ప్రాచీనాద్యతన కవితా గుణ వ్యాసావలంబమై సహితానేక సాహిత్య చతుర విశ్లేషణా కదంబమైన మీ వ్యాసం చాలా బాగున్నది. ధన్యవాదాలు అభివందనలు కొన్నిపదాల/భావాల పరిభాషలు కొత్తగా తెలుసుకొని కొంచెం విశాలమైన దృక్పధాన్ని ఏర్పరచుకోడానికి తోడ్పడే మీ కృషి అభినందనీయం.
An empty stomach is no good for religion. ఆకలితో అలమటిస్తున్న జీవి కుక్క ఐనా సరే దానికి అన్నం అందించడమే నా పరమోత్కృష్టమైన మతం అని శ్రీ వివేకానంద స్వాములవారుద్ఘోషించారు. జీవ కోటిపై ఆకలికి ఉన్న ఈ తిరుగులేనిశక్తి గుర్తించే బ్రహ్మ జిజ్ఞాసలో ఆహారాన్ని బ్రహ్మ స్వరూపాలలో ఒకటిగా అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. హృదయాన్ని కదలించే కధలోని ఈ చివరి మలుపు చాలా బాగుంది. రచయితగారికి అభినందనలు.
In my opinion she is very natural actress compared to NTR,ANR & SVR. Eventhough these three guys are really really talened, at some point they do overacting.
ఈ వ్యాసంపై అభిప్రాయాలలో కొన్నిటిని చర్చావేదికలో సాంప్రదాయ సాహిత్యం విభాగంలోకి మార్చాము. వ్యాసానికి ప్రత్యక్ష సంబంధం లేని అభిప్రాయాలను అక్కడ పోస్ట్ చేయగలరని మా విజ్ఞప్తి.
భాషలో “శభాష్” అనే అర్ధాన్నిచ్చి, ఎక్కువ సంతోషాన్ని తెలిపే మాటల నన్నిటినీ ఒక్క చోట కూర్చి చూడాలనే కోరిక వుంటే, దానికై వేమారు శబ్దార్ధ కోశాలు (Dictionaries) వెతకాలిసిన పనిలేదు. మీ వ్యాసాల చివర పాఠకుల అభిప్రాయాలను చూస్తే చాలు. (ఇంతకంటే మంచిగా నా అభిప్రాయాన్నెలా తెలుపాలో నాకు తెలియటం లేదు.)
భాషల నన్ని మాటల, “శభాష్” అని అర్ధము నిచ్చి, హెచ్చు సం
తోషము దెల్పు వాని, రస తుందిలతన్ యొకచోట చూచు చి
త్తేష గలింగె నేని, యవి యెల్లయు మీ ఘన వ్యాస వీధులన్
భేషుగ దోచు; కోశముల వేమరు చూడగ బోవ డెవ్వడున్
పాశ్చాత్య శాస్త్రీయసంగీతం గురించిన సమాచారం చాలానే దొరుకుతుంది. ఉదాహరణకు ఈ వెబ్ సైట్ చూడవచ్చు: http://w3.rz-berlin.mpg.de/cmp/musical_history.html
మన దేశపు సంగీతాభిమానులకు రెండిటినీ పోల్చ బుద్ధి అవుతుంది కాని ఈ రెండు పద్ధతుల పరిణామమూ వేరువేరు వైఖరులతో సాగింది.
పాత తరానికి చెందిన బాఖ్ సంగీతం ఇక్కడ వినవచ్చు: http://www.jsbach.net/audio/index.html
తరవాతివాడైన మోత్సార్ట్ స్వరపరిచిన అద్భుతమైన 40th symphony ని సినిమా కోసమని సలీల్ చౌదరి అనుకరించిన సంగతి తెలిసినదే. http://www.archive.org/details/Mozart_Symphony_40
మరొక మేధావి బెథోవెన్ : http://www.lvbeethoven.com/Oeuvres/Music-RealAudio.html
ఈనాడు పాశ్చాత్య శాస్త్రీయసంగీతమంతా polyphonic గానే అనిపిస్తుంది.
ఒకప్పుడు అలా ఉండేదికాదట.
మన సంగీతానికీ (ముఖ్యంగా హిందూస్తానీ), పశ్చిమదేశాల సంగీతానికీ ఉన్న తేడా ఏమిటంటే వారి సంగీతానికి స్వరరచయితా (కంపోజర్), నిర్వాహకుడూ (కండక్టర్), వాయించేవారూ (ఆర్క్కెస్ట్రా) వేరువేరు వ్యక్తులు. మనకు అలాకాదు. ఏ సంతూర్‌నో పట్టుకుని స్టేజి ఎక్కిన కళాకారుడు మూడూ తానే అవుతాడు. వారిలాగ కచేరీల్లో మనకు ‘రాసిపెట్టిన’ స్వరాల అవసరం ఉండదనేది తెలిసినదే.
శ్రోతల స్పందనకూడా కాస్త వేరుగా ఉంటుంది. ప్రసిద్ధుల symphony లన్నీ వినడానికి నాకు చాలా బావుంటాయి. అనేక ‘పొర’లలో చేసిన ఆ స్వరరచనలు ఎంతో అద్భుతమైనవి. మనకు సంగీతంలో individuality ఎంత ముఖ్యమో, వారికి విధేయత, నిబద్ధత అంతే ముఖ్యం.
