ఈమాట పాఠకులకు… గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
05/08/2009 12:01 pm
మీరు చెప్పిన విషయాలు సమంజసంగా లేవని కాదు నా అభిప్రాయం. మీ ప్రతి స్పందన కొంచం ఎక్కువగా వుందేవోనని నా అనుమానం. అక్కడక్కడా కొన్ని వ్యక్తిగతవైన అవహేళనలు, అనుచితవైన విమర్సలు లేకపోలేదు, కానీ వాటికి ఎన్నో రెట్లు సలక్షణవైన అభిప్రాయాలు వస్తున్నాయి కదా.
రచయితలు (కవులు, వ్యాసకర్తలు కూడా) ఆ మాత్రం వ్యంగ్యాన్ని, అప్పుడప్పుడూ ఏ కొంచవో అవహేళణని అసలు తాళలేకపోతే ఎలా.
నా ఉద్దేశంలో అభిప్రాయవేదిక సరిగ్గానే సాగుతుంది. అనవసరంగా పరిధిలు పెట్టుకోవడం వలన మంచికన్నా చెడు జరగడానికి ఆస్కారవుందేవోనని నా సందేహం.
రవి
రామన్న గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:
05/08/2009 11:22 am
వినీల్,
అద్భుతంగా వుంది. ఎందుకు బాగుంది, ఏవి బాగుంది అనే తర్కం కూడా రానంతగా మనసునంతా ఆవహిస్తుంది నీ కవిత. మసకబారిపోయిన గుర్తులేవో ఉలిక్కిపడి లేచి కూర్చొనేలా.. .
నాకు కూడా నాగులపల్లి శ్రీనివాస్ గారికి వచ్చిన సందేహమే వచ్చింది. “రచయితలు” అన్న మాట చాలా విలువైనది కావాలి పత్రిక్కి. రచయిత లేకుండా పత్రికకి మనుగడ ఉండదు. బయటికి ఎన్ని పెద్ద కబుర్లు చెప్పినా వైవిధ్యమైన రచయితని ఆకట్టుకోగల చతురత ..పత్రికా సంపాదకులకి ఉండాల్సిన ముఖ్య లక్షణం. పేరు పెట్టకుండా. ఈమాట ముఖ్య సంపాదకుడు చేసిన..సీనియర్ రచయితలు..అహాల..ప్రస్తావన …రచయితల మీద అర్ధంలేని అభాండంగా కన్పిస్తోందే తప్ప అందులో రచయితల పై ఏ కోశానా గౌరవం ధ్వనించలేదు. తమ పత్రికా లక్ష్యాలకి సరిపడా రచనలు ఆ పత్రికలో కన్పించకపోతే ఆ లోపం పత్రిక లోనే ఉన్నదని అర్ధం. “సంపాదకుడంటే నాకింపారెడు భక్తి గలదు ఎంచేతన గా..సంపూర్ణ మనుజుడాతడు..చింపాంజీకన్న నయము సిరిసిరిమువ్వా!! అని తన కంద పద్యంలో.. శ్రీశ్రీ మరి అందుకే అన్నాడు. అస్తు.
రమ.
పునరపి గురించి Rajesh Devabhaktuni గారి అభిప్రాయం:
05/07/2009 9:37 pm
ఇది కేవలం కల్పితమైన కథే అయిన, చాల సిగ్గుపడవల్సినటువంటి విషయమేమిటంటే, అమెరికా లాంటి దేశంలో ఊండి కూడా భార్యని ఇంక ఒక ఇంటి మొద్దు లాగా పరిగణించడం చాల బాధాకరమయిన విషయమే (ఒక వేళ అలా జరుగుతున్న సందర్బాలు ఉన్నట్లయితే). After all He/she is a “Best half” and wont be complete without He/ She. Thanks for the Story.
గాలిపటం గురించి Rajesh Devabhaktuni గారి అభిప్రాయం:
05/07/2009 8:01 pm
ఆహ ఎంత చక్కటి కథ. చదువుతూ ఉంటె అప్పుడే అయిపోయిందా అనిపించింది. రచియిత గారు మీ నామంలో ఉన్న “ఆనందం” లాగే ఈ కథలోనూ ఆనందం గురించి చక్కగా చెప్పారు. కానీ ఇప్పటి రోజుల్లో అలాంటి ఒక సంఘటన జరగక పోవచ్చు అనడం అతిశయోక్తి కాదేమో?
