రాగం, తానం, పల్లవి అనే పదాలలో రాగం, పల్లవి పదాలకు సంగీత పరమైన నిర్వచనం కాకపోయినా, సామాన్య జన గ్రాహ్యమైన అర్ధం తెలుసు కానీ తానం అంటే ఏమిటో తెలియదు. మూడిటికీ సంగీత పరమైన అర్ధం వివరించరా.
అత్యద్భుతం గురువు గారూ, మీ ఈ పరిశ్రమ సుశ్లాఘ్యం, సర్వ రసజ్ఞ జనమనో రంజకం. ఆపాత మధురమైన సంగీతం గొప్పదా లేక జీవితాంతం ఆలోచించినంత కొలది ఊట చెలమలాగా రసానందం సృజించే శాశ్వతానంద దాయకమైన సాహిత్యం గొప్పదా అని వివాదం కలిగించేలా ఘంటసాలగారు=కరుణశ్రీ గారు స్వర పరచి పాడిన=రచించిన కుంతీ కుమారి అద్భుతంగా జోడించి మాకందించారు. మీ ఈ కృషికి ఈమాట రసజ్ఞ హృదయులైన పాఠకులంతా ఋణపడిఉంటారు.
ఇది పద్యం బిదియే కవిత్వ మిదెపో ఇంపైన సాహిత్య మం
చిది గాన మ్మిదియే రస మ్మిదియపో ఇంపైన సంగీత మం
చెద తా భావ రసాద్భుతామర ఝరీ హేలా విలోలార్భటీ
విదితానంద మరందమై చెలగె సంప్రేహ్యేంద్రియారామమై
మీరు చెప్పిన మహా విద్వాంసుడు మన తొలి ఆస్థాన విద్వాంసుడు శ్రీ కాశీ కృష్ణాచార్యులేమో! నాకు తెలిసిన తెలుగు వారిలో ఆ తరంలో అటు సంస్కృతంలోనూ ఇటు సంగీతం, తబలా వాయిద్యంలోనూ అసామాన్య ప్రతిభ కలిగిన తెలుగు వ్యక్తి శ్రీ కాశీ కృష్ణాచారులు గారే!
మృదంగ విద్వాంసులలో యెల్లా వెంకటేశ్వరరావు సోలో కచేరీల్లో రకరకాల ధ్వనులు మృదంగం మీద పలికిస్తారు. నోటితో బోల్ (కొనగోలు) విన్యాసాలను వినిపించి, ఆ తరవాత తాళవాద్యం పై దాన్నే పలికించే సంప్రదాయం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులు రెంటిలోనూ ఉంది. ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పనికొస్తాయే తప్ప ప్రావీణ్యానికి ఉదాహరణలు కావు. ఎందుకంటే రాగప్రస్తారాన్ని విన్నంత ఆసక్తితో తాళవిన్యాసాలని విని ఆనందించేవారు తక్కువే.
అయితే తబలా కన్నా మృదంగ విన్యాసాలు నిస్సందేహంగా జటిలమైనవి. “జాకిర్ హుసేన్‌కు ఎక్కువ గ్లామర్ ఉండవచ్చుగాని ఏ మృదంగ కళాకారుడైనా అతనికి సాటిరాగలడని చాలామందికి తెలియకపోవచ్చు” అంటూ బొంబాయి సంగీత విమర్శకుడొకడు రాశాడు.
థిరక్వా కచేరీ గొప్పగా ఉందని నేనంటే ప్రసిద్ధ సారంగీ విద్వాంసుడు రామ్ నారాయణ్ అదే అతివిశిష్ట కళాకారులు కలిగించే ప్రభావం అని నాతో అన్నారు.
మరొక ముచ్చట. నేను హాజరయిన థిరక్వా కచేరీకి ప్రసిద్ధ సంగీతదర్శకుడు మదన్‌మోహన్ కూడా హాజరవడం గమనించాను. అతను ఆ ఏడాదే మరణించినట్టు గుర్తు (1975).
