హనుమంతరావు గారూ!!
తప్పకుండా ఆంధ్ర మ హాభారతం కాస్త తీరుబాటు దొరికినప్పుడల్లా కొంచెమ్ కొంచెం గానైనా చదవ్వల్సిన ఇతిహాసం. ఉత్తమ తెనుగు[బహుమంచి తెనుగు]మీకు ఎదురుపడుతుంది. చదువుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, తిక్కన గారు తెలుగు వాడకంలో ఎంతటి నేర్పరులో! మీకు మంచి పుస్తకాల్ని సేకరించుకుని చదివే అలవాటు ఉన్న ట్టుగా అర్ధమౌతోంది. భారతం చదవటం మంచి సాహిత్యానుభవం సుమండీ!!
వెంకటేశ్వర్రావు గారు అన్న ట్టు …ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి ఇవాళ్టి వాడకంలో వ్యాఖ్యానాలు రావటం కూడా ముఖ్యమే! ఆంధ్ర మ హాభారతాన్నించి..అన్నమయ్య పద సాహిత్యం దాకా!! తెనుగుని నిలబెట్టుకోవటం కోసం ఇది అత్యవసరం. చదువరులంతా దీని గురించి గాడంగా యోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్న ది.
ఉత్తరాది సంగీతకారులు కర్నాటక సంగీతాన్ని ఆసక్తితో వినడం అరుదే. విన్నకొద్దిమందికీ సదభిప్రాయం కలగలేదని నాకనిపించింది. అయితే దక్షిణాదివారు సంప్రదాయాన్నీ, గ్రామరునూ తు.చ. తప్పకుండా పాటిస్తారని రవిశంకర్ చాలా ఏళ్ళ క్రితమే రాశాడు. బాలమురళీకృష్ణ ప్రతిభను మొదటగా గుర్తించినది లతామంగేశ్కర్. గత పాతికేళ్ళుగా ఆయన ప్రఖ్యాతి దేశమంతటికీ తెలిసింది. నేను ఒక పంజాబీ సంగీతాభిమానికి ఆయన పాడిన రికార్డు వినిపించాక ఆయన అన్నది ఇది: “If this is Carnatic music, what I have heard so far is not Carnatic music. I used to think that Carnatic music was two ladies singing a bhajan”.
కర్నాటక, హిందూస్తానీ పద్ధతుల్లో ముఖ్యమైన వ్యత్యాసం మనోధర్మం విషయంలో కనిపిస్తుంది. దక్షిణాదిలో ఎవరో వాగ్గేయకారుడు రాసిన కీర్తనను పూర్తిగా పాడడం ముఖ్యం. అవసరమనిపిస్తే (నే) ముందు కాస్త రాగాలాపన, చివరికి స్వరకల్పన చేస్తారు. హిందుస్తానీలో అటువంటి “పప్పులు” ఉడకవు. నాలుగే లైన్లున్న సాహిత్యం ఆధారంగా అరగంట పాటు గాయకులు (వాద్యకారులు) రాగాన్ని తాముగా ఆవిష్కరిస్తూ పోవాలి. బట్టీపట్టి పాడే అవకాశం కర్నాటకంలో ఉంటుందేమోగాని హిందుస్తానీలో అసాధ్యం. ఈ రెండూ విభిన్న శైలుల్లో పరిణామం చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. హిందుస్తానీలో రాగాలూ, స్వరాలే ప్రధానం. కర్నాటకంలో అపరిచితరాగాల్లోని ఏదో ఒక కీర్తన అయిదునిమిషాల్లో పాడి అయిందనిపించవచ్చు. అటువంటిది హిందూస్తానీలో సాధ్యం కాదు. రాగాన్ని అర్థం చేసుకునే అవకాశం కనిపించకపోవడంతో ఉత్తరాదివారు దక్షిణాది సంగీతాన్ని ఎక్కువగా వినరు. సాహిత్యం అర్థంకాకపోవడం మరొక కారణం.
మంచి వ్యాసం. చక్కని పద్యాలను ఎన్నో విషయాలను గుర్తుండేలా చెప్పారు.
ఇది ఇటీవల మృణాళిని గారి “గాంధారి” వ్యాసాన్ని (“అంధ్రజ్యోతి”లో)గుర్తుకుతెచ్చింది. ఆ వ్యాసం కూడా గాంధారి గురించి ఆలోచనాత్మకంగా, మంచి పరిశీలనతో వ్రాయడం ఆకట్టుకుంది. మా అమ్మకు ఫోనులో పూర్తి వ్యాసం చదివి వినిపించాను, కాని కాపీ చేద్దామనుకొని చేయాలేకపోయాను.