ఈ వ్యాసం చదువుతుంటే పాత డైరీ చదువుతున్నట్లుంది. సురేశ్ గారిని అభినందించడం నా ధర్మం, కర్తవ్యం.
1) 90లలో గోఫర్ వెదకడంలో అందరికీ మా ల్యాబ్ లో సహాయం చేస్తుండేవాడిని. అక్కడ ఎన్నో శాస్త్రీయ విషయాలపైన సమాచారాలు దొరికేవి.
2) తెలుగు డైజెస్టు మాత్రమే కాక బవులింగ్ గ్రీన్ లోని వాణీనాథరావుగారి ఆధ్వర్యాన, ఉమా రామమూర్తి గారి సంపాదకత్వంలో (వీరు ఇప్పుడు మెంఫిస్ లో ఉన్నారు) ఇండియా డైజెస్టు వారపు రోజులలో వెలువడేది. ఇండియా న్యూస్ అని డక్కన్ హెరాల్డ్ నుండి పత్రికా సమాచారాలు కూడా వచ్చేవి. నేను ఇండియా డైజెస్టుకు ప్రతి రోజు Today’s Beautiful Gem అని ఒక పద్యాన్ని, లేక ఒక చిన్న వ్యాసాన్ని పంపేవాడిని. క్లుప్తతకు ఇది ఒక నిదర్శనం. 40 పంక్తులకు మించి రాయరాదు ఇందులో! వాటిని ఇక్కడ చదువవచ్చు. http://www.uramamurthy.com/mohan_gems.html
500లకు పైగా ఉన్నాయి ఇవి. ఇందులోని కొన్ని మణులను పుస్తకరూపంలో ప్రచురించాలనే ఆశ ఉంది.
3) నన్ను తెలుసాకు పరిచయం చేసింది సదానందగారు. తెలుసాలో నేను ఎక్కువగా పాఠకుడినే, రచయితను కాను. అప్పుడు సుప్రభగారు ఎక్కువగా అందులో పద్యాలు రాసేవారు. వారు ఇప్పుడు శారద అనే
స్వంత సైటులో రాస్తారు. పద్యాలలో నాకు ఆసక్తి కలిగించింది వారే. ఇప్పుడు కూడా పాత తెలుసా సందేశాలను చదవడమంటే ఖుషీగా ఉంటుంది.
4) రచ్చబండ వచ్చిన తరువాతే సుప్రభగారి ప్రోత్సాహముతో నేను ఎక్కువగా రాయడానికి ఆరంభించాను. అప్పుడే ఛందస్సు గుంపు కూడ మొదలయింది.
4) ఈమాట నాకు పరిచయమయింది నాలుగైదు సంవత్సరాల ముందే! ఇప్పుడు కూడా సమయము ఉన్నప్పుడు పాత సంచికలను తిరగవేస్తు ఉంటాను. ఈమాటలోని వైవిధ్యము నిజంగా ప్రశంసనీయమే. కానీ కొత్త రచయితలను ఇది కొద్దిగా భయ పెడుతుందో ఏమో అనే సందేహం వస్తుంది నాకు అప్పుడప్పుడూ.
విధేయుడు – మోహన
నిజంగా ఈ శిర్షిక ఈ-తెలుగు సాహిత్య లోకం గురించి ఒక కనువిప్పు. చాల చక్కటి సమాచారం అందించారు. ఇక్కడ ఇచ్చినటువంటి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి అన్ని ఫైల్స్ నేను సాఫ్టువేరు ద్వారా దిగుమతి చేసుకున్నాను. ఇది మాత్రమే కాక అద్బుతమైన “As we may Think” లింక్ ఇచ్చినందుకుగాను ధన్యవాదములు.