కవిత్వ భాష తీరుతెన్నులు గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/26/2009 11:07 pm
ప్రాచీనాద్యతన కవితా గుణ వ్యాసావలంబమై సహితానేక సాహిత్య చతుర విశ్లేషణా కదంబమైన మీ వ్యాసం చాలా బాగున్నది. ధన్యవాదాలు అభివందనలు కొన్నిపదాల/భావాల పరిభాషలు కొత్తగా తెలుసుకొని కొంచెం విశాలమైన దృక్పధాన్ని ఏర్పరచుకోడానికి తోడ్పడే మీ కృషి అభినందనీయం.
మరొక్కమారుకృతజ్ఞతలతో
భవదీయుడు
వానలో ఓ జాణ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/26/2009 10:05 pm
కధ సగం చదవగానే (పెళ్ళిళ్ళ ప్రసక్తి రాగానే) చివర్లో రాబోయే మలుపును చాలా ఖఛ్చితంగానే ఊహించగలిగాను. కధా కధన విధానం, శైలీ చాలా బాగున్నాయి. అభివందనలు.
భవదీయుడు
వానలో ఓ జాణ గురించి Sri harinarayana గారి అభిప్రాయం:
06/25/2009 7:45 am
Story theme and narration both are well. keep it up.
శిల కరిగింది గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/24/2009 11:48 pm
An empty stomach is no good for religion. ఆకలితో అలమటిస్తున్న జీవి కుక్క ఐనా సరే దానికి అన్నం అందించడమే నా పరమోత్కృష్టమైన మతం అని శ్రీ వివేకానంద స్వాములవారుద్ఘోషించారు. జీవ కోటిపై ఆకలికి ఉన్న ఈ తిరుగులేనిశక్తి గుర్తించే బ్రహ్మ జిజ్ఞాసలో ఆహారాన్ని బ్రహ్మ స్వరూపాలలో ఒకటిగా అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. హృదయాన్ని కదలించే కధలోని ఈ చివరి మలుపు చాలా బాగుంది. రచయితగారికి అభినందనలు.
మధ్య వ్యవధిలో నీడలు గురించి vamsi గారి అభిప్రాయం:
06/24/2009 8:08 pm
వాళ్ళ గొడవ ఎందుకు జరిగిందో కూడా చెప్తే బాగుండేది. మిగతా కథ చాలా బాగుంది.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Rajendra గారి అభిప్రాయం:
06/24/2009 8:57 am
In my opinion she is very natural actress compared to NTR,ANR & SVR. Eventhough these three guys are really really talened, at some point they do overacting.
She is all time best.
Thanks for this link.
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Madhav గారి అభిప్రాయం:
06/24/2009 5:10 am
ఈ వ్యాసంపై అభిప్రాయాలలో కొన్నిటిని చర్చావేదికలో సాంప్రదాయ సాహిత్యం విభాగంలోకి మార్చాము. వ్యాసానికి ప్రత్యక్ష సంబంధం లేని అభిప్రాయాలను అక్కడ పోస్ట్ చేయగలరని మా విజ్ఞప్తి.
– సంపాదకులు.
రచయితలకు సూచనలు గురించి మృత్యుంజయరావు గారి అభిప్రాయం:
06/24/2009 3:43 am
ఈమాట పత్రిక లోని రచనలు అద్భుతంగా ఉంటున్నాయి. ఈ స్థాయి తగ్గకుండా పత్రిక చిర కాలం నడవాలని కోరుకుంటున్నాను
గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి M.S.Prasad గారి అభిప్రాయం:
06/22/2009 1:41 am
భాషలో “శభాష్” అనే అర్ధాన్నిచ్చి, ఎక్కువ సంతోషాన్ని తెలిపే మాటల నన్నిటినీ ఒక్క చోట కూర్చి చూడాలనే కోరిక వుంటే, దానికై వేమారు శబ్దార్ధ కోశాలు (Dictionaries) వెతకాలిసిన పనిలేదు. మీ వ్యాసాల చివర పాఠకుల అభిప్రాయాలను చూస్తే చాలు. (ఇంతకంటే మంచిగా నా అభిప్రాయాన్నెలా తెలుపాలో నాకు తెలియటం లేదు.)
భాషల నన్ని మాటల, “శభాష్” అని అర్ధము నిచ్చి, హెచ్చు సం
తోషము దెల్పు వాని, రస తుందిలతన్ యొకచోట చూచు చి
త్తేష గలింగె నేని, యవి యెల్లయు మీ ఘన వ్యాస వీధులన్
భేషుగ దోచు; కోశముల వేమరు చూడగ బోవ డెవ్వడున్
భవదీయుడు
జుగల్‌బందీ కచేరీలు గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
06/19/2009 1:55 pm
పాశ్చాత్య శాస్త్రీయసంగీతం గురించిన సమాచారం చాలానే దొరుకుతుంది. ఉదాహరణకు ఈ వెబ్ సైట్ చూడవచ్చు:
http://w3.rz-berlin.mpg.de/cmp/musical_history.html
మన దేశపు సంగీతాభిమానులకు రెండిటినీ పోల్చ బుద్ధి అవుతుంది కాని ఈ రెండు పద్ధతుల పరిణామమూ వేరువేరు వైఖరులతో సాగింది.
పాత తరానికి చెందిన బాఖ్ సంగీతం ఇక్కడ వినవచ్చు:
http://www.jsbach.net/audio/index.html
తరవాతివాడైన మోత్సార్ట్ స్వరపరిచిన అద్భుతమైన 40th symphony ని సినిమా కోసమని సలీల్ చౌదరి అనుకరించిన సంగతి తెలిసినదే.
http://www.archive.org/details/Mozart_Symphony_40
మరొక మేధావి బెథోవెన్ :
http://www.lvbeethoven.com/Oeuvres/Music-RealAudio.html