Comment navigation


15815

« 1 ... 1244 1245 1246 1247 1248 ... 1582 »

  1. కీబోర్డ్ మీద రాగాలు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/13/2009 3:01 am

    రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం నాకు చాలా నచ్చింది. రాగాలని గుర్తు పట్టేంత సంగీత జ్ఞానం లేక పోయినా ఏ పాటనైనా స్వల్ప ప్రయత్నంతో వాయించగల సామర్ధ్యం వున్న నాకు వారి వ్యాసం ద్వారా కొన్ని రాగాలను తెలిసికొని పలికించగలిగిన జ్ఞానం అబ్బింది. ధన్యవాదాలు. వారి నుండి సంగీతసంబంధమైన మరికొన్ని వ్యాసాలను ఆశిస్తాము.

    “ఎటొచ్చీ పాఠకుల్లో ఎంతమందికి ఈ విషయాల్లో ఆసక్తి ఉంటుందో తెలియక రాయడం మానేశాను.”

    ఔత్సాహికులైన ఈ మాట పాఠకులకు విజ్ఞప్తి. మీ ప్రతిస్పందనపైనే ఇంకా కొన్ని సంగీత సంబంధమైన వ్యాసాలు ప్రసాద్ గారినుండి వచ్చే అవకాశం ఆధారపడి వున్నది. మనలో ఎంతమంది అభిలషిస్తున్నారో తెలుపండి.

    భవదీయుడు

  2. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    05/12/2009 3:20 pm

    Thanks for the kind words. A few comments…

    బ్రౌన్ ఎలాంటి తెలుగు పత్రికనూ పెట్టలేదు/నడపలేదు. Madras Journal of Literary Studies (MJLS) అనే జర్నల్‌కు కొంతకాలం సంపాదకత్వం వహించాడు. కొన్ని సంచికలు కొద్దికాలంగా వెబ్‌లో లభ్యమవుతున్నాయి. అలాగే “పాత పత్రికలు ఇవాళ లభ్యం అవుతాయా అన్న” సందేహం అవసరం లేదు. ఉదాహరణకు నమశ్శివాయ గారి ప్రసంగంలో ప్రస్తావించిన చాలా, చాలా పత్రికలు హైదరాబాదులోనే దొరుకుతాయి. రాజమండ్రి, వేటపాలెం, కాకినాడలలో కూడా … చెదలు తింటాయనో, సరైన సంరక్షణ లేదనో కూడా భయపడనవసరంలేకుండా ఈ పత్రికలన్నీ – దొరికినంతవరకూ – డిజిటైజ్‌ చేయబడ్డాయి. ఇక భారతి, ఆంధ్రపత్రిక-ఉగాది, ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రికల సంచికలు లాంటివైతే చాలాకాలంగా వెబ్‌లో ఉన్నాయి. [ఒకవేళ తెలుగుదేశంలో దొరకకపోతే లండన్‌ బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలోనో, Cambridge లోనో ప్రయత్నించవచ్చు. ఈ మధ్య అవసరమైతే వీరేశలింగం నడిపిన 1860లనాటి “హితవాది” సంచికలు తెప్పించుకోగలిగాను.]

    జర్నలిజం చరిత్రకొస్తే … మరీ విస్తృతమైన సాహిత్యం అయితే లేదు కానీ ఒక విధంగా పై ప్రసంగానికి మూలాధారాలు అనదగ్గ కొన్ని పుస్తకాలు, వ్యాసాలు చాలా తేలికగానే దొరుకుతాయి; “బ్రౌన్‌జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుంచి 1857 దాక”, బంగోరె, 1973, నెల్లూరు; Studies in the history of Telugu journalism : presented to V. R. Narla on the occasion of his shashtyabdapurti, Kancherla Rama Seshagiri Rao, Delhi, 1968 (ముఖ్యంగా ఈ పుస్తకంలో ఆరుద్ర వ్యాసం); J. Natarajan, History of Indian Journalism, 1955; కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, పురాతనాంధ్ర వార్తాపత్రికలు, ఆంధ్రపత్రిక ఉగాది – రౌద్రి, 1920, ఇంకా నిడదవోలు వెంకటరావు, భారతి, మే 1929, …

    ఇలా చెప్పుకుంటూపోతే ఎంతైనా వుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తాను. Personally I don’t believe in lamenting about the lack of (literary) space and resources. If one wants to pursue serious academic research in Telugu related matters (and publish it) there is always a way out. ఆ హోదాలో కాకపోయినా, సాహిత్యం గురించి మాట్లాడుకోవాలనే తపనతోనే కదా ఈమాట మొదలైంది? ఈమాటలో ఇప్పడికే లోతైన సాహిత్య చర్చని ప్రోత్సహించేవి కొన్నైనా వ్యాసాలున్నాయి. లేదూ ఒక కొత్త వ్యాసం వ్రాసి ప్రచురించగలిగినా సరే, ఉత్తమస్థాయిలో సాహిత్యచర్చకు తెరతీయవచ్చు. What we do with the space (limited may be) we have, is in our hands.