మరొక్క మహోన్నత కళాభాస్కరుని అంధత్వంలో వున్న మాకు పరిచయం చేస్తూ స్ఫూర్తి దాయకమైన సమాచారాన్ని అందజేసినందుకు హార్దిక ధన్య వాదాలు.
ఏ తాళ వాద్యకారుని గూర్చిన ప్రశంస విన్నా లేక వారి వాదనాన్నివినే భాగ్యానికినోచుకున్నా నా చిన్నతనంలో (1962-64మధ్యలో) మా ఊరి త్యాగరాజోత్సవాలలో విన్న ఒక మహా విద్వాంసుని తబలా వాదన ఇప్పటికీ స్మృతిలో చిరనూతనంగా ఉంటూ గుర్తుకు వస్తుంది. ఆనాదు ఆ 90 ఏళ్ళ వృద్ధ విద్వాంసుడు ఒక గంటసేపు తబలా వాదనతో మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయడమే కాక చివరలో ఒక అద్భుత ప్రక్రియ (నైపుణ్యం) ప్రదర్శించాడు. విఘ్నేశ్వరుని సంస్తుతించే సంస్కృత శ్లోకానికి ఒకరు రాగ యుక్తంగా ఒక్కొక్క పదం పాడుతూంటే ఆ పదాలని ఆయన తన తబలా పైన పలికించారు. తంత్రీ వాద్యాలకు, గాత్రానికి మాత్రమే సాధ్యమైన రాగాలను ఒక తాళ వాద్యంపై పలికింపజేసే ఆ ప్రక్రియ ను నేను మళ్ళీ ఎక్కడా వినలేదు. కనలేదు. ఐతే నేను వేరే ఏ తాళ వాద్య కచేరి ఇంతవరకు వినలేదని చెప్పడం కూడా ఈ సందర్భంలో అత్యవసరం. నేను చూసిన ఈ ప్రక్రియ/నైపుణ్యం ఒకింత ప్రతిభ గల వారెవరైనా చేయగలుగుతారా లేక ఇది ఒక అసాధారణ నైపుణ్యమా చెప్పగలరా. ఎందుకంటే మీ వ్యాసంలో ఇటువంటి చాతుర్యంపై ప్రసక్తి రాలేదు.
ప్రోగ్రాం చూడకపోయినా అక్షమార్హమైన వైఖరి అర్ధం అవుతూనే వుంది. మీ అభిప్రాయంతో నేనే గాక విజ్ఞులైన వారందరూ ఏకీభవిస్తారు.
ద్రోణ-ఏకలవ్య శైష్యోపాధ్యాయిక ప్రాతిపదికగా లోకంలో అనేక మంది ఆచార్యులకు తమకు తెలియని వేలాదిమంది శిష్యులుంటారు. అదే విధంగా సంగీత శాస్త్రవిషయాలపై తెలుసుకోదగిన అనేక ఉత్కంఠ భరిత సమాచారాన్ని ఔత్సాహికులకు వ్యాసాల రూపంగా అందిస్తున్న మీకు పరమహంస శిష్యులు (ఉత్తమ రసజ్ఞులు); నావంటి పరమానందయ్య శిష్యులు అనేకులు ఉండి తీరుతారు. నేనొనర్చిన సంబోధన మీపై ఏతదభిమాన సాదర పూర్వకమే గానీ అన్యంగాదు. అది మీకు కుహనా గౌరవ వ్యంగ్యంగా ధ్వనించి వుంటే క్షమించవలసినది. మీరు ఆచార్యత్వాన్ని అంగీకరించకపోయినా, శిష్యత్వాన్ని కోరుకొనేవాళ్ళు చాలామంది ఉంటారనే నా నమ్మకం.
ఎప్పటిలాగానే, మంచి పుస్తకాన్ని భద్రిరాజుగారి వ్యాసవిశేషాలగురించి తెలిపినందుకు హనుమగారికి కృతజ్ఞతలు.
