Comment navigation


15814

« 1 ... 1247 1248 1249 1250 1251 ... 1582 »

  1. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/05/2009 10:21 am

    అయ్యా ముఖ్య సంపాదకుల వారూ..!!
    మీకూ..మీ స హ..లేదా ఉప సంపాదకులకు మరో సులువు చెప్పాలని అన్పించింది. మీరెటూ సున్నిత మనస్కులు అయివుండరు గనక, కాస్త నిశ్చింత గానే చెబుతున్నాను. అదేమంటే..అసలు ఇన్ని సూచనలిస్తూ.. కత్తిరిస్తూ..ఇలాంటి అవస్థలన్ని పడేకన్నా..ఆ కధలూ..కవితలూ..వ్యాసాలూ..వాక్యాలూ..మీరే రాసేసుకుంటే పోలా??

    మీకు ఇతరుల రచనల్ని సంస్కరింఛే శ్రమ తప్పుతుంది. పాఠకులకి మీ శత..స హస్ర నిషేధాల బరువూ తప్పుతుంది. పెద్ద రచయితలు మీకు రాయరు. ఔత్సాహికులని మీరు రాయనిచ్చేలా లేరు. చూడబోతే..మీరు కవులకెల్ల కవి లాగానూ..విమర్శకులకెల్ల… విమర్శకులుగానూ..పాఠకులని మించిన పాఠకుని గానూ కన్పిస్తున్నందున..మీ పత్రికని మీ సూచనల మేరకు మీరే బాగా నడుపుకోగలరు.

    రమ.

  2. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Maddipati Krishna Rao గారి అభిప్రాయం:

    05/05/2009 9:59 am

    1993లో తానా సభలకువచ్చి అమెరికా అంతా తిరిగిన బృందంలో రాజాగారబ్బాయి చంద్రశేఖర్, ఘంటసాలగారబ్బాయి విజయకుమార్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరికీ వారి తండ్రుల గొంతులు వచ్చాయి గానీ, తండ్రులకున్న శిక్షణ, క్రమశిక్షణ, సంగీతాన్ని అంతగా ఆరాధించే తత్వం పిల్లల్లో ఎక్కడా ఉన్నట్లనిపించలేదు. లేకపోతే వీళ్ళిద్దరూ కూడా మంచి గాయకులై ఉండేవారు.

    కృష్ణారావు

  3. వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి tavva obul reddy గారి అభిప్రాయం:

    05/05/2009 8:48 am

    కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది, పతంజలి గారిపై గొరుసు జగదీశ్వర రెడ్డి గారి వ్యాసం.

  4. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/05/2009 7:32 am

    ఛందొబధ్ధవయిన కవిత్వం రాస్తున్నవాళ్ళు అనుభూతికి, భావానికి రెండో పీట వేసి ఛందస్సుకి పెద్దపీట వెయ్యడం వల్లే వాళ్ళ కవిత్వంలో ఛందస్సు తప్ప కవిత్వం వుండకుండాపోతోంది. ఈ పీటల గురించి నా విమర్శ కొంచెం రసజ్ఞ పాఠకులముందుంచి నా దృక్పధం సరి ఐనదో కాదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

    సాహిత్యానికి అందాన్ని కూర్చేవి మొదటిది శబ్దం రెండవది భావం. శబ్దం చెవిని పడుతూనే శృతిపేయంగానో కర్ణ కఠోరంగానో ఆకర్షణ వికర్షణలను ఆ కవిత్వంపై కలుగజేస్తుంది.

    [ఈ కామెంట్ పూర్తిపాఠం చర్చావేదిక లో చదవగలరు – సం]

  5. తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/05/2009 3:46 am

    నవల చాలా బాగుంది. బాగా నచ్చింది. వస్తువే గాక విధానం కూడా ఆకట్టుకుంది. కాలచక్రం వేగంగా ఎవరితోనూసంబంధం లేకుండా తిరుగుతుంది. తనతో పాటు అనేక సంస్కృతులనీ సంప్రదాయాలనీ మార్పులకు గురిచేస్తూ పోతుంది. కాలానుసారంగా మారగలిగినన్నాళ్ళూ ఎవ్వరికీ ఏ బాధా వుండదు. కానీ ఎప్పుడైతే ఇదే నిజమైన సర్వజనులూ ఆదరించి ఆచరించాల్సిన సంస్కృతి సంప్రదాయం అని ఎక్కడ మనం ఆగిపోతామో, అక్కడనుండే కష్టాలు ప్రారంభం అవుతాయి. ఎన్ని రామసేనలు వచ్చినా అనివార్యమైన కాలం తెచ్చే మార్పులను ఆపడం సాధ్యం కాదు. కాలానుగుణంగా మారి తీరాలి.

