Comment navigation


15815

« 1 ... 1235 1236 1237 1238 1239 ... 1582 »

  1. చిలక – గోరింక గురించి sirivennela గారి అభిప్రాయం:

    06/14/2009 8:43 am

    మేనరికాలు మంచివి కావని పూర్వకాలీకులు అనుకునెవారు. పోయిన సంవత్సర రీసెర్చ్ యిది అపోహ అని తెలిపినది.
    “Research downplays risk of cousin marriages”

    http://www.usatoday.com/news/science/2002-04-04-cousins.htm

  2. సహచర గురించి siriviennea గారి అభిప్రాయం:

    06/14/2009 7:48 am

    మంచి భావన!
    “ఇప్పుడు హృదయం ఇచ్చినందుకు
    రేపు స్మృతిగీతం రాయకు”

  3. ఒక రాజకీయ ఉత్తరం గురించి siriviennea గారి అభిప్రాయం:

    06/14/2009 7:43 am

    మైనారిటీలకు భరత దేశం లో హక్కులు లేవనా రచయిత్రి ఉద్దేశం?

  4. పునరపి గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:

    06/14/2009 4:42 am

    సమస్యను గుర్తించేరు బాగుంది, పరిష్కారం? హనుమంతరావు గారు other side of the story బాగా చూపించేరు. ఇలాంటి సమాధానాలు వేరే ఇళ్లల్లో వస్తాయని తెలిసి వినోదంగా అనిపించింది

  5. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    06/13/2009 10:21 am

    ఎందుచేతనో పరుచూరి శ్రీనివాస్ గారి కామెంట్ మిస్ అయాను.

    చంద్రహారం తీస్తున్నప్పుడో, తీశాకో విజయావారు నెల జీతాలు మొదలుపెట్టారు. అంతకుముందు కాదు. ఈ విషయంలో అనుమానం లేదు. బైట పాడకుండా ఉండటానికి ఘంటసాల లక్ష రూపాయలో, అంతకంటే ఎక్కువో అడిగాడని మా నాన్నగారే చెప్పారు. ఎటొచ్చీ చంద్రహారం దెబ్బతినడంతో ఈ నెలజీతాల ప్రణాళిక కొనసాగలేదు. అలాగే ఘంటసాల చుట్ట అలవాటు మధ్యలో వచ్చి, మధ్యలోనే పోయిందని అంటారు.

    కేళ్కర్‌గారు అమరసందేశం సినిమాకు ప్రధాన సంగీతదర్శకుడు. వయీ ప్రాంతపు మరాఠీ బ్రాహ్మణుల పద్ధతిలో ఆయన కాస్త అమాయకుడు. ఆయనకు చెప్పకుండా ప్రసాదరావు పేరును జత చెయ్యడం ఆయనకు చాలా కోపం తెప్పించింది. ఇదంతా జరిగిన ఒక దశాబ్దం తరవాత నేను శిష్యుడైనప్పుడు కూడా ఆయన సినిమావాళ్ళని తిడుతూనే ఉండేవాడు.

    మద్రాసు రాకపూర్వం ఆయన బొంబాయి సినీ ఆర్కెస్ట్రాలో వయొలిన్ తదితర వాద్యాలు వాయించేవాడట. ఆయన వినాయకరావు పట్వర్ధన్ శిష్యుడు. గాత్రం నేర్చుకుంటున్నప్పుడు డి.వి. పలూస్కర్‌కు సహాద్యాయి. పూట గడవడానికి సినిమాల్లో చేరాడు. మధ్యలో అల్లా ఉద్దీన్ బృందంతో కలిసి ఉదయశంకర్ నృత్యప్రదర్శనల్లో వాయించడానికి విదేశాలకు వెళ్ళాడు. అందులో వయొలిన్ వంటి విదేశీవాద్యాలకు చోటు లేదు కనక తబలాతరంగ్ జలతరంగ్ మొదలైనవి వాయించానని నాతో అన్నాడు.

  6. సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    06/13/2009 7:22 am

    రాగం అంటే ఏమిటో తెలిసినదే.
    ఖచ్చితంగా చెప్పలేను కాని, తానం ఉత్తరాదినుంచి సంక్రమించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి ఖయాల్ శైలికన్నా పాతదైన ధ్రుపద్ గాత్రంలో నోమ్ తోమ్ ఆలాపన, జోడ్ పాడతారు. నోటితో వీణలాగా పాడడానికి కారణం అప్పటి సంగీతంలో (రుద్ర) వీణకు ఉండిన ప్రాముఖ్యతే అంటారు. రుద్రవీణను సోలో వాద్యంగానూ, గాత్రానికి వంతగానూ ఉపయోగించేవారట. హార్మోనియంవంటిది లేని ఆ రోజుల్లో గాయకుణ్ణి ఇబ్బంది పెట్టాలంటే వైణికులు కష్టసాధ్యమైన శ్రుతిని అందించడం మొదలైన పనులు చేసేవారట. మొత్తంమీద వీణదే పైచెయ్యిగా ఉండేదట. అందుకని ధ్రుపద్ గాయకులు చాలావరకు వీణని అనుకరిస్తూ పాడడం చూస్తాం. రాగప్రస్తారం మధ్యలో ఆపినప్పుడు పాడే మొహ్రా (ముద్ర) కూడా అటువంటిదే. ఇదే తరహాలో దక్షిణాది గాయకులు కూడా తానం పాడతారు. నిజానికి జోడ్ లాగే తానం కూడా వీణవంటి వాద్యాలమీదనే అన్నిటికన్నా బావుంటుంది. ఇందులో లయ ఉంటుంది కాని తాళం ఉండదు.

