Comment navigation


15815

« 1 ... 1240 1241 1242 1243 1244 ... 1582 »

  1. పాటల్లో లయవిన్యాసాలు గురించి mOhana గారి అభిప్రాయం:

    05/26/2009 11:01 am

    తాళం గురించి చదివిన తరువాత రెండు విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి.

    1. పురందరదాసు కింది కీర్తన –
    తంబూరి మీటిదవ భవాబ్ధి దాటిదవ
    తాళవ తట్టిదవ సురరొళు సేరిదవ
    గెజ్జెయ కట్టిదవ ఖలరెదె మెట్టిదవ
    గాయన పాడిదవ హరి మూర్తి నోడిదవ
    విఠలన నోడిదవ వైకుంఠ సేరిదవ
    (తంబురాను మీటినవాడు భవాబ్ధిని దాటినవాడు,
    తాళాన్ని వేసినవాడు సురులలో చేరినవాడు,
    అందెలను ధరించినవాడు దుష్టులను అంతము చేసినవాడు,
    గానాన్ని పాడినవాడు హరిమూర్తిని చూచినవాడు,
    విఠలుని చూచినవాడు వైకుంఠాన్ని చేరినవాడు)

    2. హంసగీతె చిత్రంలో శిష్యుడు గురువుతో శ్యామశాస్త్రి పాటను
    మరొక తాళంలో పాడటానికి వీలవుతుంది అని నిరూపించాడు.
    గురువు ఓటమిని అంగీకరించి ఆత్మహత్య చేసికొంటాడు.

    ఒకే గురులఘువుల అమరికతో వేరువేరు గతులలో రాయడానికి
    వీలవుతుందని ఛందస్సు రచ్చబండ వేదికలపైన ఎన్నో ఉదాహరణలతో
    నేను నిరూపించిన సంగతి కొందరికి గుర్తు ఉందనుకొంటాను. ఇది
    కూడా ఒక చిత్రకవిత్వమే.

    ((పగలే వెన్నెల చరణం నింగి పైన చందమామ … మాత్రలు త్ర్యస్ర గతియే)

    విధేయుడు – మోహన

  2. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/26/2009 10:37 am

    శ్రీనివాస్ గారికి
    అనేకానేక నమస్కారలతో
    తిరుపతి వేంకటీయములైన వేరే పుస్తకాలు మీ సమాచారం వలన లభించినాయి కానీ “నానా రాజసందర్శనము” మాత్రము మీ లింకు ద్వారానూ DLI వద్దనుండి గానీ లభ్యం కాలేదు. మరొక్క మారు మీరు పంపగలరా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నందుకు క్షమించండి.

    భవదీయుడు

  3. పునరపి గురించి rama bharadwaj గారి అభిప్రాయం:

    05/26/2009 1:50 am

    ఎక్కువశాతం మంది భారతీయుల ఇళ్ళల్లో చాలా మామూలుగా కన్పించే ఈ అంతులేని చాకిరీ వెనక ఎంత మంది ఆడవాళ్ళ క్షోభ నిశ్శబ్దంగా
    అలుముకుని ఉంటుందో..కోట్లాది మంది గృహిణులకి తెలుసు. ఆడవాళ్ళు స హజంగా వంట చేస్తారు. మ గవాళ్ళు స హజంగా భోంచేస్తారు అన్న ఆలోచనా విధానం బాగా మనసుకి పట్టించిన నాగరికతలు మనవి. ఇందులో ఆడవాళ్ళూ భాగమే!! ఇష్టం..మమ త..అనురాగం ఇద్దరి మ ధ్యా ఉన్నప్పుడు ఇలాంటి అ హంకారం ఉండదు.ఆధిపత్యం సాగదు. చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్న భార్యలు రెండింతల బరువు మోస్తున్నారు ఇటువంటి ఇళ్ళల్లో.దాని గురించి స్త్రీలు ఎందుకు స్పష్టంగా ఆలోచించడం లేదో?? పై కధలో ఆ అమ్మాయికి భర్త మీద కొద్దో గొప్పో ఇష్టం ఉన్నా..అది ఆతడి ప్రవరతోనతో..క్రమేపీ చచ్చి్ ఉంటుంది. ఇహ్ ఆ బంధం ఏం బంధం!?? అలాంటి సంసారం లోని రోజు రోజూ చాకిరీ కింద నలిగిపోయే స్త్రీలో ఇంక్ ఏం రాసిక్యం మిగుల్తుందీ?? ఆ లత మొగుడు ఏమీ సరసుడు కాడని కొట్టొచ్చిట్టుగానే తెలుస్తోంది. అలాంటి నీరస వాతావరణంలో పెరిగే పిల్లల పరిస్థితి ఏమిటీ? ఆ చిన్న పిల్లవాడు పెద్దయ్యాకా..ఆ తండ్రినే అనుకరించడని చెప్పలేం. బయటి సంబంధాలు అవసరం కావటం..ఇంట్లో దొరకని తీరని ఇష్టాలు ఇంకెక్కడో దొరుకుతాయన్న భ్రమ జీవితాల్లోకి రావటం అప్పుడే కలుగుతుంది. ఆ మ గవాడు కూడా మునుపటి వాడి కన్నా భిన్నమైన వాడు కాకపోతే అంతకన్నా అపనమ్మకం ఆడదానికి ఇంకొకటి ఉండదు.ఇన్ని సమ స్యలు ఉంటాయి.యూరోప్ లో లాగా రాబోయే కాలంలో” పెళ్ళి” వెనకబట్టినా ఆశ్చర్యం లేదు. పెళ్ళికి అమ్మాయిలు విముఖత చూపించొచ్చు. గిరిధర్రావుగారి కధలో విషయం ముఖ్యమైందే..గానీ కధనంలో మాత్రం పట్టు లేదు. “పునరపి” అని అనుకోకుండా జీవిత నాయికలైన లతలు ఆ విష.. పోనీ విషమ స్థితిని దాటాలి.కొత్త ఆడుగుకి సంశయం మానాలి.అందంలేని స హజీవితం కన్నా..అందమైన ఒంటరితనం మేలు.
    రమ.