  6. జిగిరీ – 6వ భాగం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/04/2009 11:05 pm

    హృదయమంతా ఆర్ద్రత నింపి మనస్సును కదిలించి వేసే ప్రబల శక్తి ఈ నవలకెలా వచ్చింది? సర్వ వ్యాపి ఐన భగవంతుడు ఎక్కడ విశిష్టతమమైన రూపంలో భాసిస్తాడో తెలుసుకోడానికి ఉపనిషత్తులు నేతి నేతి (న+ఇతి) మార్గంలో అన్వేషిస్తీ కనిపించిన విశిష్టమైన భావాలలో ప్రేమ ఒకటి. ప్రాణుల మధ్య వివిధ రూపాలలో కనిపించే విశ్వజనీనమైన ఈ భావం శుద్ధ భగవత్స్వరూపం. యజమానికీ ఒక మూగప్రాణికి మధ్య వున్న ఈ ప్రేమ ప్రతి సంఘటనలోనూ ద్యోతకమై మనస్సులను ఆర్ద్రతతో నింపుతుంది.
    కానీ చాలా కఠోరమైన నిష్ఠురమైన సత్యం ఏమిటంటే “అన్నం పరబ్రహ్మ స్వరూపం”. ఆకలి ఇంకా ప్రబలమైనది బహుశా ఇదే అచ్చమైన బ్రహ్మ స్వరూపమేమో. ఆనందో బ్రహ్మ అనేది కేవలం కడుపులునిండిన వారి అపోహ ఏమో. ఎందుకంటే ఆకలే జీవితాలని శాసిస్తుంది – ఈ కధను కూడా.
    ఏమైనా చాలా ఉత్తమమైన నవల. శరత్చంద్ర చట్టోపాధ్యాయ గారి మహేశ్ అనే నవల/కధలో కూడా ఇదే ఇతివృత్తం. దుర్భర క్షామ పరిస్థితులలో మహేశ్ (ఆవు) కి తినిపించడానికి గ్రాసం లేక తన భుక్తికై దానిని కసాయి వాడికి అమ్మడానికి మనస్కరించక తన పూరింటి పైకప్పు గడ్డిని కొంచెం కొంచెంగా పీకి తినిపించే అభాగ్యుడి జీవితం మనస్సును కదిలించి వేస్తుంది. ఈ కధ శరత్ సాహిత్యానికేమాత్రం తీసిపోదు. చక్కని నవల రచించినందుకు రచయితకు, ప్రచురించి, పురస్కారంతో గౌరవించి మా కందించిన ఈ మాట వారికి అనేకానేక ధన్యవాదాలు.

  7. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Sreeram గారి అభిప్రాయం:

    05/04/2009 4:40 pm

    ఈ ఉపమానం చేయబుద్దేస్తూంది.
    తలత్ మహమ్మద్ : రఫి :: రాజా : ఘంటసాల
    కానీ తలత్ కన్నా రాజా మిన్న (చలి వణుకు లేదు).
    రాజా గొంతు మెచ్చని వారు బహు కొద్ది, తలత్ గొంతు తీవ్ర ప్రతిస్పందన్నిస్తుంది.
    మిస్సమ్మలొ భావ గీతము “ఈ నవ నవాభ్యుదయ విశాల…” నాకు నచ్చిన మరో గీతిక.
    -శ్రీరాం

  8. ఒక్కతే… మృత్యువు గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/04/2009 10:41 am

    మంచి అనువాదం. కవిత కన్నా అనువాదం కష్టమనుకుంటాను. మూలభాషలో చదివినవాళ్ళను మెప్పించడం ఇంకా కష్టతరం.
    “మృత్యుగీతానిది తడి ఊదాపూల రంగు మృత్యుముఖం ముదురాకుపచ్చ కాబట్టి” చదివాక ఏదో తెలియని వెలితి, ఇది రాయడానికి స్ఫూర్తి….

    [పూర్తిపాఠం చర్చావేదికలో చూడగలరు -సం.]

  9. రామన్న గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/04/2009 10:04 am

    వినీల్ గారు
    కవిత నచ్చిందందామనుకున్న కాని గుచ్చింది, car accident లో పోగొట్టుకున్న దోస్తు యాదికొచ్చి. చివరి లైను కొసమెరుపు.
    ______
    విధేయుడు
    -Srinivas

  10. పునరపి గురించి Bhanu గారి అభిప్రాయం:

    05/04/2009 7:45 am

    చాలా బాగుంది. I enjoy the stories written in eemaata as mostly they resemble the stories of NRIs(In the lunch time in Office. NOT at HOME.. no time like Latha). But I never wrote a comment before for any story for any magazine before. A real story.. touched heart… I am sure many indian wives in US feel this way. This generation, wives in India or US need to earn apart from taking care of husband,house and kids. In India, at least there will be help from elders and/or servants. Here, we have to manage everything on our own…As it appears from out side …every thing is good and well with a small family, two jobs and being well off in US,so it looks insane to ask help from not understanding husband and land up in big fights which will disturb the whole family. Is there any remedy for this situation? I request to print some more stories with issues Indian wives face in US. Thank you very much.

« 1 ... 1247 1248 1249 1250 1251 ... 1582 »