గాంధారి కృష్ణుని శపించడం అమెరికాలో tongue_in_cheek అనడానికి నిలువెత్తు దర్పణంలాకా తోస్తుంది. వేలూరి గారు వివరించినట్లు “ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు” _”ధర్మం ఎటు వుంటే అటే జయం” అన్న గాంధారి, ధర్మము యొక్క అవగాహన, స్పృహ స్పష్టంగా తెలిసికూడా, దాని పర్యవసానంగా వచ్చే పరిణామాలు అంతకంటే బాగా “చూడగలిగి” కూడా, బిడ్డలను కట్టడి చేయలేకపోవడం, చూసే కళ్ళున్నా గంతలు కట్టుకొన్న చందాన సాక్షాత్కరింపచేసిన వ్యాసుని brilliance ఊహించినప్పుడెల్లా అద్భుతమనిపిస్తుంది! యుద్ధాన్ని కృష్ణుడు ఆపగలిగి కూడా ఆపలేదని రగిలిన గాంధారికి, తను ఇవ్వబోయే, లేదా ఇచ్చిన శాపాన్ని సైతం కృష్ణుడు ఆపగలగికూడా, ఆపలేదనే స్పృహ తట్టకపోవడం, కాదుఆమెకు
తట్టకుండా ఉండేటట్లు చెప్పడం, ఆ పాత్రకు ఎంతో సహజత్వాన్ని ఆపాదిస్తూ
వ్యాసుడు చేసిన అమేయ రూపకల్పన అనికూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
ఈ వ్యాసం 2-3 మార్లు చదివినా నాకేమీ అర్ధం కాలేదు. అర్ధం చేసుకోడానికి తాళం, దరువు, లయ, అక్షరాలు, మాత్రలు అనే కనీస పదాల నిర్వచనాలు తెలిసి వుండాలని మాత్రం అర్ధం అయింది. అయిదక్షరాల పాటల్లో పాట “ఏడ తానున్నాడొ బావా” ఏడక్షరాల అప్పగింతల పాట “పోయిరా మా తల్లి” అనేవి అర్ధం కాలేదు.
నేను ఆలిండియా రేడియోలో పని చేసినప్పుడు తరుచుగా దక్షిణాది సంగీతం వినేదాన్ని. నాకు వారి గమకాలూ, సరిగమలు పాడే విధానమూ నచ్చుతాయి. ఆ సంగీతం కూడా నేర్చుకుని ఉంటే బావుండేది” అన్నారామె.
కర్ణాటక-హిందుస్తానీ సంగీతాలు ఒకదానితో ఒకటి ఇంత తీవ్రంగా విభేదిస్తాయా? ఒకదానిలో నిష్ణాతులైనవారు వేరొకదానిలో పూర్తి అనభిజ్ఞులుగానో ప్రారంభదశలోనో ఉంటారా? వీటి మధ్య దూరం వైద్య – ఇంజనీరింగుల మధ్య అంత విస్తృతమైనదా లేక వృక్ష-జంతు శాస్త్రాల మధ్య అంత సన్నిహితమైనదా? వివరించరా.
మూడేళ్ళ క్రితం ఈ వ్యాసం చదివినప్పుడు స్త్రీ పర్వం చదవాలి అనుకున్నాను గాని, మిగతా పర్వాలలాగే దానినీ చదవడానికి ఇంకా కుదరలేదు. ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్తూ ఏ పుస్తకం తోడు తీసుకెళదామా అనుకొని, నా కంప్యూటర్ వ్యాసానికి గడువు దగ్గర కొచ్చింది, కాస్త మంచి తెలుగు మాటలున్న దేదైనా చదివితే ఉపయోగపడుతుందని, ఓ తెలుగు పుస్తకాన్ని తీసుకుకెళ్ళాను. అది వడలి మందేశ్వరరావు గారి “శోకం నుంచి స్వర్గానికి: (ఆంధ్ర మహాభారతంలోని స్త్రీ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాల కథాకథనం).”