గ్రామాలలో తోలుబొమ్మలాడించే కళాకారులలో గోవిందరావు వంటి గొప్ప కవులుంటారని, కులపెద్దలందరిని పేరు పేరునా ఆశువుగా ద్విపదలో స్తుతించగలిగిన సామర్ధ్యం వుంటుందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ద్విపదలూ సమయానుకూలంగా వారు చెప్పగలిగే అనేక చాటు పద్యాలు వారి సాహిత్య పరిజ్ఞానాన్ని చాటిచెప్పుతున్నాయి. ముఖ్యంగా రామాయణ యుద్ధకాండలో మాయా సీత వధ సందర్భంలో లక్ష్మణుడు అన్నతో చేసిన ప్రసంగం సంస్కృతమూలంతో పోలిస్తే ఇంకా చాలా అందంగా ద్విపదలో ఇమిడింది. తోలుబొమ్మ కళాకారులనుండి సేకరించినవో లేక రచయిత స్వయంగా రచించినవో ఏమైనా చాలా ప్రశంసార్హములు. అర్హతను గుర్తించి పురస్కారాన్ని అందించి ప్రచురించి మాకందజేసిన ఈ మాట వారికి రచయితకీ ధన్యవాదాలు.
నా వ్యాసాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం; శ్రమకి ఫలితం దక్కినట్లే. మీరు వీటిని కాపీ చేసి పిల్లలకి పంచి పెడతానంటే నాకానందమేగాని ఎలాంటి అభ్యంతరమూ లేదు; ఈమాటకీ ఉండదు. మీ ఉదారతకి కృతజ్ఞతలు. ఈపనిలో నేను చేయూతనివ్వగలను. (మా హైస్కూలు మాస్టార్లకి పంపిస్తానని మాటిచ్చాను కాని, ఇంకా పంపలేదు. పంపాలి.)
వ్యాసాలన్నీ పూర్తయింతర్వాత, సవరించి పుస్తకంగా ప్రచురించే ఆలోచన చేస్తాను.
“యాచిత/సీనియర్ రచయితల్లో చాలామందికి సహనం కన్నా అహం ఎక్కువ. కొద్దిమంది సీనియర్ రచయితలు సంపాదకుల పనిని ససేమిరా సహించరు; హర్షించరు.” అన్న వాక్యాలు, “ప్రచురణకి వచ్చే *రచనలు* గురించి” అనే శీర్షిక పెట్టి, రచనలను గాలికొదిలేసి, రచయితల యొక్క సహనాలు, అహంభావాలు, వారు ఏమి సహిస్తారు, ఏమి హర్షించరు అనే అంశాలను పాయింట్లవారీగా నొక్కి చెప్పడం ఎంచుకున్న శీర్షకకు ఏ విధంగా అవసరం, ఉపయోగం?
____
విధేయుడు
-Srinivas

ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
05/07/2009 9:43 pm

ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి mOhana గారి అభిప్రాయం:
05/07/2009 9:45 am
ఈ వ్యాసం చదువుతుంటే పాత డైరీ చదువుతున్నట్లుంది. సురేశ్ గారిని అభినందించడం నా ధర్మం, కర్తవ్యం.
1) 90లలో గోఫర్ వెదకడంలో అందరికీ మా ల్యాబ్ లో సహాయం చేస్తుండేవాడిని. అక్కడ ఎన్నో శాస్త్రీయ విషయాలపైన సమాచారాలు దొరికేవి.
2) తెలుగు డైజెస్టు మాత్రమే కాక బవులింగ్ గ్రీన్ లోని వాణీనాథరావుగారి ఆధ్వర్యాన, ఉమా రామమూర్తి గారి సంపాదకత్వంలో (వీరు ఇప్పుడు మెంఫిస్ లో ఉన్నారు) ఇండియా డైజెస్టు వారపు రోజులలో వెలువడేది. ఇండియా న్యూస్ అని డక్కన్ హెరాల్డ్ నుండి పత్రికా సమాచారాలు కూడా వచ్చేవి. నేను ఇండియా డైజెస్టుకు ప్రతి రోజు Today’s Beautiful Gem అని ఒక పద్యాన్ని, లేక ఒక చిన్న వ్యాసాన్ని పంపేవాడిని. క్లుప్తతకు ఇది ఒక నిదర్శనం. 40 పంక్తులకు మించి రాయరాదు ఇందులో! వాటిని ఇక్కడ చదువవచ్చు. http://www.uramamurthy.com/mohan_gems.html
500లకు పైగా ఉన్నాయి ఇవి. ఇందులోని కొన్ని మణులను పుస్తకరూపంలో ప్రచురించాలనే ఆశ ఉంది.