    Regards,
    Sreenivas

  3. కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/12/2009 2:31 pm

    విజయసింహగారికి వ్యాసం నచ్చినందుకు సంతోషం. సంగీతం మీద నేను రాసిన కాసిని రచనలు కొన్ని విషయాలను పరిచయం చెయ్యడానికి పనికొస్తాయి. ఎటొచ్చీ పాఠకుల్లో ఎంతమందికి ఈ విషయాల్లో ఆసక్తి ఉంటుందో తెలియక రాయడం మానేశాను. అవసరమైనప్పుడు వ్యక్తిగతంగా జవాబులివ్వగలను. ఈ మెయిల్ పంపగలరు.

  4. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి mOhana గారి అభిప్రాయం:

    05/12/2009 1:08 pm

    సంపాదన లేని సంపాదకులు,
    రాబడి లేని రచయితలు,
    తీరుబడి లేని పాఠకులు
    Made for each other!
    విధేయుడు – మోహన

  5. కీబోర్డ్ మీద రాగాలు గురించి Vijayasimha గారి అభిప్రాయం:

    05/12/2009 11:20 am

    చాలా మంచి article Rohini Prasad Garu,

    I Like music and when ever I thought of learning used to postpone my wish, thinking that it should be learned during childhood only. After reading your article in 2007 and started learning keyboard and Vocal but could not continue for long as I had to move to different places frequently as part of my job. As you said in one of your articles, “Music can be learned at any stage and age of life only thing is one should have the passion and attitude towards learning it”, it is absolutely correct I suppose.

    A small request from my end for you,could you please continue to write some articles in the same topic with different raaga’s and examples so that one who started will continue to go step by step ahead, while i agree that without teacher one cannot learn perfectly.

    hope you consider my request and anticipate your response on this.

    Best Regards
    Vijay

  6. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/12/2009 11:15 am

    పొరపాటుగానే అయినా ఒక ముఖ్య విషయం ప్రస్తావనకు రావటం మంచిదే అయింది. అది “సంపాదన”.గురించి. లోకం మొత్తంమీద తన శ్రమకి తగిన “కూలి” ఏ కోశానా.. గిట్టనిది ఒక్క తెలుగు రచయితకే… అన్న ది జగద్విదితం!! తెలుగుదేశంలోని పత్రికల్లో మంచి కవితకీ.. కాని కవితకీ కూడా ఒకటే రేటు. మీరు ఎంత గొప్ప కవితనైనా రాయండీ..మీకు వారిచ్చేది..ఒక 150రూపాయలు మాత్రమే!! గొప్పవ్యాసం రాసినా అంతే పారితోషికం.!! మరి ఇది రచయిత బుధ్ధి పరిశ్రమని కారుచౌకగా దోచుకోవటమే కదా? ఈమాట లో అచ్చయ్యే వాటికి “అంతర్జాతీయ ప్రమాణాల”కి ధీటుగానే ధర చెల్లిస్తారేమో..నాకు తెలీదు మరి.

    నా ఉద్దేశ్యంలొ మంచి రచనలు రావాలంటే మంచి పారితోషికం చాలా ముఖ్యం. అక్కడ మార్పు లేకుండా..ఏమీ కిమ్మనకుండా.. “పెద్ద రచయితలు” రాయడంలేదని ఊరికే వగచినా..అనవసరంగా రచనలు పంపని వారిని ఆడిపోసుకున్నా… లాభం ఏముంటుందీ??

    రచనలు కావాలీ..కానీ వారి అక్షరానికి కిట్టుబాటు ధర కల్పించం..అన్న వైఖరి అయాచితంగా రచయితల కల్పనాశక్తిని దోచుకోవటమే అవుతుంది. అందుకే పత్రికలకి అరుదుగా తప్ప చెప్పుకోదగ్గ రచనలు రానిది.ఈపాటి భాగ్యానికి వచ్చిన రాతల్తో సరిపెట్టుకుని నడుపుకోవటమే పత్రికని. అందుట్లో పస లేదని అనుకున్నా ఫలితమేముందీ?? ఊరికే వచ్చింది ఉత్తమం కాదా?!ఆలోచించండి.

    రమ.

    [విస్తృత చర్చకు వీలుగా ఈ అభిప్రాయం చర్చావేదికలో కూడా వుంచబడింది.]

  7. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/12/2009 10:28 am

    well , కృష్ణశాస్త్రి రాసినంత మాత్రాన గొప్పగా ఉండాల్నేంలేదు . ఆ పాట కృష్ణశాస్త్రి రాసినా నీరసంగానే ఉంది. ఆ పాట స్వరం కూడా!!
    భిన్నరుచులు ఉంటాయని “శ్రీనివాస్ ” గారికి కనీసం ఒక ఒప్పుదల ఉన్నందుకు సంతోషం.

    రమ.

  8. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    05/12/2009 9:12 am

    ఇప్పటివరకు వచ్చిన కామెంట్లకు కొంత వివరణ.