నిఘంటువు అవసరం లేకుండానే, దీంట్లో గాంధారి గుండె మంట మనల్ని కాల్చేస్తుంది. గాంధారి శాపమున్న పద్యాన్ని విశ్లేషిస్తూ, వడలి మరో పద్యాన్ని గుర్తు చేశారు. దీనిని భారతంలో కెల్లా చెప్పుకోదగ్గ పద్యమంటారు. నాకు చాలా ఇష్టైమైన పద్యం కూడా. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు సభలో దక్షులైన సభాసదులు ఉపేక్షిస్తే సర్వనాశనం తప్పదని హెచ్చరించే పద్యం:
మొన్న ఆదివారం నాడు పుణె లో ప్రసిధ్ధ ఆంగ్ల కవయిత్రి కమలాదాస్ తన 75వ ఏట [చిన్న కుమారుని ఇంట్లో] తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమె రాసిన అనేక కవితలు చాలా ప్రఖ్యాతినందినవి. ఆమె మాధవికుట్టి పేరుతో మళయాళంలో కధలు రాసేరు. ఆమె ఆత్మకధ my story చాలా సంచలనం రేపింది. వ్యక్తిగతంగా సూటిగా..సున్నిత స్వభావిగా ఉండే కమలాదాస్ జీవితం చివరి దశకంలో ఇస్లాం స్వీకరించి కమలా సురయ్యా గా పేరు మార్చుకున్నారు. ఆమె మళయాళీ నాయర్ కుటుంబంలో హిందువుగా పుట్టి..కృష్ణ భక్తురాలిగా గడిపి..చివర్లో ముస్లింగా మారటం..కేరళ సమాజాన్ని విభ్రాంతి పరిచింది. తన రచనల ద్వారానూ..తన జీవితం ద్వారానూ కమలాదాస్ ఒక రెబెల్ గానే చివరిదాకా కొనసాగారు. ఆమెని భారతీయులెందరో స్త్రీ మనోకామనల్ని ఎటువంటి సంకోచమూ లేకుండా వ్యక్తీకరించిన తొలి indian modern poetess గా గుర్తుపెట్టుకుంటారు.
అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/03/2009 12:12 pm
http://www.musicindiaonline.com/music/hindustani_vocal/m/artist.207/

http://indianmelody.com/badeghulam.htm
మొదటి రెండూ కొన్ని రికార్డింగులకు పనికొస్తాయి. మూడోది ఆయన గురించిన విశేషాలను వివరిస్తుంది. ఇవికాక google.com ద్వారా audio links వెతుక్కోవచ్చు.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
06/03/2009 10:17 am
హనుమంతరావు గారూ!!
తప్పకుండా ఆంధ్ర మ హాభారతం కాస్త తీరుబాటు దొరికినప్పుడల్లా కొంచెమ్ కొంచెం గానైనా చదవ్వల్సిన ఇతిహాసం. ఉత్తమ తెనుగు[బహుమంచి తెనుగు]మీకు ఎదురుపడుతుంది. చదువుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, తిక్కన గారు తెలుగు వాడకంలో ఎంతటి నేర్పరులో! మీకు మంచి పుస్తకాల్ని సేకరించుకుని చదివే అలవాటు ఉన్న ట్టుగా అర్ధమౌతోంది. భారతం చదవటం మంచి సాహిత్యానుభవం సుమండీ!!
వెంకటేశ్వర్రావు గారు అన్న ట్టు …ముఖ్యమైన తెలుగు పుస్తకాలకి ఇవాళ్టి వాడకంలో వ్యాఖ్యానాలు రావటం కూడా ముఖ్యమే! ఆంధ్ర మ హాభారతాన్నించి..అన్నమయ్య పద సాహిత్యం దాకా!! తెనుగుని నిలబెట్టుకోవటం కోసం ఇది అత్యవసరం. చదువరులంతా దీని గురించి గాడంగా యోచన చేయవలసిన ఆవశ్యకత ఉన్న ది.
రమ.
గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/03/2009 7:29 am
ఉత్తరాది సంగీతకారులు కర్నాటక సంగీతాన్ని ఆసక్తితో వినడం అరుదే. విన్నకొద్దిమందికీ సదభిప్రాయం కలగలేదని నాకనిపించింది. అయితే దక్షిణాదివారు సంప్రదాయాన్నీ, గ్రామరునూ తు.చ. తప్పకుండా పాటిస్తారని రవిశంకర్ చాలా ఏళ్ళ క్రితమే రాశాడు. బాలమురళీకృష్ణ ప్రతిభను మొదటగా గుర్తించినది లతామంగేశ్కర్. గత పాతికేళ్ళుగా ఆయన ప్రఖ్యాతి దేశమంతటికీ తెలిసింది. నేను ఒక పంజాబీ సంగీతాభిమానికి ఆయన పాడిన రికార్డు వినిపించాక ఆయన అన్నది ఇది: “If this is Carnatic music, what I have heard so far is not Carnatic music. I used to think that Carnatic music was two ladies singing a bhajan”.
