Comment navigation


15815

« 1 ... 1231 1232 1233 1234 1235 ... 1582 »

  1. పట్టుకో పట్టుకో గురించి Subbarao Nanduri గారి అభిప్రాయం:

    07/02/2009 7:20 am

    కానీ నేను వాటిని పట్తుకొనేందుకు
    ప్రయత్నమే చెయ్యలేదు,
    అందకుండా ఆకాశానికి ఎగిరిపోతున్న ధరలనీ,
    ఆగకుండా పాతాళానికి జారిపోతున్న ఆశలనూ,
    నిరాశల ఊబిలో కూరుకుపోతున్న ఆశయాలనూ,
    అవసరాల అగ్నిలో ఆవిరయిపోతున్న విలువలనూ,
    పట్టుకోలేని నాకు,
    వీటిని పట్టుకొనే శక్తి ఎక్కడిది?

  2. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Subbarao Nanduri గారి అభిప్రాయం:

    07/02/2009 6:59 am

    అఫ్సర్ గారికి,
    అభినందనలు. మీ కవితలో పదప్రయోగం, భావగాఢత బాగుంది. కానీ తర్కం ఏదీ? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వ్రాశారు. ఎవరితో? మీ నాన్నతోనా? పాఠకుడితోనా? మీలో మీరే మాట్లాడుకుటున్నారా? నేను ఆధునిక కవిత్వం చదవను. ఇప్పటి ట్రెండ్ ఇదేనేమో నాకు తెలియదు. విప్పి చెబితే వచనం. కప్పి చెపితే కవిత్వం ఇంతేనా తేడా?
    శ్రీశ్రీ, దేవులపల్లి, కుందుర్తి, తిలక్ , నండూరి, వీళ్ళందరి కవితలూ సూటిగా, తర్కబద్దంగానే ఉంటాయి కదా? తర్కం లేకుండా కేవలం పదాల పోహళింపుతో, భావగాఢతతో కవిత బతకదేమో? ఇప్పటి కవితలు పాఠకుల హృదయాల్లో నిలబడటం లేదేమో? ఇదంతా మీరూ మిగతా కవులూ ఆలోచించాల్సిన విషయం. నేను కవిని కాను కనుక నాకు అన్నీ సందేహాలేగానీ వాటిని పరిష్కరించగల సామర్ద్యం లేదు.
    మరోసారి అభినందనలతో,
    నండూరి వెంకట సుబ్బారావు.

  3. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Pasunoori Ravinder గారి అభిప్రాయం:

    07/02/2009 5:34 am

    “చీకటి వంతెన
    దిగులు పొలాలు
    ఖాళీ ఆకాశాలు”
    వెనక్కి తిరిగి చూసుకునే గడియలే నిజంగా బతికిన క్షణాలు
    అక్షరాల్లో బ్రతుకును చూపించడం అందరి వల్ల కాదు.
    అందుకేనేమో కవిత్వానికి, కన్నీళ్ళకి దగ్గరి సంబంధం ఉందనిపిస్తది.
    ఓ మంచి కవితను చదివే అవకాశాన్ని కల్పించిన అఫ్సర్ గారికి అభినందనలు

  4. నాకు నచ్చిన పద్యం: నిగమశర్మ అక్క పలకరింపు గురించి రానారె గారి అభిప్రాయం:

    07/02/2009 5:18 am

    ఈ శీర్షిక నిరంతరం నిరంతరాయంగా కొనసాగిస్తున్నందుకు ఈమాటవారికీ బృందావనరావుగారికీ కృతజ్ఞతలు.

    ‘నిగమశర్మ అక్క’ గుఱించి నాకు మొదటగా పరిచయం చేసినవారు పరుచూరి శ్రీనివాస్‌గారు – కూడలి కబుర్లలో. ఆ పాత్రౌచితిని గుఱించిన ఒక వ్యాసానికి లంకె ఇచ్చారు. అందులో పద్యాల్లేవు. అంతా వచనమే.