3) నన్ను తెలుసాకు పరిచయం చేసింది సదానందగారు. తెలుసాలో నేను ఎక్కువగా పాఠకుడినే, రచయితను కాను. అప్పుడు సుప్రభగారు ఎక్కువగా అందులో పద్యాలు రాసేవారు. వారు ఇప్పుడు శారద అనే
స్వంత సైటులో రాస్తారు. పద్యాలలో నాకు ఆసక్తి కలిగించింది వారే. ఇప్పుడు కూడా పాత తెలుసా సందేశాలను చదవడమంటే ఖుషీగా ఉంటుంది.
4) రచ్చబండ వచ్చిన తరువాతే సుప్రభగారి ప్రోత్సాహముతో నేను ఎక్కువగా రాయడానికి ఆరంభించాను. అప్పుడే ఛందస్సు గుంపు కూడ మొదలయింది.
4) ఈమాట నాకు పరిచయమయింది నాలుగైదు సంవత్సరాల ముందే! ఇప్పుడు కూడా సమయము ఉన్నప్పుడు పాత సంచికలను తిరగవేస్తు ఉంటాను. ఈమాటలోని వైవిధ్యము నిజంగా ప్రశంసనీయమే. కానీ కొత్త రచయితలను ఇది కొద్దిగా భయ పెడుతుందో ఏమో అనే సందేహం వస్తుంది నాకు అప్పుడప్పుడూ.
విధేయుడు – మోహన
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి Rajesh Devabhaktuni గారి అభిప్రాయం:
05/07/2009 4:13 am
నిజంగా ఈ శిర్షిక ఈ-తెలుగు సాహిత్య లోకం గురించి ఒక కనువిప్పు. చాల చక్కటి సమాచారం అందించారు. ఇక్కడ ఇచ్చినటువంటి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి అన్ని ఫైల్స్ నేను సాఫ్టువేరు ద్వారా దిగుమతి చేసుకున్నాను. ఇది మాత్రమే కాక అద్బుతమైన “As we may Think” లింక్ ఇచ్చినందుకుగాను ధన్యవాదములు.
తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
05/06/2009 11:12 pm
గ్రామాలలో తోలుబొమ్మలాడించే కళాకారులలో గోవిందరావు వంటి గొప్ప కవులుంటారని, కులపెద్దలందరిని పేరు పేరునా ఆశువుగా ద్విపదలో స్తుతించగలిగిన సామర్ధ్యం వుంటుందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ద్విపదలూ సమయానుకూలంగా వారు చెప్పగలిగే అనేక చాటు పద్యాలు వారి సాహిత్య పరిజ్ఞానాన్ని చాటిచెప్పుతున్నాయి. ముఖ్యంగా రామాయణ యుద్ధకాండలో మాయా సీత వధ సందర్భంలో లక్ష్మణుడు అన్నతో చేసిన ప్రసంగం సంస్కృతమూలంతో పోలిస్తే ఇంకా చాలా అందంగా ద్విపదలో ఇమిడింది. తోలుబొమ్మ కళాకారులనుండి సేకరించినవో లేక రచయిత స్వయంగా రచించినవో ఏమైనా చాలా ప్రశంసార్హములు. అర్హతను గుర్తించి పురస్కారాన్ని అందించి ప్రచురించి మాకందజేసిన ఈ మాట వారికి రచయితకీ ధన్యవాదాలు.
భవదీయుడు.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
05/06/2009 8:40 pm
ప్రసాదం గారికి,
నా వ్యాసాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం; శ్రమకి ఫలితం దక్కినట్లే. మీరు వీటిని కాపీ చేసి పిల్లలకి పంచి పెడతానంటే నాకానందమేగాని ఎలాంటి అభ్యంతరమూ లేదు; ఈమాటకీ ఉండదు. మీ ఉదారతకి కృతజ్ఞతలు. ఈపనిలో నేను చేయూతనివ్వగలను. (మా హైస్కూలు మాస్టార్లకి పంపిస్తానని మాటిచ్చాను కాని, ఇంకా పంపలేదు. పంపాలి.)
వ్యాసాలన్నీ పూర్తయింతర్వాత, సవరించి పుస్తకంగా ప్రచురించే ఆలోచన చేస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
05/06/2009 8:00 am