శకాలు కూడా ఉత్తమమైనవి. ఇవి నా తప్పులు నేను తెలుసుకొని సంస్కరించుకోడానికి ఉపయోగ పడుతున్నాయి.
    ఒరులేయవి యొనరించిన
    నరవర! యప్రియము తన మనంబున కగు దా
    నొరుల కవొనరింప కునికి
    పరాయణము సకల ధర్మ పధముల కెల్లన్
    నాలాంటి కొందరికి ఈ ప్రక్రియ (అభిప్రాయ ప్రకటన) కొత్త. మీ సూచనలకు ఒడంబడి సౌహార్ద్రత, సౌమనస్యతా పూర్వకమైన వాతావరణం భంగం చేయకుండా వ్యవహరిస్తాము. అనవసరమైన ఆవేశ కావేషాలకు పోయి ఎప్పుడైనా అసంగతమైన వ్యాఖ్యలు/విమర్శలు చేసినా వాటిని యుక్తమైనట్లు త్రుంచి లేదా నిర్మూలించి సంస్కరించడానికి వున్న మీ హక్కుని సదా గౌరవిస్తాము.
    భవదీయుడు

  5. ఈమాట పాఠకులకు… గురించి Meher గారి అభిప్రాయం:

    05/04/2009 1:15 am

    పాఠకుల అభిప్రాయ నియమావళి చదివాను. అన్నీ బానే వున్నాయి. ముఖ్యంగా ఒక పాఠకుడు మరో పాఠకుని అభిప్రాయంపై దండెత్తే చెడు అలవాటుపై పరిమితి విధించడం మంచిదే. కానీ పాఠకులు తన స్పందనలు సంపాదకుల్ని సంభోదిస్తూ చెప్పాలన్న నియమం మాత్రం బాలేదు. పాఠకునిగా ఒక రచన నాకు నచ్చినపుడు నేను ఆ కృతజ్ఞతను తిన్నగా రచయితకే తెలుపుకోవాలనుకుంటాను. నచ్చనపుడు సాధారణంగా అక్కడ స్పందనే తెలపను. పాఠకునిగా నాకూ రచయితకూ మధ్య సంపాదకులు మీడియేటర్స్ అంతే. వాళ్ళతో నాకే నిమిత్తమూ లేదు. ఏదన్నా కథో కవితో నచ్చినప్పుడు ఇక ఇక్కడ కూడా మామూలు పత్రికల్లోలా “ఎడిటర్జీ మీరు ప్రచురించిన ఫలానా కవిత/ కథ చాలా బాగుంది” అని చెప్పాలంటే ఏదో కోల్పోయినట్టనిపిస్తుంది. రచయితలు ప్రతిస్పందించడం/ ప్రతిస్పందించకపోవడం వాళ్ళ యిష్టం. పాఠకుని స్పందన మాత్రం రచయితకు ఉద్దేశిస్తేనే బాగుంటుంది.

    [మీ సలహా ప్రకారం తగువిధంగా పాఠకులకు సూచనలలో మార్పులు చేశాము. – సం]

  6. మే 2009 సంచిక విడుదల గురించి రవి గారి అభిప్రాయం:

    05/03/2009 11:22 pm

    పైన సురేష్ కొలిచాల గారి లంకె తెరుచుకోవట్లేదు. గమనించగలరు.

    [లింకు సరిచేశాము. హెచ్చరించినందుకు కృతజ్ఞతలు – సం]

  7. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/03/2009 8:52 pm

    ముందుగా రాజాశంకర్ కాశీనాథుని గారి అభిప్రాయానికి కృతజ్ఞతలు. కేవలం చరిత్రకీ, జీవితాంశాలకీ పరిమితం కాకుండా, అసలు విషయాన్ని కొంత లోతుగా వివరించి, ఆసక్తి పెంచాలన్నదే నా ఉద్దేశం కూడా. గణితంలో హైస్కూలు చదువుకి మించిన అర్హత లేని వాళ్ళకి కూడా అర్థం కావాలన్నది మరో ముఖ్యమైన లక్ష్యం. ఒక్కొక్కప్పుడు ఈ రెంటినీ సాధించడం చాలా కష్టమవుతోంది. హిల్బర్ట్ ఫార్మలిజం గురించి లోతుగా రాయలేక పోయినదందుకే. నేను ఇంకాస్త గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది. కేంటర్ వ్యాసంలో మాత్రం అనంతాలలో వైవిధ్యం గురించి సరళంగా, విపులంగా రాశాననే నమ్మకం.

    ఈ వ్యాసాల్లో మనమింకా కంప్యూటర్ యుగం లోకి రాలేదు కదా. మరి అప్పుడే ముగింపు కోసం ఎదురు చూస్తే ఎలా? 🙂

    ఏమైనా, ఇలాంటి అభిప్రాయాలు నాకు తప్పక ఉపయోగపడతాయి. ఎటొచ్చీ కాస్త ముందరే చెప్తే వెంటనే కొన్ని సలహాలు అమలులో పెట్టాడానికి వీలవుతుంది. ప్రస్తుత వ్యాసం (ఎనిమిదవది) పరిశీలకుల దగ్గరకి చేరింది. ఇప్పటికే బాగా ఆలస్యమవడాన, దానికి విస్తృతమైన మార్పులు చెయ్యడం కుదరదు. తొమ్మిదో వ్యాసం రాసేటప్పుడు రాజాశంకర్ గారి మాటలు దృష్టిలో ఉంచుకుంటాను.