    రోహిణీప్రసాద్ గారన్నట్లు:

    1. “ఘంటసాలకు చుట్ట కాల్చే అలవాటు” వల్లనే భానుమతి ఆయనతో పాడలేదని నమ్మటం కొంచెం కష్టం. అంతకుముందు వీరిద్దరూ “లైలామజ్ను” (1949), “ప్రేమ” (1951), “చండీరాణి” (1953) సినిమాల్లో కలిసి పాడారు.
    2. నాకు తెలిసినంతలో విజయా వాళ్ళు ఘంటసాల “మరే సంస్థకూ పనిచెయ్యకూడదు” అనే షరతు పెట్టలేదు. 1950-54 మధ్యల్లో ఆయన వేరే సంస్థలకు కూడా పనిచేసారు. (ఆ మాటకొస్తే జెమినీ వాళ్ళు ఆ షరతు పెట్టేవారు. అదువల్లే 1942 – 1949 మధ్యల్లో సాలూరి మరెవ్వరికీ పని చేయలేదు.) “మల్లీశ్వరి” (1951, వాహిని 1949 నాటికే విజయా ఆధీన్యంలోకి వచ్చింది!), “పాతాళభైరవి” (1951), “పెళ్ళిచేసిచూడు” (1952), “చంద్రహారం” (1954) సినిమాలకు “planning” ఒకేసారి జరిగింది అని, అన్నింటిలో రామారావు నాయకుడి పాత్రలో నలుగురు దర్శకులకు నాలుగు సినిమాలు ఇవ్వటం జరిగిందని చెప్తారు. (ఆ contract చేతికి వచ్చిన తరువాతే రామారావు కుటుంబాన్ని మద్రాసుకి మార్చడం జరిగిందన్నది తెలిసిన విషయమే..)
    3. “అమరసందేశం”లోని పాటలకు కేళ్కర్‌ గారికి credit ఇవ్వలేదన్నమాట నిజం కాదు. పాటల పుస్తకంలోను, రికార్డులపైన ఇద్దరి పేర్లూ వుంటాయి. (side note: కె. ప్రసాదరావు అప్పటికి కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. 1956 తరువాత ఆయన కూడా సంగీతదర్శకత్వం చేసిన దాఖలాలు లేవు. పెండ్యాల ఆర్కెస్ట్రాలో violin వాయిచేవారని విన్నాను.)

    శివశంకర్ గారు అనుకున్నది నిజమే:

    4. “పక్కయింటి అమ్మాయి” (ఇది correct title!) సినిమాలో పాటలన్నీ రాసింది సాక్షాత్తు “వైతాళికులు” ముద్దుకృష్ణే! “కలయేమో పాట” oldtelugusongs.com లో వినవచ్చు.

    చివరిగా “రమ” గారి వ్యాఖ్యకు:

    నీరసంగా ఉన్నదనిపించిన సాహిత్యాన్నందించిన పెద్ద మనిషి పేరు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. మలయాళం నుండి డబ్‌ అయిన ఆ సినిమాకి పాటలన్నీ ఆయనే రాసాడు. ఇంక నీరసంగా ఉన్న సంగీతాన్ని వినిపించిన పెద్ద మనిషి పేరు పి.ఎస్‌. దివాకర్‌. ఆ పాట ఇక్కడ వినిపించడానికి కారణాలు చాలా వున్నాయి. అంత తేలిగ్గా దొరకని పాట కావడం, జిక్కి-రాజాలు పాడిన మొట్టమొదటి పాటల్లో ఒకటి కావడం, తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్‌సినిమాల్లో ఒకటి కావడం, …ఇలా.

    చివరిగా “రాజా గొంతు హిందీపాటకి బహుశా మరింత బాగుండేది” అని వారనుకుంటున్నారు. అప్పట్లో జెమినీలో హిందీ విభాగానికి incharge గా వుండి, రాజా గొంతుని ఆడిషన్‌ చేసిన ఒక ప్రముఖ గాయని అభిప్రాయం వేరు. But, as I earlier said; de gustibus ……

    — శ్రీనివాస్

  9. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    05/12/2009 6:13 am

    “సంపాదనలు” ఇవ్వడం లేదు, శ్రమించే సంపాదకులకు, రచయితలకు:-)
    అచ్చు తప్పని తెలిసినా చెప్పడం మన్నించాలి. రచనలగురించి ప్రసక్తి కదా. తీసుకొస్తేనే ప్రసక్తి, తీసుకురాకపోతే విరక్తి. ఏమో!.
    ____
    విధేయుడు
    _Srinivas

  10. ప్రచురణకి వచ్చే రచనల గురించి గురించి malathi nidadavolu గారి అభిప్రాయం:

    05/12/2009 2:30 am

    నా వ్యాఖ్యలో స్పష్టంగా లేనిది -. ఒకరచనమీద ఆరచయితకి ప్రత్యేకంగా, ప్రైవేటుగా ఆ రచనని పరిపుష్టం చెయ్యడానికి సంపాదనలు ఇస్తున్న సూచనలు. వాటివల్లే కదా రచయితల అహంకారం ప్రసక్తి వచ్చింది.

« 1 ... 1244 1245 1246 1247 1248 ... 1582 »