పండితులుచేసే వ్యాఖ్యానాలగురించి ఒక్క మాట. భాషలో నుడికారాలు, సమాసాల సొగసులు, ఉక్తివైచిత్రి వగైరాల గురించి ఎంత చెప్పినా, అసలు చెప్పాల్సినదేదో ఎందుకో వదిలేసిన భావం, కొరత. అంటే వాటి ప్రాముఖ్యతను కాదనడం కాదు. కానీ అవన్నీ వాటికవే సొంతంగా ఎంతవరకు సాధారణ పాఠకులను పుస్తకానికి దగ్గరచేస్తాయి అని, అసలు అవేనా తిక్కన కవిత్వం అంత సొగసుగా అందిస్తున్నది అని కూడా అనిపిస్తుంది.
నెత్తిమీదున్న బతుకు బరువుకు, ప్రస్తుత పరిస్థితులకు తిక్కన రచన ద్వారా ఏమైనా లబ్ధిపడే అవగాహన, నిశితమయ్యే దృక్కు, స్పష్టతనిచ్చే అభివ్యక్తి లాంటివి కొంతైనా, ఎంతైనా, వడలి మందేశ్వరరావు, జీ.వి.సుబ్రహ్మణ్యం గార్ల వలె అందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ demand ఎప్పుడూ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అట్లా కాకుండా వొట్టి పాండిత్య ప్రకర్షగా, భాషాశాస్త్రం, పద సంపద వివరించడం, వ్యాకరణ అంశాలతో
వూదరగొట్టడం- రుచికర ఆహారపదార్థాలను scientists వాటి పుట్టుపూర్వోత్తరాలు, చెట్ల పేర్లు, వాటి రసాయనాలు, అవి జీర్ణించబడడానికయ్యే reactions- మొత్తం వాళ్ళకు తెలిసిన శాస్త్రమంతా పేజీలలో గుమ్మరించినట్లుంటుందేమో అని అనుమానం. తీరా ఇదంతా మనకు రుచి, బలం ఇచ్చే ఆహారం గురించే(నా) అన్నది కూడా మరిచిపోయేటట్లు చెప్తారేమోనని కూడా భయం! కుయ్యోమంటున్న పాఠకులను చూసి అయ్యో ఇంత పాండిత్యంతో రాసిన వ్యాఖ్యానాలు చదువుకొ(న)డం లేదని వాపోవడం కూడా అతిశయోక్తి కాదేమో అని కూడా అనిపిస్తుంది.
———-
విధేయుడు
_Srinivas
ప్రసాద్‌గారూ,
మొదటి సంగతి: నేనేమీ ఆచార్యుణ్ణి కాను.
సోనూ నిగం ప్రసిద్ధ కళాకారులకు చప్పట్లు కొట్టమని ప్రేక్షకులకు విజ్ఞప్తి చెయ్యవలసిన అవసరం కనిపించలేదు. అతను పుట్టకముందే వారంతా పేరు మోసిన కళాకారులు. చిన్నపిల్లల విషయంలోనూ, వర్ధమాన కళాకారుల విషయంలోనూ కాలేజి ఫంక్షన్లలో అలా అనడం పరిపాటి. ఇవన్నీ చవకబారు పోకడలు. ప్రోగ్రాం చూసినవారికి నేనంటున్నదేమిటో అర్థమవుతుంది.
సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/12/2009 12:48 am
రాగం, తానం, పల్లవి అనే పదాలలో రాగం, పల్లవి పదాలకు సంగీత పరమైన నిర్వచనం కాకపోయినా, సామాన్య జన గ్రాహ్యమైన అర్ధం తెలుసు కానీ తానం అంటే ఏమిటో తెలియదు. మూడిటికీ సంగీత పరమైన అర్ధం వివరించరా.