  4. పాటల్లో లయవిన్యాసాలు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/26/2009 1:07 am

    త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్ర తాళ గతులు అర్ధం కాలేదు. వాటికి మీరుదహరించిన పాటలలో అక్షరాలు గానీ మాత్రలు గానీ సరిపోవడం లేదు. ఉదాహరణకి త్రిశ్ర గతి పగలే వెన్నెలా పాటలో మూడు మూడు అక్షరాలుండగా మాత్రలు నాలుగు ఐదు వున్నాయి. జగమే మాయా లో మూడు రెండు అక్షరాలు, నాలుగు నాలుగు మాత్రలున్నాయి. ఇటువంటి అవగాహనతో ఇంకా ముందుకు పోతే ఖండ మిశ్ర గతుల పాటలలో ఇంకా అయోమయంగా కనుపడుతోంది. పూర్తి ప్రాధమిక దశలో వున్న నా బోటి వారికి త్రిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్రాది గతులను మరికొంచెం విశదపరచగలరా?

    నేను సంగీతం నేర్చుకొన్న అతి కొద్ది కాలంలో మాకు ఆది తాళం (ఎనిమిది), రూపక తాళం (ఆరు) మాత్రమే తెలిసాయి. పైన చెప్పిన గతులు యస్పీ గారి ప్రొగ్రాం లోను తరువాత మీ వ్యాసం ద్వారా నామ మాత్రంగా పరిచయం అయ్యాయి.

    భవదీయుడు

  5. రాగాలూ స్వరాలూ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/25/2009 10:14 pm

    సంపాదకులవారికి
    నమస్కారం
    మీనుండి నాకెటువంటీ సందేశం రాలేదు. నేను ప్రతి దినమూ నా మెయిలు చూసుకుంటాను. ఇవాళ కూడా చూసాను. మీ మెయిలు ఎడ్రసు తెలుపనందు వలన మళ్ళీ దీని ద్వారానే సంపర్కించవలసి వచ్చింది. నా చిరునామా
    msprasad2004@rediffmail.com maringantis@email.com

    భవదీయుడు

    [మీకు గత 24 గంటలలో రెండు వేర్వేరు అకౌంట్లనుండి ఈ మెయిళ్ళు పంపాము. మీ ఇన్‌బాక్సులో అవి లేకపోతే మీ మెయిల్ సెట్టింగ్స్ తనిఖీ చేసుకోగలరు. అలానే మీ బల్క్ లేదా స్పాం ఫోల్డరులలో కూడా. మీరు పైన ఇచ్చిన రెండు అడ్రసులలో రెండవది పని చేయుటలేదు. మీ రీడిఫ్ అడ్రస్సుకి పంపిన మెయిళ్ళు ఏమీ తిరిగిరాలేదు. మీరు – editors[AT]eemaata.com ( [AT] స్థానంలో @ వుంచి) అడ్రసు కు మెయిలు పంపి మమ్మల్ని “సంప్రదించ”గలరు.ఇదే మీ ఉద్దేశమని మాకు తోస్తున్నది. మీ ప్రతీ మెయిలుకీ మేము వెంటనే రిప్లై ఇస్తూనే వుంటాము. మీకు అవి అందకపోతే మీ మెయిల్ అడ్మినిస్ట్రేటర్లను సంప్రదించండి. – సం]

  6. పురూరవ: శ్రవ్య నాటిక గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    05/25/2009 8:39 am