    ఆలస్యానికి అందరికీ క్షమాపణలతో,
    కొడవళ్ళ హనుమంతరావు

  8. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి papineni sivasankar గారి అభిప్రాయం:

    05/03/2009 7:58 pm

    ఒక మృదు గాయకుడి గురించి మేలైన వ్యాసం. నాకు తెలియని సంగతులెన్నో చదివాను. రాసినవారి కృషికి, వేసిన వారి అభిరుచికి అభినందనలు.

    మరేమో 2004 వేసవిలో గుంటూరులో జిక్కి గారికి `విశాల సాహితి` సత్కారం చేసినప్పటి అనుభూతి మరుపు రానిది. అప్పటికే ఆమె కొంత అనారోగ్యంతో ఉన్నారు. `ఏరువాకా` మొదలు ఎన్నో పాత పాటలు వినిపించారు. చుట్టు పక్కల ఊళ్ళ నుంచి కూడా అభిమానులు తండోప తండాలుగా వచ్చారు.
    పాడిన పాటలన్నిటిలోను `పులకించని మది ` తనకెంతో ఇష్టమని జిక్కి చెప్పారు.

    మీరు రాసినట్టు వాళ్ళ అబ్బాయిది అచ్చం రాజా కంఠ స్వరమే.

    `పక్కింటి అమ్మాయి`లో రాజా పాడిన ఒక అద్భుతమైన పాట `కలయేమో`.
    ముద్దుకృష్ణ రాశాడు గదా!

    మెచ్చుకోలుతో
    పాపినేని శివశంకర్

  9. ఒక్కతే… మృత్యువు గురించి గరికపాటి పవన్ కుమార్ గారి అభిప్రాయం:

    05/03/2009 7:28 pm

    అనువాదాలు కత్తి మీద సాము లాంటివే, అందులోనూ లయ బద్దమైన వాక్య నిర్మాణానికి పెరెన్నిక గన్న నెరుడా కవిత్వానువాదమంటే ఎంతో లోతైన ఆలోచన, కవిత్వం చదివినప్పుడు కలిగిన నిండైన భావావేశం రెండూ కలపోయాలని నా స్వీయానుభవం. లేకపోతే అనువాదం రక్తి కట్టదు.

    మొదటి ఏడు పాదాల స్పానిష్ మూలం;

    SÓLO LA MUERTE

    HAY cementerios solos,
    tumbas llenas de huesos sin sonido,
    el corazón pasando un túnel
    oscuro, oscuro, oscuro,
    como un naufragio hacia adentro nos morimos,
    como ahogarnos en el corazón,
    como irnos cayendo desde la piel al alma.

    ఉరామరికగా, స్పానిష్ నుంచి అర్థం:

    మృత్యువొక్కటే

    అక్కడ ఒంటరిగా శ్మశానాలు
    ఎముకలు నిండిన సమాధులు, శబ్దం లేదు
    గుండె గుండా ఒక సొరంగం
    చీకటి, చీకటి, చీకటి
    మనని మృత్యువులో దించిన పగిలిన ఓడన్నట్టు
    మన గుండెలోన మనని ముంచినట్టు
    మనం తోలు నుండి ఆత్మ లోకి పడినట్టు

    ఇక భైరవభట్ల గారి అనువాదం పరిశిలిస్తే: మొదటి పాదం బాగా వచ్చింది, కానీ రెండవ పాదంలో కవి(నెరుడా) హృదయం నిశ్శబ్దం అని కాదు, శబ్దం లేదని (కవిత్వంలో ఈ రెంటికీ చాలా తేడా ఉంది),అలాగే సమాధులు ఎముకల నిశ్శబ్దం నిండినవని కూడా కాదు.

    ఇక మూడవ పాదం ఆంగ్లానువాదంలోని తప్పుని ఖరారు చెయ్యడం.
    నాలుగవ పాదంలో మూలంలో లేని అనవసరమైన దండుగ్గణం (కటిక)
    ఐదు, ఆరు, ఏడు పాదాలు Como అనే పదంతో మొదలైతాయు స్పానిష్ లో, దానర్థం లా, ఉపమానంగ చెప్పినట్టు. “ఈ మరణం” అనేది ఎక్కడ నుండి వచ్చింది? కవితా వాక్య నిర్మాణానికి అనువాదంలో ఎటువంటి స్థానం కల్పింఛారు భైరవభట్ల వారు?

    అనువాదాలు చేసేప్పుడు కొన్ని సూచనలు:

    1. మూలాన్ని రక్షించండి (మూలో రక్షతి రక్షితః)
    2. వివరణల్లోకి పోవద్దు, కవితని కవితగానే ఉంచండి (ఉదాహరణకి పై ఐదు, ఆరు, ఏడు పాదాలు వివరణ)
    3. మూల భాషలో కనీస పరిజ్ఞాన్ని పెంచుకోవడం.

    మన పద్యాలను సంస్కృతంలో నుంచి జర్మనులోకి పరివర్తించేప్పుడు, ఛందోబద్దంగా అనువదించగలిగితే బాగుండేదని మహకవి గోథే అభిప్రాయపడ్డాడు. ఈ వివరణ భైరవభట్ల గారి కలం నుంచి ఇంకా మంచి అనువాదాలు వెలువడాలనే.

    [మరింత చర్చకు వీలుగా ఈ అభిప్రాయాన్ని చర్చావేదికలో కూడా ప్రచురించాము. – సం]

  10. గృహకల్ప గురించి sarath గారి అభిప్రాయం:

    05/03/2009 7:05 pm

    ఇటు దగ్గిరసా దీన్నొదలవు – దీని అర్ధం?

« 1 ... 1248 1249 1250 1251 1252 ... 1582 »