కర్నాటక, హిందూస్తానీ పద్ధతుల్లో ముఖ్యమైన వ్యత్యాసం మనోధర్మం విషయంలో కనిపిస్తుంది. దక్షిణాదిలో ఎవరో వాగ్గేయకారుడు రాసిన కీర్తనను పూర్తిగా పాడడం ముఖ్యం. అవసరమనిపిస్తే (నే) ముందు కాస్త రాగాలాపన, చివరికి స్వరకల్పన చేస్తారు. హిందుస్తానీలో అటువంటి “పప్పులు” ఉడకవు. నాలుగే లైన్లున్న సాహిత్యం ఆధారంగా అరగంట పాటు గాయకులు (వాద్యకారులు) రాగాన్ని తాముగా ఆవిష్కరిస్తూ పోవాలి. బట్టీపట్టి పాడే అవకాశం కర్నాటకంలో ఉంటుందేమోగాని హిందుస్తానీలో అసాధ్యం. ఈ రెండూ విభిన్న శైలుల్లో పరిణామం చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. హిందుస్తానీలో రాగాలూ, స్వరాలే ప్రధానం. కర్నాటకంలో అపరిచితరాగాల్లోని ఏదో ఒక కీర్తన అయిదునిమిషాల్లో పాడి అయిందనిపించవచ్చు. అటువంటిది హిందూస్తానీలో సాధ్యం కాదు. రాగాన్ని అర్థం చేసుకునే అవకాశం కనిపించకపోవడంతో ఉత్తరాదివారు దక్షిణాది సంగీతాన్ని ఎక్కువగా వినరు. సాహిత్యం అర్థంకాకపోవడం మరొక కారణం.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/03/2009 7:06 am
మంచి వ్యాసం. చక్కని పద్యాలను ఎన్నో విషయాలను గుర్తుండేలా చెప్పారు.
ఇది ఇటీవల మృణాళిని గారి “గాంధారి” వ్యాసాన్ని (“అంధ్రజ్యోతి”లో)గుర్తుకుతెచ్చింది. ఆ వ్యాసం కూడా గాంధారి గురించి ఆలోచనాత్మకంగా, మంచి పరిశీలనతో వ్రాయడం ఆకట్టుకుంది. మా అమ్మకు ఫోనులో పూర్తి వ్యాసం చదివి వినిపించాను, కాని కాపీ చేద్దామనుకొని చేయాలేకపోయాను.
గాంధారి కృష్ణుని శపించడం అమెరికాలో tongue_in_cheek అనడానికి నిలువెత్తు దర్పణంలాకా తోస్తుంది. వేలూరి గారు వివరించినట్లు “ధర్మంబేతల ననూనమగు నిద్ధ మాతలకు నెట్లయిన సిద్ధమగు” _”ధర్మం ఎటు వుంటే అటే జయం” అన్న గాంధారి, ధర్మము యొక్క అవగాహన, స్పృహ స్పష్టంగా తెలిసికూడా, దాని పర్యవసానంగా వచ్చే పరిణామాలు అంతకంటే బాగా “చూడగలిగి” కూడా, బిడ్డలను కట్టడి చేయలేకపోవడం, చూసే కళ్ళున్నా గంతలు కట్టుకొన్న చందాన సాక్షాత్కరింపచేసిన వ్యాసుని brilliance ఊహించినప్పుడెల్లా అద్భుతమనిపిస్తుంది! యుద్ధాన్ని కృష్ణుడు ఆపగలిగి కూడా ఆపలేదని రగిలిన గాంధారికి, తను ఇవ్వబోయే, లేదా ఇచ్చిన శాపాన్ని సైతం కృష్ణుడు ఆపగలగికూడా, ఆపలేదనే స్పృహ తట్టకపోవడం, కాదుఆమెకు
తట్టకుండా ఉండేటట్లు చెప్పడం, ఆ పాత్రకు ఎంతో సహజత్వాన్ని ఆపాదిస్తూ
వ్యాసుడు చేసిన అమేయ రూపకల్పన అనికూడా అనిపిస్తుంది!