    చాలా చక్కటి పనిచేశారు ఈ నాటకాన్ని నలుగురికీ అందించి. నేను నా చిన్నతనంలో ఒక మోనో టేపు రికార్డర్ తో ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి ప్రసారమయిన కొన్ని చిన్న నాటికలను రికార్డు చెయ్యగలిగిన అదృష్టం కలిగింది. ఆ నాటికలను నేను సురసా నెట్లోకి అప్లోడ్ చేశాను. ఈ కింద లింక్ తో ఆ నాటికలను వినవచ్చు. అక్కడే, గణపతి నాటకం కూడ మరెవరో అందించారు. ఆసక్తి గలవారు ఈ సైటులోకి వెళ్ళి వినవచును.

    http://surasa.net/music/telugu-natika

    కన్యాశుల్కం, వరవిక్రయం, గణపతి నాటకాలు సి డి లరూపంలో ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో ఉన్న చిన్న షాపులో అమ్ముతున్నారు.

    శివరామప్రసాదు కప్పగంతు

  7. రాగాలూ స్వరాలూ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    05/25/2009 7:19 am

    ప్రసాద్ గారూ, మీరు సంగీతానికి కొత్త అయితే ఈ దశలో వివాది స్వరాలను ఉపేక్షించడం మంచిది.

    హార్మోనియం, పియానో, కీబోర్డ్స్ వంటి పాశ్చాత్య వాయిద్యాలు tempered (diatonic) scale మీద ఆధారపడే టటువంటివి. Continuous spectrumలాంటి స్వరస్థానాల్లో మనం 12, 16, 22 లేదా ఈజిప్ట్ లోనో మరెక్కడో అనుకున్నట్టు 96 శ్రుతులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు (పలికించగలిగిన వారు ఉన్నట్టయితే!)
    ఈ కింది వెబ్ సైట్లో కొన్ని వివరాలున్నాయి. మీ academic doubts కోసం చూడండి.
    http://www.carnaticdarbar.com/views_01.htm

    Vivadi swara is a dissonant note, perceived by many in the musical world, to be an enemy note. That is probably the reason why vivadi melas were called ragas with “dosha” (some harmful element like an enemy perhaps!). According to Prof. Sambamurthy, vivadi melas are those scales which take one of the following notes: shatshruti rishabha (R3). Suddha Gandhara (Ga1), shatshruti dhaivata (Dha 3) and suddha nishada (Ni1). There are 40 such ragas which are supposed to have vivadi dosha.
    .
    ..many of the 72 melakarta ragas existed even before Venkatamakhi times.

    …the beauty of many of these vivadi melakarta ragas can be fully appreciated when one listens to these ragas played on the veena. As explained earlier, Vivadi is a dissonant note in relation to an adjacent note and is viewed as an enemy note.
    ఇటువంటివి పలికించలేదు కనకనే హార్మోనియం నిషేధానికి గురి అయింది. అయితే అది అర్థంలేని పని. బడే గులాం, పక్కవాద్యంగా హార్మోనియం సరిపోతుంది. (గోవిందరావు టేంబే, రామకృష్ణ చిమోటే మొదలైన విద్వాంసులు హార్మోనియం సోలో వాద్యంగా ఎంత గొప్పగా మోగుతుందో నిరూపించారు). అమీర్ ఖాన్ వంటి గొప్ప గాయకులు హార్మోనియం పక్కవాద్యంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు కర్నాటకంలో హార్మోనియం విద్వాంసులుండేవారు. ఇప్పుడు కొందరు తమిళులు pitch bender సహాయంతో గమకాలు పలికిస్తూ కీబోర్డ్స్ చక్కగా ఉపయోగిస్తున్నారు.

  8. రాగాలూ స్వరాలూ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:

    05/25/2009 4:07 am

    మీరు వ్రాసిన వ్యాసాలు నాకందుబాటులోకిరావడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. దారీ తెన్నూ లేని నా వంటి వారి సాధనకి ఒకింత దిశా నిర్దేశనం చేస్తున్నాయి. కృతజ్ఞుడను.

    కొన్ని రాగాలు 12 స్వరాల చట్రంలో సరిపోకపోవడం వలన 16 స్వరాల అమరిక ఏర్పడీందని కొన్ని అటువంటీ రాగాలను వాటిలో స్వరపరిచిన కొన్ని పాటలను వివరించారు. మరి అన్ని కీ బోర్డుల/హార్మోనియం లాంటి వాయిద్యాలలోనూ 12 స్వరాల అమరికే వుంటుంది గదా. ఈ రాగాలను, పాటలను ఎలా నిర్దుష్టంగా వాటిపై పలికించగలరు?
    తరువాత హార్మోనియంను ఆకాశవాణిలో నిషేధించారని అన్నారు. ఏ అవలక్షణాల వలన ఆ వాయిద్యానికి ఆ దుర్గతి పట్టింది? వేణు వాయులీనాలు ఆ కొరతలు లేనివా? ఇవి మేము తెలుసుకోదగినవైతే తెలుపగలరు.