    మన్నించాలి, ఈ పద్య పరిచయంలో చిన్న టైపాటు దొర్లినట్టుంది. “నెలపొడుపు కోసం సముద్రంలో నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఎంతో అందంగా వుంది.” అని వుంది. సముద్రునివలె అని వుండాలనుకుంటాను.

    అలాగే చక్షూరాజీవ యుగమ్ము వాఁచె అనే నుడిని రామకృష్ణుడు పద్యంలో పలికించడాన్ని కూడా ప్రస్తావించివుంటే సంతోషించేవాడిని.

    [టైపో సరిదిద్దాము. కృతజ్ఞతలు – సం.]

  5. ఫాదర్స్ డే గురించి రాఘవ గారి అభిప్రాయం:

    07/02/2009 2:23 am

    కన్నీళ్లు తెప్పించారండీ. ముఖ్యంగా ఈ పంక్తులైతే మఱీనూ…

    భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు ఆ భగవంతుని వరశాపం.

  6. ఈ కానుకనివ్వలేను గురించి రవిచంద్ర గారి అభిప్రాయం:

    07/01/2009 10:59 pm

    అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

    చివరికి హార్దికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది.

    అక్కడక్కడా ఇలాంటి వాక్యాలు హృదయాన్ని తాకాయి. సమకాలీనమైన సంఘటనలను కథారూపంలో మలిచిన రచయితకు అభినందనలు.

  7. పెట్టె బయట గురించి రవిచంద్ర గారి అభిప్రాయం:

    07/01/2009 10:47 pm

    కథలో నవ్యత ఉంది.
    రచయిత చెప్పిన విషయం విన్న తర్వాత నా కీ సంఘటన గుర్తుకొస్తోంది.

    నేను ఈ మధ్యనే మా వూరెళ్ళాను. రెండవ తరగతి చదువుతున్న మా తమ్ముడికి విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం స్పెల్లింగ్ లను బట్టీ పట్టించడం నేను కూడా గమనించాను. ఏమి ఇంగ్లీషు మీడియం చదువులో ఏమో!

  8. పట్టుకో పట్టుకో గురించి yasasvi గారి అభిప్రాయం:

    07/01/2009 9:06 pm

    భావుకత కరవైపోతోన్న ఇవాళ్టి కాలంలో ఇంద్రాణి గారి కవిత ఆహ్లాదంగా
    అన్పించింది. రోజూ మన చుట్టూ ఉండే చిన్న చిన్న అందాలని గమనించలేని
    వేగపు బతుకైపోయి ఎవరైనా ‘పట్టుకో పట్టుకో” అని వెనకబడమంటూ..ఊరించే దృశ్యాలని చూపిస్తే “హమ్మయ్య” అని జీవించటానికి
    ఇంత నమ్మకం కలగదూ!! అంత నమ్మకాన్నిచ్చింది ఈ కవిత. ఆమెకు అభినందనలు.

    యశస్వి.

  9. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి hrk గారి అభిప్రాయం:

    07/01/2009 5:08 pm

    ఏడుస్తూ వుండిపోయాను పద్యం చదివి చాల సేపు. ఇన్ని మరణాలూ ఏమీ నేర్పవు మనకు. ఎప్పటికప్పుడు ‘అలవాటు కాని చీకటిలోనే, కొత్త కొత్త చీకట్లలోనే నిలబడ’క తప్పదు. మరణించిన వాళ్లూ ఏమీ నేర్పరు మనకు. చనిపోని ప్రేమను రగిల్చి వెళ్లడం తప్ప. అఫ్సర్‍, నీతో నొప్పిని పంచుకుంటున్నా, పంచుకోడానికి నొప్పి మాత్రమే వుంటం వల్ల.
    హెచ్చార్కె

  10. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Seshagiri Rao Devaguptapu గారి అభిప్రాయం:

    07/01/2009 3:00 pm

    చాలా బాగుంది మీ కవిత. హృదయ బాధ అనుభవించితె గానీ రాదిటు వంటి కవిత. భాదల మీద అభిప్రాయం చె ప్ప గ ల ధై ర్యం లే దు లే దు నాకు లే దు

    శేషగిరి రావు.

« 1 ... 1231 1232 1233 1234 1235 ... 1582 »