_____
విధేయుడు
_Srinivas
అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/03/2009 3:04 am
ఉస్తాద్ ఖాన్ గారి కచేరి రికార్డ్ క్లిపింగ్ ఏదైనా కూడా మేము విని ఆనందించడానికి జత చేయరా. ఇది విన్నపం మాత్రమే.
భవదీయుడు
సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/03/2009 2:36 am
ఈ వ్యాసం 2-3 మార్లు చదివినా నాకేమీ అర్ధం కాలేదు. అర్ధం చేసుకోడానికి తాళం, దరువు, లయ, అక్షరాలు, మాత్రలు అనే కనీస పదాల నిర్వచనాలు తెలిసి వుండాలని మాత్రం అర్ధం అయింది. అయిదక్షరాల పాటల్లో పాట “ఏడ తానున్నాడొ బావా” ఏడక్షరాల అప్పగింతల పాట “పోయిరా మా తల్లి” అనేవి అర్ధం కాలేదు.
అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/03/2009 2:01 am
తెర ముందు వారి గురించే గానీ తెర వెనుక వారి గురించె ఏమంత తెలియని నాకు ఒక మహావ్యక్తి గొప్పతనాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
భవదీయుడు
గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/03/2009 1:35 am
నేను ఆలిండియా రేడియోలో పని చేసినప్పుడు తరుచుగా దక్షిణాది సంగీతం వినేదాన్ని. నాకు వారి గమకాలూ, సరిగమలు పాడే విధానమూ నచ్చుతాయి. ఆ సంగీతం కూడా నేర్చుకుని ఉంటే బావుండేది” అన్నారామె.
కర్ణాటక-హిందుస్తానీ సంగీతాలు ఒకదానితో ఒకటి ఇంత తీవ్రంగా విభేదిస్తాయా? ఒకదానిలో నిష్ణాతులైనవారు వేరొకదానిలో పూర్తి అనభిజ్ఞులుగానో ప్రారంభదశలోనో ఉంటారా? వీటి మధ్య దూరం వైద్య – ఇంజనీరింగుల మధ్య అంత విస్తృతమైనదా లేక వృక్ష-జంతు శాస్త్రాల మధ్య అంత సన్నిహితమైనదా? వివరించరా.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/02/2009 10:35 pm
మూడేళ్ళ క్రితం ఈ వ్యాసం చదివినప్పుడు స్త్రీ పర్వం చదవాలి అనుకున్నాను గాని, మిగతా పర్వాలలాగే దానినీ చదవడానికి ఇంకా కుదరలేదు. ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్తూ ఏ పుస్తకం తోడు తీసుకెళదామా అనుకొని, నా కంప్యూటర్ వ్యాసానికి గడువు దగ్గర కొచ్చింది, కాస్త మంచి తెలుగు మాటలున్న దేదైనా చదివితే ఉపయోగపడుతుందని, ఓ తెలుగు పుస్తకాన్ని తీసుకుకెళ్ళాను. అది వడలి మందేశ్వరరావు గారి “శోకం నుంచి స్వర్గానికి: (ఆంధ్ర మహాభారతంలోని స్త్రీ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాల కథాకథనం).”
నిఘంటువు అవసరం లేకుండానే, దీంట్లో గాంధారి గుండె మంట మనల్ని కాల్చేస్తుంది. గాంధారి శాపమున్న పద్యాన్ని విశ్లేషిస్తూ, వడలి మరో పద్యాన్ని గుర్తు చేశారు. దీనిని భారతంలో కెల్లా చెప్పుకోదగ్గ పద్యమంటారు. నాకు చాలా ఇష్టైమైన పద్యం కూడా. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు సభలో దక్షులైన సభాసదులు ఉపేక్షిస్తే సర్వనాశనం తప్పదని హెచ్చరించే పద్యం:
“సారపు ధర్మమున్ విమల సత్యమున్ పాపముచేతన్ బొంకుచేన్
పారమున్ పొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.
సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే
శక్తి కలిగి ఉండీ, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికీ, సర్వ
అనర్థాలకూ కారణమవుతుంది.”
గాంధారి కృష్ణుణ్ణి, కురుపాండవుల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే సామర్ధ్యం ఉండీ ఉపేక్ష చేశాడనీ, దానికి ఫలితం అనుభవించాలనీ శపిస్తుంది.
“దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” – అది అనేక సందర్భాలలో గుర్తుంచుకోవాల్సిన మాట.
కొడవళ్ళ హనుమంతరావు
వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
06/01/2009 10:14 pm