    1565లో జరిగిన తళ్ళికోట యుద్ధానికి పూర్వం ఉత్తర, దక్షిణ సంగీతపద్ధతులకు ఇప్పటికన్నా దగ్గర సంబంధం ఉండేదనీ, ఆ తరవాత రెండూ క్రమంగా విడిపోయాయనీ కొందరంటారు.

  7. పునరపి గురించి ramaadevi godugula గారి అభిప్రాయం:

    06/13/2009 2:55 am

    నిజం గా ఇది ఆలోచించాల్సిన విషయం. రమాదేవి గారు రాసినట్లు పెళ్ళిని పక్కన పెట్టేసే రోజు తొందరలోనే వస్తుందేమో! అప్పుడు కుటుంబం అంటే తెలియకుండా పోతుందేమో! “సేవ్ ఎర్త్ ” ఆర్గనైజేషన్స్ ఇంక మొదలెట్టాలేమో! కధలో గమనించాల్సింది భార్య భర్త ఫ్రెష్ గా కోరుకుటాడని, దోశ ఇడ్లి లాటివి కావాలనుకుటాడని దాని పై స్థాయి అసలు తను మాత్రమే వంట గురిచి టిఫిన్ గురిచి పట్టించుకోవాలి అని అనుకోకపోవడము……..హనుమంత రావు గారు హాస్యం గా రాశాననుకుంటున్నారేమో కాని అది చేదు నిజం. పచ్చిపాలు etc తో చాలా మంచి భర్త అయిపోయాననుకునే అలాంటి భర్తలే చాలా ప్రోగ్రెస్సివ్ అనుకోవాలేమో! కాలేజీల్లో కంప్యూటర్ ప్రోగ్రాములూ, వేవ్ ఈక్వేషన్స్ తో బాటు సాటి మనిషితో ఎలా బతకాలి, అసలు కుటుంబం ప్రారంభించగల స్కిల్స్ నేర్పించి, సర్టిఫికేట్ ఇచ్చే వ్యవస్థ కావాలేమో! రమాదేవి గారు చెప్పినట్లు పిల్లవాడు అరుణ్ వాళ్ళ నాన్నలా కాకుండా వేరే విధం గా వుండే అవకాశాలు తక్కువ. We are half genetic and half from environment. Here both are suggesting that the child becomes another raaghava!!!!!!!!!! But what is the solution? How to change this? How many legal changes can bring a change in this sort of mentalities? 90% of the society expects a woman to be with the husband since as Mr Hanumantha Rao expressed ” కొట్టడు, వేరే హింస లేదు కదా, భరించవచ్చు.” కానీ సంసారమంటే ఇదేనా! చలం మైదానం రాసి ఎన్ని యేళ్ళు గడిచాయి? కానీ ఇంకా అదే వుపేక్ష స్త్రీ కి వుహూ, భార్యకి ఏమి కావాలో అర్ధం చేసికోవడంలో! ఇది ఫామిలీ/కుటుంబ వ్యవస్థని వాతావరణం లో ఓజోన్ రంధ్రం కంటే పెద్ద హాని కలగచెయ్యగలదని ఎందుకు అనిపించట్లేదో అని దిగులేస్తోంది.

  8. జనరంజని: మహానటి సావిత్రి గురించి Ramakrishna గారి అభిప్రాయం:

    06/12/2009 1:46 pm

    మరీ పిక్కీ అనుకోకపోతే, ఒక ప్రశ్న.

    టైపోలు కనపడితే, వాటి గురించి చెప్పడానికి ఇక్కడ కాక ఇంకో మార్గముందా?

    [ఎడిటర్స్ ఎట్ ఈమాట.కాం కు ఈమెయిల్ పంపవచ్చు – సం.]

  9. జనరంజని: మహానటి సావిత్రి గురించి Ramakrishna గారి అభిప్రాయం:

    06/12/2009 9:18 am

    దేనికొసమో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. జనరంజని – సావిత్రి సమర్పించిన ఈ ప్రత్యేక జనరంజని వింటున్నాను. “ఆవిడ ముఖములోని అమాయకత్వం ఆవిడ సుమధురమైన గొంతులో ప్రతిబింబించింది.” అన్నది అక్షరాలా నిజం! మంచి పాటలు చాలా ఉన్నాయి కానీ, ఆ చక్కని గొంతూ, ఆషామాషీ (ఆవిడ మాట!) మాటవరసా, ఆ పాటలన్నీ తీసేసినా తిరిగి తిరిగి వినాలనిపించేట్టుగా ఉన్నాయి.
    శ్రీనివాస్ – థాంక్సు.

  10. నిశ్శబ్దం గురించి Mr.Suneeth గారి అభిప్రాయం:

    06/12/2009 3:52 am

    కవిత్వంలో శబ్దం, శిల్పం రెండు ముఖ్యమే. పచ్చిగా రాస్తే అది depth వున్న కవిత్వం అని కొద్ది మంది పెద్దవాళ్ళ కవిత్వమం చదివితే కలిగే తొందరపాటు నిర్ణయం. “Poetry is the economy of words” అన్నడు చలమ్. నాకు తెలిసి propriety of words is THE fundamental. ఖడ్గం సినిమాలొ “నువ్వు నువ్వు” పాట్లొ “మెత్తని ముల్లై గిల్లె తొలి చినుకె నువ్వు” అని రాసాడు కవి. అదే విషయాన్ని పచ్చిగా రాస్తే చదవడానికి నోరు రాదు. కవిలో మర్యాదస్థున్ని చదవాలి, కవిత్వం అబ్బిన వాడికి మర్యాద అబ్బకపొదు.

    I am sure it is just a slight perversion before the perfection and you CAN write better than what you did. So రవికిరణ్ గారూ Best of luck !!

« 1 ... 1235 1236 1237 1238 1239 ... 1582 »