భవదీయుడు
ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/12/2009 12:18 am
అత్యద్భుతం గురువు గారూ, మీ ఈ పరిశ్రమ సుశ్లాఘ్యం, సర్వ రసజ్ఞ జనమనో రంజకం. ఆపాత మధురమైన సంగీతం గొప్పదా లేక జీవితాంతం ఆలోచించినంత కొలది ఊట చెలమలాగా రసానందం సృజించే శాశ్వతానంద దాయకమైన సాహిత్యం గొప్పదా అని వివాదం కలిగించేలా ఘంటసాలగారు=కరుణశ్రీ గారు స్వర పరచి పాడిన=రచించిన కుంతీ కుమారి అద్భుతంగా జోడించి మాకందించారు. మీ ఈ కృషికి ఈమాట రసజ్ఞ హృదయులైన పాఠకులంతా ఋణపడిఉంటారు.
ఇది పద్యం బిదియే కవిత్వ మిదెపో ఇంపైన సాహిత్య మం
చిది గాన మ్మిదియే రస మ్మిదియపో ఇంపైన సంగీత మం
చెద తా భావ రసాద్భుతామర ఝరీ హేలా విలోలార్భటీ
విదితానంద మరందమై చెలగె సంప్రేహ్యేంద్రియారామమై
మరొక్కమారు దశ సహస్ర శత కోటి అభివందనలతో
భవదీయుడు
తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్ థిరక్వా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
06/10/2009 7:53 am
ప్రసాద్ గారూ:
మీరు చెప్పిన మహా విద్వాంసుడు మన తొలి ఆస్థాన విద్వాంసుడు శ్రీ కాశీ కృష్ణాచార్యులేమో! నాకు తెలిసిన తెలుగు వారిలో ఆ తరంలో అటు సంస్కృతంలోనూ ఇటు సంగీతం, తబలా వాయిద్యంలోనూ అసామాన్య ప్రతిభ కలిగిన తెలుగు వ్యక్తి శ్రీ కాశీ కృష్ణాచారులు గారే!
విష్ణుభొట్ల లక్ష్మన్న
తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్ థిరక్వా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/10/2009 5:31 am
మృదంగ విద్వాంసులలో యెల్లా వెంకటేశ్వరరావు సోలో కచేరీల్లో రకరకాల ధ్వనులు మృదంగం మీద పలికిస్తారు. నోటితో బోల్ (కొనగోలు) విన్యాసాలను వినిపించి, ఆ తరవాత తాళవాద్యం పై దాన్నే పలికించే సంప్రదాయం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులు రెంటిలోనూ ఉంది. ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పనికొస్తాయే తప్ప ప్రావీణ్యానికి ఉదాహరణలు కావు. ఎందుకంటే రాగప్రస్తారాన్ని విన్నంత ఆసక్తితో తాళవిన్యాసాలని విని ఆనందించేవారు తక్కువే.
అయితే తబలా కన్నా మృదంగ విన్యాసాలు నిస్సందేహంగా జటిలమైనవి. “జాకిర్ హుసేన్‌కు ఎక్కువ గ్లామర్ ఉండవచ్చుగాని ఏ మృదంగ కళాకారుడైనా అతనికి సాటిరాగలడని చాలామందికి తెలియకపోవచ్చు” అంటూ బొంబాయి సంగీత విమర్శకుడొకడు రాశాడు.
థిరక్వా కచేరీ గొప్పగా ఉందని నేనంటే ప్రసిద్ధ సారంగీ విద్వాంసుడు రామ్ నారాయణ్ అదే అతివిశిష్ట కళాకారులు కలిగించే ప్రభావం అని నాతో అన్నారు.
మరొక ముచ్చట. నేను హాజరయిన థిరక్వా కచేరీకి ప్రసిద్ధ సంగీతదర్శకుడు మదన్‌మోహన్ కూడా హాజరవడం గమనించాను. అతను ఆ ఏడాదే మరణించినట్టు గుర్తు (1975).