    భవదీయుడు

    [అయ్యా – మీరు దయచేసి మీ ఈమెయిలు ఒకసారి చూసుకోవలసినది. మీరు పత్రికాముఖంగా అడిగిన ప్రశ్నలకు మేము మీకు సమాధానాలను పంపి వున్నాము. మీనుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఇలా పత్రికాముఖంగానే మిమ్మలి హెచ్చరించవలసి వస్తున్నది. – సం.]

  9. చలంతో రజని ముఖాముఖి గురించి SIVARAMAPRASAD KAPPAGANTU గారి అభిప్రాయం:

    05/24/2009 6:23 pm

    అద్భుతం పరమాద్భుతం. చలం గారి గళం వినాలని నాకు ఎప్పటినుండో కోరిక. రేడియో కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని తెలుసు కాని, ఇంతకాలానికి వినే అవకాశం దొరికింది. పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

    ఇదే విధంగా శ్రీ విశ్వనాధ సత్యనారాయాణ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రానికి ఒక గంట నిడివి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది వినే భాగ్యం నాకు దాదాపు పాతిక సంవత్సారాల క్రితం కలిగింది. అప్పట్లో నాదగ్గర రికార్డు చెయ్యటానికి సదుపాయం లేక భద్రపరచలేకపొయ్యాను. శ్రీనివాస్ గారూ ఈ ఇంటర్వ్యూ కూడ సంపాయించి తెలుగు లోకానికి అందిగలిగితే ధన్యులం.

    ఇంకా ఇలాంటి నిధులు ఆకాశవాణి వారి మట్టి బీరువాల్లో ఎన్ని ఉన్నాయో,ఇప్పటి వారి అయోమయ, అజ్ఞాన ఉద్యోగులకు వాటి విలువ తెలుసో లేదో, వాళ్ళు బీరువాల ఖాళీ ఉద్యమంలో ఈ నిధుల్ని ఎక్కడ పారేస్తారో లేక ఇప్పటికే పారేశారో తలుచుకుంటే నే దుఖం కలుగుతున్నది. ఆకాశవాణి వారు ఈ పాత రికార్డింగులన్నీ కూడ వారి నెట్ లో పెట్టేట్టుగా చెయ్యటానికి ఇన్ఫర్మేషన్ ఏక్ట్ కింద ఏమైన చెయ్యగలమా అని సాహిత్య సంఘాలన్ని సమకూడి చెయ్యవలసిన పని అని నాకు అనిపిస్తున్నది.

  10. పునరపి గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    05/24/2009 10:22 am

    ఈ కథ చదివిన వెంటనే, అనేక సంవత్సరాలుగా ప్రొద్దున్నే లేచి, పచ్చి పాలూ, corn flakes కలుపుకొని తిని పనికి పరుగెట్టే నేను, అమావాస్యకీ పౌర్ణమికీ మా ఆవిడ ఇచ్చే ప్రియా ఇడ్లీలనే ప్రసాదంగా తినే నేను, ఎంత ఉన్నతుణ్ణి, అనుకోడంతో నాఛాతీ పెరిగింది. ఇక ఉండబట్టలేక, మా ఆవిడని పిలిచి, “ఈ కథ చదువు. అప్పుడన్నా తెలుస్తుంది నీవెంత అదృష్టవంతురాలివో, నాలాంటి ఆదర్శప్రాయుడైన భర్తని పొందినందుకు,” అన్నా.

    “నీ బడాయి కేమిలే,” అంటూ కథ చదివి, తను, “ఈ కాలంలో అమెరికాలో weekdays ప్రొద్దున్నే లేచి దోసెలు వేసే వాళ్ళున్నారంటే నేను నమ్మను. ఉంటే, నూటికి కోటికి ఒకరున్నారేమో. మన స్నేహితులలో ఎవరన్నా ఉన్నారా అసలు?” అని నన్నొక సామాన్యుడిగా చేసేసింది. “ఏమో! మన స్నేహితుల్లో తెలుగు వాళ్ళు తక్కువ కదా,” అన్నా.

    సాయంత్రానికల్లా ఓ తెలుగు స్నేహితురాలితో email సంభాషణ సాగించి, తన కోలీగ్ భర్త రాఘవ లాంటి వాడేనట, అని చెప్పింది. మరి ఎలా ఎందుకు వేగుతోంది అని అడిగితే, “కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు” అన్నదట కొలీగ్!

    ఇలాంటి కథల అవసరం ఉంది కాని, మృణాళిని రాసిన “కోమలి గాధారం” లాంటి కథల అవసరం ఇంకా ఎక్కువనిపిస్తుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

« 1 ... 1240 1241 1242 1243 1244 ... 1582 »