నౌషాద్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/10/2009 5:17 am
నౌషాద్ తదితరులు సినీసంగీతానికి పరిచయం చేసిన శంశాద్ బేగం ఇంకా జీవించే ఉంది. ఆవిడ గురించిన వార్త ఇవాళే చదివాను.
http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/jun/10navya1
తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్ థిరక్వా గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/10/2009 3:02 am
మరొక్క మహోన్నత కళాభాస్కరుని అంధత్వంలో వున్న మాకు పరిచయం చేస్తూ స్ఫూర్తి దాయకమైన సమాచారాన్ని అందజేసినందుకు హార్దిక ధన్య వాదాలు.
ఏ తాళ వాద్యకారుని గూర్చిన ప్రశంస విన్నా లేక వారి వాదనాన్నివినే భాగ్యానికినోచుకున్నా నా చిన్నతనంలో (1962-64మధ్యలో) మా ఊరి త్యాగరాజోత్సవాలలో విన్న ఒక మహా విద్వాంసుని తబలా వాదన ఇప్పటికీ స్మృతిలో చిరనూతనంగా ఉంటూ గుర్తుకు వస్తుంది. ఆనాదు ఆ 90 ఏళ్ళ వృద్ధ విద్వాంసుడు ఒక గంటసేపు తబలా వాదనతో మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేయడమే కాక చివరలో ఒక అద్భుత ప్రక్రియ (నైపుణ్యం) ప్రదర్శించాడు. విఘ్నేశ్వరుని సంస్తుతించే సంస్కృత శ్లోకానికి ఒకరు రాగ యుక్తంగా ఒక్కొక్క పదం పాడుతూంటే ఆ పదాలని ఆయన తన తబలా పైన పలికించారు. తంత్రీ వాద్యాలకు, గాత్రానికి మాత్రమే సాధ్యమైన రాగాలను ఒక తాళ వాద్యంపై పలికింపజేసే ఆ ప్రక్రియ ను నేను మళ్ళీ ఎక్కడా వినలేదు. కనలేదు. ఐతే నేను వేరే ఏ తాళ వాద్య కచేరి ఇంతవరకు వినలేదని చెప్పడం కూడా ఈ సందర్భంలో అత్యవసరం. నేను చూసిన ఈ ప్రక్రియ/నైపుణ్యం ఒకింత ప్రతిభ గల వారెవరైనా చేయగలుగుతారా లేక ఇది ఒక అసాధారణ నైపుణ్యమా చెప్పగలరా. ఎందుకంటే మీ వ్యాసంలో ఇటువంటి చాతుర్యంపై ప్రసక్తి రాలేదు.
భవదీయుడు
సంగీతానికి స్పందన గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/09/2009 1:44 am
ప్రోగ్రాం చూడకపోయినా అక్షమార్హమైన వైఖరి అర్ధం అవుతూనే వుంది. మీ అభిప్రాయంతో నేనే గాక విజ్ఞులైన వారందరూ ఏకీభవిస్తారు.
ద్రోణ-ఏకలవ్య శైష్యోపాధ్యాయిక ప్రాతిపదికగా లోకంలో అనేక మంది ఆచార్యులకు తమకు తెలియని వేలాదిమంది శిష్యులుంటారు. అదే విధంగా సంగీత శాస్త్రవిషయాలపై తెలుసుకోదగిన అనేక ఉత్కంఠ భరిత సమాచారాన్ని ఔత్సాహికులకు వ్యాసాల రూపంగా అందిస్తున్న మీకు పరమహంస శిష్యులు (ఉత్తమ రసజ్ఞులు); నావంటి పరమానందయ్య శిష్యులు అనేకులు ఉండి తీరుతారు. నేనొనర్చిన సంబోధన మీపై ఏతదభిమాన సాదర పూర్వకమే గానీ అన్యంగాదు. అది మీకు కుహనా గౌరవ వ్యంగ్యంగా ధ్వనించి వుంటే క్షమించవలసినది. మీరు ఆచార్యత్వాన్ని అంగీకరించకపోయినా, శిష్యత్వాన్ని కోరుకొనేవాళ్ళు చాలామంది ఉంటారనే నా నమ్మకం.
భవదీయుడు
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
06/08/2009 9:32 pm
ఎప్పటిలాగానే, మంచి పుస్తకాన్ని భద్రిరాజుగారి వ్యాసవిశేషాలగురించి తెలిపినందుకు హనుమగారికి కృతజ్ఞతలు.
పండితులుచేసే వ్యాఖ్యానాలగురించి ఒక్క మాట. భాషలో నుడికారాలు, సమాసాల సొగసులు, ఉక్తివైచిత్రి వగైరాల గురించి ఎంత చెప్పినా, అసలు చెప్పాల్సినదేదో ఎందుకో వదిలేసిన భావం, కొరత. అంటే వాటి ప్రాముఖ్యతను కాదనడం కాదు. కానీ అవన్నీ వాటికవే సొంతంగా ఎంతవరకు సాధారణ పాఠకులను పుస్తకానికి దగ్గరచేస్తాయి అని, అసలు అవేనా తిక్కన కవిత్వం అంత సొగసుగా అందిస్తున్నది అని కూడా అనిపిస్తుంది.
నెత్తిమీదున్న బతుకు బరువుకు, ప్రస్తుత పరిస్థితులకు తిక్కన రచన ద్వారా ఏమైనా లబ్ధిపడే అవగాహన, నిశితమయ్యే దృక్కు, స్పష్టతనిచ్చే అభివ్యక్తి లాంటివి కొంతైనా, ఎంతైనా, వడలి మందేశ్వరరావు, జీ.వి.సుబ్రహ్మణ్యం గార్ల వలె అందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఆ demand ఎప్పుడూ ఉంటుందని కూడా అనిపిస్తుంది. అట్లా కాకుండా వొట్టి పాండిత్య ప్రకర్షగా, భాషాశాస్త్రం, పద సంపద వివరించడం, వ్యాకరణ అంశాలతో
వూదరగొట్టడం- రుచికర ఆహారపదార్థాలను scientists వాటి పుట్టుపూర్వోత్తరాలు, చెట్ల పేర్లు, వాటి రసాయనాలు, అవి జీర్ణించబడడానికయ్యే reactions- మొత్తం వాళ్ళకు తెలిసిన శాస్త్రమంతా పేజీలలో గుమ్మరించినట్లుంటుందేమో అని అనుమానం. తీరా ఇదంతా మనకు రుచి, బలం ఇచ్చే ఆహారం గురించే(నా) అన్నది కూడా మరిచిపోయేటట్లు చెప్తారేమోనని కూడా భయం! కుయ్యోమంటున్న పాఠకులను చూసి అయ్యో ఇంత పాండిత్యంతో రాసిన వ్యాఖ్యానాలు చదువుకొ(న)డం లేదని వాపోవడం కూడా అతిశయోక్తి కాదేమో అని కూడా అనిపిస్తుంది.
———-
విధేయుడు
_Srinivas
సంగీతానికి స్పందన గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/08/2009 7:37 am
ప్రసాద్‌గారూ,
మొదటి సంగతి: నేనేమీ ఆచార్యుణ్ణి కాను.
సోనూ నిగం ప్రసిద్ధ కళాకారులకు చప్పట్లు కొట్టమని ప్రేక్షకులకు విజ్ఞప్తి చెయ్యవలసిన అవసరం కనిపించలేదు. అతను పుట్టకముందే వారంతా పేరు మోసిన కళాకారులు. చిన్నపిల్లల విషయంలోనూ, వర్ధమాన కళాకారుల విషయంలోనూ కాలేజి ఫంక్షన్లలో అలా అనడం పరిపాటి. ఇవన్నీ చవకబారు పోకడలు. ప్రోగ్రాం చూసినవారికి నేనంటున్నదేమిటో అర్థమవుతుంది.
వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/08/2009 7:32 am
సినిమా పాటల్లో వాద్యసంగీతం గురించిన నా కొత్త వ్యాసంలో మరిన్ని వివరాలు రాశాను. http://www.pranahita.org/2009/06/music01_cinema_patallo_vayidyalu/